శికందరు బేగం (స్త్రీ విద్యా విజయ దుందుభి!!!) – భండారు అచ్చమాంబ సరళీకరణ : పి. ప్రశాంతి

ఆమె ధైర్యంతో, సత్ప్రవర్తనతో, బుద్ధికుశలతతో ప్రజల హితం కోసం రాజ్యంనందు చేసిన సంస్కరణలు, అనుభవం కలిగినట్టి, రాజ్యకార్య దురంధరుడైన పురుషునికి కూడ భూషణాస్పదంబులు.” ఈ గ్రంథకారుని వాక్యముల వలన శికందరుబేగం ఎంత రాజధర్మ నిపుణమైనదీ తేటతెల్లమ వుతుంది. ఈమెయందుగల ముఖ్య గుణము వత్సలత. అనగా ప్రజలను వాత్సల్యంతో చూసుకుని ప్రేమించుట. ఈ విషయమై భర్తృహరి తన నీతిశతకంలో ఇలా వ్రాసాడు :

రాజన్‌దుధుక్షసి యది క్షితిధేను మేనాం
తేనాద్యవత్సమివ లోకమముం పుషాణ
యస్మింశ్చ సమ్యగనిసం పరితుష్యమాణే
నానా ఫలైః ఫలతి కల్పలతేన భూమిః
తే.గీ.    ”ధరణిధేనువు బిదుకంగ దలచితేని
జనుల బోషింపు మధిప వత్సములమాడ్కి
జనులు పోషింప బడుచుండ జగతి ల్ప
లతలెరంగున సకల ఫలంబులొసగు.”
ఇలా బేగంవారు లోకులపట్ల వాత్సల్యం ఉంచటం వలన వారు సకల జనులకు పూజ్యులై, పృథ్విని కల్పవృక్షంగా చేసి స్వేప్సితఫలములను పొందారు. బేగంగారివలె ప్రజా వాత్సల్యమే పరమధర్మమని రాజులందరూ తలచి అలా ఉండటానికి ప్రయత్నిం చిన పక్షంలో లోకంలోని జనమంతా సుఖించుదురు కదా? ఓడిన, గెలిచినవారి మధ్య వైరం సమసిపోవును గదా?

రాణీగారు తురుష్కులైనను తమ రాజ్యంలోని హిందూ జనులను దయతో చూసేవారు. నిరపరాధులైన హిందువులను అనేకులను తురష్కరాజులు పశువులవలె నరికివేశారని చరిత్ర ప్రసిద్ధమే కనుక, బేగంగారియందుగల సమత విశేష ప్రశంసనీయం.

బేగం షహజహానునకు, అనగా బేగంగారి కుమార్తెకు పద్ధెనిమిది సంవత్సరాల వయసు వచ్చేవరకు బేగంగారు రాజ్యం చేయాలని ఇంగ్లీషువారు సిద్ధాంతం చేసారని ముందే వ్రాసాను. ఇంత కొద్దికాలంలోనే బేగంవారు తన సంస్థానంను ఒక అద్వితీ యమైన, అనుకరణీయమైన సంస్థానంగా చేశారు. అక్బరు బాదుషా తర్వాత జన్మించి రాజ్యపాలన చేసిన తురుష్కులలో ఈమె ఉత్తమ ప్రభ్వియని చెప్పటానికి సందేహం లేదు. అక్బరునందుండిన సద్గుణాలలోని అనేక సద్గుణాలు ఈమెయందు ఉండేవి. కంపెనీవారి ప్రభుత్వంలోని గొప్పగొప్ప అధికారులు ఈమె రాజ్యవ్యవస్థను చూసి ఆనందాశ్చర్యాలను పొందేవారు. రాజ్యంలోని ప్రజలందరూ సదా సంతోషంతో ”మా పురాకృత పుణ్యం వలన మాకీ శికందరుబేగం గారు రాణీగా లభించారు” అని కొనియాడుచుండేవారు.

ఇలా బేగంగారు సకలవందితులై రాజ్యం చేయుచుండగా ఆమె కూతురైన బేగం షహజహాను ఉపవరమయ్యెను. అప్పుడు బేగంగారు ఈ చిన్నదానికి, బక్షిబాకర్‌ మహమ్మదు ఖాన్‌ అను వరుని తెచ్చి వివాహం చేసారు. అప్పటికి బేగంగారు బిడ్డకు రాజ్యమివ్వడానికి మూడు సంవత్సరాల వ్యవధి ఉన్నది. బేగంగారి మనసులో అంత్యకాలం వరకు తాము రాజ్యం చేయాలన్న ఇచ్ఛ ఉండేది. బేగంగారి ఇచ్ఛ త్వరలోనే సిద్ధించింది.

1857వ సంవత్సరములో ఉత్తర హిందూస్థానమందలి పటాలంలోని సిపాయిలు తిరగబడినందున ఇంగ్లీషువారికి గొప్ప సంకటం సంభవించిందనే విషయం హిందూదేశ చరిత్ర చదివినవారికి అందరికి తెలిసిన విషయమే. ఆ సంకట సమయంలో దయార్ద్ర హృదయ ఐన బేగంగారు ఇంగ్లీషువారికి అనేకరీతుల సహాయం చేసి ఇంగ్లీషువారు సూర్యచంద్రాదులు ఉండువరకు మరవకూడనంత ఉపకారం చేసింది. సంకట సమయాన ఇంగ్లీషువారికి ఉత్తర హిందూస్థానం వరకు శిందోహేళకరులు, మధ్య హిందూస్థానము నందు భూపాళబేగంగారును, దక్షిణమున నైజాం సహాయం చేసినందువలననే ఈ దేశములో ఆంగ్లేయులుండగలిగారేమో. అనగా మనం ఇప్పుడు ఇంగ్లీషు రాజ్యం వలన అనుభవిస్తున్న శాంతత, నాగరికత, విద్యాభివృద్ధి మొదలగు సౌఖ్యములకు అంశతః శికందరు బేగంగారు కారణభూతురాలని నిర్భయంగా చెప్పవచ్చును. ఈమె రాజ్యంలోని అనేక జనులు, ఈమె తల్లి, ఇంగ్లీషువారిపై తిరగబడ్డారు; కాని ఈమె వారందరిని నివారించి, మృత్యుముఖాన పడనున్న అనేక ఆంగ్లేయులను యుక్తిప్రయుక్తులతో ఇంగ్లీషు సైన్యమున్న హుషంగాబాదు పట్టణంకు సురక్షితంగా చేర్చుటలో బేగంగారు చూపిన ధైర్యం అత్యంత ప్రశంసనీయం. ఇలా అనేకరీతుల బేగంగారు ఇంగ్లీషువారికి సహాయం చేసి అంతగ శాంతపడిన తర్వాత ఇంగ్లీషువారి రాజ్యం స్థిరపడటానికి అనేక రీతుల సహాయం చేసింది. ఈ ప్రకారంగా ఈమె ఇంగ్లీషువారిని కృతజ్ఞతాబద్ధులను చేసినందువలన, వారీమెను చాలా సన్మానించి, అదివరకు తీసుకున్న భైరసియాప్రాంతం ఆమెకిచ్చేసారు. 1859వ సంవత్సరంలో ఇంగ్లీషువారు, శికందరుబేగం భూపాళ సంస్థానంకు స్వామిని అనీ, మరణకాలం వరకూ ఈమెనే రాజ్యం చేయాలనీ, ఈమె మరణానంతరం ఆమె కుమార్తెకు రాజ్యం దొరుకునని ఏర్పాటు చేసారు. ఇలా బేగంగారి ఇచ్ఛ సిద్ధించింది. ఇంగ్లీషువారు కృతజ్ఞతాబుద్ధితో ఆమెకు నాలుగుతోటలు బహుమానంగా ఇచ్చారు. వారు 1863వ సంవత్సరంలో గొప్ప దర్బారు చేసి బేగంగారికి ‘స్టార్‌ ఆఫ్‌ ఇండియా’ అనగా ‘హిందూదేశం యొక్క నక్షత్రం’ అను బిరుదును ఇచ్చారు. ఇలా బహువిధాల ఇంగ్లీషు ప్రభువులు ఈమెను సన్మానించారు.

శికందరుబేగం ఇలా రాజ్యకార్యదక్షతను గురించి కీర్తిని సంపాదించి, ఇంగ్లీషువారిపట్ల రాజనిష్ఠతను చూపి, వారిచే అనేక సన్మానములను పొంది, ప్రజల ప్రీతికి పాత్రురాలై ఐహిక సుఖములను అనంతంగా అనుభవిస్తుండేది. కాని సౌఖ్యములలోనూ ఆమె పారమార్థిక విచారమును మరచిపోలేదు. ఆమె బీదలయందు అధిక దయగలదై వారి దుఃఖనివారణకు అనేక ఉపాయములను చేసింది. ఈమె స్త్రీలకు స్వాభావికములైన అనేక ధర్మకృత్యాలను చేసింది. తురుష్కుల ధర్మశాస్త్ర ప్రకారం ఆమె ప్రతిదినము మూడుపూటల తప్పక ఈశ్వర ప్రార్థన చేస్తుండేది. 1863వ సంవత్సరంలో ఆమె రాజ్యమంతా బిడ్డకు అప్పగించి, ఆ రాజ్యాన్ని కాపాడాలని ఇంగ్లీషు ప్రభుత్వంవారికి విన్నవించి తాను మక్కాయాత్రకు వెళ్ళింది. హిందువులకు కాశీ ఎలానో, తురష్కులకు మక్కా అలా అని చదువరులు గ్రహింపగలరు. యాత్ర చేసుకుని అక్కడ అనేక ధర్మములు చేసి దానశూరురాలని కీర్తిని పొందింది. అక్కడి నుండి తిరిగి తన రాజ్యానికి వచ్చి, 1868వ సంవత్సరం వరకు పరమార్థ విచారంలో సుఖంగా కాలం గడిపింది. 1868వ సంవత్సరంలో ఈమెకు ఒక వ్యాధి కలిగి, అక్టోబరు నెల 30వ తేదీన ఈమె కాలధర్మం చెందింది. అప్పుడు ఈమె ప్రజలు, ఇంగ్లీషువారు కూడా దుఃఖితులయ్యారు.

ఈమె కాలం చేసిన తర్వాత ఈమె కూతురైన షహాజహాన్‌ బేగం సింహాసనమెక్కి మిక్కిలి న్యాయంతో రాజ్యం చేసింది. తల్లిలాగే ఈమె ప్రజావాత్సల్యంనందు, ఇంగ్లీషువారిపట్ల రాజభక్తి దృఢంగా చూపుటలోను మిక్కిలి ఖ్యాతిని పొందింది. ఈమె సుగుణాలను దర్బారునందు ఇంగ్లీషువారు పొగిడి, ఈమెకు జే.సి.యస్‌.వి. అన్న పదవిని ఇచ్చారు.

లార్డు ల్యాండ్‌ డౌన్‌గారి ప్రభుత్వ సమయంలో ఆయన భూపాళ సంస్థానం చూడటానికి వెళ్ళి అక్కడి ప్రభుత్వాన్ని చూసి మెచ్చి ఆ సంస్థానం గురించి ఇలా వ్రాసాడు :

”భూపాల సంస్థానాధీశ్వరులెప్పుడూ రాజ్యకార్యధురం ధరత్వంనకును, రాజభక్తికిని, ఔదార్యంనకును ప్రఖ్యాతులైయున్నారు. ప్రస్తుతపు సింహాసనాధీశ్వరి యొక్క తల్లిగారగు శికందరు బేగంగారు 1857వ సంవత్సరంలో బ్రిటిషువారికి (ఇంగ్లీషువారికి) చేసిన సహాయం ఎప్పుడూ మరవదగినదికాదు. ఇప్పటి బేగంగారు, తల్లిగారి రాజ్యం గ్రహించినట్లే ఆమెయొక్క సద్గుణములను కూడా గ్రహించినది. ఈమె సారాసార విచారము కలిగి, బుద్ధి వైభవం కలిగి, రాజ్యకర్త్రయని పేరుపొందింది. ఈమె లోకోపకార ప్రథములైన అనేక కార్యముల కొరకు అత్యంత ధనమును వ్యయపరచినది. ఈమె రైళ్ళు కట్టడానికి సహాయం చేసింది. భూపాలులోని ప్రజల కొరకు అద్వితీయమైన జలము తెప్పించింది. తాను కొన్నిరోజులక్రిందట తన సైన్యములలో నుండి ఇస్తానన్న సైన్యమును బ్రిటిష్‌వారు తీసుకోవచ్చని, ఆ సైన్యము హిందూదేశ సంరక్షణార్థం ఉపయోగించాలని ఈమె నాకు నేడు తెలియచేసింది.”

ఈ వంశస్థులు ఇలాగే కీర్తిని చెంది శికందరు బేగం వంటి అనేక బేగంలచే భూషితులగుదురుగాక అని ఈశ్వరుని ప్రార్థించి, ఈ చరిత్రను సమాప్తి చేయుచున్నాను.

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో