జూలు విదల్చండి – సోమిశెట్టి స్వర్ణలత

మన మధ్య తిరుగాడే
బహుముఖ రూపాలతో వ్యాఘ్రాలు
మంచితనపు తొడుగుతో తీపిని తలదన్నే
కబుర్లతో ఆడవాళ్ళని ప్రేమ ఉచ్చులోకి
లాగుతూ పబ్బం గడుపుతున్నారు
అమాయకపు ఆడవాళ్ళూ తస్మాత్‌ జాగ్రత్త!
వంటినిండా కామపు నెత్తురు ఎక్కించుకుని
వావివరసలకి సమాధులు కట్టి
గొంతు విప్పి మాయామర్మాల విషపు విత్తులు
చల్లటానికి సిద్ధంగా ఉన్నారు
విత్తులు మింగారా
అంతే పచ్చని సంసార వృక్షం
కూలిపోవాల్సిందే!
గోతికాడ గుంటనక్కల ఆటలు కట్టించాల్సిందే
సింహం జూలు విదిల్చే శ్వాసను బంధించి
గొంతులో భాస్వరమై మండే ఆక్రోశానికి ఊపిరిలూదండి
మయసభలో ద్రౌపదిలా చెలరేగిపోండి
అంతే కాని మలిన పడ్డామని మనసుని
మట్టిలో పూడ్చేయకుండా గ్రహణం పట్టిన
సూక్ష్మబుద్ధికి ద్రౌపది ప్రతిన బూని వదిలేసిన
కురులలోని శ్వాసను ఆవాహన చేసుకోండి
జడపదార్థంలా ముడుచుక్కూర్చోకుండా
ప్రతిఘటనా రెక్కలు విప్పి తరిమి తరిమి కొట్టండి
నికృష్టపు మదాంధులు సమాజంలో తిరగకుండా!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో