నెలసరిపై నిశ్శబ్ద మేల?? – స్వార్డ్‌, మెదక్‌ జిల్లా

బాలిక, స్త్రీగా మారే క్రమంలో జరిగే శారీరక మరియు లైంగిక మార్పుల (పరిపక్వత) కాలాన్ని ”కౌమార దశ” అంటారు. బాలికలకు 9 నుండి 16 సం|| మధ్య వయస్సులో ఈ మార్పులు జరుగుతాయి. అందరిలో ఈ మార్పులు ఒకేవయసు మొదలు కావు. బాలికలలో ఈ మార్పులు త్వరగా మొదలవడమేకాక, త్వరగా పరిపక్వత చెందుతాయి.

బాలికల శరీరంలో మార్పులు
రొమ్ములు / స్తనాలు పెరుగుదల
పిరుదులు వెడల్పు అవ్వడం
నడుము భాగం సన్నగా అవ్వడం
చంకలు మరియు జననాంగాలదగ్గర వెంట్రుకలు రావడం
అండం విడుదల
నెలసరి / బహిస్టు అవ్వడం.

స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ – గర్భాశయం – భాగాలు

1. ప్రతీ స్త్రీ మరియు బాలికల శరీరంలో గర్భాశయం నాభి క్రింద మన పిడికిడంత పరిమాణంలో ఉంటుంది.
2. గర్భాశయానికి ఇరువైపులా రెండు సన్నని నాళికలు ఉంటాయి. వీటినే అండ వాహికలు (ఖీవశ్రీశ్రీశీజూఱaఅ ్‌బపవర) అంటారు. ఇవి అండాశయంవైపుకి తెరుచుకుంటూ మూసుకుంటూ సంకోచ, వ్యాకోచాలు కలిగి ఉంటాయి.
3. అండాశయం వేలకొద్ది అండాలను కలిగి ఉంటుంది. ప్రతినెలా అండాశయం నుండి ఒక అండం విడుదలవుతుంది.
4. గర్భాశయం లోపలి భాగాన్ని ఎండోమెట్రియం పొర లేదా గర్భాశయ లోపలి పొర అంటారు. ఈ పొర ఎక్కువగా సన్నని చిన్న రక్తనాళికలతో ఏర్పడుతుంది.
5. గర్భాశయ ద్వారానికి అడుగుభాగంలో యోని బయటకి తెరచుకొని ఉంటుంది. దీనిద్వారా రక్తస్రావం బయటకి వస్తుంది.

ఋతుస్రావం (నెలసరి) – రజస్వల/పుష్పపతి

1. యవ్వన/కౌమర దశ ప్రారంభంలో బాలికలకు మొట్టమొదటి సారిగా తన యోని నుండి రక్తస్రావం అయినపుడు ”ఋతుస్రావం” అంటారు. దీనినే ”పెద్దమనిషి/రజస్వల/పుష్పవతి” అంటారు.
2. సైన్సుపరంగా ఋతుస్రావం/బహిస్టు ఆడవారిలో ప్రతీ 28 రోజులకు ఒకసారి మొదలవుతుంది. వ్యక్తికీ, వ్యక్తికీ మధ్య వ్యత్యాసాలు
ఉండవచ్చు. సగటున 25 నుండి 40 రోజులమధ్య మొదలవ్వవచ్చు.
3. బహిస్టు సమయంలో మొదటి 3-7 రోజుల పాటు రక్తస్రావం జరుగుతుంది. అయితే దీనిలో కూడా వ్యక్తికీ, వ్యక్తికీ మధ్య వ్యత్యాసాలు ఉంటాయి.
4. బహిస్టు సమయంలో స్త్రీకి సుమారుగా 2-4 పెద్ద స్పూన్లు (అనగా 30-50 మి||లీటర్ల) రక్తస్రావం జరుగుతుంది.

ఋతుచక్రం – దశలు

1. అండం పరిపక్వం చెందుట : పుట్టుకతోనే బాలికల అండాశయం లో వేలకొద్ది అండాలు ఉంటాయి. గర్భాశయానికి ఇరుప్రక్కల ఉన్న అండాశయాలలో ఏదో ఒక అండాశయం నుండి ప్రతీనెలా 21 నుండి 40 రోజుల మధ్యలో ఒక అండం పరిపక్వం చెంది విడుదలకు సంసిద్ధం అవుతుంది. ఈ దశ 7 నుండి 14 రోజుల మధ్య పూర్తి అవుతుంది.
2. అండోత్పత్తి : 14వ రోజు సమయంలో పరిపక్వం చెందిన అండం విడుదలయ్యి అండవాహికలగుండా (Fellopian tubes) ప్రయాణిస్తుంది. అండం అండాశయం నుండి వీడటాన్ని ”అండోత్పత్తి” అంటారు.
3. ఫలదీకరణకు సంసిద్ధత : అండం అండవాహికలగుండా ప్రయాణం చేస్తున్నప్పుడు గర్భాశయంలో మెత్తగా, స్పాంజిలా ఉండే పొర ఒకటి ఏర్పడుతుంది. ఈ పొర సన్నని చిన్న రక్తనాళికలతో ఏర్పడుతుంది. అండం అండవాహికలనుండి గర్భాశయంలోని మధ్య భాగంలోనికి ప్రవేశిస్తుంది. ఈ అండం, పురుషునితో కలిసినప్పుడు విడుదలైన వీర్యకణాలతో ఫలదీకరణం చెందితే పిండంగా (ఎంబ్రియో)గా ఏర్పడుతుంది. అది గర్భాశయంలో శిశువుగా పెరగడం ప్రారంభం అవుతుంది. అప్పుడు మెత్తని పొరలా ఏర్పడిన రక్తణాళికలు పిండానికి ఆహారాన్ని, రక్షణని (పరుపులాగ) అందిస్తాయి. ఇదంతా 14వ రోజు నుండి 28వ రోజు మధ్యలో పూర్తి అవుతుంది.

4. బహిస్టు / నెలసరి : ఒకవేళ అండం ఫలదీకరణం చెందకపోతే, అండం వీర్యకణాలతో కలవకపోతే గర్భాశయంలో ఏర్పడిన మెత్తని పొర పగిలి యోని నుండి రక్తస్రావంగా సగుటున 28వ రోజు బయటకి వస్తుంది. ఇలా జరిగే రక్తస్రావాన్ని బహిస్టు / నెలసరి అంటారు. నెలసరి 3 – 7 రోజులు అవుతుంది.

నెలసరి సమయంలో బాలికలు / స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు

1. సక్రమంగా రాని నెలసరి 2. ఋతుస్రావం ఎక్కువగా జరిగే నెలసరి 3. నొప్పితో కూడిన నెలసరి

1. సక్రమంగా రాని నెలసరి : పుష్పవతి అయిన మొదటి కొన్ని సం||లలో ఋతుచక్రం క్రమంగా కాకపోవచ్చు. ఋతుచక్ర కాలం చిన్నదిగా అనగా 2 వారాలు లేదా అతి ఎక్కువ అనగా 6 వారాలు ఉండవచ్చు. చిన్న వయస్సు బాలిక అయితే ఇది సరికావడానికి 2 లేదా 3 సం||లలో సమయం సహజంగా పడుతుంది. దీనికి ఆందోళన చెందనవసరం లేదు.

2. ఋతుస్రావం ఎక్కువగా జరిగే నెలసరి : ఋతుస్రావం ఎక్కువగా జరగడం అంటే రక్తస్రావం 8 రోజులకన్నా ఎక్కువగా జరగడం. ఒక గంటలో శానిటరీ నేప్‌కిన్‌ లేదా బట్ట తడిచిపోవడం లేదా రక్తస్రావం గడ్డలు గడ్డలుగా పడటం జరుగుతుంది. యవ్వన దశలో శరీరంలో హార్మోన్ల సమతుల్యత లేకపోవడం (నaతీఎశీఅaశ్రీ Iఎపaశ్రీaఅషవ) వల్ల ఈ విధంగా జరుగుతుంది. ఇలా తరుచుగా జరుగుతున్నట్లయితే శరీరం ఉత్పత్తి చేసే రక్తం కన్నా ఎక్కువ రక్తస్రావం జరగడం వల్ల బాలికకు నీరసంగా అనిపిస్తుంది. అలసిపోయిన భావన కలుగుతుంది. అటువంటి సందర్భంలో బాలికలు వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.

3. నొప్పితో కూడిన నెలసరి : స్వల్పమైన నొప్పి నెలసరిలో సాధారణం. ఈ నొప్పి ప్రోస్టోగ్లాండిస్‌ అను రసాయనం సాధారణ కంటే ఎక్కువగా స్రవించడం వల్ల కలుగుతుంది. దీని వలన వికారము, తలనొప్పి, విరోచనాలు లేదా తీవ్రమైన కడుపునొప్పి ఉంటాయి. ఈ విధంగా ఒకటి నుండి మూడు రోజులు ఉంటుంది.

ఉపశమనం :

 • ప్లాస్టిక్‌ సీసాలో వేడినీరు పోసి దానికి బట్ట లేదా తువ్వాలు చుట్టి పొత్తి కడుపుపై పెట్టుకోవాలి.
 • పొత్తి కడుపుపై సున్నితంగా మర్దనా చేయాలి.
 • స్థానికంగా వాడుకలో ఉన్న చిట్కాలు, అల్లం టీ వంటివి తీసుకోవచ్చు.

బహిస్టు సమయంలో దేహానుభూతి / ఇతర సంకేతాలు :

స్త్రీ ఋతుచక్రం సమయంలో హార్మోన్ల స్థాయిలు పెరుగుతూ, తరుగుతూ ఉండటం వల్ల ఆమె మానసిక, భౌతిక స్థితిపై ప్రభావం చూపుతుంది.

భౌతిక లక్షణాలు    మానసిక లక్షణాలు

 • పొత్తి కడుపులో పోట్లు / నొప్పి    ్న    చిన్నవిషయాలకే కోపం, చిరాకు    ్న    శరీరం ఉబ్బడం    ్న    భయాందోళనలు
 • బరువు పెరగడం
 • అయోమయం/మానసిక అలజడి
 • అధికంగా ఆహారం తినడం
 • ఏకాగ్రత లేకపోవడం
 • స్తనాలవాపు, నొప్పి
 • మానసిక ప్రవృత్తిలో
 • చేతులు లేక పాదాలవాపు
 • ఆకస్మిక మార్పు
 • తలనొప్పి
 • ఒత్తిడి
 • తలతిరగడం
 • అలసట

బహిస్టు/నెలసరి సమస్యల ఉపశమన పరిష్కారాలు

నెలసరిలో ఎదుర్కొనే సమస్యలకు
ఉపశమనానికి 3 ముఖ్య పరిష్కారాలు
1.కాపడం 2. మర్దన 3. ఆసనాలు
1. కాపడం
కాపడం వల్ల కండరాలలో వత్తిడి తగ్గి ఉపశమనం కలుగు తుంది. ఋతుస్రావంలో వెచ్చని నీటితో స్నానం చేయడం, నడుము, పొట్టమీద వేడినీళ్ళ కాపడం పెట్టడం, ఉప్పును వేడిచేసి గుడ్డలో ఉంచి కాపడం పెట్టడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

2. మర్దన

పొట్టలో తీవ్రంగా నొప్పి ఉంటే పొట్టమీద బోర్ల పడుకొని, నడుం మీద తేలికగా మర్దన చేయించుకోవడం, మెల్లగా నడవడం, వేడిపానీయం తీసుకోవడం, పొట్టమీద మెల్లగా మర్దన చేయడం చేయాలి.

3. ఆసనాలు

భుజంగాసనం, మార్జాలాసనం, శశాంక ఆసనం ఒక్కొక్కటి 2 నిమిషాలపాటు రోజులో 2 నుండి 3 సార్లు చెయ్యడం వల్ల పొట్ట, నడుము నొప్పి తగ్గుతుంది.

యోగాసనాలు ఖాళీ పొట్టతో లేదా భోజనం చేసిన 2 గం||ల తరువాత వేయాలి.

కౌమార బాలికల పోషకాహార అవసరాలు
జీవితంలోని అన్ని దశలలో కంటే కౌమార దశలో ఎక్కువ పోషకాహారం అవసరం. దీనికి కారణాలు:

 • ఈ వయస్సులో వారి శారీరక పెరుగుదలవేగంగా ఉంట

పెద్దయ్యాక ఉండే బరువులో 50%, ఎత్తులో 20% ఇప్పుడే పెరుగుతాయి.
చురుగ్గా పనులు చేస్తారు.
బాలికలు రుతుస్రావంలో ప్రతినెలా రక్తాన్ని కోల్పోతారు.చిన్న వయస్సులో వివాహాలు జరిగే సమాజంలో కౌమార బాలికలకు గర్భం, బాలింత దశలలో ఎక్కువ పౌష్ఠికాహారం అవసరం.
సంపూర్ణ ఆహారపు అలవాట్లు పెంపొందించుకోవాలి
కౌమార వయస్సు వారు ఆరోగ్యంగా పెరగడానికి ఎక్కువ కాలరీలు అవసరం. పౌష్ఠికాహార పరిభాషలో ఆహారం ద్వారా లభించే శక్తిని ”కాలరీలు” అంటారు.

కౌమార వయస్సు బాల బాలికలు మాంసకృత్తులు, ఖనిజా లు, విటమిన్‌లు, శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు ఎక్కువగా సమతుల్యంగా తీసుకోవాలి.

అవసరమైన దానికన్నా తక్కువ కాలరీలు ఆహారం తీసుకుంటే పోషకాహార లోపం, రక్తహీనత వంటి లోపాలకు గురి అవుతారు.

తాజా ఆకుకూరలు, పండ్లు, పాలు, ధాన్యాలు, పప్పు దినుసులు, గుడ్లు, మాంసం, చేపలు మొదలైన ఆహారపదార్థాలు సమృద్ధిగా, సమతుల్యంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చు.

పౌష్ఠికాహార లోపం వల్ల కలిగే అనర్థాలు

 •     శారీరక పెరుగుదల కుంటుపడుతుంది
 •    మానసిక సామర్థ్యం తగ్గుతుంది
 •    లైంగిక పరిణితి ఆలస్యం అవుతుంది
 •    రక్తహీనత ఇతర పోషకాహార లోపాలు ఏర్పడతాయి.

బహిస్టు – అపోహలు – నివృత్తి

అపోహ 1 : బహిస్టు సమయంలో స్నానం చేయకూడదు?

నివృత్తి (వాస్తవం) : ప్రాచీన కాలంలో ప్రజలు నదులు, చెరువులు, కుంటలు మొదలైన జలవనరుల్లో స్నానాలు ఆచరించేవారు. ఇవి బహిరంగ ప్రదేశాలు కావడం వల్ల అక్కడ స్నానం చేయవద్దని సలహా ఇచ్చేవారు. ఇప్పుడు స్నానపు గదులు విడిగా ఉన్నాయి కాబట్టి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి, దుర్గంధం నివారించుకోవడానికి గోరువెచ్చని నీటితో బహిస్టు సమయంలో రోజూ స్నానం చేయడం ఉపకరిస్తుంది.

అపోహ 2 : ఋతుస్రావం/బహిస్టు సమయంలో పచ్చళ్ళను తాకితే అవి పాడైపోతాయి?

నివృత్తి (వాస్తవం) : నిల్వ పచ్చళ్ళలో ఉప్పుపాళ్ళు సరిలేకపోవడం, నిల్వ ఉంచే రసాయనిక పదార్థాలు లోపించడం మరియు తడి తగలడం వల్ల పచ్చళ్ళు పడైపోతాయి కానీ, ఋతుస్రావంలోని మహిళలు తాకడం వల్ల కాదు.

అపోహ 3 : బహిస్టు సమయంలో ఇంటిలోనికి రాకూడదు. కుటుంబ సభ్యులకు దూరంగా విడిగా భోజనం చెయ్యాలి?

నివృత్తి (వాస్తవం) : బాలిక/మహిళ బహిస్టు అయినప్పుడు విడిగా భోజనం చేయాల్సిన అవసరం లేదు. శుభ్రత పాటిస్తూ అందరితో కలసి తినవచ్చు.

అపోహ 4 : బహిస్టు సమయంలో బాలికలు/మహిళలు అపరిశుభ్రంగామారి మలినం అవ్వడం వల్ల అన్ని మతపరమై పూజలు, సాంఘిక కార్యక్రమాలు, శుభాకార్యాలకు దూరంగా ఉండాలి?

నివృత్తి (వాస్తవం) : బహిస్టు సమయంలో వెలువడే రక్తం అపరిశుభ్రమైనది కాదు. ఋతుస్రావానికి సంబంధించిన రక్తంలో మలినం ఏదీ లేదు. ఋతుస్రావాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి సంబంధించిన అంశాలు పరిశుభ్రత మరియు నిర్మలత్వం. స్నానం చేయడం. జననాంగాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం, బట్ట/ప్యాడ్‌లను మార్చడం వంటి ఉత్తమ పరిశుభ్రతలను పాటిస్తూ అన్ని కార్యకలాపాలు నిస్సంకోచంగా యదావిధిగా కొనసాగిస్తూ మరింత ఉల్లాసంగా ఉండవచ్చు.

అపోహ 5 : బహిస్టు సమయంలో పాలు, పాలసంబంధిత పదార్థాలను తీసుకోరాదు. పాలు ఆవునుండి వస్తాయి. ఆవు గోమాతగా పూజిస్తారు కాబట్టి పాలను తీసుకోరాదు?

నివృత్తి (వాస్తవం) : పాలు, పాలసంబంధిత పదార్థాలు పెరుగు వంటివి నిస్సంకోచంగా తీసుకోవచ్చు. పాలు మంచి పోషకాహారమే కాక పాలలో ఉండే మాంసకృత్తులు ఎదిగే వయస్సులో శారీరక ఎదుగుదలకి తోడ్పడతాయి. అన్నిరకాల ఆహార పదార్థాలు సమతు ల్యంగా తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి.

ఋతుస్రావం / నెలసరి శుభ్రత – నిర్వహణ

బాలికలు, స్త్రీలు ఋతుస్రావానికి రెండు రకాల పద్ధతులను వాడతారు.

1.బట్టను వాడటం, 2. శానిటరీ నాప్‌కిన్‌లను వాడటం.

1. బట్టను వాడటం : ఋతుస్రావం అనేది చెడు రక్తం అనే అపోహ ఉండడం వల్ల చాలామంది ఈ బట్టలను/గుడ్డలను ఎక్కడపడితే అక్కడ దాచడం ఫలితంగా సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. మళ్ళీ అవే గుడ్డల్ని వాడినప్పుడు దురద, మంట వచ్చి వ్యాధులు సోకుతాయి.

బట్టను వాడేటప్పుడు గుర్తుంచుకోవలసిన అంశాలు :

శుభ్రమైన నూలు / కాటన్‌ బట్టని మాత్రమే వాడవలెను. నైలాను / సింథటిక్‌ వాడటం వల్ల రక్తస్రావాన్ని పీల్చకపోవడమే కాక, చికాకు, దురదను కలుగజేస్తాయి.

నెలసరి సమయంలో వాడిన బట్టని విడిగా (ఇతర బట్టలతో కలపకుండా) ముందు చల్లటి నీటితో శుభ్రపరిచి, తర్వాత వేడినీరు మరియు సబ్బుతో ఉతికి సూర్యరశ్మికి ఆరవేయడం వల్ల సూక్ష్మ జీవులు నశిస్తాయి.

వాడిన బట్టను మరలా తిరిగి వాడాలి అనుకుంటే ఉతికి, ఎండలో ఆరబెట్టి, శుభ్రమైన ప్రదేశంలో ఒక కాగితం సంచిలో భద్రపరచుకోవాలి.

కొద్దిసార్లు వాడిన బట్టలను మూడు నెలలకి ఒకసారి కాల్చేసి, వేరే మంచి బట్టలను వాడాలి. సగటున రోజుకు 3-4 సార్లు బట్టని మార్చుకోవాలి.

2. శానిటరీ నాప్‌కిన్‌లను వాడటం:

నెలసరి సమయంలో జరిగే రక్తస్రావాన్ని పీల్చడానికి శానిటరీ నాప్‌కిన్స్‌ ప్యాకెట్ల రూపంలో స్టేఫ్రీ, విస్‌పర్‌ అనే పేర్లమీద మార్కెట్‌లో దొరుకుతుంది.

ఒక ప్యాకెట్‌ ఖరీదు 20 రూపాయలనుండి 150 రూ. వరకు మన స్థాయికి అనుగుణంగా మార్కెట్‌లో లభ్యం అవుతాయి.

ఈ నేప్‌కిన్‌లను డ్రాయర్‌ ధరించి వాడటం వల్ల సౌకర్యవంతంగా ఉంటుంది. సగటున రోజుకు 3-4 నాప్‌కిన్లను మార్చాలి. తడిసిన వెంటనే నాప్‌కిన్‌ మార్చడం వల్ల దురద, తొడలమధ్య రాసుకోవడం వంటి వాటిని నివారించవచ్చు. చాలాసేపు మార్చకుండా ఉంచుకుంటే తడిసినపోయి ఉండలుగా అయిపోయే అవకాశం ఉంది.

ఒకసారి వాడిన శానిటరీ నాప్‌కిన్‌ను కాగితంలో చుట్టి, చెత్తకుండీల్లో పారవేయాలి లేదా గుంతలో పాతి పెట్టాలి. శానిటరీ నాప్‌కిన్‌లను కాల్చకూడదు. కాల్చడం వల్ల, దానిలో ఉన్న ప్లాస్టిక్‌ కాగితం నుండి వెలువడే వాయువులవల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది.

లెట్రిన్‌లలో ఎంతమాత్రం వేయకూడదు. లెట్రిన్లో వేస్తే డ్రైనేజికి అడ్డుపడి సమస్యలు ఎదురవుతాయి.

బహిస్టు సమయంలో గుర్తుంచుకోవలసిన ఐదు ముఖ్య అంశాలు

1. బహిష్టు/ఋతుచక్రం అనేది సాధారణ ప్రక్రియ ఎటువంటి సంకోచం కానీ, సిగ్గు/బిడియం పడకుండా ఋతుస్రావం గురించి చర్చించవచ్చు.

2. బహిష్టు సమయంలో తెల్లటి కాటన్‌ బట్ట / లేతరంగు శుభ్రమైన బట్టను / నాప్‌కిన్‌ను వాడాలి.

3. బహిష్టు సమయంలో బట్టను / నాపికిన్‌ను రోజుకు కనీసం 3-4 సార్లు మార్చుకోవాలి.

4. ప్రతీరోజు స్నానం చేయాలి.

5. ఉపయోగించిన బట్టను సబ్బుతో శుభ్రంగా ఉతికి, ఎండ తగిలే ప్రదేశంలో ఆరవేయాలి.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో