వర్తమానలేఖ -శిలాలోలిత

ప్రియమైన షాజహానాకు, ఎలా ఉన్నావు. ఎండలు మండి పోతున్నాయి కదా! ఇంకా మీ ఖమ్మం జిల్లాలో ఐతే మరీ ఎక్కువ. నాన్నా వాళ్ళు పాల్వంచ, నువ్వు పుట్టిన కమలాపురంతో సహా గుండెలు బాదుకుం టున్నాయి ఎండలతో కదూ! స్టేట్స్‌ నుంచి అక్క షంషాద్‌ బేగం వచ్చిందట కదా! ఎలా ఉందిప్పుడు. మంచి కవిత్వ పుస్తకం ‘ఈ కిటికీ తెరుచుకునేది ఊహల్లోకి’ వేసింది. దానికి నేను ‘ముందు మాట’ కూడా రాసినట్టున్నాను.  మీ నాన్న గారైన దిలావర్‌ గారి, బాబాయి కమ్రుద్దీన్‌, షంషాద్‌ బేగంల ప్రభావం నీ రచనలపై చాలా ఉందన్నావ్‌ ఒకసారి మనం మాట్లాడుకున్నప్పుడు. నాకు నువ్వంటే చాలా యిష్టం షాజహానా, ఆత్మీయత కూడా. అద్భుతమైన నీ కవిత్వ చరణాలు కొన్ని కొన్ని సార్లు నన్ను అల్లకల్లోలం చేస్తాయి. తుపాకి తూటా లాంటివి నీ కవిత్వ పదాలు అన్పిస్తుంది. ఎంత వాడిగా, వేడిగా కత్తి దిగినట్లుగా, నిజాల మూట విప్పినట్లుగా, నిప్పులు చెరిగినట్లుగా, స్త్రీల స్థితికి అద్దం పట్టినట్లుగా నిజాయితీగా ఉంటాయి. బహుశాః చిన్నప్పటి నుంచీ మీ నాన్న గారు తెచ్చి యిచ్చిన అనేక పుస్తకాలు కూడా నీ మెదడు తలుపుల్ని విశాలం చేసుంటాయి. అందుకే 7వ తరగతి నుంచే రచించటం ప్రారంభమై, 9, 10 తరగతులకొచ్చే వరకు స్కూలు మ్యాగజైన్లలో ప్రచురింపబడటం వరకూ వచ్చింది. ముస్లిం స్త్రీల జీవన నేపథ్యాలు, సంఘంలో వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలు, మామూలు స్త్రీలకంటే, దళిత స్త్రీలు, ముస్లిం స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్ష నిన్ను బాగా ఆలోచింపజేశాయి. ‘తలాక్‌ తలాక్‌’ అని నిముషంలో విడిచి పెట్టే స్థితి నిన్ను గాయపర్చింది. ఆ గాయం ఎంత లోతుగా అయిందో అంత అద్భుతమైన కవితను సృజించ గలిగావు. వివాహ వ్యవస్థపైనే అస్త్రాన్ని ఎక్కు పెట్టావు. అటు సామాజిక రంగంలో ఇటు సాహిత్య రంగంలో కూడా ముస్లింలకు జరుగుతున్న అన్యాయాలు చూసి- ‘ముస్లిం వాద కవిత్వం- వస్తు రూప వైవిధ్యం’ అనే అంశంపై 2005 లోనే తెలుగు యూనివర్సిటీలో యం.ఫిల్‌. కూడా చేశావు. దానికి ‘గోల్డ్‌ మెడల్‌’ కూడా వచ్చిందని గుర్తుంది నాకు. అట్లాగే ‘తెలుగులో ముస్లిం వాద సాహిత్యంపై పిహెచ్‌.డి. కూడా 2012 లోనే పూర్తి చేశావు. ఐనా ఏ యూనివర్సిటీలో తలుపులు కూడా తెరవలేదు. ఆ రాజకీయా లన్నీ మనకు తెలిసినవే కదా! కొత్తేముంది. ఛానల్స్‌లో, యన్‌.జి.వోల్లో, లెక్చరర్‌గా కాలేజీల్లో ఇలా రకరకాలుగా ఉద్యోగాలు చేశావు. జర్నలిజమ్‌ అంటే ఉన్న ఇష్టంతో మిగిలి పోయావు. ‘హైదరాబాద్‌ మిర్రర్‌’ లో కూడా చేసినట్లున్నావ్‌. ఫ్రీ లాన్సర్‌ గా రాస్తూనే ఉన్నావు. నువ్వు రాసిన ‘నఖాబ్‌’ కవిత్వం నాకు చాలా ఇష్టం. అలాగే ‘దర్జీ’, ‘చాంద్‌ తారా’ అని మూడు పుస్తకాలు వేసావు. జర్మనీ, రష్యాలలో బుక్‌ఫెయిర్‌లో కవిత్వం చదివావని గుర్తొస్తే సంతోషంగా అన్పిస్తుంది. షాజహానాకు వచ్చిన అవార్డులేమిటి అని ఆలోచిస్తే గుర్తొచ్చాయి కొన్ని. ఢిల్లీలో ‘సంస్క ృతి నేషనల్‌ అవార్డ్‌’, ‘రంజని అవార్డ్‌’, ‘రంగినేని ఎల్లమ్మ అవార్డ్‌’, ‘వెంకట సుబ్బు అవార్డ్‌’, ‘రొట్టమాకు రేవు అవార్డ్‌’, ‘రంగవల్లి మెమోరియల్‌ అవార్డ్‌’లు కదూ! ఇక, నీ మనసుకు నచ్చిన చెలికాడు స్కై బాబాకు నీకు ’98 లో అనుకుంటా పెళ్ళయింది. అప్పట్నించి ఇప్పటివరకూ, ఎప్పుడు చూసినా దోసిట్లో విరబూసిన పువ్వుల్లా నవ్వుతూనే కన్పిస్తారు.

నీ కవిత్వ లక్షణం ఆవేశం. నిత్య చైతన్యం, ఆగ్రహం లావాలా ఉబుకుతుంది. ఏ మొహమాటాలు, సరిహద్దులు, మెరమెచ్చు మాటలు లేని, కీర్తి కాంక్షలకై పరుగిడని స్వచ్ఛమైన స్పటికం లాంటి వ్యక్తివి నువ్వు. బతుకు బండను చిన్నాభిన్నం చేస్తున్న వైఖరులన్నింటినీ ప్రశ్నిస్తూ, ఎదిరిస్తూ నీ అక్షరాల ఆయుధాలతో నిరంతరం సాహితీ యుద్ధం చేస్తూనే ఉన్నావు. నీ కవిత్వంతో పాటు కథలు కూడా విభిన్నమైనవే. అప్పుడెప్పుడో ‘ఆంధ్రజ్యోతి’ లో వచ్చిన ‘సిల్‌ సిలా’ కథ చాలా యిష్టం. నీక్కూడా కదూ! అలాగే ‘నవ్య’లో పడిన ‘దీవారే’ కథ కూడా అద్భుతమైన కథే. ‘లద్దాఫ్నీ’ పేరుతో 11 కథలతో పుస్తకం వేస్తున్నావు కదా! 27 న ‘లామకాన్‌’ హైదరాబాద్‌లో ఆవిష్కరణ అన్నావు. తప్పకుండా వస్తాను. కవర్‌ పేజీ చాలా బాగుంది. ముస్లిం స్త్రీలపై కథలు ‘గీతాంజలి’ కూడా బాగా రాసింది. స్త్రీలపై సాహిత్యం ఇంకా ఎక్కువగా రావాలన్న నీ ఆకాంక్ష సరైనదే! ‘స్కై బాబా’, ‘బా’ రెహమతుల్లా కొంతమేరకు ముస్లిం స్త్రీల గురించి రాశారు. గతంలో కూడా కొద్దిమంది మాత్రమే ఈ సాహిత్యాన్ని రాశారన్పిస్తుంది. ఇంకా విస్తృతంగా ఈ సాహిత్యం రావాల్సిన అవసరం ఎంతైనా వుంది. షాజహానా! నీ రిసెర్చ్‌ బుక్స్‌ రెండూ కూడా పుస్తక రూపంలో వస్తే చాలా బాగుంటుంది. అలాగే నువ్వు ఒక నవల రాస్తే కూడా ఒక జీవన నేపథ్యాన్ని మొత్తం వివరించినట్లవు తుందనిపిస్తుంది. ఒక ముస్లిమ్‌ స్త్రీ చిన్నప్పటినుంచీ ఎదుర్కొని సంఘర్షించిన, పోరాడిన తీరు, విజయాన్ని సాధించడానికి ఆమె పడిన వేదన, చేసిన యుద్ధం ఇవన్నీ నవలా రూపంలో వస్తే అది సాహిత్య రంగంలో నిలబడి పోతుంది. అమ్మో నవలా! కష్టం అనకు. మొదలంటూ పెడితే అదే పూర్తవుతుంది. నువ్వు రాయగలవన్న నమ్మకమూ నాకుంది. 27న కలుద్దాం.

ఉండనా మరి-

నీ  శిలాలోలిత

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో