చేనేతక్క(చేనేత మహిళల జీవన చిత్రం)

పులుగుజ్జు సురేష్‌, ఎస్‌.వి. శివరంజని

పేగులు కాలుతున్నా పోగులు అతుకుతుంటారు.
కడుపులు మాడుతున్నా ఖరీదైన చీరలు నేస్తుంటారు.
జానెడు పొట్ట కోసం బారుల కొద్దీ బట్టలు నేస్తుంటారు.
ఆర్థికంగా వెనుకబడినా ఆధునిక డిజైనులు నేయుటలో
వారిది అందెవేసిన చేయి.
ఇ వారు లేనిదే చీర తయారు కాదంటే అతిశయెక్తి కాదు. అందుకే మగ్గం నేయలేని మహిళ ఇల్లాలుకానేరదని మన జాతిపిత మహాత్మాగాంధీ ఆనాడే అన్నాడు. అక్షరాలు నేర్వకపోయినా గడ్డిపరకల కలయికను చూసి పడుగు పేకలు కలిపి మానవ ప్రపంచానికి బట్టలు నేసిన మహిళా చేనేతక్కల గాధ ఇది.
ఇ మహిళల కోసం మహిళలే నేస్తున్న ఏకైక పరిశ్రమ చేనేత. ప్రపంచ జౌళిరంగంలో అత్యధికంగా మహిళలు భాగస్వాములయ్యింది చేనేత పరిశ్రమలోనే.
ఇ భారతదేశంలో 74.4 లక్షల మంది మహిళలు చేనేతరంగంలోనే ఉపాధి పొందుతున్నారు.
ఇ చేనేతరంగంలో మహిళల కోసం చేసే ఉత్పత్తులు 70-80%, వీటి విలువ 40 1వేల కోట్ల పైమాటే.
ఇ కేవలం అసిస్టెంట్లుగా ఉన్న మహిళలు జాకార్డు మగ్గంపైన అందాల ప్రతిమలను తీర్చిదిద్దుతున్నారు. ఎంత చేసినా అంతేనంటూ అతుకుల బొంతే బతుకన్నట్టు వీరి చాకిరి లెక్కలోకి రావడంలేదు.
ఇ పొద్దుపొడవక ముందే వీరి పని ప్రారంభమై రాత్రి పన్నెండుదాకా రెక్కలాడుతూనే ఉంటాయి.
ఇ ఇంటి, వంటతో పాటు కుటుంబ భారమంతా మొసేది మహిళలే. విరామంలేని శ్రమ, విలువలు లేని కష్టం వీరిది. కన్నీళ్ళకే కన్నీళ్ళు వచ్చినట్టు కష్టానికే కష్టమనిపిస్తుంది.
ఇ కష్టాలు చెప్పుకుని కాసింత ఓదార్పు పొందాలనుకున్నా కాలం అనుమతించదు వారికి.
ఇ గడియారానికి భయంపుడుతుంది వీరి పనిగంటలు చూసి.
ఇ కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు మహిళల కోసం చేనేతల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. వాటిలో ఒక్కటి కూడా చేనేత మహిళలకు వర్తించడంలేదు. వందలాది కోట్ల బడ్జెట్‌ ఖర్చవుతున్నాయి. ఒక్కరూపాయి కూడా వీరి కొరకు కేటాయించకపోవడం విచారంగా ఉంటుంది.
ఇ చేనేత మహిళల సమాచారం, గణాంకాలు ప్రభుత్వాఫీసుల్లో లేవంటే వీరి పట్ల చూపుతున్న వివక్ష, నిర్లక్ష్యం ఎంతో తెలుస్తుంది.
ఇ నిత్యం చేనేతల కోసం ప్రత్యేకంగా పని చేస్తున్న ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలు కనిపించరు. అంతెందుకు చేనేతల హక్కుల సంఘాల్లో కూడా స్థానం లేదు.
 గెస్ట్‌రూ౦, రెస్ట్‌రూ౦, బెడ్‌రూ౦, బాత్‌రూ౦, కిచన్‌రూ౦, డైనింగురూ౦లు ఏ గదికాగది విశాలంగా ఉంటేనే ఇరుకిరుగ్గా ఉంటుంది. ఇంట్లో సగానికి పైగా మగ్గం నిండి ఉంటుంది. ఒక మూల గల రెండు ఇటుకల పొయ్యి మీద పిడికెడు బియ్యం ఉడికించాలి. వంటా వార్పు, తిండి తిప్పలు అన్నీ అగ్గిపెట్టెలాంటి గదిలోనే సర్దుకోవాలి.
ఇ రోజుకు కనీసం 16-18 గంటలు పనిచేస్తూ ఐదువేళ్లు నోట్లోకి పోవు.
ఇ 97% మహిళలు ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నారు.
ఇ 100% మహిళలకు ఒక్క పథకం కూడా వారి దరి చేరడం లేదు.
ఇ కాటికి కాళ్లు చాచిన కురు వృద్ధులు కూడా కండెలు చుడుతూనే ఉంటారు. ఇది వారి దారిద్య్ర తీవ్రత ఎంతో తట్టి చెబుతుంది.
ఇ ఆరుగాలం కష్టించినా ఆకలితో పేగులు అల్లాడుతుంటాయి. పెరుగుతున్న ధరలు పేదోళ్ల డొక్కలు ఖాళీగా ఎండబెడు తున్నాయి. పూట గడవడం కష్టమై అప్పులు చేయక తప్పడం లేదు. వీరి అవసరాలను అదునుగా తీసుకున్న మైక్రోఫైనాన్స్‌ సంస్థలు మహిళలను అప్పుల ఊబిలోకి దించుతున్నాయి. కృత్రిమ అవసరాలను సృష్టించి అప్పుల మీద అప్పులిస్తూ వారిపై భారం పెంచుతున్నాయి.
ఇ చేనేత కేంద్రాలలో వడ్డీ వ్యాపార సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వాయిదా చెల్లింపుకే కూలీ సరిపోక ఉన్న ఇంటిని, పడుగును తాకట్టు పెట్టాల్సి వస్తుంది.
ఇ పలక బలపం పట్టని చేనేతలు వందకు 61 మంది ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. బాలకార్మికుల సంఖ్య విస్తరిస్తున్నది. లేలేత బాలికల బాల్యం డబ్బాలు తోడడంతోటే అంతమవుతుంది. 12 గంటలు నిలబడి దారం చుడుతూనే ఉంటారు.
ఇ నూటికి 97 మంది రెండు కంటే ఎక్కువ జబ్బులతో బాధపడుతున్నట్టు చిప్‌ నివేదిక తెలిపింది. సంపాదనలో పావలా వంతు దావఖానాకు ఖర్చుపెట్టాలి. సర్కారు దావఖానాలు కరుణించక ప్రైవేటు ఆసుపత్రికి పోయి జేబులు ఖాళీ చేసుకోవడం తప్పనిసరి.
ఇ ప్రభుత్వం అందించే ఆర్టిజాన్‌ క్రెడిట్‌ కార్డులు 98% లేవు.
ఇ 77% మహిళలకు చేనేత గుర్తింపు కార్డులు లేవు.
ఇ చేనేత పథకాల గురించి తెలియని వారు 99%.
ఇ 32% మహిళలు పస్తులుంటున్నారు.
ఇ 1000 రూ. లోపు ఆదాయం కలిగిన వాళ్లు 55%. వీరిలో సగానికి పైగా 500రూ. లోపు ఆదాయం.
ఇ ప్రపంచీకరణ చాచిన విషపు కోరలకు బహుళజాతి కంపెనీలలో యంత్రాలు చేసే ఉత్పత్తుల దాడికి చేనేత పరిశ్రమ రెక్కలిరిగినట్టయింది.
ఇ యంత్రాలలో మనుషులను పోటీ పడమనే నేటి కలియుగంలో చేతివృత్తులకు చరమగీతం పాడాలని ప్రభుత్వాలు వెజుపడ్డాయి. ఫలితంగా పేదల జీవనోపాధులు సంక్షోభంలోకి నెట్టబడి, బతుకు బండిని లాగడం కష్టమై బతుకులు చిధ్రమవుతున్నాయి. ఫలితంగా కొన్ని ప్రాంతాలలో మగ్గాలను అటకెక్కించి, పొట్ట చేతబట్టుకొని వలసబాటన పడుతున్నారు.
ఇ వలస ప్రాంతంలో షెడ్డుల్లో చేరిన కార్మికులు పులిబోనులో తలపెట్టినట్టయింది. చీరాల, మంగళగిరి, పెడన, ధర్మవరం వంటి చోట్ల షెడ్డుల సంఖ్య పెరుగుతున్నది. షెడ్డు కార్మికులంటే ఏ ఆధారం లేని హోంలెస్‌ అండ్‌ లూ౦లెస్‌ అని అర్థం షావుకారుల ఆధీనంలో షెడ్డుల్లో కనీస సౌకర్యాలు కరవు. త్రాగునీరుగానీ, బాత్‌రూ౦లుగానీ ఉండవు.
ఇ మహిళలు నీరు తాగక, బాత్‌రూ౦కి వెళ్లక, కిడ్నీలు ఫెయిల్‌ కావడం, గ్యాస్‌ట్రబుల్‌ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. తోటిపనివారు, షావుకారుల నుండి అనేక వేధింపులతోపాటు లైంగిక వేధింపులు తప్పడంలేదు. బాధిత మహిళలు ఎవరికీ చెప్పుకోలేక శివుడు హాలాహలాన్ని కంఠంలో దాచుకున్నట్ట్టు కడుపులో దాచుకుంటున్నారు.
 మహిళలు అన్ని రంగాలలో ముందుకు రాణించడానికి అనేక అవకాశాలు వస్తుంటే, చేనేతరంగం అందుకు భిన్నంగా ఉన్నది.
చేనేతరంగం – ముఖ్యాంశాలు
ఇ భారతదేశంలో చేనేత మగ్గాలు 38.90 లక్షలు
ఇ గ్రామీణ ప్రాంతాలలో మగ్గాలు 32.80 లక్షలు
ఇ ప్రపంచంలో ఎక్కడాలేనన్ని మగ్గాలు (84%) భారతదేశంలో ఉన్నాయి.
ఇ ప్రపంచ వస్త్రోత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉన్నది.
ఇ పత్తి ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్నది.
ఇ ప్రపంచ జౌళిరంగంలో అత్యధికంగా (80%) మహిళలు పని చేస్తున్న దేశం బంగ్లాదేశ్‌.
ఇ ప్రపంచ చేనేతరంగంలో 60% మహిళలు పనిచేస్తున్న దేశం భారతదేశం.
ఇ భారతదేశంలో చేనేత మగ్గాలపై 1.24 కోట్ల మంది ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో 60% అంటే 74.4 లక్షల మంది మహిళలు చేనేతపై ఉపాధిని పొందుతున్నారు.
ఇ భారతదేశ చేనేతరంగంలో అత్యధిక శాతం ఉత్పత్తులు మహిళలకు సంబంధించినవి. (చీరలు, పావడాలు, డ్రెస్‌మెటీరియల్స్‌). వీటిని నేస్తున్నది కూడా ఎక్కువ శాతం మహిళలే కావడం విశేషం.
ఇ చేనేతకు సంబంధించిన అనుబంధ వృత్తులు 27. ఇందులో 21 వృత్తులలో మహిళల పాత్ర ఉన్నది.
భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో చేనేత మహిళలు :
ఇ అస్సాం  82%
ఇ మణిపూర్‌  95%
ఇ నాగాలాండ్‌  92%
ఇ అరుణాచల్‌ ప్రదేశ్‌  91%
ఇ ఢిల్లీ  13.1%
ఇ జమ్ము కాశ్మీర్‌  28.9%
ఇ ఉత్తరప్రదేశ్‌  30.1%
ఇ రాజస్థాన్‌  33%
ఇ హిమాచల్‌ ప్రదేశ్‌  33.5%
ఇ మిగతా రాష్ట్రాలలో 65%
చేనేత మహిళల సమస్యల పరిష్కారానికి :
ఇ జౌళిరంగం నుండి చేనేతరంగాన్ని వేరుచేయాలి.
ఇ మహిళా దృక్పథంతో పథకాలు రూపొందించాలి. ఇపుడున్న పథకాలలో జనాభా ప్రాతిపదికన 65 శాతం మహిళలకు కేటాయించాలి.
ఇ చేనేత పరిశోధనా కేంద్రాలు మహిళల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలి.
ఇ ప్రసతి భత్యం ఆరునెలల పాటు నెలకు వేయి రూపాయల చొప్పున అందించాలి.
ఇ చేనేత మహిళాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలి.
ఇ ప్రతి చేనేత కేంద్రంలో మహిళలకు కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైనింగు శిక్షణ ఇచ్చి కావలసిన పరికరాలు అందించాలి.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

One Response to చేనేతక్క(చేనేత మహిళల జీవన చిత్రం)

 1. srilakshmi says:

  చెనెత మహిళా కార్మికురాళ్ళ వెతలకి అంతము లెదా? హృద్యమైన చీక్రలు
  రలు నెయడము మాత్రమె వ చు వారికి….తమ జీవితాలు హ్రుద్యము
  గా మలుచుకొడము మాత్రము వారి చెతులొ లెదు. ప్రస్తుత సామాజిక
  పరిసితుల్లొనిజమైన దారిద్యము అనుభవిస్తున్నది మాత్రము వారె..
  ఈ పరిస్తితులు అంతము కావాలి అని హ్రుద య పూర్వకముగా కొరుతున్న…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో