గెలుపెప్పుడూ…… నీదే కాదు … నాది కూడా! – భండారు విజయ

అనాలోచితంగా ఉన్నప్పుడు
ఎప్పుడు చొరబడ్డావో తెలియదు
కట్టు, బొట్టునే కాదు
భాషను, యాసను, నడతను
నాగరికతను కూడా మార్చేసావ్‌
తేనె పూసిన మెత్తని కత్తుల మాటలు
ఎన్ని గుప్పించి మరిపించావో కాని
పాతివ్రత్య పురాణాలు కూడా వినిపించి
నామరూపాలను కూడా మరచిపోయేలా
ఉనికిని కోల్పోయి జీవించేలా చేసావ్‌
చాపకింద నీరులా మెల, మెల్లగా జారుతూ
ఆంతరంగిక అనుభూతులను
లోపలి పొరల గాలి వెలుతురులను
చిమ్మ చీకటి నూతిలోకి విసిరేసి
కాళ్ళకింద భూమినీ లాగేసుకున్నావ్‌
ప్రతి మాటకు స్పై కెమారాను పెట్టి
శరీర నిఘంటువుపై పిచ్చి రాతలు రాస్తూ
కర్మ సిద్ధాంతాన్ని బాగా వంటపట్టించి
జాతక చక్రాల సుడిగుండంలోకి దూరి
చిలుక ముక్కుకు కాలాన్ని అందించావ్‌
ఎక్స్చేంజ్‌ చేసుకుందామన్నా
నష్ట పరిహారం అడుగుదామన్నా
న్యాయాన్ని అన్వేషిద్దామన్నా
వినియోగదారునిగా నమోదుకాబడలేదు
ఇల్లీగల్‌ గా వంచించ బడినదానను
పెట్టుబడిదారుడివి ఎలాగూ నీవేకాబట్టి
పరిష్కారం సులభమెలా అవుతుంది?
అరిగేంత వరకు వాడుకొని, వాడుకొని
వాడుకకు పనికిరాదన్న నిర్ధారణకు వచ్చేసాక
మూలకు విసిరివేయబడిన వస్తువు
మళ్ళీ ముడి సరుకుగా రూపాంతరం చెందాలి కదా
నా పిచ్చి గాని కాటేసిన కాలానికి
కాళ్ళే కానీ, కళ్ళు లేని కబోది అన్నది మరిచాను!
వర్గమేదైతేనేమి? నీకు తెలిసింది వంచన!
జాతి ఏదైతేనేమి? నాకు తెలియంది ఆత్మ వంచన!
(ప్రేమల పేరుతో, సహజీవనాల ముసుగులో వంచించబడుతూ, దిక్కూ, మొక్కూ కానరాక ఆత్మహత్యే శరణ్యమని, చివరి ప్రయత్నంగా కౌన్సిలింగ్‌కై మాదగ్గరికి వచ్చి తాము మోసపోయిన విధానం నుండి ఆత్మస్థైర్యాన్ని పొంది, కొత్త జీవితాలలోకి ప్రవేశించి ధైర్యంతో జీవిస్తున్న అమాయకపు ఆడపిల్లల సాహసానికి అభినందనలతో)

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో