ముళ్లలాంటి కాలంలో
జీవితం అన్యాక్రాంతమై పోయినాక
మొద్దువారిన మొండి బతుకుల నేపథ్యంలో…
ఇక ఈ చిగురించటాలు, పుష్పించటాలు ఎవరి కోసం?
రెక్కలు తెగిన కాకిలా
మసిగుడ్డ కన్నీటి సంతకాలు!
ఆవిరయ్యే పొగదేహపు కుంపటిని
ఉట్టిమీదికెక్కించి పరిచయంలేని ప్రపంచం నుండి
తప్పించలేని విధి విలాపాన్ని,
బ్రహ్మరాతగా మలుచుకున్న ఒక శ్రామిక స్వేదం..
ఒంటరి ఆకాశం కింద ఒక్కతిగా… కన్నీటి తెరచాపనెత్తి
ఎవని సాయం లేని ఎవుసాయాన్ని
న (అ) మ్ముకొని.. పొలం మళ్ళలో నాటుకుంటున్న
ఆమె దిగులు గుండె చప్పుళ్ళు!
ఞ ొ వ అంటూ ప్రతిక్షేపించలేని సత్యాల్ని
వెలుతురు చూడని వెన్నెల బాలలను
నేలమాళిగలో సమాధి చేస్తూ… వాళ్లో… విధివంచితలంటూ
కొన్ని మొసలి కన్నీళ్లు జారవిడుస్తున్న దుష్టచతుష్టయాలు!
నిజానికి ఆమె… నీవెక్కడో అలసిన దేహంతో
గుమ్మం తలుపు తడితే… చిరునవ్వుల చలివేంద్రమై
నీకు స్వాగతమిస్తుంది!
అన్నం కుండలో విరిసిన మల్లెల పరిమళమై
నిత్యమూ నీ జీవితాన్ని సారవంతం చేస్తుంది!
కత్తిపోట్లు… రక్తపు గాట్లతో
నిలువెల్లా చీలుస్తున్న శరీర గాయాల్ని అదిమిపట్టి..
ప్రేమోన్మాదక పైత్యపు చర్యలని ఎదుర్కొంటూనే
నిత్యమూ ఛస్తూ.. పుడ్తున్న సంజీవని ఆమె!
మరో కురుక్షేత్ర రణరంగంలో
విషపు బీజాల్ని తుదముట్టిస్తూ
వికసిత దిశాన్వేషణలో మొలకెత్తే ఓ హరిత స్వప్నం ఆమె!
తల లేని మొండాలు, మొండాలు లేని
తలలను తప్పిస్తూ, ఓడిన బతుకులో
ఒంటరి శాపగ్రస్థను కాదంటూ ఆమె..
గ్రహణం వీడిన ఆకాశంలో… సగభాగం నేనేనని
సగర్వంగా వెలిగి పోతుంది!
మనసుకు చేసిన మానని గాయాల్ని
నిశ్శబ్దంగా స్వీకరిస్తూ… ఆవగింజ విత్తనం నుండి
అంతులేని వటవృక్షంగా… విస్తరిస్తున్న విశ్వరూపిణి ఆమె!
ఆమెకు ఇప్పుడు… ఒక వెలుతురు పుష్పమై వికసిస్తుంది!
భేతాళుని భుజంమ్మీద వేసుకొని తిరుగుతున్న
అక్రమార్కుల తలలు కాలం గుదిబండకు వేలాడదీసి
విత్తు ముందా? చెట్టు ముందా? వెర్రి ప్రశ్నల
వేదాంతాన్ని కాలరాచి…
అందిన ఆకాశంలో సగాన్ని..
అవనిపై సమంగా అలంకరిస్తుంది!
-
Recent Posts
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
March 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
