వర్తమాన లేఖ – శిలాలోలిత

పియమైన కె. గీతా!

గీతల కావల, సముద్రాల కావల, మరో భాష నోరు తెరిచిన చోట ఎలా ఉన్నావ్‌? నాకందుకే కోపం. ఒకింత అలక. ఎందుకంటే నేనుగా గుర్తు చేసుకోవాల్సిందే కానీ, నీకు నేను గుర్తు రాలేదా? ఎఫ్‌.బి. లో నువ్వు తీసుకున్న డిగ్రీ పట్టాను, మెరిసే నీ సంతోషాన్ని చూసి ముచ్చట పడ్డాను. నువ్వు నా డిగ్రీ ఫస్టియర్‌లో కదా పరిచయం. చాలా లేత మొగ్గ వయసు నీదప్పుడు. రాజమండ్రి యూనివర్సిటీలో సెమినార్‌ జరుగుతుంటే, అమ్మ వరలక్ష్మి గారితో, చెల్లితో వచ్చినప్పుడు నీ ఉత్సాహ ఉద్వేగాలు నిన్ను ఆకాశమంత ఎత్తుకు ఎదిగేట్లు చేస్తాయని నాకప్పుడే అన్పించింది. ఎం.ఏ. తెలుగులోనే ఆపకుండా ఎం.ఏ. ఇంగ్లీషు చేశావు. లెక్చరర్‌ ఉద్యోగంతో సరిపెట్టు కోకుండా ఆగని నీ పయనంతో దేశాల కావల కొలువున్నావు. జీవితంలో పెనుతుఫానులెన్నెదురైనా నీ సహచర మిత్రుడు సత్య వల్ల నీ జీవితం ఆనందమ యిందన్న విషయం నాకు ఆనందాన్నిస్తుంది. ఇప్పుడు తీసుకున్న మాస్టర్స్‌ డిగ్రీ ఎంతో అపురూపమైంది కదూ! గీతా నీ స్వరం అద్భుతంగా ఉండేది. పదే పదే ఆ పాటను వినేదాన్ని. సంగీతంలో నీ ప్రవేశం నీతోనే ఆపకుండా- ఎందరికో నేర్పుతున్నావని విని ముచ్చట పడ్డాను. సంగీతం నిన్ను శిలను కాకుండా చేస్తే, కవిత్వం నిన్ను మనిషిగా నిలబెట్టింది. అసలు చిన్నపిల్లవి. మాకెంతో అపురూపంగా ఉండేదప్పుడు. ‘నేను రుతువునైన వేళ’ అనే కవిత నిన్ను ఉత్తమ కవయిత్రిగా గుర్తించేట్లు చేసింది. నిన్ను తలుచుకోగానే ముందుగా ఆ కవితే మెదులుతుంది.

స్త్రీవాదం ఉధృతంగా ఉన్న రోజుల్లో, విప్లవాత్మక ధోరణిలో రాస్తున్న వారిలో నువ్వు చేరిపోయావు. బాగా ఫీలయితే, బాగా కోపం వస్తే, విపరీతమైన ఆవేదన కలిగితే నీనుంచి కవిత్వమై ఆ రోజుల్లో రాలి పడేవి. 93′ లో వచ్చిన ‘నీలిమేఘాలు’ లో ‘పరపరాగ విరాగం’, ‘బంగాళా’ఖాతం, వచ్చాయి. ఎన్నాళ్ళని అవయవాల్ని కడుపులోకి కూడగట్టు కోవటం?… శరీరం ఒక పోరాటం, మనసు మరో యుద్ధం- ఈ ఒక్క అవయవాన్నీ విసిరవతల పారేస్తే చాలు’- అని ఆ రోజుల్లోనే ఒక ధిక్కార స్వరాన్ని విన్పించావు పరపరాగ విరాగంలో. అలాగే ‘బంగాళా ఖాతం’ కవితలో కూడా- ఇదే అసహనం, ఆగ్రహం కన్పిస్తాయి. ‘క్రూర వినోదాలకీ/ అంతర్గత శరీరం అయిపోయింది/ బూతు పారాయణానికి/మనసు కర్ణభేరి మొదటికి తెగిపోయింది/ రాగాల సరాగాల సంసారం/ఒక్కనాడూ అనుభూతికి రాలేదు/ ప్రేమ ఎక్కడుందో మచ్చుకైనా తెలీలేదు/ ఇక్కడ ప్రాముఖ్యత లేనిది/ఇంక వుండలేనిది కూడా వుంది/ – నేను – చాలా విషయాల్ని ఈ కవితలో వ్యక్తీకరించావు. స్త్రీల మనోగతాలన్నీ విప్పి చెప్పావు. ‘నేను ఋతువునైనవేళ’ కవితలో కూడా విపరీతమైన రక్తస్రావం, కడుపు నొప్పీ, భరించలేని విలవిల్లాడే తనం ఎలా ఉంటాయో కళ్ళకు కట్టేట్లు చెప్పావు. ఆ శారీరక బాధ కొందరు స్త్రీలకు ఎంత నరకప్రాయమో చెబ్తున్నా అది సహజమేనని కొట్టి పారేసిన వాళ్ళను కొట్టినంతపని చేశావు. వాణీ రంగారావు గారు ‘ముద్దమందారం’ అనే కవితను రాసారు. అందులో మొగ్గగా వున్న బాలిక విచ్చుకునే స్థితిని మార్మిక్‌ చిత్రణలో చెప్పారు. 70ల్లో రాసిన ఆ కవిత అప్పటి కాలానికొక సెన్సేషన్‌. నీలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా గీతా! ఏదీ నువ్వు పనిగట్టుకొని రాయవు. నిన్ను తాకిన, ఆవహించిన, ఆలోచించిన, ఆవేదన కలిగించిన, సమ్మోహన పరిచిన, సందిగ్ధంలో పడవేసిన, సామాజిక బాధ్యత కదా అన్పించినా, నేను స్త్రీనైనందున స్త్రీల కొరకు మానవత్వపు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఇది అని భావించిన సందర్భంలో మాత్రమే అవి అక్షరరూపం దాల్చాయి. అందుకే ఆ అక్షరాలకు అంతటా నిజాయితీ అంటుకుంది. కోర్టు బయటా, లోపలా విడాకులు తీసుకుంటున్న స్త్రీల స్థితీ, పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయో, అప్పటి వారి మానసిక సంఘర్షణ ఎలా

ఉంటుందో చెబ్తూ అద్భుతమైన కవిత రాశావు. అమ్మ వరలక్ష్మి అంటే నీకు ప్రాణమని తెలుసు. గొప్ప రచయిత్రిగా పేరు తెచ్చుకున్న అమ్మ ప్రేమలో పెరిగిన చిగురుకొమ్మవు నువ్వు. మొన్నీ మధ్యన కాకినాడలో ‘ఇస్మాయిల్‌’ పురస్కార సభకు వెళ్ళినప్పుడు, అమ్మ కూడా కల్సిందక్కడ. నీ గురించే మాట్లాడుకున్నాం. ‘ఓల్గా’ సభలో కూడా మళ్ళీ కలిసాం. నువ్వు ఇండియా ఎప్పుడొస్తు న్నావ్‌? పాప, బాబు ఎలా

ఉన్నారు? (పేర్లు తెలియదు మరి) నీకు అజంతా అవార్డ్‌ రావడం నీలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. నీ కవితల పుస్తకాలు ‘ద్రవభాష’, ‘శీత సుమాలు’ కదా! 70 ల్లో డిసెంబర్‌ 11న అనుకుంటా నువ్వు తూ.గో.లోని జగ్గంపేటలో పుట్టి పెరిగావు. సంగీత సాహిత్యాలతో పాటు లెక్కలంటే కూడా నీకు చాలా ఇష్టం. నీలిమేఘాల్లో తల్లీ కూతుళ్ళ కవిత్వం ఉండటం ఒక ప్రత్యేకతగా నాకన్పించేది. వ్యక్తి తిరుగుబాటు ధోరణిని ప్రతిఫలించిన కవిత ‘అసహనపు ఆఖరి మెట్టు’. 2013లో అనుకుంటా ‘శతాబ్ది వెన్నెల’ – అనే కవిత్వ పుస్తకం వచ్చింది. చేరా గారి మాటల్లో కూడా నువ్వొక మంచి కవయిత్రివన్న మెప్పుదల ఉండేది. గీతా! ఇప్పటికిక ఉండనా మరి…

– నీ

శిలాలోలిత

 

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో