దూబగుంట రోశమ్మ

ఐ.రోశమ్మ. 1992వ సంవత్సరంలో జరిగిన సారా వ్యతిరేకోద్యమంలో నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామంలో స్త్రీలకు రోశమ్మ నాయకత్వం వహించారు. ఆ గ్రామంలో సారా సమస్య ఎక్కువగా ఉంది. అక్షరజ్యోతి కార్యక్రమాలలో ఆ ఊరి స్త్రీలు ”సిరిపురం సీతమ్మ” కథ చదివారు. ఆ కథలో సీతమ్మ తన ఊరి స్త్రీలందరినీ కూడగట్ట్టి ఊర్లోకి సారా రాకుండా చేయగలుగుతుంది. ఆ పాఠం చదువుకున్న రోజులలో దూబగుంటలో ఒక సభ జరగటం, తాగి వచ్చిన మగవాళ్ళు ఆ సభలో అల్లరి చేయటం చూసి, రోశమ్మ తన తోటి స్త్రీలతో, ఊరిలో అల్లర్లు లేకుండా ఉండాలంటే సారాను ఊరి నుంచి తరిమెయ్యాలని పిలుపునిచ్చారు.

ఆ విషయం గురించి అక్షరజ్యోతి తరగతులలోనే కాకుండా పనిచేసుకునే స్థలాల్లో, పొలాల్లో కూడా రోశమ్మ తోటి స్త్రీలతో చర్చించారు. గ్రామానికి కల్లు, సారా రానివ్వవద్దని నిర్ణయించుకున్నారు. సారా తెచ్చిన వారిని అడ్డగించి ఆ కల్లూ, సారా పారబోసేస్తే మీకు రావలసిన డబ్బు మేమిస్తామని చెప్పారు. ఇళ్ళల్లో మగవారిని సారా తాగవద్దని కఠినంగా హెచ్చరించారు. సారా వాహనాలు తమ గ్రామంలోకి రాకుండా రాత్రింబవళ్ళూ కొన్ని నెలలపాటు కాపలా కాశారు. ఆ సంగతి పత్రికలలో రావడం, అధికారులు వాళ్ళ గ్రామానికి వచ్చి రోశమ్మను, ఇతర స్త్రీలను ప్రశంసించడం, ఇవన్నీ రోశమ్మకు తాను చేస్తున్న పని మంచిదేనన్న అభిప్రాయాన్ని కలిగించాయి.

సారా వేలంపాటలకు వ్యతిరేకంగా ఆమె నెల్లూరులో జరిగిన ప్రదర్శనలో పాల్గొన్నారు. స్త్రీలందరూ కలిసి ఆ జిల్లాలో వేలంపాటను ఆపేశారు. ఈ పోరాటం గురించి రోశమ్మ ”ఏమనిపించిందా.. మంచి అనిపించింది. ఒక కష్టం తీరిపోయింది గదా అనిపించింది, సీకటి పోయి ఎలుతురు వచ్చినట్టుంది మాకు. అందరం కలిసి చేశాం, సరే అది ఒక దారికి వచ్చింది. అన్ని వాగులూ పెద్దవాగులో కల్సినట్టు. ఇంకా చెయ్యాలని ఎందుకు లేదూ… ఉంది. సీకటి పోయి ఎలుతురొచ్చిందనటంలా. ఇన్ని రోజులూ అట్టా లేదుగా. పనికాడ్నుంచి అటే పోయి సుక్కేసుకు రావడమాయె. ఆనందంగా ఉందమ్మా … ఇప్పుడు” అన్నారు.

ఈ ఉద్యమం ఆంధ్ర దేశమంతా వ్యాపించినపుడు రోశమ్మ ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి సభలలో మాట్లాడారు. హైదరాబాద్‌ వచ్చి ప్రదర్శనలో పాల్గొన్నారు. స్త్రీలు చేసిన ఈ ఉద్యమంతో ప్రభుత్వం చాలా ఇరకాటంలో పడింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికలలో ఓడిపోయింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మద్యనిషేధాన్ని ప్రకటించింది. రోశమ్మకు ఆంధ్ర దేశంలో చాలాచోట్ల సన్మానాలు జరిగాయి. ఉషాకిరణ్‌ మూవీస్‌ వారు తీసుకొచ్చిన సారా వ్యతిరేక పాటల క్యాసెట్లను హైదరాబాద్‌లో జరిగిన పెద్ద సభలో రోశమ్మ ఆవిష్కరించారు. ప్రభుత్వం కొద్ది నెలల్లోనే సారామీద నిషేధాన్ని ఎత్తేసినపుడు ఏర్పడిన ‘సంపూర్ణ మద్య నిషేధ సమితి’లో రోశమ్మ పనిచేశారు. మద్య నిషేధాన్ని అమలు చేయమని ప్రభుత్వాన్ని రకరకాల పద్ధతుల్లో డిమాండ్‌ చేశారు. 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో గుంటూరు నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించారు.

అనారోగ్యంతో ఇటీవల మరణించిన రోశమ్మ మహిళా సంక్షేమ ఉద్యమాలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారు. మహిళలు సంఘటితంగా పోరాడితే ఎలాంటి మహమ్మారినైనా సమాజం నుంచి పారద్రోలగలమని నిరూపించి చూపారు.  ప్రస్తుత పరిస్థితులలో, మద్యం వరదలై పారుతున్నవేళ ఎంతో మంది దూబగుంట రోశమ్మల అవసరం ఉంది. పోరాటయోధురాలు రోశమ్మకు భూమిక నివాళి తెలుపుతోంది.

(మహిళావరణం సౌజన్యంతో…)

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

One Response to దూబగుంట రోశమ్మ

  1. ari sitaramayya says:

    సారావ్యతిరేక ఉద్యమం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం – ఉద్యమించి సాధించిన ఫలితాన్ని దేన్నీ ప్రభుత్వాలకు అర్పించకూడదు. అలా చేస్తే మోసపోవడం తప్ప మరో పర్యవసానం ఉండదు. మద్యపాన నిషేధం ద్వారా సారా వ్యతిరేక ఉద్యమాన్ని తుడిచేసిన ప్రభుత్వం ఇప్పుడు లైసెన్సులు ఇచ్చి సారా వ్యాపారం చేయిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో