కుటుంబమే కాదంటే…!?!? – పి. ప్రశాంతి

తనలో ఏం జరుగుతోంది.. తనకెం దుకిలా అనిపిస్తోంది..? టీనేజ్‌ అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవు తారని… అది సహజమేనని… ఇంకా ఏవేవో చెప్పిన టీచర్‌ మాటలు శుద్ధ తప్పనిపిస్తు న్నాయి. ఎందుకని? తొమ్మిదో తరగతి చదువుతున్న అన్షు దాదాపు రెండు రోజులుగా తలకిందులౌతోంది. ఎంత వద్దనుకున్నా తన మనసులో రేగుతున్న తుఫాను తాకిడి నుంచి బయటపడలేకపో తోంది. అనుక్షణం అదే ప్రశ్న… ”తనకే మైంది?” ఇది తనను భూతం లా భయపెడుతోంది.

14-15 ఏళ్ళ వయసులో ఆపోజిట్‌ సెక్స్‌ పట్ల ఉండే ఆకర్షణ సహజమేనని, తన నేస్తాలైన లైలా, రచన, సమంతా…స్కూల్‌లో తన వయసున్న అమ్మాయిలు, అబ్బాయిలు సరదాగా జోకులేసుకుంటూ, కలివిడిగా

ఉంటూ…అంతేకాదు, టీనేజ్‌ ఆకర్షణతో జంటలు జంటలుగా గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటూ, ఔటింగ్స్‌ ప్లాన్‌ చేసుకుంటూ ఎంజాయ్‌ చేస్తుంటే తనకెందుకిలా వేరేగా అనిపిస్తోంది… ఈ తేడా ఏంటి? పోటెత్తుతున్న ఆలోచనకి జవాబు మాత్రం దొరకట్లేదు. ఎవర్నన్నా అడుగుదామంటే తననెలా అను కుంటారో అన్న సంశయం.

నిన్న మొన్నటివరకు కలిసి ఆడుకున్న మగపిల్లలు కూడా… తన ఫ్రెండ్సే… అయినా సరే, దగ్గరగా వచ్చినా… టీనేజ్‌ ఆకర్షణతో భుజాల మీద చేతులేసినా…చేతులు పట్టుకు న్నా… ఆఖరికి జోకులేసినా తనకి కంపరంగా అనిపిస్తోంది. తమ గ్రూప్‌లోని మిగతా అమ్మాయిలు, అబ్బాయిలంతా ఎప్పట్లానే ఎంజాయ్‌ చేస్తున్నా తనకి మాత్రం అబ్బాయిల ప్రవర్తన విసుగెత్తిపోతోంది. నిన్న, మొన్నటిదాకా తన క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అనుకున్న అబ్బాయిలు కూడా దగ్గరగా వస్తే చిరాగ్గా అనిపిస్తోంది.

అంతే అయితే పురుషద్వేషిగా అవుతున్నా నా అని ఆలోచించేదేమో! కానీ… కానీ… తనలో మార్పు స్పష్టంగా తెలుస్తోంది. ఎంతసే పూ అమ్మాయిలతో దగ్గరగా గడపాలని… వారిని తాకాలని… సరదాగా గడపాలని… సరసాలాడాలని… ప్రేమ కబుర్లు చెప్పాలని… హత్తుకోవాలని… మాటిమాటికీ ఇవే ఆలోచన లతో ఉలిక్కిపడుతోంది. స్కూల్‌ యూనిఫాం ఫ్రాక్‌ వేసుకోవాలనిపించట్లేదు. ప్యాంట్‌ షర్ట్‌ తను వేసుకోవాల్సిన డ్రెస్‌ అనిపిస్తోంది. పీరియడ్స్‌ వస్తే చికాగ్గా అనిపిస్తోంది. తన శరీరం తనది కాదనిపి స్తోంది. తన ఆత్మ పురుషుడిగా… ఈ స్త్రీ శరీరంలో ఇమడలేనని పిస్తోంది. అమ్మాయిలలో తన బెస్ట్‌ ఫ్రెండ్‌తో కూడా షేర్‌ చేసుకోలేకపోతోంది. ఒకవేళ తనలోని ఈ మార్పుల్ని, ఈ ఆలోచనల్ని వారితో పంచుకుంటే వారంతా తనకి దూరమై పోతారే మోనన్న భయం. అబ్బాయిల్తో షేర్‌ చేస్తే ఎగతాళి చేస్తూ ఆటపట్టిస్తారేమోనన్న అనుమానం. తనిప్పుడేం చేయాలి? ఇవే ఆలోచనలతో క్లాసులో పాఠాలు వినలేకపో తోంది. స్కూల్‌లో ఎవ్వరితో మాట్లాడలేక పోతోంది. ఇంట్లోనూ అన్నతో, తల్లిదండ్రులతో ముభావంగా ఉంటోంది. ఎడతెగని ఆలోచన… జవాబు దొరకని ప్రశ్న… తనిప్పుడేంచేయాలి?

ఇవే ఆలోచనలతో మథనపడు తూనే రెండేళ్ళు గడిచిపోయాయి. తను అంటీ ముట్టనట్లు ఉండడంతో తన ఫ్రెండ్సంతా దూరమైపోతున్నారు. మనసులోని ఒంటరిత నం బైటా కనిపించడం ప్రారంభ మైంది. పదో తరగతి బోర్డ్‌ ఎగ్జామ్స్‌… అత్తెసరు మార్కుల్తో ఎలాగో గట్టెక్కింది. తన తండ్రి పలుకుబడితో ఎలాగో పట్నంలో బెస్ట్‌ కాలేజ్‌ అయిన ‘విమెన్స్‌ కాలేజ్‌’లో మేనేజ్‌మెంట్‌ కోటాలో సీటు సంపాదించారు. కుడితిలో పడ్డ ఎలుకలా అయింది తన పరిస్థితి. అమ్మాయిల్తో ధైర్యం గా, స్పష్టంగా మాట్లాడలేకపోతోంది. వారితో పాటు గర్ల్స్‌ టాయ్‌లెట్‌లోకి వెళ్ళాలంటే… సిగ్గుగా అనిపిస్తోంది, వెయిటింగ్‌ రూమ్‌లో అమ్మాయిలు బట్టలు సరిచేసుకుంటున్నా దొంగచూపులు చూడాలనిపిస్తోంది… కానీ సంకోచంతో ముడుచుకుపోతోంది.

ఎంతో చురుకైన అన్షులో వచ్చిన, కొట్టొచ్చి నట్లు కనిపిస్తున్న ఈ మార్పుని అన్న మనోజ్‌ గమనించాడు. అన్షుకన్నా ఐదేళ్ళు పెద్ద అయిన మనోజ్‌ ఈ మధ్య వీూఔ చేస్తున్న పుడు ఫీల్డ్‌వర్క్‌లో భాగంగా ట్రాన్స్‌జెండర్స్‌ , హిజ్డా కమ్యూనిటీతో పనిచేశాడు. దాదాపు రెండు నెలలపాటు వారితో మాట్లాడడం, వారి కథలు వినడం, వారి సమావేశాల్లో పాల్గొనడం వల్ల వారి మనోభావాలను అర్థం చేసుకోగలి గాడు. ఇప్పుడు తన చెల్లిలో కనబడుతున్న మార్పుని తన ఫీల్డ్‌వర్క్‌ అనుభవంతో గ్రహించ గలిగాడు.

అయితే, 17 ఏళ్ళు అన్నా చెల్లెళ్ళుగా కలిసి పెరిగిన … తనకెంతో ప్రియమైన తన చిట్టిచెల్లి హిజ్డానా… ట్రాన్స్‌జెండరా…! ఒకరోజంతా తట్టుకోలేకపోయాడు. తనను తాను నిలువ రించుకోవడానికి, వాస్తవాన్ని అంగీకరించడా నికి తనకి రెండ్రోజులు పట్టింది. ఈ రెండ్రోజు లుగా అన్న తనను చూస్తున్న విధానం, పడ్తున్న మధన గమనించిన అన్షుకి ఎంతో రిలీఫ్‌గా అనిపించింది. ఆ రోజు సాయంత్రం అన్నతో పార్క్‌కి వెళ్దామని అడిగింది. దాదాపు నాలుగు గంటలపాటు అన్నాచెల్లెళ్ళిద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఒకర్ని పట్టుకుని ఒకరు ఏడ్చారు. మొదటిగా కుదుటపడ్డ మనోజ్‌ చెల్లిని అనునయించాడు. ఇది విపరీతం కాదని, సహజమైన మార్పేనని, కొంతమందిలో ఇలా జరగడం మామూలేనని చెబ్తూ తన ఫీల్డ్‌ వర్క్‌ అనుభవాలను చెల్లికి షేర్‌ చేశాడు. అమ్మా నాన్నల్తో మాట్లాడి, వారికి అర్థమయ్యేలా వివరించే బాధ్యత తను తీసుకున్నాడు. చెల్లిని తనకిష్టమైనట్లు ఉండమని, తను అందర్నుండీ దూరం కావలసిన అవసరం లేదని, తామి ద్దరూ కలిసి పరిస్థితిని హ్యాండిల్‌ చేసుకుందా మని చెప్పాడు. అంతేకాదు, ఇదే అంశంపై పనిచేస్తున్న ‘పెహచాన్‌’ అనే స్వచ్ఛంద సంస్థకి తీసుకువెళ్ళాడు. వారితో మాట్లాడి, తనను తాను తెలుసుకుని, తన గమ్యాన్ని నిర్ణయించు కోమని… అది ఎటువంటి నిర్ణయమైనా తాను అండగా నిలుస్తానని చెల్లికి భరోసా ఇచ్చాడు.

అన్షుకైతే అన్నీ తెలిసిన అన్న ఉండడంతో తాను నిలబడగలిగింది. కానీ ఎంతోమంది అన్షులాంటి అమ్మాయిలు, అబ్బాయిలు సరైన గైడెన్స్‌ లేక అపరాధభావంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఇంటినుంచి వెళ్ళగొడ్తున్నారు… సమాజం వెలివేస్తోంది…పోలీసుల దౌర్జన్యానికి, ఆకతా యిల, రౌడీల ఆగడాలకి బలైపోతున్న ఈ ‘మూడోమనిషి’కి ఆసరా ఏది? రాజ్యాంగం వీరిని మనుషులుగా గుర్తించదా? రాజ్యం వీరికి అవసరమైన చట్టాలను చేయదా? అసలు సమాజం వీరినీ మనుషులుగానే ఎప్పటికి గుర్తిస్తుందో?? అసలు కుటుంబమే కాదంటే వీరేమౌతారు???

 

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో