షీ కప్స్‌… రూట్‌ ఫర్‌ లిబరేషన్‌ – కొండవీటి సత్యవతి, పి. ప్రశాంతి

షీటీమ్స్‌, షీక్యాబ్స్‌, అంటే తెలుసు కానీ ఈ షీకప్స్‌ ఏమిటి? ఇటీవలే మొదటిసారి ఈ పేరు విన్నాను. మొన్నీమధ్య మేమిద్దరం  బెంగుళూరు వెళ్ళినపుడు ఫ్రెండ్‌ హేమంత చెప్పగా విన్నాం. హేమంత ఫ్రెండ్‌ అనన్య చెప్పగా కూడా విన్నాం. కేర్‌ ఫ్రీ గురించి, విస్పర్‌ గురించి ఇంకా ఇలాంటి చాలా పేర్లు విన్నాం కానీ ఈ షీ కప్‌ గురించి మొదటిసారి వినడంతో వాటి గురించి వివరంగా చెప్పమని అడిగితే ”షీ కప్‌ మీన్స్‌ లిబరేషన్‌ ఫ్రమ్‌ మెన్సెస్‌. నాకు ఇన్ని రోజులు తెలియదు ఈ మధ్యే తెలిసింది” అంది. లిబరేషన్‌ అంటున్నావేంటి అంటే ”ఎస్‌. నిజంగానే లిబరేషన్‌. ఇలాంటి కప్స్‌ ఉన్నాయని తెలిస్తే నేను ఇన్ని సంవత్సరాలు పర్యావరణానికి కల్గించిన హానిని తగ్గించుకునేదాన్ని” అంది.

”మెన్సెస్‌ అంటావ్‌, కప్‌ అంటావ్‌, స్వేచ్ఛ అంటావ్‌… పర్యావరణం అంటావ్‌ ఏంటో కాస్త వివరంగా చెప్పమ్మా!”

”ఓ.కె. ఓ.కె… మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ అనేవి ఈ మధ్య చాలా ప్రచారంలోకి వచ్చాయి. బహిస్టు సమయంలో సాధారణంగా అడవాళ్ళు బట్టగానీ, కేర్‌ఫ్రీ లాంటివి కానీ వాడతారు కదా! బట్ట అయితే, చాలా ప్రాంతాల్లో ఉతుక్కుని మళ్ళీ వాడతారు. దానివల్ల ఎన్నో యిబ్బందులున్నాయి. అలాగే కేర్‌ఫ్రీ, విస్పర్‌ లాంటివి వాడి పారేస్తే… వాటిల్లో వుండే కెమికల్స్‌ వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. మన దేశంలో కోట్లాది మంది ఆడపిల్లలు, ఆడవాళ్ళు ప్రతీనెలా కోట్ల సంఖ్యలో వీటిని వాడి పారేస్తారు. భూమిలో కలిసిపోని రసాయనాల వల్ల పర్యావరణం దెబ్బ తింటుంది కదా! షీకప్స్‌ అంటే అది సిలికాన్‌తో చేసిన ఒక కప్‌. మెత్తగా, మృదువుగా వుంటుంది. దానిని యోనిలో అమర్చుకుంటే…”

”కప్‌ని వజైనాలో అమర్చుకోవాలా? యిబ్బందిగా వుండదా?” అందుకున్నా మధ్యలోనే.

”యోనిలో అమర్చుకోవాలంటే ఉన్న బెరుకు వలనే కదా ఇతర దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ‘టాంపూన్స్‌’ మన దగ్గర అంత సక్సెస్‌ కాలేదు! మరి నువ్వేమో ఇప్పుడు ఏకంగా కప్‌నే యోనిలో అమర్చుకోవాలంటున్నావ్‌…” అంది ప్రశాంతి.

”ముందు మన మైండ్స్‌లో ఉన్న బ్లాక్‌ని తీసేస్తే దీన్ని ఉపయోగించడం చాలా సులువు, సుఖం కూడా. కరక్ట్‌గా అమర్చుకునే టెక్నిక్‌ నేర్చుకుంటే చాలా హాయిగా ఉంటుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ కప్‌ని బయటకు తీసి, శుభ్రం చేసుకుని, మళ్ళీ అమర్చుకోవచ్చు. ఐదు రోజులూ అయిపోయాక సబ్బుతో శుభ్రంగా కడిగి దాచుకోవచ్చు. మళ్ళీ నెలవాడొచ్చు. బోళ్ళన్ని నీళ్ళు వాడి ఉతకాల్సిన పనిలేదు, అసలే నీటి కరువు. ఎండలో ఆరబెట్టాల్సిన అగత్యం లేదు. చెత్తకుప్పల్లో పడేసి, వాటిని కుక్కలు రోడ్లమీదకి లాక్కోస్తే ఎబ్బెట్టుగా ఫీలవ్వాల్సిన పరిస్థితి అసలే రాదు.”

”పారేయక్కర లేదా? మళ్ళీ నెల కూడా వాడొచ్చా?” ఆశ్చర్యంగా అడిగాం. ”ఒక్కసారి కొన్న కప్‌ని పదేళ్ళపాటు హాయిగా వాడుకోవచ్చు” అన్నారు ఇద్దరు ఒకేసారి.

”పదేళ్ళ పాటా? నిజమేనా? చాలా ఖరీదై వుంటుంది” ”ఏం కాదు. రకరకాల కంపెనీలున్నాయి” షీ కప్స్‌  కంపెనీవి తొమ్మిది వందల నుంచి, పన్నెండు వందల వరకు రేటుంది, అంతే… మేము ఆన్‌లైన్‌లో కొన్నాము, తొమ్మిది వందలు. మూడు నెలల్నుంచి వాడుతున్నాం. చాలా హాయిగా, లిబరేటెడ్‌గా ఉంది. చాలా రక్తం పోతోంది అని భయపడతాం కానీ కప్‌ కూడా నిండదు.” నవ్వుతూ అంది హేమంత.

”ఎందుకని ఇవి ప్రాచుర్యంలోకి రాలేదు. ఇన్ని లాభాలున్నపుడు ముఖ్యంగా పర్యావరణ ఫ్రెండ్లీగా ఉన్నపుడు వీటి గురించి ప్రచారం చెయ్యాలిగా” ”ఏమో! ఇది బహుళ ప్రచారం పొంది స్త్రీలంతా వాడడం మొదలు పెడితే ఖచ్చితంగా రేటు తగ్గుతుంది. దీనివల్ల నష్టపోయే కంపెనీలు ఏమైనా కుట్రలు చేసి అడ్డుకుంటున్నాయోమో తెలియదు. నేనైతే అందరికీ చెబుతున్నాం. దీని కోసం వాట్సప్‌ గ్రూప్‌ వుంది. షేర్‌ చేసుకుంటున్నాం. మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా ఇప్పుడైతేే హాయిగా, సుఖంగా, స్వేచ్ఛపొందినట్లుంది” అంది అనన్య.

నిజమే కదా! స్త్రీలకి సాధికారతనిచ్చేది, పర్యావరణానికి హాని చెయ్యనిదీ అయిన షీ కప్స్‌ గురించి ఇంత గోప్యత కొనసాగడం వెనక ఏదో కుట్ర వుంది. నష్టపోయే కంపెనీల దుర్మార్గమేదో ఉంది. ఉదా: నెల నెలా పాకెట్లు కొనే వాళ్ళు అవి కొనడం మానేసి, పదేళ్ళ వరకు పనిచేసే షీ కప్‌ ఒక్కటి కొనేసుకుంటే… కంపెనీలు మూసుకోవాల్సిందే కదా! ఇంత కుట్ర ఉందన్నమాట. సరే! కుట్రల్ని, మౌనాల్ని బద్దలు కొట్టడమే మన పని కదా! షీ కప్‌ జిందాబాద్‌!” థాంక్యు హేమంతా! ఈ రోజు ఓ కొత్త విషయాన్ని, చాలా ముఖ్యమైన అంశాన్ని మాతో చెప్పావ్‌, భూమికలో వేసేద్దాం ఓకెనా!!” ”ఓ.కె.. వేసెయ్‌… నీ దృష్టి పడిందంటే … అది బహిరంగమే…” అంది నవ్వుతూ… నేను ప్రశాంతి కూడా నవ్వుకుంటూ ఆ సంభాషణని ముగించాం.

Share
This entry was posted in సమాచారం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.