వర్తమాన లేఖ

ప్రియమైన నిర్మలా, ఎలా ఉన్నావ్‌? నిర్మలలు చాలామంది

ఉండటంతో కొండేపూడి నిర్మల అనిపిలిస్తేనే కానీ కుదరని సందర్భమిది. ఈ మధ్య మనం కలిసి కూడా చాలా కాలమైంది. నిర్మలా నిన్ను మొదటిసారి చూసింది నీ అక్షరాల్లోనే. యం.ఫిల్‌ చేసే రోజుల్లో కవయిత్రుల జాబితాలో నువ్వు, ఘంటసాల నిర్మల, ఓల్గా, విమల ఇలా ప్రము ఖమైన వాళ్ళుండడంతో మిమ్మల్నందర్నీ వ్యక్తిగతంగా కలుసుకోవాలనే ఉత్సాహం చాలా ఉండేది. విడివిడి కవితలన్నీ ఫైల్‌ చేసుకునేదాన్ని. 88లో వచ్చిన ‘సందిగ్ధ సంధ్య’ – కవిత్వ పుస్తకం, 89లో వచ్చిన నడిచే గాయాలు ఎంత ఇష్టంగా చదువు కున్నానో తెల్సా! విజయవాడలో నిర్మలా స్క్వేర్‌లిద్దరూ ఆంధ్రజ్యోతిలో సబ్‌ ఎడిటర్లుగా ఉన్నప్పుడు రాసిన కవితలున్నాయి. మీరిద్దరూ బాల్య, యువ స్నేహితులు కదా! ఆరోజుల్నించి మనని ఇప్పటి దాకా కలిపి వుంచింది కవిత్వ స్నేహమే. నీలిమేఘాలు వచ్చే నాటికే తెలుగు సాహిత్యంలో ప్రశ్నించి ప్రభావితం చేస్తున్న స్త్రీవాద కవిత్వమే నీ నేపథ్యం కదా! కథల్లో కూడా అంత తీవ్రమైన అభివ్యక్తిని కనపరచగలవనడానికి నిదర్శనం ‘శత్రుస్పర్శ’ కథల సంపుటి. 2001లో అనుకుంటా వచ్చిందిది. నిర్మలా ఆ టైటిలే నాకు బాగా నచ్చింది – ‘బాధా శప్త నది’ ఎన్నో ఎన్నో బాధల్ని ఒక్క పదంలో చెప్పేశావు. ఇది కూడా బహుశా 1994లో అనుకుంటా వచ్చింది. పరిణితి చెందిన కలానికి నిదర్శనం 2001లో వచ్చిన ‘మల్టీనేషనల్‌ ముద్దు’. పేరు చూసే భయపడ్డారు కొందరు. కుతూహలంతో, ఆసక్తితో చదివారు కొందరు. బురద జల్లడానికి ప్రయత్నించారు కొందరు. కవిత్వమే లేదు పొమ్మన్న మహానుభావులూ ఉన్నారు కొందరు. వాళ్ళ విమర్శ వెనుక, భయం వెనుక, అంగీకరించలేని తనం ఎందుకుందో మనకు తెలుసు కాబట్టి నవ్వుకున్నాం.

కానీ, నిర్మలా నువ్వనగానే టక్కున గుర్తొచ్చే కవిత ‘లేబర్‌ రూమ్‌’. దాని చుట్టూ అల్లిన, అల్లుతున్న ‘మిత్‌’ని మొత్తం బ్రేక్‌ చేసావు. ‘రైలు పట్టాల మీద నాణెంలా విస్తరించిన బాధను కళ్ళకు కట్టేట్లు చేశావు. ‘నీలిమేఘాల్లో’ మళ్ళీ ముద్రించిన నీ కవితల్లో నాకిష్టమైన ‘రహస్తంత్రి’, ‘తెల్లార కట్ట కవతల’, ‘హృదయానికి బహువచనం’, ‘ఆక్వేరియం’, ‘మరణ వాంగ్మూలం’, ‘నడిచేగాయాలు’, ‘స్లీపింగ్‌ పార్ట్‌నర్‌’ గా ఇలాంటివెన్నో. ముఖ్యంగా పేర్లే స్ట్రయికింగ్‌గా ఉంటాయి. లోతైన అర్థాన్ని, జీవన గాఢతను కలిగి వుంటాయి. నీ కవితా సంకలానాలన్నీ ‘నిర్మల కవిత్వం’ పేరిట ముద్రించటం వల్ల ఒక సమగ్రత వచ్చింది. కొత్త వాళ్ళకు ఎంతో ఉపయోగం కూడా. నిర్మలా నువ్వు విజయవాడలోనే పుట్టి, డిగ్రీ వరకూ అక్కడే చదివావు కదూ! కవిత్వమే కాకుండా ఇతర ప్రక్రియలైన, కథలూ, వ్యాసాలూ, సెటైర్స్‌ లాంటివి ఎక్కువగానే రాశావు. జర్నలిస్ట్‌గానే నీ జీవితం ఆగిపోకుండా నువ్వు చేసిన రకరకాల ఉద్యోగాల వల్ల అనేక జీవితానుభవాలన్నీ వస్తు విస్తృతిని పెంచాయి. అందుకే అంతస్సూత్రంగా స్త్రీవాదమే

ఉన్నప్పటికీ వస్తు విస్తృతి అపారంగా ఏర్పడింది. ప్రతి కవితా విలక్షణతను సంతరించుకుంది. భావతీవ్రత, గాఢత ఎక్కువవ్వడం వల్ల, ఏ కవితా చదివాక కూడా ఒదిలిపెట్టదు. ఆలోచింపజేస్తుంది. ఆగ్రహాన్ని రగిలిస్తుంది. ఆర్ద్రతను మిగులుస్తుంది. ‘ఇండియన్‌ లిటరేచర్‌’, క్వెస్ట్‌, తానా లాంటి పత్రికల్లో ఆంగ్లానువాదాలు అచ్చయ్యాయి. కన్నడ, ఉర్దూ, తమిళ భాషల్లోకి అనువాదా లూ వచ్చాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘కుమారన్‌ ఆశాన్‌ నేషనల్‌ అవార్డ్‌’ను 90లో అనుకుంటా నువ్వందుకోవడం ఓ మంచి జ్ఞాపకం. తెలుగు యూనివర్సిటీ అవార్డ్‌తో పాటు ‘అంబేద్కర్‌ వర్క్స్‌’ ట్రాన్స్‌లేటింగ్‌ టీమ్‌లో పనిచేస్తూ, ఓపెన్‌ యూనివర్సిటీ వారి ఆడియో లెసన్స్‌ కూడా చెప్పావు కదా! ‘డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌’గా కొన్నాళ్ళు పనిచేసిన అనుభవంలో ఒక మంచి పోయెం ‘సింకింగ్‌’ వచ్చింది. ఎక్కడా తలవంచని, ప్రశ్నించే తత్వం ఉండటం వల్ల, అర్థం చేసుకొనే క్రమంలో అమాయకత్వం ఉండటం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో నష్టమే జరిగిందని నాకనిపిస్తుంది. పురుష ప్రపంచం సృష్టించిన హైరార్కీల చట్రంలోకి, పోటీ ధోరణిలోకి వెళ్ళడం మనకే నష్టమని ‘ఓల్గా’, ‘నీలి మేఘాలు’ ముందుమాటలో కూడా అన్నారు. మనల్ని మనకు దూరం చెయ్యటానికీ, ఎలిమినేషన్‌కి గురి చెయ్య టానికీ జరిగే ప్రయత్నమిది. నీకు తెలియని విషయం కాదనుకో ఇది. ఎందుకో నీతో మాట్లాడాల న్పించింది అలా. అంతే. ‘రంగవల్లి’ అవార్డ్‌ వచ్చిందికదూ! గత సంవత్సరంమనుకుంటా ‘అమృతలత’ – అవార్డ్‌ వచ్చింది. తను స్త్రీ రచయితలకు అభినందన రూపంలో ఇస్తున్న ‘అపురూప’ అవార్డ్‌ నిజంగా అపురూపమే. నిర్మలా నీతో ఇంకా చాలా మాట్లాడాలని వుంది. కానీ స్థలాభావం వల్ల ఈరోజుకిక ఆపేస్తున్నా. నీ ఫోన్‌ నెంబర్‌ పనిచేయడం లేదు. ప్రయ త్నించీ ప్రయత్నించి విసుగొ చ్చింది. ‘కాల్చేసు’ తున్నా ఫలితం లేదు. కొత్త నెంబర్‌ నాకు పంపు తల్లీ!

– నీ  శిలాలోలిత

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో