వానా వానా వల్లప్ప – పి. ప్రశాంతి

నాలుగు నెలలుగా మండుతున్న ఎండల నుండి తప్పించుకోవాలని… వచ్చే మాన్‌సూన్‌ కోసం నాలుగు వారాలుగా ఎదురుచూపులు చూస్తున్న జనం… రేడియోలో, టీవీలో ఇదిగో వచ్చేసింది వర్షం… అదిగో మాన్‌సూన్‌… అని ఒకటే ఊదరగొట్టడం… విని విని విసుగెత్తింది కానీ వర్షం మాత్రం ఆగి ఆగి వాన జల్లులుగానే ఊరిస్తోంది. పట్నపు పొల్యూషన్‌ నుండి వీకెండ్‌ రెండ్రోజులన్నా తప్పించుకుందామని ఫాంహౌస్‌కి వెళ్ళిపోయారు శాంతి, రామ్‌.

చల్లగా వీస్తున్న పచ్చిగాలి… రెండు వారాల్లో కురిసిన రెండు మూడు జల్లులకే మురుకినొదల్చుకుని, తేరుకుంటున్న చెట్లన్నీ చీకట్లోనూ పచ్చగా మెరుస్తున్నాయి. గాలికి కదులుతున్న బత్తాయి చెట్ల ఆకులు, రాలిన వేప పండ్లు, అడవి మల్లెలు, తడిసిన మట్టి, పునాస మామిడి పూత… గాలిలో తేలి వస్తున్న రకరకాల వాసనలు మనసుని ఆహ్లాదపరుస్తున్నాయి. మధ్య మధ్యలో విసిరి కొడ్తున్నట్టు వీస్తున్న గాలికి ఊగిపోతున్న తాటి కమ్మలు, కొబ్బరాకులు, కానుగ కొమ్మలు చేసే చప్పుడు… తారా స్థాయి సంగీతాన్ని వింటున్నట్లుంది. గాలి వాటున వచ్చిపోతున్న వాన తెరలు ఝల్లున తాకినపుడు మాత్రం చెట్ల కొమ్మల్లోని గూళ్ళనుంచి కువ కువ మంటున్న అడవి పిచ్చుకలు, కొంగలు, గువ్వలు… వాటికి తోడుగా కోళ్ళగూట్లో కమ్మేసిన

కోళ్ళు, గిన్నెకోళ్ళు, టర్కీ కోళ్ళు గొంతులు జతకలుపుతున్నాయి.

వారమంతా రకరకాల పనుల్లో, ఆలోచనల్తో అలసిపోయిన తనువు, మనసు… అందమైన ఈ మరో ప్రపంచంలో సేదతీరుతున్నట్లే ఉంది. ఆకాశంలో పరుగెడ్తున్న మబ్బుల్ని చూస్తూ మధ్యమధ్యలో కనిపిస్తున్న నక్షత్రాలు ఏ రాశి గుంపులోవో గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ ఆరుబయట కూర్చొని వర్షం కోసం ఎదురు చూస్తోంది శాంతి. కారుమబ్బులు కమ్ముకోడం చూస్తే పెద్ద వర్షం వచ్చేసేలాగే ఉంది. కానీ అంతలోనే ఈదురు గాలులు మబ్బుల్ని తీసుకుపో తున్నాయి. ఇదీ ‘ఎల్‌నినో’ ప్రభావమేనేమో అనుకుంటూ ఇక వర్షం వచ్చేలా లేదులే అని వెళ్ళి నిద్రపోయింది శాంతి. తెల్లవారు ఝామున చలి పెడ్తుంటే మెలకువ వచ్చింది. కిటికి మూసేసి పడుకుందామని లేచింది కాని, బైటికి చూసిన శాంతికి నిద్రమత్తు ఒక్కుదుటున పారిపోయినట్లైంది. ఒక్క గెంతులో ఇంటి బయటికొచ్చేసింది.

బంగారం కరింగించి గంగాళంలో పోస్తే ఒలికిపోయి ఆకాశంలో పారినట్లుంది తూర్పున. దానికి అంచులా నారింజ రంగు, ఎరుపు వర్ణాలు… ఉత్తర, దక్షిణాలేమో తెల్లబడ్తున్న నీలిరంగు… బూడిద రంగు కలగలిపిన డిజైన్‌లో… నిండు వంగపండు రంగులో పడమర దిక్కు… అద్భుతంగా ఉంది ఆకాశం. చేతులు అడ్డంగా చాపి అంతటి సౌందర్యాన్నీ తనలోకి లాగేసుకోవాలన్నట్లు గుండ్రంగా అల్లిబిల్లి తిరిగింది శాంతి. తిరుగుతూ తిరుగుతూ మెల్లగా పాడుతోంది… వానా వానా వల్లప్పా… వాకిలి తిరుగు మల్లప్పా…

చిన్నపుడెప్పుడో 35-40 ఏళ్ళ క్రిందట అమ్మమ్మింట్లోనూ, నాన్నమ్మింట్లోనూ పిల్లలంతా కలిసి ఆరుబయట, వానలో తడుస్తూ, బంకమట్టి బూట్లులా కాళ్ళకి ఇంతెత్తున పట్టేసినా… లంగాలు కాళ్ళకి చుట్టుకుపోతున్నా… ఒకరి చేతులొకరు పట్టుకునీ… ఒకొక్కరూ విడిగా… అందరూ కలిసి పాడుతూ… వానా వానా వల్లప్పా, వాకిలి తిరుగు మల్లప్పా, తిరుగూ తిరుగూ చెల్లప్పా, తిరగా లేను మల్లప్పా… అంటూ ఆడుకున్న రోజులు మళ్లీ తన ముందు… ప్రత్యక్షంగా తానందులో చిన్నపిల్లనై పోయినట్లే చేతులు చాపి తిరుగుతోంది శాంతి.

కిలకిలమన్న పిల్లల నవ్వులు ఆగకుండా విన్పిస్తూంటే తన జ్ఞాపకాల్లోనే అనుకుంటోంది. కానీ ‘మేడమ్‌… మేడమ్‌…’ అని పిలుస్తున్న శ్రావణి, నందుల పిలుపు, వాళ్ళ నవ్వులు తనని భౌతిక ప్రపంచంలోకి లాక్కొచ్చాయి. దూరంగా నుంచుని చూస్తూన్న వాచ్‌మెన్‌ పిల్లలిద్దర్నీ రమ్మని చేతులూప్తూ పిలిచింది. ఇద్దరూ పరుగెత్తుకొచ్చి శాంతితో చేరిపోయి తనలాగే చేతులు చాచి అల్లిబిల్లి తిరుగుతున్నారు. ఈ అల్లరికి వరండాలో పడుకున్న పెంపుడు కుక్కలు రెండూ లేచి ‘వీళ్ళకేమయింది…’ అన్నట్లు ఆశ్చర్యంగా చూసి ఆనందాన్ని పంచుకుంటున్నట్టు ఆ ముగ్గురి చుట్టూ రెండు రౌండ్లేసి వెళ్లి వాటి స్థానంలో కూచ్చున్నాయి. దూరంగా కట్టేసిన ఆవు, గేదే, దూడలు కూడ ఆ సంతోషాన్ని పంచుకుంటున్నట్టుగా చూస్తూ ‘అంబా…’ అన్నాయి. వర్షం పెద్దదవుతుండగా కాళ్ళకి బూట్లలా అంటుకుపోయిన పొలంలోకి తోలించిన చెరువు మట్టిని మోసుకుంటూ వచ్చి వరండా అంచున కూర్చొని చేత్తో కాళ్ళకున్న మట్టిని తీసేయడం మొదలెట్టారు శాంతి, శ్రావణి, నందులు.

పట్నం గుర్తొచ్చింది శాంతికి. చిన్న వాన పడితే చాలు జనం పడే పాట్లు, వాళ్ళ భయాలు గుర్తొచ్చాయి. ఎక్కడా మట్టనేది కనబడకుండా సిమెంట్‌తో నీట్‌గా వేసిన రోడ్లు… ఆ రోడ్ల మీద కాలువలు కట్టి డ్రైనేజీని వెతుక్కుంటూ ఉరికిపోయే వాన నీళ్లు… ఎత్తు పల్లాలు ఉండే రోడ్లలో పల్లపు ప్రాంతాలలో నీరు నిలిచిపోతే అయ్యే ట్రాఫిక్‌ జామ్‌లు… స్కూళ్ళకి, కాలేజీలకి, ఆఫీసులకు వెళ్ళాల్సిన వారి ఆదుర్దాలు… బస్సులు, రైళ్లు పట్టుకోవడానికి

వెళ్తున్న ప్రయాణీకులు పడే ఆగచాట్లు… చిన్న వాన జల్లులకే పోయే కరెంటులు… పనిచేయని ఫ్రిజ్‌లు, మిక్సీలు, రైస్‌కుక్కర్లతో… పనిమనిషి మానేస్తే ఏంచేయాలో పాలుపోక… అంట్లెక్కడ కడగాలో అర్ధంకాక… బట్టలెక్కడ ఆరెయ్యాలో తెలియక… బిత్తరపోయే

ఇల్లాళ్ళు… అన్నీ గుర్తొచ్చి నవ్వొచ్చింది శాంతికి.

అంతలోనే పట్నంలో ఈ మధ్య వచ్చిన గాలులకి కాస్త వర్షం తోడయ్యేటప్పటికి వేళ్ళు లోతుగా పోలేక కూకటి వేళ్ళతో లేచిపోయిన చెట్లు… పెకిలించుకుపోయిన పుట్‌పాత్‌లు… కూలిన గోడలు… చితికిన బ్రతుకులు… అన్నీ గుర్తొచ్చి గంభీరంగా మారిపోయింది శాంతి వదనం. ఈ దుస్సంఘటనలకి కారణం ఎవరు? మనిషి ప్రాణాన్ని నిలిపే ప్రకృతా? ప్రకృతిని చిన్నచూపు చూసి నిర్లక్ష్యం చేసే మనిషా ?…

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.