జీవితకాల జ్ఞాపకం

కె.బి.లక్ష్మి
శీతాకాలం సాయంత్రం, అక్టోబరు 17.
సంజవేళ ఆకాశం నారింజరంగులో మావెంటే వస్తూ కదిలే రైల్లోని మమ్మల్ని పలకరిస్తోంది.


ఎవరికైనా తెలిసి మహిళాపత్రికలు ఫాషన్లకి, వంటావార్పులు, ఫిట్‌నెస్‌లు, ఫిగర్‌ కాన్షన్స్‌లు వగైరాలకే పెద్ద ఫాంటులు. తద్భిన్నంగా ‘భూమిక’ను తీర్చిదిద్దుతున్న సత్యవతి అంకితభావం అనుపమానం. యంత్రికతకు విరుద్ధంగా, ప్రాక్టికల్‌గా వుండేలా ఈ యత్రా ప్రణాళికను రూపొందించి, మా అందరికీ చెప్పిననాడే ఈ ప్రయణమెంత విలక్షణమైందో అర్థమైపోయింది. సత్యవతి నిర్వహణాదక్షత, మైత్రీభావం, చిరునవ్వుకి, సుతిమెత్తగా, సూటిగా పదునుగా సంగతుల్ని సుబోధం చేసే తీరు ఎంతో బాగా అనిపిస్తుంది.
40 మంది వనితలు! మూడు కొప్పులు కలిస్తే ప్రళయమే!..అన్న ప్రమాదకర నానుడిని తీసిరాజని ఎంచక్కా అందరం స్నేహంగా పలకరించుకుంటూ, పుస్తకాలు, మస్తిష్కాలు పంచుకుంటూ హాయిగా వున్నాం. ‘అవన్నీ పిచ్చి సామెతలు’ అన్నారెవరో! ‘అవి మూడుకొప్పులకే 30, 40 మందికి వర్తించవు’ చమత్కరించారొకరు. నవ్వులు విరిశాయి.
ఒకే వూర్లో వున్నా కలుసుకోని, దూరాభారం అయితే పలకరింపులే అరుదైపోతున్న నేపథ్యంలో అందరం కలిసి ఒక లక్ష్యంతో, ఒక సదాశయంతో ఈ యత్ర రచయిత్రుల సాహితీయత్రలా గాక ఎంచుకున్న మహిళాంశాల వల్ల సామాజిక యత్రగా మారిన వైనం అందరికీ నచ్చింది. తదాదిగా సామాజిక న్యాయ పరిరక్షణ, సాధన మా ఎజెండాగా మారిపోయింది.
విశాఖలో శుభోదయాన సత్యవతి స్నేహితురాలు జయలక్ష్మి ఆతిథ్యం అమృతో పమానం. గంగమ్మతల్లిని కొలుచుకుంటూ, సముద్రం తమ సొంతమని నమ్ముకున్న గంగవరం సోదరీమణుల దగ్గరికి బయ ల్దేరాం.’ఇంటికో ఉద్యోగం, నెలకింత భత్యం, ఎక్కడో నిర్వాసిత ఇళ్లు మాకొద్దు. మా సముద్రం మాకిస్తే చాలు. మా సముద్రం పోయింది. అన్యాయమైపోయం’ అంటూ చెప్పుకొచ్చారు. సముద్రంలో పుట్టి పెరిగి, దానిమీదే జీవనం సాగిస్తున్న వాళ్లని అనాధలుగా మార్చే ప్రభుత్వ పథకాలు, ప్రణాళికలు, అభివృద్ధి చర్యలు దారుణం. పేదల పొట్టలు కొట్టి పెట్టే పరిశ్రమలు, అభివృద్ధి ఎవర్ని ఉద్ధరించడానికో పునరా లోచించాల్సిన అవసరం వుంది. కన్నీటి సాగరాలైన వాళ్లని ఏమని ఓదార్చగలం? వాళ్లు పోగొట్టుకున్న సముద్రాన్ని (కోల్పో యిన జీవనోపాధిని) ఎలా తెచ్చివ్వగలం? కాగితం, కలం పట్టి కాగల కార్యం నెరవేర్చ గలమన్న పూర్తి స్థాయి భరోసా ఇవ్వగలమా? అన్నీ ప్రశ్నలే. ”మీ కష్టనష్టాలను మా అక్షరాల ద్వారా అందరి దృష్టికి తీసుకు వస్తాం” అన్నదొక్కటే సమాధానం. కళ్లనిండా ఆశాదీపాలు వెలిగించుకున్న వాళ్లని వదల్లేక వదిలి దిబ్బపాలెం వైపు దారితీశాం. విద్యుత్‌ ఫెన్సింగ్‌తో సముద్రంతో గంగవరం నిర్వాసితుల్ని వేరుచేస్తున్న నిలువెత్తు గోడలు వాళ్ల గోడుకి సాక్ష్యాలుగా నిలిచాయి.
యథార్థగాథల వ్యథార్తహృదయాల మాటలు కాగితం మీద పెడితే మనలాంటి రచయితలెవరూ వాళ్ల అక్షరశిల్పాల ముందు కొరగారనిపించింది. మనోయమానిక మీద గాఢవర్ణాలతో వ్యధిత చిత్రాలు బరువుగా కదిలాయి.
విశాఖ సెంట్రల్‌ జైల్లో మహిళా ఖైదీలను కలిశాం. ఆ పడతుల దీనగాధలు విని శోకతప్తులమయ్యం.
వాకపల్లి కొండకోనల్లో గువ్వపిట్ట ల్లాంటి జీవితాలు. పొంచివున్న వేటగాళ్లని కనుక్కోలేని అమాయకత్వం, చుట్టూ పచ్చని, చిక్కని కొండలు. పచ్చదనం పరుచుకున్న ప్రకృతి, కంటికి హాయినిస్తున్నా గుండెలో దిగులు నింపింది. ఏదో తెలీని కలవరం. ప్రళయం తర్వాతి నిశ్శబ్దం. ఉప్పెన తర్వాతి నిస్తబ్దత! పోలీసుల పదఘట్టనల కింద నలిగిన గడ్డిపూలు. ”మేం మీ గురించి ప్రపంచానికి తెలియజేస్తాం. మీకు వెన్నుదన్నుగా వుంటాం. పాలకుల నిర్లక్ష్య ధోరణిని ఎండగడతాం…” అంటూ ఎవరికి తోచినట్లు వారు అనునయించాం వాళ్లకి అర్థం అయ్యేలా. ‘మాకు న్యాయం కావాలి’ అన్న వాళ్లకి ”మీకు సామాజిక న్యాయం జరిగేలా చూస్తాం” అని రత్నమాల నినదించింది. మా అందరి గొంతులు తనతో కలిశాయి. వద్దనివారిస్తున్నా మాతోబాటు కొంతదరం వరకు నడచి వచ్చి సాగ నంపారు. అలా వస్తుంటే 4 అడుగుల దూరంలో 5 అడుగుల నల్లత్రాచు జరజరా పాకుతూ వెళ్తుంది. పాము, పాము అని అరిచాం. దానిపాటికి అది పోతోంది. అయినా విషజంతువు. గిరిజన పురుషులు కర్రతో దాన్ని కొట్టి చంపేశారు. ‘ప్చ్‌, ఇలాంటి క్రూరమృగాలనించి తమని తాము నిరంతరం రక్షించుకుంటూ, వాటితో సహజీవనం చేయగలుగుతున్నారు. కానీ మానవమృగాల నుండి తప్పించుకోలేక పోయరు’. నా గుండె తడి కన్నీరైంది. నేనసలు బ్రహ్మరాక్షసిని. టూ ప్రాక్టికల్‌గా ఆలోచించడం, ఏదీ మనచేతులో లేదనుకోవడం, జాతస్య ధృవో మృత్యుః అనే స్థితప్రజ్ఞత చిన్నతనానే అలవడిన కారణం కావచ్చు, నా కళ్లల్లో ఓ పట్టాన నీళ్లు రావు. అలాంటిది వాకపల్లి విషాదం ఇప్పటికీ తేరుకోలేనంతగా కదిలించి కన్నీరు పెట్టిస్తోంది. వార్తని వాస్తవంగా వాళ్ల మాటల్లో వినడంవల్ల కావచ్చు. అసలా రోజు మేం ఆకలిదప్పులు మర్చిపోయం. తినాలనే అనిపించలేదు.
ఎస్‌.కోటలో జిందాల్‌ బాక్సైట్‌ తవ్వకాల వ్యతిరేక పోరాటం చేస్తున్న కాకిదేవుడమ్మ, పార్వతిలను కలిసినపుడు వాళ్ల మాటల్లో తొణికిసలాడుతున్న ఆత్మవిశ్వాసం, ప్రతిఘటనా పోరాటశక్తి మమ్మల్ని విస్మయపరిచింది. వీరనారులంటే వీళ్లే. పార్వతి భర్త ఆమెకు మద్దతుగా వున్నారు. దేవుడమ్మ భర్త ‘డబ్బులిస్తే తీసుకోక పోరాటాలెందుకు?’ అనడమేగాక అడుగడుగునా ఆమెను నిరుత్సాహపరుస్తున్నా లక్ష్యపెట్టకుండా తన పోరాటాన్ని కొన సాగిస్తోంది. హేట్సాఫ్‌. పోలీసుల దుర్భాషల్ని, దుశ్చర్యల్ని మీడియ ముందుంచి, వారిని వెంటపెట్టుకు వెళ్లి పోలీసుల దాష్టీకానికి చమటలు పట్టిస్తున్న దేవుడమ్మ, పార్వతిలు ఓ ఝాన్సీరాణిలా, ఓ రుద్రమదేవిలా కనిపించారు. జిందాల్‌ వాళ్ల బోర్డు పీకిపారేసి తమ బోర్డు సర్వే నంబర్‌తో సహా పాతి ‘ఖబడ్దార్‌’ అన్న పార్వతి వాళ్ల పాలిట కాళికే మరి.
విజయనగరంలో సాహితీ స్రవంతిలో మా ఈ రచయిత్రుల సాహితీ సామాజికయత్ర సమాపకోత్సవానికి ప్రఖ్యాత రచయిత్రి చాగంటి తులసి స్వాగతం పలికారు. మా అందరి అనుభవాలను, అనుభూతులను అక్కడివారు విన్నారు.
ఆ వేదిక మీద మరొక ఆహ్లాదకర సన్నివేశం ‘అప్నా సంఘర్ష్‌’ (20 మంది రచయిత్రుల కథలు), ‘అక్షర్‌ హవరా అస్తిత్వ్‌’ (23 మంది కవయిత్రుల కవితలు) పుస్తకాల ఆవిష్కరణ. భూమిక పూనుకుని తెలుగులోని రచనల్ని హిందీలో సంపుటాలుగా తీసుకొచ్చింది. ఈ రెండింటి సంపూర్ణ అనువాదకురాలు శ్రీమతి ఆర్‌. శాంత సుందరి. ఈ పుస్తకాలు అచ్చులో వున్నాయని తెలుసు గానీ ఇలా ఈ యత్ర సమాపక సందర్భంగా గురజాడ, చాసో వంటి కథకుల ఊళ్లో ఆవిష్కరింపబడ తాయన్నది ఎవరికీ తెలీదు. భలే ప్లెజంట్‌ సర్‌ప్రైజ్‌. అందుకు కూడా కొండవీటి సత్యవతికి అభినందనలు.
ఇలా ఎన్ని చెప్పినా, ఎంత రాసినా ఎన్నో మిగిలే వున్నాయి. టూకీగా చెప్పుకుని వదిలేసేవి కావు. మరచిపోయేవీ కావు. జీవితకాల జ్ఞాపకాలివి. ఆలస్యంగానైనా అందరికీ తెలియాల్సిన నిజాలివి. ఇదొక అద్వితీయ సామాజిక యాత్ర.
తవ్వకాలైనా, భూపోరాటమైనా, అత్యాచారమైనా పేరేదైనా, అభివృద్ధి పేర పాలకులు చేసే విధానాలయినా ఏమైనా అవన్నీ స్త్రీల మీద దాడులే, హింస మనిషిని వదలని వ్యవస్థలో స్త్రీలను పట్టి పీడిస్తోంది. దుఃఖం దిగమింగిన దీనత్వం రేపటికోసం పోరాటశక్తిని సమీకరించుకుంటోంది. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆగడం లేదు వాళ్లకోసం వాళ్లే పిడికిలి బిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్త్రీవాదం కొత్తకోణం దాల్చాలి. ఇకపై రచయిత్రు(త)ల రచనా విధానం మారాలి, మారుతుందనిపిస్తోంది. ఇటువంటి యాత్రలు అందుకు దోహదం చేస్తాయి.
ఈ యాత్రలో కొత్త సాహితీ మిత్రులతో స్నేహం కలిసింది. అందరిలోకి చిన్నవయసు అయినా వయసుకి మించిన పరిణతితో, వివేచించగల విజ్ఞాని ‘పృధ్వి’ మంచి స్నేహితురాలైంది. కేవలం ఏదో రచయితలుగా గాక భూమిక బృందం అంటే ఓ కుటుంబం, ఓ స్నేహనికుంజంలా ఇంతింతై వటుడింతై అన్నట్లు యాత్ర యాత్రకీ సంఖ్యా బలం పెరగడం ముదావహం.
నా కాలేజీ రోజుల్నించీ ‘ఏయ్‌, పిల్లా’, ‘పూల పిల్లా’ అంటూ ఆప్యాయతను, అభిమానాన్ని ప్రేమను పంచిన స్నేహశీలి భార్గవీరావ్‌ ఈ యాత్రలో పదేపదే గుర్తొస్తూనే వుంది. దివిజకవిమారులతో పైనించి మా యాత్రను వీక్షించే వుంటుంది. ప్రభుగారు (భార్గవి భర్త) భూమిక సంచిక చదివి యత్రావిశేషాలు తెలుసుకుంటారను కుంటాను.
అనితర సాధ్యంగా, ఇతరులు అనుకరించాలని తాపత్రయపడేలా (ఇటు వంటి సాహితీయత్రకు రచయితలు పూనుకోబోతున్నారని తాజా వార్త) నిర్వహించిన కార్యసాధనా సమర్థురాలు కొండవీటి సత్యవతికి స్నేహసుమహారం. ప్రశంసా పొగడపూల మాల. ఆమె భుజ శక్తులు ప్రసన్న, కల్పన, దివ్య, లక్ష్మి అందరికీ శుభాకాంక్షలు, అభినందన చందనాలు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో