భోజనం – ప్రేత వస్త్రం – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

1971 సం||లో ఝార్‌ఖండ్‌ కోల్‌ఫీల్డ్‌ల నేషనలైజేషన్‌ కోసం సమ్మెలు జరిగాయి. అప్పుడు నేను, శ్రీ కేదార్‌ పాండె కల్పించుకోవడం వలన ఇంటక్‌కి సంబంధించిన కోల్‌ఫీల్డ్‌ కార్మిక సంఘంలోకి వచ్చాను. బిందేశ్వరి దుబె మంత్రిగా పనిచేసేవారు కేదలా కోల్‌ఫీల్డ్‌ నేషనలైజేషన్‌ ప్రస్తావన విషయంలో సమ్మె చేయడానికి నోటీసును స్వీకరించారు. సమ్మెలో ట్రక్‌ లోడర్‌ మాకు సహాయం చేయలేదు. సమ్మెని విజయవంతం చేయడానికి అక్కడి నుండి ట్రక్‌ వాళ్ళ రాకపోకలను మూసేయాలి. వాళ్ళని ఆపడానికి బండీ గ్రామస్థులు ఛోటన్‌ నేతృత్వంలో పరేజ్‌ నుండి ఝార్‌ఖండ్‌ వరకు రోడ్డులో ముళ్ళను పాతిపెట్టారు. ఎందుకంటే ట్రక్కులు వెళ్ళేటప్పుడు పంచర్‌ కావాలని వాళ్ళ ఉద్దేశ్యం. వాళ్ళు చరహి నుండి తాపిన్‌లకి మధ్య ఉన్న వంతెనని బాంబుతో లేపేయాలని ప్రయత్నించారు కాని సఫలీకృతులు కాలేకపోయారు. ఎందుకంటే బాంబులు తయారు చేసే జ్ఞానం వాళ్ళకి లేదు. కేవలం మందుగుండు సామగ్రి మాత్రమే తెలుసు. ఈ సామగ్రిని బొగ్గు-రాళ్ళని, కొండలని పేల్చడానికి వినియోగిస్తారు. అందువలన వాళ్ళకి అది అందుబాటులో ఉంది. దానితో వంతెనలను పేల్చలేరు. కేదలాలో కార్మికుల స్థితి-గతులు బాగున్నాయి. నంబరు 3 వంతెనని కూలదోల్చాసిన అవసరం ఉంది, దీన్ని దాటే ట్రక్‌ లోడింగ్‌ జరుగుతుంది. కార్మికులు దీన్ని కూల్చేసారు. ఆ రోజుల్లో నేను బీహారు విధానసభ పరిషత్‌లో మెంబరుగా ఉండేదాన్ని. మేం ఒక ఠేకేదార్‌ కోల్‌ఫీల్డ్‌ని మూసేయించాము. ట్రక్‌లు వచ్చేటప్పుడు ఆగాలా వద్దా అని ఎన్‌క్వయిరీ చేస్తున్నాము. ఠేకేదార్లు, వాళ్ళ ఏజెంట్లు, మేనేజరు ఇంకా కొంతమంది అధికారులు చౌక్‌లో ఉన్నారు. వాళ్ళందరు నన్ను అరెస్టు చేయాలని దారోగాని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దారోగా నా జుట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ జీప్‌లోకి ఎక్కించాడు. ఆయన నన్ను అరెస్టు చేయాలనుకున్నాడు. కార్మికుల మనోబలం బలహీనపడాలన్న ఉద్దేశ్యంతో నేను విధానసభ సభ్యురాలైనా అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. కాని గనులలో పనిచేసే మహిళా కార్మికులు నన్ను చుట్టుముట్టి రక్షణ ఇవ్వసాగారు. దారోగా పిస్తోలు పేలుస్తానని బెదిరించాడు. తేజోమతి అన్నది – ‘దమ్ముంటే పిస్తోలు పేల్చు. అమ్మని మాత్రం తీసుకువెళ్ళనీయం-‘

ఠేకేదార్‌ ఎస్‌.బి. సింహ్‌ పిస్తోలు పేల్చమని మెజిస్ట్రేట్‌కి మాటిమాటికి చెప్పడం మొదలు పెట్టాడు. మెజిస్ట్రేట్‌ ఆజ్ఞానుసారం ఆకుపచ్చ జెండాని పెట్టారు. మహిళలు జీపు బానెట్‌ పైన కూర్చున్నారు. నేను జీపు స్టీరింగ్‌ని పట్టుకుని కూర్చున్నాను. ఆ రోజుల్లో నేనే జీపు నడిపేదాన్ని. మెజిస్ట్రేట్‌ రాజ్‌పుత్‌. ఠేకేదార్ల మనిషి. ఇంతలో మాండు బి.డి.లో శ్రీఝా, దారోగా శ్రీ కాండేలు అక్కడికి వచ్చారు. వాళ్ళు అన్నారు – ”మా క్షేత్రంలో ఆయుధాలు చేతులలో లేని ఈ నిస్సహాయల మీద పిస్తోళ్ళు పేల్చ కూడదు.”

ఇక ఏం చేయలేని పరిస్థితిలో మెజిస్ట్రేట్‌కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మేజిస్ట్రేట్‌ క్షత్రియుడే. ఆయన ఠేకేదారులతో చేతులు కలిపారు. పి.డి. అగర్‌వాల్‌ ఏజెంటు బాబూ సర్వేశ్వర్‌ సింహ్‌ కూడా కలిసే ఉన్నారు. శ్రీ కేదార్‌ పాండె ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన వలన నేను యం.యల్‌.సి. అయ్యాను. గిరిడీహ్‌ని హజారీబాగ్‌ నుండి వేరు చేసి, వేరే జిల్లాగా ఏర్పాటు చేయాలని వాళ్ళ ఉద్దేశ్యం. నేను కమిటీ మెంబరుగా దీన్ని ఒప్పుకోలేదు. సమ్మెకి సమర్ధన ఇవ్వాలని మేం ముఖ్యమంత్రి శ్రీ కేదార్‌ పాండేని కేదలాలో జరిగిన మీటింగుకు పిలిచాము. కాని ఈ మీటింగు జరపడం ఠేకేదార్లకు ఏమాత్రం ఇష్టం లేదు. ప్రభుత్వంతో చేతులు కలిపి మీటింగు జరిగితే గొడవలు జరుగుతాయి అని రాసి పంపించారు. ఈ విధంగా కుట్ర పన్ని మొత్తానికి కేదార్‌ పాండేని మీటింగుకి రాకుండా చేసారు. కార్మికులందరు ఎంతో ఎదురు చూసారు. ఆ తరువాత రోజే ఇన్‌స్పెక్టర్‌ నా జుట్టుపట్టి లాగుతూ ఈడ్చికెళ్ళడం, ఠేకేదారులు చెప్పడం వలన మెజిస్ట్రేట్‌ పిస్తోలు పేల్చడానికి ప్రయత్నించడం రెండు సంఘటనలు జరిగాయి. ఈ రెండు సంఘటనలను వ్యతిరేకిస్తూ నేను కేదలా చౌక్‌ దగ్గర సమ్మెకి కూర్చున్నాను. నాలుగు వైపులా శ్రామికులు కూర్చున్నారు. హజారీబాగ్‌ నుండి కేదార్‌ పాండే గారు నేను, ఆయన గిరీడిహ్‌కి వెళ్తున్నామన్న సందేశం మెజిస్ట్రేట్‌ ద్వారా పంపించారు. కాని నేను వెళ్ళలేదు- ‘ఆ క్షత్రియ మెజిస్ట్రేట్‌ని 24 గంటలలో సస్‌పెండ్‌ చెయ్యాలి. అప్పుడే నేను సమ్మె విరమించుకుంటాను’- అని పట్టుబట్టాను.

ఆ ఇన్‌స్పెక్టర్‌ దగ్గర ఒక అతను ఉండేవాడు. చాలా నమ్మకస్థుడు. ఆ రోజుల్లో హజారీబాగ్‌లో ఎస్‌.డి.తో పదవిలో మిస్‌ దయాల్‌ అనే ఆదివాసి మహిళ ఉండేది. ఆమె నిష్పక్షపాతంగా పనిచేస్తుందని నా నమ్మకం. అందుకే ఈ సంఘటనలపై ఎన్‌క్వైరీ చేయాలని నేను ప్రభుత్వానికి రికమెండు చేసాను.

రాత్రి పూట మేం అందరం నెగడు వేసుకుని చెక్‌పోస్ట్‌ దగ్గర కూర్చునేవాళ్ళం. శ్రామికులందరు నన్ను రక్షిస్తూ వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళారు. రామచంద్ర నోనియా మాటీటోపీ (విస్ఫోటక పదార్థం) ని శీసాలో వేసి కార్మికులకి ఇచ్చాడు. గుడిసె చుట్టూ అందరిని పహారా పెట్టాడు. ఏ ఠేకేదారైనా దాడి చేస్తే ఎదురు దాడి చేయవచ్చని, లేకపోతే పోలీసులు వస్తే వాళ్ళని ఆపవచ్చన్న ఉద్దేశ్యంతో ఆయన ఇట్లా చేసారు. ఆ రాత్రి శాంతిగా గడిచిపోయింది. మరునాడు ఘాట్‌ సహాయకుడు ధానా ప్రభారీ ఖాన్‌ సాహెబ్‌ ద్వారా హజారీబాగ్‌ ప్రభుత్వం మాతో సంప్రదింపులు జరపాలని సందేశాన్ని పంపించారు. నేను ఆయనతో తప్ప మరెవరితోనూ మాట్లాడను అని చెప్పాను. కేదార్‌ పాండె గారి వైర్‌లెస్‌ సందేశం వచ్చింది. కాని నేను గిరిడీహ్‌ వెళ్ళాలంటే ఒక షరతు పెట్టాను-

”మెజిస్ట్రేట్‌ ట్రాన్స్‌ఫర్‌, థానేదార్‌ సస్‌పెంషన్‌ తరువాతే ఏదైనా-”

చివరన మూడో రోజు 12 గం||ల కల్లా మేజిస్ట్రేట్‌ ట్రాన్స్‌ఫర్‌ కాపీతో సహా హజారీబాగ్‌ నుండి ఒక అధికారి వచ్చాడు. ఆయన కారులో నన్ను గిరిడీహ్‌ తీసుకు వెళ్తానని అన్నాడు. అక్కడ ముఖ్యమంత్రి గిరిడీహ్‌ని ప్రత్యేక రాష్ట్రంగా మార్చాలన్న విషయం మీద నాతో మాట్లాడాలన్నారు. నా జీపులో శ్రామికుల సంరక్షణలో మాత్రమే నన్ను

పంపుతాం అని వాళ్ళు అన్నారు. పోలీసుల మీద వాళ్ళకి నమ్మకం లేదని చెప్పారు. నా జీపులో వెనక సీట్లో నాతోటి వాళ్ళు చేతులలో కత్తులు కఠారులు తీసుకుని కూర్చున్నారు. ఒకవేళ మధ్య మార్గంలో ఏ ఠేకేదారైనా దాడి చేస్తే ఎదురు దాడి చేయవచ్చని వాళ్ళ ఉద్దేశ్యం. మేము సాయంత్రం ఐదు గంటలకి గిరిడీహ్‌ వెళ్ళిపోయాం. అక్కడ మా లాయరు నా కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. అందరు గిరిడీహ్‌ని వేరే జిల్లాగా ఒప్పుకోవాలని ఎంతో ప్రాధేయపడ్డారు. బగోదర్‌, గోమియా వాళ్ళందరికి గిరిడీహ్‌ చాలా దూరం అవుతుంది. అందువలన మేం జిల్లాను విభజించడానికి ఇష్టపడలేదు. ముఖ్యమంత్రి మరికొన్ని వాహనాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం వలన నేను ఒప్పుకున్నాను.

కేదార్‌ పాండే గారి దగ్గర తన కాబినెట్‌లో ప్రస్తావనను ఒప్పించి కేదలా రాజా కోల్‌ఫీల్డ్స్‌ని కేంద్ర ప్రభుత్వం తన అధీనంలో తీసుకోవాలని కోల్‌ఫీల్డ్స్‌ మంత్రి కుమార మంగళం సందేశం పంపించాలని హామీ తీసుకున్నాము. వాటిని బీహార్‌ ప్రభుత్వం బి.ఎమ్‌.డి.పీ. నడవకూడదు. ఆయన పాట్నా వెళ్ళగానే ప్రస్తావన పంపిస్తానని కేబినెట్‌ సమావేశం సమయంలో ప్రస్తావనాన్ని ఒప్పుకున్నట్లు చేస్తానని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని సూచన నాకిచ్చారు.

మేం సమ్మెను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాం. డిసెంబరు 4న సమ్మె మొదలయింది. కాబినెట్‌లో ప్రస్తావన పెట్టారు. కోల్‌ బోర్డ్‌ కేదలాలో కోకింగ్‌ కోల్‌ ఉంది అని నిర్ధారణ చేసారు. కేంద్ర ప్రభుత్వం కేదలాని కోకింగ్‌ కోల్‌గా ప్రకటించారు. డిసెంబరు 16, 1971 న దానిని నేషనలైజ్‌ చేసింది ప్రభుత్వం. సమ్మెకి 12 రోజుల ముందు నోటిఫికేషన్‌ వచ్చింది. ఠేకేదార్లు ఈ డిక్లరేషన్‌కి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసారు. మళ్ళీ అడ్డంకులు వచ్చాయి. ఠేకేదార్లకు వ్యతిరేకంగా ఎన్‌.సి.డి.సి. బోర్డు శ్రామికుల దీర్ఘ పోరాటం నడిచింది. ఎన్‌.సి.డి.సి ఠేకేదార్లకు వ్యతిరేకంగా హైకోర్టు నుండి స్టే తెచ్చుకుంది. తరువాత ఠేకేదార్లు దీనిని అడ్డగించారు. ఈ విధంగా ఒక్కొక్కసారి స్టే ఉండేది, ఒక్కొక్కసారి ఎత్తేసేవారు. లాయర్ల చర్చలు జరుగుతునే ఉండేవి. నేను కూడా కేసు హియరింగ్‌లో ఉన్నప్పుడు పాట్నా హైకోర్టుకి వెళ్తూ ఉండే దాన్ని. రిసీవర్‌ కేదలా ఝార్‌ఖండ్‌ రాజా బొగ్గు గనులను ఎన్‌.సి.డి. సీ కి సరియైన సమయానికి హాండోవర్‌ చేయలేదు. దీనివలన ఈ సమస్య ఇంకా అట్లానే ఉండిపోయింది. హైకోర్టులోని చాలామంది జడ్జిలకి వాళ్ళ చుట్టాలకి ఠేకేదారీ కేదలాలో ఉంది. ఈ సమ్మె దాదాపు సంవత్సరంపైన నడిచింది. శ్రామికులు నా దగ్గరి నుండి హామీ తీసుకున్నారు.

”మీరు నేషనలైజ్‌ కాకుండా సమ్మెను విరమించవద్దు”.

నేను వాళ్ళకి హామీ ఇచ్చాను- ”నన్ను భోజనం పెట్టమని అడగవద్దు, నేను ప్రేత వస్త్రాన్ని ఏర్పాటు చేస్తాను-”

సమ్మె సమయంలో ప్రతీ ఇంట్లో ఆకలి మంటలకు ఎవరో ఒకరు బలి అవుతూనే ఉన్నారు. మేం పదిమంది ఐదు రూపాయలకి వేయించిన సెనగలు తెప్పించుకుని తినే వాళ్ళం. కాని బండిలో పెట్రోలు పోయించడం తప్పదు. కార్మికులు ఏదోవిధంగా పైసలను సమకూర్చేవారు. వాళ్ళకోసం చుట్టుపక్కల ఊళ్ళల్లో బీడుపడ్డ రైతుల పొలాలను పంటపొలాలుగా మార్చడానికి చదరపు అడుగుకి ఎనిమిది అణాల కూలీకి వాళ్ళని పంపించే వాళ్ళం. అంతో ఇంతో ధాన్యాన్ని సమకూర్చే వాళ్ళం. శ్రామిక వర్గం మాత్రం తలవంచలేదు. నేను పక్కన ఉన్న ఓపెన్‌ కోల్‌ఫీల్డ్‌లకి వెళ్ళి భోజనం, ప్రేత వస్త్రాలని అడిగి తెచ్చేదాన్ని. మేం అందరం చుట్టుపక్కల డామ్‌లలో పని చూసుకునే వాళ్ళం. కార్మికులతో కలిసి ఆకులు-అలములు కూరలను తినేవాళ్ళం. ఎలుకల బొరియలలో నుండి తెచ్చిన ధాన్యాన్ని ఉడికించి తినే వాళ్ళం. ఇదంతా రమణిక నాటకం అని ఠేకేదార్లందరు మొత్తుకుంటూ ఉండేవారు. వెంటనే కార్మికులు జవాబు చెప్పేవారు – ‘మరి ఈ నాటకం మీరు తక్కిన నేతలు కూడా ఆడాల్సింది.”

చంద్రస్వామి పారసనాథ్‌ యజ్ఞం

ఆరోజుల్లోనే పారస్‌నాథ్‌ మందిరంలో శ్రీమతి ఇందిరా గాంధీ నేతృత్వంలో యష్‌పాల్‌ కపూర్‌, కేదార్‌ పాండె, వి.పి. సిన్హా, బిందేశ్వరి దుబె సహాయంతో చంద్రస్వామి, బిహారులో ఉన్న ఆదివాసీలు ఆరోజుల్లో బోడోతాండ్‌ లాగా ఝూర్‌ఖండ్‌ కోసం

ఉద్యమం చేయమని అనుకున్నారు. మోసం చేస్తూ ఒక యజ్ఞాన్ని తలపెట్టారు. ఝూర్‌ఖండ్‌ యువకులు ఆరోజుల్లో ఆస్సాము వెళ్ళి బోడో ఉద్యమకారులతో మాట్లాడారు. అప్పడే విమానాల నుండి రాంచి హజూరీబాగ్‌లలో కొన్ని పాంప్లెట్స్‌ కిందకి వేసారు. ఆదీవాసులు చంద్రస్వామి యజ్ఞంలో పాల్గొనలేదు. కానీ బిహారు రాజనేతలు చాలా మంది ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్లు. బీష్మ నారాయణసింహ్‌ చంద్రస్వామికి భక్తుడు. బిందేశ్వరిరూలే ఆయన చెప్పులను కూడ ఎత్తిపెట్టెవారు. ఆయన చంద్రస్వామి దొవతిని కూడా ఆరేసేవాడు. కేదార్‌పాండే వారు కూడ వారంలో ఒకసారి ఇందిరాగాంధీ సందేశం తీసుకుని ఇక్కడికి వచేవారు. కేదార్‌పాండే మనసులో చంద్రస్వామి పట్ల మంచి భావం లేదు. కానీ ఇందిరాగాంధీకి ఆయన మీద ఉన్న భక్తి వలన రాజకీయంగా చంద్రస్వామి ఎంత బలవంతుడో పాండేకి తెలుసు. అందువలన ఆయనతో సంబంధం పెట్టుకోవలసి వచ్చింది. చంద్రస్వామి బిందేశ్వరి దూలేని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. లోలొపల మాత్రం కొన్ని గ్రూపులు తయారయ్యాయి. వాళ్ళ కార్యకలాపాలు ఎక్కువకాసాగాయి. పెద్ద వ్యాపారస్తులు, కోల్డ్‌ ఫీల్డ్‌ కార్‌ఖానాల యజమానులు, ఆఫీసర్లు ఠేకాదార్లు అందరూ చంద్రస్వామి దగ్గరకు వచ్చేవాళ్ళు. తమ తమ పనులు నేరవేర్చుకోవడానికి ఆయన చుట్టూ తిరిగే వాళ్ళు. బియ్యం – పప్పులు మొదలయ్యాయి. ఇక పైసల సంగతి చెప్పనేఖరలేదు. సారా కోసం ఠేకాదార్లు, అధికారులు అందరూ అక్కడికి చేరే వాళ్ళు. ఆదీవాసీ అయిన శ్రీమాన్‌ అక్కడ ఆఫీసరు. మైకా మార్నెట్‌ రాజ్‌గఢియా ఆయన కుటుంబం వాళ్ళు చంద్రస్వామి వలన చాలా నష్టపోయారు. ఆయన కొడుకులందరూ చంద్రస్వామి వలలో పడి నాశనం అయ్యారు.

నేను బిందేశ్వరిదుబే, కేదార్‌పాండేల కోసం అక్కడికి వెళ్ళేదాన్ని. బిందేశ్వరిగారు కొలియారి మజూదూర్‌ సంఘ్‌కి సెక్రెటరీ కావడం వలన సమ్మె జరుగుతుందని నోటీసు ఇచ్చారు. నేను ఆ రోజుల్లో ఇంటర్‌కి సంబందించిన కొలియార్‌ మజూదూర్‌ సంఘానికి (తరువాత ఇదే రాష్ట్రీయ కొలియార్‌ మజూదూర్‌ సంఘంగా మారింది.) సెక్రెటరీగా ఉన్నాను. తరువాత ఉపాద్యక్షురాలుగా

ఉన్నాను. సమ్మె కోర్టు విషయాల మీద చర్చించడం తప్పదు. ఎన్‌సిడిసి ప్రబందక్‌ శ్రీ బిఎల్‌ వడేరా కూడా ఠేకాదారుల విరుద్ధంగా దుబే గారితో సహాయం తీసుకోవాలన్న ఉద్ధేశ్యంతో వచ్చేవారు. కేంద్రీయ ప్రభుత్వంతో కూడా పని ఉండటం వలన పాండే గారి దగ్గరకి వెళ్ళాల్సి వచ్చేది. బీష్మ నారాయణసింహ్‌ (వీరి తరువాత గవర్నర్‌ అయ్యారు) బిఎన్‌డి ద్వారా కోల్‌ఫీల్డ్స్‌ని నడిపించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. నేను వ్యతిరేకించాను. లాబీ కూడా చేయాల్సిన అవసరం చేప్పెవాడు. ఆయన నాకు ముందే ఇవన్ని చెప్పాడు. ఒకసారి ప్రెసిడెంట్‌ రూజ్‌వెల్డ్‌ భారతదేశానికి వచ్చారు. రాంచీకి వెళ్ళాడు. చంద్రస్వామి ఆయన చేయి చూసి ఆయన ప్రెసిడెంట్‌ అవుతాడని చెప్పాడు. తరువాత ఆయన ప్రెసిడెంట్‌ అయ్యాక భారత్‌ వచ్చినపుడు చంద్రస్వామి తనకు ఏ విధంగా భవిష్యవాణి చెప్పారో చెప్పారు. తను ఆయనని కలవాలని ఇందిరాగాంధీకి చెప్పారు. అప్పటి నుండి ఆవిడ చంద్రస్వామి పట్ల ప్రభావితురాలైంది. కొన్ని పనులను ఆయనకు అప్పగించింది. రాంచీ అంటే చంద్రస్వామికి ప్రేమ

ఉండటం వలన పారస్‌నాథ్‌లో యజ్ఞం చేయమని ఆయనకు చెప్పారు. ఇందిరాగాంధీ గారి దాకా ఆయన ఇంప్లూయెన్స్‌ పనిచేస్తుందన్న

ఉద్దేశ్యంలో అందరు ఆయన దగ్గరకు వెళ్ళసాగారు. యశ్‌పాల్‌ కస్టర్‌ చంద్రస్వామికి సహాయపడేవారు. కస్టర్‌ బిపి సిన్హా , కేదార్‌పాండే గార్లకు కూడా కొన్ని పనులు వప్పచెప్పాడు. చంద్రస్వామి కొన్ని తానే సృష్టించి తన గొప్పలను చిలవలు పలువులుగా చెప్పేవాడు.

నాకిప్పటికి గుర్తు ఉండి ఒకసారి నేను దుబేగారిని కలవడానికి చంద్రస్వామి ఫ్లాట్‌కి వెళ్ళాను. అక్కడ దుబేగారితో నరసింహరావుగారు కూర్చోవడం చూసాను. చంద్రస్వామి చెప్పులను నరసింహారావుగారు ఎత్తుతున్నపుడు చూసి ఆశ్చర్యపోయాను.

ఆ రోజుల్లో రిసీవర్‌ పదవిలో కె.బి. సహాయ్‌ (మాజీ ముఖ్యమంత్రి బిహారు) అల్లుడు ఉండేవారు ఆయన అక్కడి వాడే కనక ఠేకాదార్లతో చేతులు కలిపేవాడు. ఒకవేళ సుబ్రహ్మణ్యమ్‌ లేకపోతే నాగమణి పి.ఎ.ఎస్‌ లలో ఎవరో ఒకరు రీసీవరు అయి

ఉంటే ఈ గొడవ ఉండేదికాదు. రిసీవర్‌, బి.యల్‌. వడేరా కస్టోడియన్‌ జనరల్‌ వాళ్ళ ప్రతినిధులు అధికారులకు శ్రామికుల రికార్డు ఇవ్వలేదు. అదువలన గనుల హస్తాంతీకరణ కాలేదు. ఠేకాదార్‌ సుప్రీమ్‌ కోర్టుకి వెళ్ళారు. కాదలా ఝూర్‌ఖండ్‌ గనులలో కోకింగ్‌కోల్‌ లేదు. అవన్నీ నాన్‌ కోకింగ్‌ కోల్‌ గనులే. గవర్నమెంట్‌ వీటికి కోకింగ్‌ కోల్‌ తప్పుడు సర్టిఫికెట్‌ ఇచ్చింది. అందువలన వీటిని నేషనలైజ్‌ చేయలము. దీని ప్రకారంగా వాళ్ళు కోర్టు నుండి నాన్‌ – కోగింగ్‌ కోల్‌ ఆధారంగా నేషనలైజేషన్‌ స్టే ఆర్‌డర్‌ తీసుకువచ్చారు. అందరు ఠేకాదార్లు కలిసి కట్టయ్యారు. కేసు చాలా కాలం నడిచింది. స్థానీయ కోర్టు (రిసీవరర్‌ దీని అండర్‌లోనే ఉన్నారు.) కూడా ఠేకేదారుల పక్షమే. వాళ్ళ బంధువులలో కూడ ఠేకేదార్లు కాదలా కొలియారీలో కాంట్రాక్టు తీసుకునేవారు. ముఖ్యంగా ఇందులో రాజపుత్‌లు ఉండేవారు. నాపై కోర్టుని అవమానం చేసానన్న కేసుకూడా నడిచింది. నేను కోర్టుని చుట్టుముట్టాను. కోర్టుకి వ్యతిరేకంగా అట్టల మీద స్లోగన్లు రాసి బయట అనేక చోట్ల కోర్టులో కూడా ప్రదర్శించాను. నా మీద కేసు ఉన్నా నేను భయపడలేదు. నేషనలైజేషన్‌ తరువాతి కుజూకి వచ్చిన కుమార మంగళమ్‌ ఎదురుకుండా కోర్టుకి వ్యతిరేకంగా స్లోగన్లు రాసాము. కేదలా సమస్యను పరిష్కరించాలని మనవి చేసుకున్నాము.

ఒక మహిళా కూలీకి సమ్మె సమయంలో పాము కరిచింది. ఆమె శవాన్ని హజారీబాగ్‌ కోర్టు చాంబర్‌ బయట పెట్టాము. కోర్టులో కోలాహలం మొదలయింది. కోర్టు తన పేష్‌కార్‌ని పంపించి నన్ను పిలిపించింది. జడ్జిసాహెబ్‌ కొందరు గ్రామ కులను పిలిచి వాళ్ళ పేర్లు అడిగారు. కాని వాళ్ళు మా ప్లాన్‌ ప్రకారం ఎన్నిసార్లు అడిగి రమణిక గుప్తా అనే చెప్పారు. ఇంటి అడ్రస్‌ అడిగితే అదే చెప్పారు. నేను కోర్టుకి వచ్చాక వకీలు ద్వారా రావాలి అని అన్నారు. ‘మేం ఆకలితో చస్తున్నాం. వకీలు కోసం పైసలు ఎక్కడి నుండి తెస్తాం?’

కోర్టు, కోర్టులో ఉన్న లాయర్లలో ఒక లాయరుని మా కేసు చూడమంది. ఆయన వకాలతనామాని తెప్పించుకున్నాడు. నేను నా కేసు విషయంలో నేనే వాదిస్తానన్నాను. నేను గనుల దయనీయ స్థితిని వర్ణించాను. కోల్‌ఫీల్డ్‌లో డాక్టరు వెళ్ళకపోవడం వలన కార్మికులు జబ్బులతో ఏ విధంగా చనిపోతున్నారో రాసాను. రిసీవర్‌, ఠేకేదార్ల ద్వారా శ్రామికుల వివరాలు ఎన్‌.సి.డి.సి లో రాయకపోవడం వలన వస్తున్న ఇబ్బందుల గురించి రాసాను. దీనివలన కేదలాకి డాక్టర్‌ వెళ్ళాలని ఆకడర్‌ని పాస్‌ చేసింది కోర్టు. రిసీవర్‌ విషయంలో కూడా కఠినమైన చర్యలు తీసుకుంది.

మేము సమ్మె చేస్తూనే ఉన్నాము. ఎన్‌.సి.డి.సి స్టే ఆర్‌డర్‌ తెచ్చినప్పుడు కోల్‌మైన్స్‌ మూతబడేవి. ఠేకేదారులు వాటిని తెరిపించాలని ఆర్డర్లు తెచ్చేవారు. వాటిని తెరిచే ప్రయత్నం చేసేవారు. కాని నేషనలైజేషన్‌ అయ్యాక తెరవాలని పట్టుబట్టాము. ఈ మధ్యలో 1973న కేంద్ర ప్రభుత్వం రెండోసారి అన్ని నాన్‌-కోగింగ్‌ కోల్‌ ఫీల్డ్స్‌ని నేషనలైజేషన్‌ చేయడానికి రెండోసారి నిర్ణయం తీసుకుంది. రాజా కోల్‌మైన్స్‌ని కూడా నాన్‌- కోగింగ్‌ గనుల లిస్టులో చేర్చారు. సుప్రింమ్‌ కోర్టు కుడా ఆందులో కల్పించుకోకుండా ఈ విధంగా చేసారు.

శ్రీ మోహన్‌కుమార్‌ మంగళమ్‌ నేషనలైజ్‌ కాకముందు బిందేశ్వరీ దుబె దామోదర్‌ పాండె నన్ను ఇంటర్‌ వుపు నుండి చతురానన మిశ్రని ఎటక్‌ వైపు నుండి ఢిల్లీలో తన చాంబర్‌కి పిలిచారు. ముందు చేయవలసిన దానిని గురించి మాట్లాడారు. ఈ మీటింగ్‌ చాలా పెద్ద మీటింగ్‌. దీన్ని గురించి ఎవరికి తెలియప రచలేదు. 1973లో కేవలం ప్రభుత్వానికి మాకు కొంతమందికే తెలుసు దేశం మొత్తంలో ఉన్న కోల్‌ మైన్స్‌ అన్నీ తరువాత రోజు నేషనలైజ్‌డ్‌ అవుతున్నాయని మరునాడు అన్ని గనుల మీద ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంది. మేం ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాము. ముఖ్యమంత్రి కేదార్‌ పాండేగారు, బీష్మ నారాయణసింహ్‌ మైనింగ్‌ మంత్రి వ్యతిరేకిస్తున్నా కేదలా ఝూర్‌ఖండ్‌లోని ఈ రాజా బొగ్గు గునుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పంపించారు. మోహన్‌ కుమార్‌ మంగళమ్‌తో మేము మాట్లాడాము. ఆయన కూడా సిద్ధంగానే ఉన్నారు. అందువలన ఈ బొగ్గు గనులు మరొకసారి నోటిఫై అయ్యాయి. సప్రీమ్‌కోర్టులో వివాదం సమాప్తం అయింది.

రెండోసారి నేషనలైజేషన్‌ ఆర్‌డర్‌ వచ్చినా రిసీవర్‌, ఠేదార్లు, రిజిష్టర్లు ఇవ్వడానికి నిరాకరించారు. వాళ్ళు రిజిష్టర్లలో తమ స్నేహితులు, బంధువుల పేర్లను రాసి పనులివ్వాలని మాజీ కూలీలను తీసేయ్యాలని అనుకున్నారు. స్థానీయ కోర్టు రిసీవర్‌ని కార్యాలయంలో లేడు అని చెప్పి వెనక్కి పంపించేవారు. వడేదరా సాహబ్‌తో మాట్లాడి నేను రిసీవర్‌ ఇంటికి వెళ్ళి కాగితాలను ఆయన చేతుల్లో పెట్టాను. ఆయన ఆశ్చర్య పోయారు. ఇంతకు ముందు కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉండేదాన్ని. సమస్యల గురించి ఆయనతో మాట్లాడేదాన్ని. ఈ సారి ఆయనకు కాగితాలను తీసుకురావడం తప్పలేదు. కేవలం రిసీవర్‌ అండర్‌లో ఉన్న గనుల రికార్డులను ఎన్‌.ఎమ్‌.డి.సి అధికారులు జప్తు చేసారు. వాళ్ళ వ్యతిరేకంగా స్టేట్‌మైనింగ్‌ ఆఫీసర్లు (వీళ్ళు ఏజెంట్లు కూడా) కోర్టు నుండి స్టే ఆర్‌డర్‌ తీసుకున్నాడు.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో