వేదిక

ఆలంబన ఆవరణలో ప్రతి నెల రెండవ శనివారం వేదిక పేరిట సాహితీ మిత్రుల సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ఇటీవల ప్రచురితమైన కథ గురించి చర్చా కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల స.వెం. రమేష్‌ రచించిన సిడిమెయిలు కథ గురించి చర్చా కార్యక్రమం జరిగింది. సిడిమొయిలు కథ ప్రధానంగా సమాజంలో ఉండే అసమానతలు మరీ ముఖ్యంగా స్త్రీలపై జరిగే హింస గురించి ప్రస్తావించడం జరిగింది. హోసూరు మాండలికంలో సాగిన ఈ కథ ఆద్యంతం ప్రకృతి పర్ణశాలతో, పాడిపంటలు, పైరులు గురించి, ఏనుగుల గుంపు పంటలపై దాడి గురించి, ప్రకృతికి సమాజంలో జరిగే వాస్తవాలకు ప్రత్యక్ష సాక్ష్యాలతో సాగింది. అణగారిన వర్గాల స్త్రీలపై పైకులాల పెత్తందార్లు లైంగిక వేధింపులను ఏ విధంగా సాగించింది చెప్పడం ముఖ్య కథాంశం. దీనిలో ఈ దాడిని పెద్ద వయస్సు స్త్రీలు ఎలా నేర్పుగా తిప్పి కొట్టారో వర్ణించిన తీరు ఎంతో ఆసక్తిదాయకంగా, స్ఫూర్తిదాయకంగా ఉంది. దాసరి శిరీష, వేమూరి సత్యనారాయణ, చంద్రశేఖర్‌ ఆజాద్‌, కృష్ణకుమారి పాల్గొన్న ఈ సాహిత్య సమావేశం ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది.

తెలంగాణా అభ్యుదయ వేదిక ఆధ్వర్యంలో 19.6.2016 తేదీన ూIుఖజ ఆఫీసు ఆవరణలో ‘భారతదేశ ఆర్థికాభివృద్ధి – నూతన సవాళ్ళు’ అనే అంశంపై ప్రొ|| హరగోపాల్‌ గారు విశ్లేషణాత్మకమైన ప్రసంగం చేసారు. ముఖ్యంగా ఆయన ఆర్థిక వ్యవస్థలోని లోపాలు, ద్వంద్వ స్వభావాన్ని సభికులకు కళ్ళకు కట్టినట్లుగా వివరించారు. జి.డి.పి. గారడీ లెక్కలు, వాటిలోని లొసుగులను వివరించారు. మరీ ముఖ్యంగా ఈ అసమాన ఆర్థికాభివృద్ధి మహిళల జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేస్తున్నది వివరించారు. పాలకులు విద్య, వైద్యం పట్ల ఎంత నిర్ణయాత్మక వైఖరి అవలంబిస్తున్నది, దీనివల్ల సమాజంపై పడే దుష్పరిణామాలను వివరించారు.

డా. వనమాలి గారు ఇంగ్లీషులో రచించిన ఁ ఖీవఎఱఅఱఓఱఅస్త్ర ్‌ష్ట్రవ శ్రీaపశీబతీ తీవశ్రీa్‌ఱశీఅరఁ అనే పుస్తకం సెస్‌ ఆవరణలో 22.6.2016 న ఆవిష్కరించబడింది. డా. వనమాల గారు 30 సంవత్సరాలు మెదక్‌ జిల్లాలో ఒక గ్రామాన్ని నమూనాగా తీసుకుని ఆ గ్రామంలో వ్యవసాయంలో స్త్రీల పాత్ర నుంచి నేడు పారిశ్రామికంగా వచ్చిన మార్పులవల్ల స్త్రీల పాత్రలు ఎలా పరిణామం చెందాయో గణాంకాలతో సహా వివరించారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ ఆర్థికవేత్త జష్ట్ర. హనుమంతరావు గారు ఆవిష్కరించారు.

‘అందరూ బాగుండాలి – మీ వంతుగా…’ అనే సామాజిక స్పృహతో డా. ప్రకాష్‌, డా. కామేశ్వరిల ఆధ్వర్యంలో 20 రోజుల కార్యక్రమంలో భాగంగా కూకట్‌పల్లి ఆలంబన ఆవరణలో నాలుగు రోజుల పాటు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు ఆరోగ్య, సామాజికపరమైన విషయాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. దానిలో భాగంగా మహిళలు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు, వారికి అనవసరంగా చేస్తున్న గర్భాశయ తొలగింపు ఆపరేషన్ల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఈ నాలుగు రోజుల కార్యక్రమాలలో వివిధ రంగాలలో పనిచేస్తున్న వ్యక్తులు వారి అనుభవాలను పంచుకున్నారు. మొదటి రోజు యువభారతి ఆచారి, రెండవ రోజు సుశీల, మూడవ రోజు విమల, నాల్గవ రోజు కృష్ణకుమారి వారి వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ నాల్గు రోజులు ఆలంబన ఆవరణను వేదికగా ఇవ్వడమే కాకుండా దాసరి శిరీష గారు ప్రతీ రోజు తన అనుభవాలను వివరిస్తూ ఈ సమావేశాలు జరగడానికి ఎంతో తోడ్పాటును అందించారు. డా. కామేశ్వరి గారు ప్రతి రోజు స్త్రీల ఆరోగ్యం పట్ల అవగాహనను కల్పించారు. డా. ప్రకాష్‌ గారు సమాజం పట్ల ప్రతివ్యక్తి బాధ్యత గురించి చెప్పారు.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో