ఒక అశ్విని మరణం – వేణు తడిసెట్టి

అమ్మా.. శక్తిమాన్‌..!

నువ్వు కన్ను మూసినందుకు

గుండెలు ఎగసిపడుతున్నా

రెండు పాదాల జంతువులు చేసే

నిరంతర రక్తరాజసూయాన్ని

ఇలాగైనా తప్పించుకున్నందుకు

కాస్త సంతోషంగానూ ఉంది బిడ్డా!

బహుశా నువ్వు బతికుంటే

మళ్లీ ఇంకెవడో నీ కాళ్లు విరగ్గొట్టడన్న

హామీ ఏమీ లేదు కదమ్మా,

కరుణరసం వరదలై పారే

ఈ గోనాగపూజల పుణ్యభూమిలో..

బహుశా నువ్వు బతికుంటే

నీ కడుపుకింత గడ్డిపెడతారని

నీ గాయపడిన కాలికింత మందు రాస్తారని

కర్రకాలో, కడ్డీకాలో అతికించి సాకుతారని

హామీ ఏమీ లేదు కదమ్మా,

మనుషులు దాణాలు బుక్కే లోకంలో

మనుషులు సర్వలోహాలూ మింగే

ఈ సస్యశ్యామల పులకితయామినిలో..

అయినా, నీ చావు ఇప్పుడు మొదలైందా కన్నా?

నీతోపాటు గెంతిన మానవ మహాపాదం

నిన్ను దాటి లోకాన్ని ఆక్రమించినప్పుడే కదా

సమస్త జంతుజాలపు మరణశాసనం

అతని కళ్లేలపై లిఖితమైపోయింది..!

తల్లీ.. పంచకల్యాణీ..!

నువ్వు నీ తల్లి కడుపున వున్నప్పుడు

గెంతడం, పరిగెత్తడం సకిలించడమే కాకుండా

మనుషులు అధర్మ యుద్ధవ్యూహాలనూ

తెలుసుకుని వుండాల్సింది బిడ్డా..!

పాపం.. పశువ్వి కదా..!

నీకేం తెలుసులే..

నువ్వు పెరిగి పెద్దయ్యాక

నిన్ను పోలీసు గుర్రాన్ని చేస్తారని

తమ చేతులకు మట్టి అంటకుండా

నీ కాళ్లతో జనాన్ని తొక్కించి చంపుతారని..!

అయినా అమ్మడూ..!

పోలీసులతో అన్నేళ్లు సావాసం చేశావు కదా..

కాసిని కిటుకులు తెలుసుకోవాల్సింది చెల్లీ..

సవారీ, కవాతు, ఆయుధాల మోత గట్రా

బహిరంగ పోలీసు విద్యలే కాకుండా..

తిండిలో, నీటిలో విషం పెట్టడం

ఇన్ఫార్మర్ల, కోవర్టుల వలలు అల్లడం

చట్టాల కవచాలను, హెల్మెట్లను తిరగేసి వాడడం

ప్రాణాలను బీభత్సచాతుర్యంగా తీయడం

వగైరా రహస్య విద్యలూ నేర్చుకుని ఉండాల్సిందికదమ్మా..

పోనీ.. అవేం చేతగాకపోయినా..

ఆ దేశభక్త కాషాయపు వీరాధిశూరుడు

నీ కాళ్లను పటుక్కుమని విరగ్గొట్టేముందు

‘భారత్‌ మాతాకీ జై’ అని

అస్పష్టంగానైనా సకిలించి ఉండాల్సింది కద నాన్నా..!

అమ్మా శక్తిమాన్‌..!

నువ్వు నీ రక్తసిక్త గాయంతో

కన్నుమూసినందుకు దుఃఖంగా ఉన్నా

రెండు పాదాల జంతువుల చేసే

నిరంతర పీడితమానవమేధంలో

మరింత కాలం నువ్వొక పావుగా మిగిలిపోకుండా

కాల్వలుకట్టిన కన్నీటితో

మనుషుల్లారా.. మీకిక సెలవంటూ వెళ్లిపోయినందుకు

కాస్త అశ్రుతప్త నయన సంతోషంగానూ ఉంది బిడ్డా..!

(ఉత్తరాఖండ్‌ బీజేపి ఎమ్మెల్యే గణేశ్‌ జోషి దాడిలో గాయపడి చనిపోయిన శక్తిమాన్‌ గుర్రానికి)

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో