అభివృద్ధి పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలి 2013 భూ సేకరణ చట్టం కన్నా జి.వో 123 మెరుగైనదనే అబద్ధపు ప్రచారం మానుకోవాలి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గత రెండు సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక పార్కులు, థర్మల్‌ విద్యుత్‌ ప్రాజక్టులు, ఔషధ నగరం, ప్రత్యేక ఆర్థిక, తయారీ మండళ్లు పేరు మీద రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ప్రజల నుండి సేకరిస్తున్నది. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అత్యంత ఎక్కువ భూమిని అత్యంత తక్కువ కాలంలో అత్యంత తక్కువ ఖర్చుతో సేకరిస్తున్నది. దీంతో తెలంగాణ రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని సంబరపడాలో లేక ఆ అభివృద్ధి ప్రక్రియలో సర్వం కోల్పోయి, సొంత ప్రాంత పాలకుల చేతుల్లోనే వంచనకు గురై సమిధలైతున్న సన్న, చిన్న కారు రైతులు, దళితులు, ఆదివాసీలను చూసి వేదన చెందాలో తెలియని స్థితి.

ఒక ప్రాంతం అభివృద్ధి ఇంకో ప్రాంత వనరులను దోచుకుంటేనే సాధ్యమవుతుందనే అభివృద్ధి విధానాన్ని ఆంధ్ర పాలకులు పాటిస్తే వ్యతిరేకించి, కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే ఇప్పుడు ఆ విధానాన్నే నేటి తెలంగాణ పాలకులు కూడా పాటిస్తున్నారు. ఒక ఊరికి నీరు రావాలంటే ఇంకో ఊరు వ్యవసాయం వదులుకోవాలని, కొన్ని వందల ఉద్యోగాల కోసం కొన్ని వేల మంది భూమిని, ఆ భూమితో ముడిపడిన బతుకుదెరువును కోల్పోవాలని బోధిస్తున్నారు. కోల్పోతున్న భూములకు, బతుకులకు తగిన ప్రత్యామ్నాయం చూపించకుండా, న్యాయంగా వ్యవహరించకుండా ప్రజలను జి.వొ ల పేరిట మోసం చేస్తూ గత పాలకులకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. పరాయి వాడు మోసం చేస్తే పొలిమేరలవతలకు తరిమికొట్టాలి. సొంత ప్రాంతం వాడు మోసం చేస్తే పాతిపెట్టాలి అన్న కాళోజి మాటలను నేటి పాలకులు గుర్తు తెచ్చుకుంటే మంచిది.

2013 భూసేకరణ చట్టం కన్నా మెరుగైన నష్టపరిహారం జి.వొ 123 ద్వారా లభిస్తుందని, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి అద్భుత ఆలోచన అని, ఇంక దీనికి తిరుగులేదని మంత్రులు, అధికారులు పదే పదే చెబుతున్నారు. పోనీ అదే విషయం రాతపూర్వకంగా పూర్తి వివరాలతో ఇవ్వమంటే మాత్రం మొహం చాటేస్తున్నారు. ఎందుకు అంత భయం? అధికారులు, మంత్రులు చెప్పేది పూర్తి అవాస్తవం. రెండింటికి పోలికే లేదు. ఈ అవాస్తవాల ప్రచారం కేవలం ప్రజలను మోసం చేయడానికే అనేది ఈ కింద వివరాలు పరిశీలిస్తే స్పష్టమవుతుంది.

వ.సం.    2013 భూ సేకరణ, పునరావాస చట్టం

పూర్తి వివరాలతో వారికి పునరావాస, పునరాశ్రయ పథకం తయారు చేయాలి. అది గ్రామసభలో పెట్టి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. ఆమోదం పొందిన పథకం వివరాలను తెలుగులో ప్రజలందరికి అందుబాటులో ఉంచాలి. ఈ ప్రక్రియంతా భూమి ప్రజా ప్రయోజనానికి ఖచ్చితంగా అవసరం అని రూఢీ ప్రకటన జారీ చేసే ముందే జరగాలి.

6.    రెండవసారి దినపత్రికలలో రూఢీ ప్రకటన జారీ చేసిన తరువాత భూమి యజమానులకు/సాగు చేసుకునే వారికి నష్టపరిహారం గురించి విచారణ జరపటానికి 30 రోజుల ముందు ప్రజలకు నోటీసు ఇవ్వాలి. ప్రభావిత ప్రజలు వారు కోరుకుంటున్న నష్టపరిహారం, పునరావాసం గురించి రాతపూర్వకంగా తెలియచేసుకునే అవకాశం ఇవ్వాలి. అవార్డు విచారణ వీలైనంత వరకు బహిరంగంగా గ్రామంలోనే జరగాలి. అధికారులు ఏ విధంగా వారు మార్కెట్‌ ధర నిర్ణయించింది, నష్టపరిహారం ఎంత చెల్లించదలచుకున్నారు, పునరావాసం వివరాలు ప్రజలకు చెప్పాలి. ప్రజల అభ్యంతరాలను, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని కలెక్టరు అవార్డు ప్రకటించాలి. అందులో భూ విస్తీర్ణం, నిర్ణయించిన మొత్తం నష్టపరిహారం మరియు పునరావాస, పునర్నిర్మాణ వివరాలను పేర్కొనాలి.

7.    భూమికి పరిహారం నిర్ణయించేటప్పుడు, మార్కెట్‌ విలువ (రిజిస్ట్రేషన్‌ ధర) పరిగణనలోకి తీసుకోవడం ఒక అంశం మాత్రమే. అది కూడా భూ సేకరణకు ప్రాథమిక ప్రకటన ఇచ్చే ముందు మార్కెట్‌ విలువను తప్పని సరిగా సవరించాలి (తెలంగాణలో మార్కెట్‌ విలువ సవరించి దాదాపు 3 ఏళ్లు అవుతుంది). చట్టం ప్రకారం భాదిత ప్రజలకు ఇచ్చే పరిహారం సవరించిన మార్కెట్‌ విలువకు మూడు రెట్లు తగ్గకూడదు అని చెప్తుందే కాని, అంతే ఇవ్వాలని కాదు. చట్టం సెక్షన్‌ 26, 28 లోను సెక్షన్‌ 107, 108 ప్రకారం ఆయా ప్రాంత ప్రజల అవసరాలు, స్థానిక పరిస్థితులను బట్టి ఎంత ఎక్కువ పరిహారాన్నైనా నిర్థారించే అధికారం, వెసులుబాటు కలక్టరు, ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి చట్టం ప్రకారం నిర్వాసితులకు తక్కువ పరిహారం వస్తుందని చెప్పటం పచ్చి అబద్ధం. ప్రభుత్వాల అలక్ష్యం, ప్రజల తెలియనితనం కారణంగా అతి తక్కువగా

ఉన్న రిజిస్ట్రేషన్ల ధరను ఆధారంగా చేసుకుని ప్రజలను భయపెట్టి మార్కెట్‌ రేటు (లావాదేవీల వాస్తవ ధర) కన్నా తక్కువ ధరకు భూములను గుంజుకోవాలని ప్రభుత్వం చూస్తుంది.

8.    అసైన్డ్‌ భూమి, పట్టాలేకుండా సాగులో ఉన్న భూమిని కూడా పట్టా భూమితో సమానంగా పరిగణించి సమాన నష్టపరిహారం, పునరావాసం అందించాలి.

9.    చట్టంలో హక్కుగా, ఖచ్చితంగా అందే నష్టపరిహారం, పునరావాసం

– మార్కెట్‌ విలువ ఒక ఎకరానికి లక్ష రూపాయలుంటే నష్టపరిహారం 3 లక్షలు + భూమి మీద ఆస్థుల విలువకు రెండు రెట్లు + నోటిఫికేషన్‌ నుండి మార్కెట్‌ విలువ మీద 12 శాతం వడ్డీ.

– అసైన్డ్‌ భూములు, పట్టాలు లేకుండా ప్రభుత్వ భూమిలో సాగులో ఉన్న వారికి కూడా అంతే పరిహారం ఇవ్వాలి.

– సాగునీటి ప్రాజక్టులో భూమి కోల్పోతుంటే ప్రతి కుటుంబానికి నష్టపరిహారానికి బదులుగా కనీసం ఒక ఎకరం, ఎస్‌సి, ఎస్‌టి లైతే 2.5 ఎకరాలలోపు ఎంత భూమి కోల్పోతే అంత. ఆ భూమి కూడా సంబంధిత ప్రాజక్టు ఆయకట్టులో ఇవ్వాలి. మొత్తం వారికి వచ్చే నష్టపరిహారంలో ఆ భూమి మార్కెట్‌ విలువ మినహాయించి మిగిలిన భూమికి నగదు పరిహారం ఇవ్వాలి.

– ప్రతి ప్రభావిత కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఒకేసారి లేదా నెలకు 2000 రూ. చొప్పున 20 సంవత్సరాలు లేదా ప్రాజక్టులో అవకాశం ఉంటే కనీస వేతనాలకు తగ్గకుండా ఒకరికి ఉద్యోగం. ఏది కావాలో బాధితులే ఎంచుకోవచ్చు.

– ప్రాజక్టు కారణంగా ఇళ్లు కూడా కోల్పోయి నిర్వాసితులౌతుంటే ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం ప్రకారం అన్ని సౌకర్యాలతో ఇల్లు,

ఒక సంవత్సరం పాటు నెలకి 3000 చొప్పున 36,000,

Share
This entry was posted in కరపత్రం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.