“ఎవరెష్ట్ మీద కురిసిన పండు వెన్నెల” మా నేపాల్ ట్రిప్

కె.హేమంత

  మా శ్రీవారి ఉద్యోగరీత్యా రెండు నెలలు నేపాల్‌లో గడిపే అవకాశం లభించింది.  మొదటిచూపులో మనం పరాయి దేశంలో అడుగుపెట్టాం అన్న భావనే కలుగదు.  దానికి తగ్గట్టుగానే వారు భారత్‌ను బిగ్ బ్రదర్‌ (పెద్దన్న) గా వ్యవహరిస్తారు.  అక్కడి మనుషులు, వాతావరణం, జీవనశైలి, ఆహారపుటలవాట్లు ఇలా అన్నీ ఉత్తర భారతంలోని నగరంలా అనిపిస్తాయి.  దాదాపు అందరు హిందీ మాట్లాడగలరు.  నేపాలీ భాష కూడా హిందీ బెంగాలీ కలిసినట్లుగా వుంటుంది.
స్వతహాగా నేపాలీలు నెమ్మదస్తులు, శాంతి ప్రియులు, సర్దుకుపోయే మనస్తత్వం గలవారు, స్నేహశీలురు.  ఎవరిని పలుకరించినా ”హజూర్‌” (హుజూర్‌) అంటూ ఆప్యాయంగా సంబోధిస్తారు.  80 శాతం పైగా జనాభా హిందువులే అయినా దసరా, దీపావళి ఎంత పెద్ద ఎత్తున జరుపుకుంటారో అంతే వేడుకగా క్రిస్మస్‌ కూడా జరుపుకుంటారు.  దసరా, దీపావళికైతే పదేసి రోజులు ప్రభుత్వ ఆఫీసులు, సూపర్‌ బజార్‌ లు కూడా బందే.  వృద్ధు లు, కుటుంబ పెద్దలకు చాలా గౌరవం ఇస్తారు.  ముఖ్యంగా పండుగల సమయంలో కుటుంబాలకు ఎంత దూరాన వున్నా సరే వచ్చి కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకోకపోతే వారికి పండుగ జరుపుకున్నట్టే కాదు.  పండుగ రోజులలో ఎక్కడ ఎవరిని చూసినా ఆడ, మగ తేడా లేకుండా మొహాలపై పెద్ద పెద్ద టీకాల (నుదుటిపై నిలువుగా పెట్టుకునే కుంకుమ తిలకం) తో కళకళలాడుతూ కనిపిస్తారు.  నేపాలీలు ఇంత చక్కగా తమ పెద్దలను గౌరవి్స్తూ తమ సంస్కృతిని పరిరక్షించుకునే విధానం చూస్తే ముచ్చటేస్తుంది.  చలిప్రదేశం కావటం వల్ల ఇక్కడ పూలు, పళ్ళు, కూరగాయలు చాలా పెద్దగా, ఫ్రెష్‌గా దొరుకుతాయి.  ముఖ్యంగా ఆకుకూరలు ఎంత బాగుంటాయంటే పచ్చివే తినాలనిపిస్తుంది.  చిన్నదైనా పెద్దదైనా ఏ షాపుకెళ్ళినా ముందుగా హార్డ్‌ డ్రింక్స్‌ కౌంటర్‌ దర్శనమిస్తుంది.  ఎక్కువగా ప్రజలు మా౦సాహారులే.  అలాగే జంతు ప్రేమికులు కూడా.  దీపావళి పండుగ సమయంలో కోడి, కుక్క, కోతి, మేక, ఆవు ఇలా రోజుకొక జంతువు చొప్పున అయిదు రోజులు పూజలు చేస్తారు.  కుక్కను పూజించిన రోజైతే రోడ్డు మీద ఏ కుక్కను చూసినా నుదుటిమీద టీకాతో, మెడలో పూల దండతో భలే తమాషాగా వున్నాయి.
 నేపాల్‌ రాజధాని ఖాట్మండు ఒకప్పుడు మూడు చిన్న రాజ్యాలుగా వుండేది.  అవే కాంతి పూర్‌, లలిత్‌ పూర్‌ మరియు భక్తాపూర్‌.  గర్ఖా రాజ్యంలోని షా వంశస్తులు ఈ రాజ్యాలపై దండెత్తి విజయం సాధించి, ఈ మూడింటిని ఒక్కటి చేసారు.  కాంతిపూర్‌ ప్రస్తుతం ఖాట్మండుగా వ్యవహారంలో వుంది.  మన జంటనగరాల లాగే,ఖాట్మండు, లలిత్‌ పూర్‌ భాగీరధి నదికి ఇరువైపులా వున్నాయి.
ఖాట్మండులో ప్రధానంగా చూడ వలసిన ప్రదేశాలలో మొదటిది పశుపతినాథ్‌ దేవాలయం.  ఈ దేవాలయం నేపాల్‌లోనే కాకుండా మనదేశంలో చాలా పేరుగాంచిన దేవాలయం.  దేశంలోని అతిముఖ్యమైన శైవ క్షేత్రాలలో మొదటిది.  భాగీరథి నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయనికి నాలుగువైపుల నుంచి ప్రవేశ ద్వారాలు ఉన్నాయి.  లోపల చాలా పెద్ద ప్రాంగణం, మధ్యలో గుడి, ప్రధాన ఆలయం కాకుండా చుట్ట చిన్న చిన్న గుడులు కూడా వున్నాయి.  ఈ ఆలయ ప్రాశస్త్యం, స్థల పురాణం నాకు పెద్దగా తెలీదు కాని ఈ గుడిలో నాకు నచ్చిన విషయమేమిటంటే, ఇక్కడ మన ఆలయలలో లాగా పెద్ద పెద్ద క్యూలు, సెక్యూరిటీ గార్డులు, అరసెకను దర్శనాలు వంటివి లేనే లేవు.  ఎవరైనా సరే, ఎంతసేపైనా వుండొచ్చు.  కాని దేవాలయంలో కూడా ఎక్కడ చూసినా కోతులు, కుక్కలు వుండటం వత్రం ఆశ్చర్యపరిచే విషయం.  ఈ ఆలయంలో ఒక ప్రక్కన నది ఒడ్డున దహనక్రియలు, కర్మకాండలు జరుపుతారు.  నేపాల్‌ రాజవంశస్థులకు కూడా ఇక్కడే అంత్యక్రియలు చేస్తారు.  ఆలయ ద్వారాల బయట వర్గానికి ఇరువైపులా రకరకాల షాపుల్లో పసుపు కుంకాల నుంచి రుద్రాక్షలు, సాలెగ్రావలు, శ్రీయంత్రాల వరకు చాలా దొరుకుతాయి.  రుద్రాక్షల గురించి చాలా విషయలు నేను ఈ గుడి దగ్గరే తెలుసుకున్నాను.  రుద్రాక్షలు వంటివి కొనేముందు మాత్రం అసలు, నకిలీ పరీక్షించి సగానికి సగం బేరమాడి కొనాల్సిందే.  నేపాల్‌లో మన కరెన్సీ కూడా వాడుకలో వుంది, కాని 500, 1000 నోట్లు అక్కడ చెల్లవు.
ఖాట్మండులో చెప్పుకోదగ్గ మరో ఆలయం బౌద్ధనాథ్‌ స్తూపం.  ఇది దేశంలో కెల్లా పెద్ద బౌద్ధ స్తూపం అని చెపుతారు.  అర్థగోళాకారంపైన చతురస్రం ఆపైన గోపురం వుండే ఈ స్తూపంపై చిత్రించబడిన కళ్ళను ఆల్‌ సీయింగు ఐస్‌ ఆఫ్‌ బుద్ధా అని చెపుతారు.  ఈ స్తూపం చుట్ట తిరుగుతుంటే ఆ కళ్ళు మన వంకే చూస్తున్నట్లు అనిపిస్తుంది.  ఇక్కడ బౌద్ధ భిక్షువులు పెద్ద పెద్ద బకెట్లలో కుంకుమ పువ్వు కలిపిన నీటిని స్తూపంపై పోస్తూ౦టారు.  మనం కూడా కావాలంటే పక్కన అమ్మే కుంకుమ పువ్వు పాకెట్లు కొని ఇస్తే అవి కూడా ఆ నీటిలో కలిపి పైకి తీసుకెళ్ళి పోస్తారు.  స్తూపం చుట్ట ప్రేయర్‌ వీల్స్‌ అమర్చబడి వున్నాయి.  భక్తులందరు ఈ ప్రేయర్‌ వీల్స్‌ తాకుత (తిప్పుత) ప్రదక్షిణ చేస్తారు.  ఇక ఆవరణలో చుటూ టిబెటన్‌ షాపులు, రెస్టారెంట్‌లు, బౌద్ధ భిక్షువుల పాఠశాలలు, హాస్టల్స్‌ ఉన్నాయి.  టిబెటన్‌ పూసలు, మ్యూజికల్‌ బౌల్స్‌, ఆయుర్వేద వనమూలికలు, అగరుబత్తీలు, కొండరాళ్ళు వంటివి అనేకం ఇక్కడ దొరుకుతాయి.  ఇంకా స్వయంభనాథ్‌ టెంపుల్‌, సిటీ మ్యూజియం, దర్బార్‌ స్క్వేర్‌ వంటివి ఖాట్మండులో చడదగ్గ ప్రదేశాలు.
ఖాట్మండుకి సుమారుగా 10 కి.మీ. దూరంలో వుంది భక్తాపూర్‌.  ఇది ఒక వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌.  18వ శతాబ్దం నాటి ఈ నగరాన్ని నేటికీ అలాగే పరిరక్షిస్తున్నా  ఇక్కడి ఇళ్ళని రోడ్లని ఆనాటి ొరూపురేఖలు పోకుండా మరమ్మత్తులు చేసి సంరక్షిస్తున్నారు.  మరొక విషయం ఏమిటంటే ఇది ఉపయెగంలో వున్న వూరే.  ఎందరో చిత్రకారులు, హస్తకళా విద్యార్థులు ఇక్కడ కళను అభ్యసిస్త జీవిస్తున్నారు.  చుట్ట కొండలు, అడవులు కావడం వల్ల ఇక్కడి పురాతన కట్టడాలన్నీ చెక్కతో నిర్మించినవే.  దేశంలోకెల్లా ఎత్తైన గుడి ఇక్కడే వుంది.  5 అంతస్తుల ఈ చెక్కనిర్మాణం ప్రస్తుతం ఉపయెగంలో లేదు.  నేపాల్‌లోని చారిత్రక, పురాతన కట్టడాలన్నీ చెక్కతో మలచినవే.  ఇక్కడి చెక్కతో చేసిన హస్తకళా వస్తువులు మన చూపుల్ని కట్టిపడేస్తాయి.  ఇక్కడి ఇరుకైన రోడ్లను ఇటుకలు పేర్చి మరమ్మత్తు చేస్తున్నారు. 
నేపాల్‌లో ఒకచోటనుంచి మరోచోటకు ప్రయణం చేయలంటే టాక్సీలనే వుపయెగించాలి.  మన ఆటోల లాగా ఇక్కడ ్మారుతీ 800 కార్లను వుపయెగిస్తారు.  ఈ టాక్సీలన్నీ డిజిటల్‌ మీటర్స్‌తో పనిచేస్తాయి.  కాని ఒక్కో టాక్సీ ఒక్కో రేటు.  ఒకే చోటుకి మేము ఒకసారి ర.40, మరోసారి ర.100 చెల్లించాల్సి వచ్చింది.  మన ఆటోవాలాలకి తెల్సో తెలీదో కానీ నేపాలీ ట్యాక్సీవాలాలకి మాత్రం డిజిటల్‌ మీటర్ల మ్యాజిక్‌ బాగా తెల్సు.
నేపాల్‌లో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థ దాదాపు లేనట్టే.  చేతిలో బండి వుంటే ఖాట్మండు చుట్టు పక్కల ఎన్నో దాగివున్న అందాలను వెతికిపట్టుకోవచ్చు.  కానీ ఒక లీటరు పెట్రోలు కోసం ఒక రోజంతా క్యూలో నిలబడాలి.  టాక్సీలు వారంలో ఆరురోజులు రోడ్ల మీద వుంటే ఒకరోజు క్యూలో వుండాలి.  అంతసేపు క్యూలో వున్నా దొరికే పెట్రోలు మాత్రం రేషనే.  గ్యాస్‌ కోసం సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే పెద్ద పెద్ద హోటల్స్‌లో మాత్రం వంటకే కాదు, గీసర్లకీ, హీటర్లకీ కూడా గ్యాస్‌ సిలిండరే వాడతారు.  మనకి వేసవిలో పవర్‌కట్‌లా, శీతాకాలం పెరిగేకొద్దీ పవర్‌కిట్‌లు ఎక్కువవుతాయి.  కొన్ని హోటళ్ళలో తప్ప ఎక్కడా సీలింగు ఫ్యాన్‌లు వుండవు.  అక్కడ చలికి ఆ అవసరం కూడా రాదు.  వేసవిలో మాత్రం స్టాండ్‌ ఫ్యాన్‌లు వాడతారు.
బయట వూర్లకి వెళ్ళటానికి బస్సులు వుంటాయి.  ఈ బస్సులు కదలాలంటే బస్సు లోపల, పైన కూడా నిండాలి.  ఖాట్మండు లోకి రావాలన్నా, పోవాలన్నా ఒక్కటే హైవే.  అది కూడా పూర్తిగా ఫట్‌ రోడ్డు.  ఎప్పుడో చైనీయులు వేసిన రోడ్డు క్షీణావస్థలో వుంది.  ఏ కారణం వల్లైౖనా ట్రాఫిక్‌ జామ్‌ అయితే క్లియర్‌ అవటానికి ఒక్కొక్కసారి కొన్ని రోజులు పడుతుంది.  నేపాల్‌లో రైల్వే వ్యవస్థ లేదు.  ఎక్కడో జనక్‌పూర్‌ (బీహార్‌ బోర్డర్‌లో వుంటుంది) దగ్గర మాత్రం 4 కి.మీ. మేర రైలు మార్గం వుంది.  నేను నేపాల్‌లో కలిసిన ఒక వ్యక్తి ఆయన కుమార్తెను బెంగుళూర్‌ కాలేజీలో చేర్పించటం కోసం తాను చేసిన రైలు ప్రయణం గురించి ఎంతో సంతోషంగా చెపుతుంటే నాకు ఆశ్చర్యమనిపించింది.  మనకున్న ఎన్నో వసతుల గురించి నేపాలీయులకు కొన్నింటి గురించి తెలిసి కూడా వుండకపోవచ్చు.  అవన్నీ వున్న మనం ఒక్కొక్కసారి వాటి విలువ తెలుసుకోకుండా బ్రతికేస్తున్నామేవె అనిపించింది.
థామెల్‌, ఇది ఒక రంగుల ప్రపంచం.  ఎడారిలో ఒయసిస్సులను తలపించే ఎండమావి.  అల్లావుద్దీన్‌ అద్భుతదీపం లోని జీనీ మాయ సృష్టి.  టూరిస్టుల కోసం అవతరించిన అందాల హరివిల్లు.  ఇది ఖాట్మండులోని ఒక షాపింగు/టరిస్ట్‌ డిస్ట్రిక్ట్‌.  ఇక్కడ నేపాలీయులు, విదేశీయుల్లా కనిపిస్తారు.  కొంతమంది మతిమరుపు రాయుళ్ళు నేను నేపాల్‌ వచ్చానా లేక న్యయర్క్‌ వచ్చానా? అని ఆశ్చర్యపోయినా తప్పు లేదు.  టర్‌ గైడ్‌ నుంచి అడ్వంచర్‌ స్పోర్ట్స్‌, ట్రెకింగు, మౌంటెనీరింగు,వైల్డ్‌ వాటర్‌ రాఫ్టింగు ఎవరెస్ట్‌ ఎక్స్‌పెడిషన్స్‌ (ప్యాకేజి) వరకు అన్నిటి సామగ్రి ఇక్కడ లభ్యం.
 థామెల్‌ చూడాలంటే రాత్రి పూటే.  నేపాల్‌ ొచూడటానికి లేదా పర్వతారోహణ కోసం వచ్చే ఎంతోమంది విదేశీ యత్రికులు ఇక్కడి హోటళ్ళలోనే బస చేయటానికి ఇష్టపడతారు.  రాత్రి పూట లైట్ల కాంతిలో ఏ షాపులో ఏ వస్తువు ొచూసినా అది అక్కడ తప్పితే మరెక్కడా దొరకదేవొమొ అనిపిస్తుంది.  షాపులన్నీ విదేశీ కష్టమర్లను దృష్టిలో వుంచుకునే వ్యాపారం కొనసాగిస్తాయి.  పుస్తకాలు, వ్యప్‌లు, ట్రెక్కింగు, మౌంటెనీరింగు సామగ్రి నుంచి రకరకాల ఒరిజినల్‌ అని చెప్పబడే డూప్లికేట్స్‌ ఒకటేమిటి సమస్తం ఇక్కడ లభిస్తాయి.  కొత్తవారికి ప్రత్యేకంగా కనిపించినా అక్కడ లభించే వస్తువులన్నీ బయట 25 శాతం నుంచి 50 శాతం తక్కువ ధరకే లభిస్తాయి.  ఇక్కడ ఉన్నితో చేసే కళాఖండాలు, దుస్తులు, ఆట వస్తువులు కళ్ళు చెదిరే రంగులతో అద్భుతంగా అనిపిస్తాయి.  ఖాట్మండులో వుంటే కనుక ఒక్క సాయంత్రం తప్పకుండా థామెల్‌ కోసం కేటాయించండి.
మేము అక్టోబరు నుండి డిసెంబరు వరకు అక్కడ వున్నాము.  అప్పటికే శీతాకాలం మొదలవటం వల్ల చాలావరకు మంచుకొండలు పొగమంచు వల్ల అప్పుడప్పుడు మాత్రమే కనపడేవి.   ఖాట్మండులో మనకు కనపడేవి అన్నపూర్ణ పర్వత శ్రేణులు. వీటిని మరింత దగ్గరగా చూడాలన్నా, మంచుకొండల అద్భుత అందాల్ని ఆస్వాదించాలన్నా మనం తప్పకుండా పోఖరా వెళ్ళాల్సిందే.
ఖాట్మండు నుంచి పోఖరాకు ఆరుగంటల ప్రయణం. బస్సు, విొమాన మార్గాలున్నా, రోడ్డు మార్గం ద్వారా వెళితేనే స్వచ్ఛమైన ప్రకృతి అందాల్ని తనివితీరా చూసి తరించొచ్చు.  హైవే దాదాపు 90 శాతం ఫట్‌రోడ్డు.  రోడ్డుకు ఒక వైపు పచ్చటి ఎత్తైన కొండలు, దట్టమైన లేత అడవి, కొండల మీది నుంచి ఎంతో హడావిడిగా పరుగెత్తుకుంట జాలువారే ఎన్నెన్నో జలపాతాలు.  అక్కడక్కడా కొండపైనే చదును చేసివేసిన పంటపొలాలు.  వాటి మధ్య ఎలా చేరుకోవాలో దారి కనపడని కుటీరాల్లాంటి ఇళ్ళు, మరోవైపు పరవళ్ళు తొక్కుత ఉధృతంగా వున్న కోసీ నది.
ఆ నీటివంక చూస్తుంటే ఎన్నో అనుభతులు గుండెలో ఉప్పొంగుతాయి.  ఆ ఉధృతి మనతో సంభాషిస్తున్నట్టు తనవారి కడ్డువచ్చిన బండలను కోపంగా నెట్టివేస్త, ఎంతపెద్ద కొండైనా నన్నాపలేదు అనే పొగరు, ఎంతవారలైనా తన వయ్యరాల ముందు తలవంచి తొలగవలసిందేననే గర్వం.  ఇన్ని భావావేశాల్ని కలిగించే నదులకు స్త్రీ లింగం ఆపాదించడం ఎంత సమంజసం అనిపిస్తుంది.
అబ్బ అటు చడు, అదిగో అక్కడ చూశావా అనుకుం్టూ వుండగానే రెండు గంటల ప్రయణం తర్వాత ొమా కారు  ఒకచోట ఆగింది.  రోడ్డుకి అటువైపు ఎత్తైన కొండమీద అమ్మవారి గుడి.  అదే మనోకామనా దేవత ఆలయం.  ఆరోజు దసరా కావటం వల్ల చాలా రద్దీగా వుంది.  కొండ మీదికి వెళ్ళటానికి రోప్‌వే వుంది.  క్రింద నది ఉరకలు వేస్తున్నా ఇంతకు ముందున్న ఆగ్రహం ఆవేశం తగ్గింది.  బహుశా అమ్మవారి పాదాల దగ్గర శాంతి దొరికిందేవె.  భక్తుల మనసులోని కోరికల్ని తీరుస్తుందని ఈ దేవతకు మనోకామనా మాత అని పేరు.  రోప్‌వే లేకముందు కాలినడకన కొండ ఎక్కటం ఒక్కటే దారి.  ఇప్పటికీ రోడ్డు మార్గం లేదు.  దాదాపు మూడువేల మీటర్ల ఎత్తులో 20 ని||ల రోప్‌వే ప్రయణం బాగుంది.
నేపాల్‌లో ఇంకా జంతుబలి చేస్తారు.  పండుగలప్పుడు ఇంకా ఎక్కువ.  దసరా పండుగ కావటం వల్ల దాదాపు భక్తులందరు తమ శక్తి మేర కోడి, మేక ఇలా ఏదో ఒకటి బలి ఇవ్వటానికి జంతువులతో సహా క్యూలో నుంచున్నారు.  గర్భగుడిలో అమ్మవారి పాదాల దగ్గర బలి ఇచ్చి వాటిని గోనె సంచిలో చుట్టి బయటికి ఈడ్చుకుంట వెళతారు.  గుడి ఆవరణంతా జనం, పేడ, రక్తం.  ఇవన్నీ చూడలేక బయటినుంచే దణ్ణం పెట్టుకుని వచ్చేశాం.
పోఖరాకు ొమా మిగతా ప్రయణం అంతా లేత కొండలమీద పచ్చటి అడవులు, అప్పుడప్పుడ మబ్బులా మంచుకొండలా అనిపించే హిమ శిఖరాల దో్బూచు లాటతో సాగి పోయింది.  పోఖరా చేరగానే మన కళ్ళ ముందు సాక్షాత్క రించే రాజసం ఉట్టిపడుత ఠీవిగా నుంచున్న ఆ మంచుకొండలను చూస్తుంటే అప్రయ త్నంగా నోరు తెరుచుకుని అన్నీ మరిచిపోయి వాటినే ొచూస్తుండి పోవాలనిపిస్తుంది.  ఈ మంచుకొండలలో, ప్రత్యేకించి పోఖరాలో ప్రధాన ఆకర్షణ ”మచ్ఛ పుచ్ఛరే” లేదా ఫిష్‌ టైల్‌ మౌంటేన్‌.  ఈ కొండ శిఖరం ఫిష్‌ టైల్‌లాగా వుండటమే ఈ పేరుకి కారణం.
పోఖరా సరస్సులో ఈ ఫిష్‌ టైల్‌ ప్రతిబింబం అద్భుతంగా వుంటుంది.  సరస్సుకి మధ్యలో ఒక గుడి వుంది.  సరస్సులో బోటింగు వుంది.  ఈదురుగాలులు, పొగమంచువల్ల మేము బోటింగుకు వెళ్ళలేదు.  పోఖరాలో ఫిష్‌ టైల్‌ మౌంటేన్‌ కాకుండా చూడవలసిన మరో రెండు ప్రదేశాలు దేవిస్‌ ఫాల్స్‌ మరియు మౌంటేనీరింగు మ్యూజియం.  వీటికంటే ముందు సారంగుకోటలో సన్‌రైజ్‌ పాయింట్‌కి మిస్‌కాకుండా వెళ్ళాలి.
నేను కన్యాకుొమారిలో సముద్రం మీద సర్యోదయం చూసినప్పుడు సముద్రుడు ొసూర్యుడ్ని ప్రసవించానిపించింది.  మంచుకొండలలో ొసూర్యోదయం చాలా విభిన్నంగా వుంది.  సారంగుకోట అనే ఒక కొండమీది పల్లె పైన నుంచుని 5 గం|| నుంచి ొచూస్తే 5.45కి తొలికిరణం ఒక ఎత్తైన శిఖరాన్ని తాకి దాన్ని బంగారు రంగులో వెలిగించింది.  ొచూస్తుండగానే మిగతా శిఖరాలన్నీ బంగారంలా ొమారిపోతుంటే, మంచు శిఖరాలన్నిటికీ నిప్పురాజుకున్నట్టుండే ఆ దృశ్యం ఇప్పటికీ నా మదిలో ఒక చెరిగిపోని చిత్రం.
రెండు ఎత్తైన ఇరుకైన కొండల మధ్యన దకే జలపాతమే పోఖరాలోని దేవీస్‌ ఫాల్స్‌.  ఇవి ఎంత ఉధృతమైన ఫాల్స్‌ అంటే, ఈ ప్రవాహం మధ్య వున్న ఒక పెద్ద కొండరాయికి దాదాపు నాలుగు అడుగుల డయమీటర్‌లో రంధ్రం ఏర్పడింది.  ఈ రంధ్రం లోంచి దకే నది క్రింద ఎక్కడ పడుతుందో తెలియనంత ఇరుకైన లోయ.  క్రింద లోయ కనపడదు కాని నీటి హోరు మాత్రం బాగా తెలుస్తుంది.  రోడ్డుకి అవతల ప్రక్క మరోచోట ఈ జలపాతం పాదాల దగ్గరకు వెళ్ళటానికి కొన్ని గుహల లోంచి 2 అంతస్తులు భూమి లోపలికి దారి వుంది.  గుహ ద్వారం నుంచి ఒక అంతస్తు క్రిందకు దిగితే లోపల ఒక చిన్న శివాలయం వుంది.  ఇక్కడినుంచి క్రిందకు దిగటానికి దారి వున్నా అది మూసేశారు.  గుహ లోపల అంతా చాలా తడిగా జారుడుగా వుంది.  వేసవిలో 2-3 నెలలు ొమాత్రమే క్రిందకు అనుమతిస్తారు.  మిగతా సమయం అంతా ప్రవాహం చాలా ఉధృతంగా ఉంటుందంట.
దేవీస్‌ ఫాల్స్‌ లాంటిదే పోఖరాలో మరో గోర్జ్‌ వుంది.  అక్కడ నీటి ప్రవాహం వెంట చిన్న ఓపెన్‌ నాలా లాంటిది నిర్మించారు.  నాలా ప్రక్కన ఫుట్‌ బ్రిడ్జి వుంది.  దాని మీద నుంచుని ఈ నీటిని తోడవచ్చు.  ఈ నీళ్ళెంత స్వచ్ఛంగా వున్నాయంటే చూట్టానికి పాలలాగా వున్నాయి.  ముట్టుకుంటే జిల్లుమనే చల్లదనం.  స్వచ్ఛమైన లేత మంచు బిందువుల రుచి బహుశా ఇలాగే వుంటుందేవె అనిపించింది.
పోఖరా నుంచే అన్నపూర్ణా పర్వతశ్రేణుల పైకి రకరకాల పర్వతారోహణ బృందాలు బయలుదేరతాయి.  కొంతమందికి శిఖరాగ్రాలకి చేరుకోవాలనే అభిలాష అయితే, కొంతమందికి కొండలమీది పల్లెలపై ఆసక్తి.  కొంతమందికి అక్కడ దొరికే మొక్కలు, పువ్వులు, పక్షులు, జంతువులపై శ్రద్ధ అయితే మరికొందరికి ఆధ్యాత్మిక చింతన, ముక్తికై అన్వేషణ.  అందుకే ఇక్కడ నెలకొల్పారు మౌంటెనీరింగు మ్యూజియం.
ఈ మ్యూజియం అంతా పూర్తిగా చూడటానికి ఒక రోజంతా పట్టవచ్చు.  పర్వతాలకు, పర్వతారోహణకు సంబంధించిన దాదాపు అన్ని విషయలు మనం ఇక్కడ తెలుసుకోవచ్చు.  హిొమాలయల ఆవిర్భావం, ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలు, వివిధ దేశాలలోని గిరిజనుల జీవనశైలి, వేషభాషలు, ఆహారపుటలవాట్లు, వివిధ పర్వత శ్రేణులలో కనిపించే పుష్ప, వృక్షజాతులు, పక్షి జాతులు, జంతు జాతులు, వివిధ వ్యాధుల వైద్యానికి వుపయెగించే వనమూలికలు, పర్వతారోహణలో వాడే సామగ్రి, పర్వతారోహణకు సంబంధించిన చరిత్ర…. ఇంకా ఎన్నో విశేషాలు.
మ్యూజియంలో ఒకచోట చాలా సామాను వరుసగా పేర్చబడి వున్నాయి.  ఆక్సిజన్‌ సిలిండర్‌లు, వంట సామాను, ఇంకా ఇలాటివే ఎన్నో వున్నాయి.  అవేమిటో తెలిశాక నాకు చాలా ఆశ్చర్యమేసింది.  అవన్నీ ఎవరెస్ట్‌ మీద దొరికిన చెత్త.  2005-06లో కొంతమంది పర్వతారోహకులు వలంటీర్‌ చేసి 100 కిలోల పైగా చెత్తను ఎవరెస్ట్‌ మీదినుంచి క్రిందకు తీసుకువచ్చారు.  అప్పటినుంచి ఎవరెస్ట్‌ శుద్ధి కార్యక్రమంలో భాగంగా నేపాల్‌ ప్రభుత్వం ఎవరెస్ట్‌ పర్వతారోహణకు వెళ్ళే బృందంలోని ప్రతి సభ్యుడు తనవెంట కనీసం 5 కిలోల చెత్తను తప్పనిసరిగా క్రిందకు తీసుకురావాలని నిబంధన విధించింది.  దీనివల్ల ప్రతిఏటా ఎవరెస్ట్‌ పర్వతారోహణవల్ల కలిగే పర్యావరణ కాలుష్యం నుంచి కొంత వూరట లభిస్తోంది.  ఇలా చెప్పుకుంట పోతే పర్వతారోహణ గురించి ఎన్నో విషయలున్నాయి.
పర్వతారోహణ గురించి చెపుత షెర్పాల గురించి చెప్పకపోతే అది అన్యాయమే అవుతుంది.  షెర్పాలు బాగా ఎత్తైన చల్లటి కొండ ప్రదేశాలలో నివసించే ఒక జాతి గిరిజనులు.  హిమాలయలు మనకు కొండలు, కాని వారికి దైవసమానం.  మనం ఎవరెస్ట్‌గా వ్యవహరించే హిమాలయలను వారు ”సాగర్‌మాత”గా కొలుస్తారు.  షేర్పాలు లేకుండా ఏ పర్వతారోహణ బృందం బయలుదేరదు.  పర్వతారోహణకు బయలుదేరేముందు, వారు సాగర్‌మాతకు భక్తితో పూజలు చేస్తారు.  తమ పాదాలతో దేవతను అపవిత్రం చేస్తున్నందుకు మన్నించమంట తమ అధిరోహణ, అవరోహణ క్రమంలో ఏ ఆటంకాలు లేకుండా సహకరించమని వేడుకుంటారు.
గొర్రెలు మేపటం, పర్వతారోహణ బృందాలలో కూలీలుగా, దారిచూపే గైడ్‌లుగా వ్యవహరించటమే వీరి ప్రధాన జీవనోపాధి.  ఎంతోమంది షెర్పాలు పర్వతారోహణలో ప్రాణాలు కోల్పోవటవె, వికలాంగులుగా మిగిలిపోవటవొమొ లాంటివి తరుచూ జరుగుతుంటాయి.  అటువంటి వారి కుటుంబాలు దుర్భర దారిద్య్రం అనుభవించాల్సి వస్తుంది.  వారి బాధలు ొచూడలేక సర్‌ ఎడ్‌మండ్‌ హిల్లరీ వారి కోసం ఒక ఫౌండేషన్‌ స్థాపించారు.  షెర్పా గ్రాొమాలలో స్కూళ్ళు, ఆసుపత్రులు కట్టించి షెర్పాలకు మెరుగైన జీవనం కల్పించే విధంగా సర్‌ ఎడ్‌మండ్‌ హిల్లరీ  ఫౌండేషన్‌ కృషి చేస్తోంది.
ఖాట్మండు నుంచి గంటన్నర ప్రయణం చేస్తే నాగర్‌కోట్‌ చేరుకోవచ్చు.  వాతావరణం క్రియర్‌గా వున్న రోజులలో ఇక్కడి నుంచి ఎవరెస్టు శిఖరం చూడొచ్చు అని ఇక్కడి వారంతా చెపుతారు.  మేము నవంబర్‌ నెలాఖరులో వెళ్లటం వల్ల ొమాకా భాగ్యం కలుగలేదు.  5 సెంటీగ్రేడుల ఉష్ణోగ్రత, విపరీతమైన చలి, పొగమంచు సాయంకాలం 5 గంటలకే చుట్ట చిమ్మచీకటి ఆ రోజు రాత్రి ఎత్తైన కొండలలో మంచు కరుగుతున్నట్లు పయనిస్తున్న పొగలాంటి మబ్బుల మధ్య నిండు చంద్రుని అందాలు, చుట్ట ప్రశాంతమైన నిశ్శబ్దం, ఆ అనుభవం వర్ణించటానికి నా దగ్గర మాటలు లేవు.
నేపాల్‌ గురించి చెపుతూ బుద్ధిజం గురించి చెప్పకుండా ఉండలేం.  బుద్ధుని జన్మస్థలం లుంబినీ గ్రామంకు ఖాట్మండు నుండి ఆరు గంటల ప్రయణం. ఖాట్మండు వ్యాలి అయితే ఇది మాత్రం చదును ప్రాంతం. ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువే.  ఒక మాదిరి వేడిగానే వుంటుంది.  చాలా పొడిప్రాంతం.  కొండలన్నీ ఎక్కడో దూరంగా కనిపిస్తాయి.  బుద్ధుని జన్మస్థలం పరిరక్షించటానికి నేపాల్‌ ప్రభుత్వం ఈ గ్రామాన్ని ఖాళీ చేయించి ఆ భూమిని బుద్ధిజం అభివృద్ధి కోసం వివిధ దేశాలకు కేటాయించింది.  చైనా, బర్మా, జపాన్‌, తైవాన్‌, కొరియ, ఇండోనేషియ, ఇండియ, టర్కీ, జర్మనీ, ఆస్ట్రియ వంటి అనేక దేశాలు ఇక్కడ మొనాస్ట్రీలు నిర్మించిన పగోడాలు ఇక్కడ వున్నాయి.  వివిధ దేశాలు తమ తమ సాంప్రదాయలకనుగుణంగా ఇక్కడ స్తూపాలను నిర్మించి బుద్ధిస్ట్‌ స్కూళ్ళను ఏర్పాటు చేశారు.
బుద్ధుని కథలో బుద్ధుని తల్లి మాయదేవి తోటలో విహరిస్తుండగా ఒక చెట్టుని పట్టుకుని ప్రసవించిందని, బుద్ధుడు పుట్టగానే పది అడుగులు వేసి అక్కడున్నవారికి జ్ఞానబోధ చేశాడని చెపుతారు.  అలా నడిచినప్పటివిగా చెప్పుకునే పాదముద్రలున్న స్థలాన్ని పరిరక్షించి దాని చుట్టూ ఒక ఆలయన్ని నిర్మించారు.
 ఇక్కడి గ్రామస్థుల జీవనోపాధికై ఈ ప్రాంగణం లోనికి కార్లను నిషేధించారు.  అయితే నడిచి వెళ్ళాలి, లేదా రిక్షాలలో వెళ్ళాలి, ఎన్నో ఎకరాల స్థలంలో దారి తప్పకుండా కావలసిన చోటికి వెళ్ళటానికి దాదాపు టూరిస్టులందరు రిక్షాలనే వుపయెగిస్తారు.
 ఇప్పటికీ నేపాల్‌లో చాలా గ్రామాలకు కాలిబాటనే వెళ్ళాలి.  ఎన్నో పల్లెలకు విద్యుత్తు సౌకర్యం లేదు.  చాలా పల్లెలకు అందుబాటులో హాస్పిటళ్ళు లేవు.  ఎన్నో దేశాల ఎన్‌జివోలు ఇక్కడి వారి వివిధ సమస్యల పరిష్కారా నికై కృషిచేస్తున్నాయి.  ఎక్కువగా చదువుకున్న యువత ఎన్‌జివోలో లేదా హోటల్‌ మేనేజ్‌మెంట్‌,  టూరిజం విభాగాలలోనే పనిచేస్తున్నారు.  నేను పైన చెప్పినవన్నీ సంవత్సరం క్రితం విషయలు.  ఇప్పుడు అక్కడి రాజకీయ పరిస్థితులు మారాయి.  రాచరికం వీడి ప్రజాస్వామ్యాన్ని స్వాగతించిన నేపాలీలకు మెరుగైన, సంతోషకర మైన, అభివృద్ధితో కూడిన భవిష్యత్తును ఆశిద్దాం.

Share
This entry was posted in యాత్రానుభవం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో