షర్మిలా యిరోమ్‌ – కర్మానంద్‌

నేను పోరాడుతున్నాను
మనుషులు పోరాడడం ఆపేసారు
ఒక కలకు, ఒక వొడంబడికకు వ్యతిరేకంగా
యేమౌతుంది?
గుర్రపు డెక్కల శబ్దం కంటే భయంకరంగా
యిప్పుడు నా గొంతు పదునెక్కి హెచ్చింది

నాకు జీవితమంటే  ప్రేమ యెక్కువే
నాకు చావు విలువ తెలుసు
అందుకే పోరాడుతున్నాను
గాయపడ్డ వేటగాడు నేర్పరి
అందుకే పోరాడుతున్నాను
నా పిల్లల నోళ్ళలో నా స్థన్యం వుంది
నన్ను నలువైపులా చుట్టుముట్టేసారు
పోరాడుతూనే వున్నాను

వేటగాడికి నా దంతాలు, నా గోళ్ళు, నా అస్థికలు కావాలి.
నా సాంస్కృతిక ధనస్సు, బాణాలను
మార్కెట్టులో అన్నింటి విలువలు
నిర్ణయింపబడ్డాయి.

నా నల్లమందు మట్టి కూడా అమ్ముడైంది.
నాకు నా దేశంలోనే నిర్వాసిత శిక్ష విధింపబడింది.
నేను నా దేశాన్ని వెతుక్కుంటున్నాను
ఢిల్లీ వీథులలో ఫిర్యాదులతో
తిరుగుతున్నప్పుడు
నా దేశం యేదని అడిగారు
నేను వారి చేరికకు లోపలే వున్నానని
నన్ను అంగీకరిస్తారు
వారు యెక్కడ కోరుకుంటే
అక్కడ జెండా పాతేస్తారు
మా పచ్చని దేహాలను పిసకడం
యీ వేటగాళ్ళను మోహింపచేయును
కామ పురుషులకు విరిగిన మా
యెముకలు కనిపించవు
సైనికుల చప్పుళ్ళతో మా నిద్దుర
ముక్కలౌతుంది
వారు మమ్మల్ని వేశ్యలుగా భావించారు
మా పనులు చూస్తే వారికి అసహ్యం కలగదు
మమ్మల్ని చెరపడమే వారికి యిష్టం
వాడి అల్ప ప్రతిక్రియలలో నేను వోడిపోతానని ఆలోచిస్తాడు

గాయపడ్డ వేటగాళ్ళారా రండి చూడండి
నీ కోరిక కంటే యెత్తైన కఠినమైన నా వక్షోజాలను
నీవు నా స్తనాలను తాగాలనుకొన్నావు కదూ
రా పువ్వుతో విషంతో కలిసిన నా
నెత్తురును రుచి చూడూ!
రా చూడు! బూడిదను వెచ్చగా వుంచే రాతిరి నాలో ప్రాణాలతో వుంది

బ్రహ్మపుత్ర యెలా  నవ్వుతుందో చూడు
వితస్తా  నన్నెలా కాపలా కాస్తుందో చూడు
మా పగుళ్ళలో  నుంచి ప్రవహిస్తున్న సిరా
యెంత యెర్రగా మత్తును యిస్తూ వుందో చూడు
నేను మళ్ళీ పుట్టనని అనుకోకు
నేను నా తరాల్లో స్థిరంగా వున్నాను
నేను యిరోంని
యిరోం షర్మిలా చాను    (సారంగ వెబ్‌ మాగజైన్‌ నుండి)

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో