ఒహో రాములమ్మలు..

అనిశెట్టి రజిత
ఆద్యంతం నెలరోజులపాటు వైజాక్‌ టూర్‌ గురించిన ఉత్కంఠ. ఆకుల్లో ఆకులమై పువ్వుల్లో పువ్వులమై.. సముద్రపు అలలతో చెమ్మచెక్కలాడి, గెంతి కేరింతలు కొట్టాలన్న తపన, కానీ… జరిగిందేమిటి?

అనూహ్యం. ప్రత్యక్షంగా చూసిన సామాన్యుల సాహసాలు…నిలువెల్లా కంపిస్తున్న ఏడుపు పాటలను ఎదురెదురుగా చూసిన విన్న దిగ్భ్రాంతి..అదో ఎడతెగని దుఃఖాల ఊట..దానికి కాలాలతో సమయలతో పనిలేదు..ఆ పెనుదుఃఖాలను పరామర్శించి ఓదారుస్తున్న మా అస్తిత్వం.
ఆ దుఃఖాల ఊటలకు ఏడుపుల పాటలకు రాగతాళాలు, శృతిలయల..శాస్త్రీయ ప్రామాణికాల లేవు..ఆ ఏడుపులకు రూపాలు నిర్వాసిత జీవితాలు..దిక్కులేక చెరలో బందీలు.. అత్యాచారాలవల్ల ఆగమైన సహజీవనాలు..భవిష్యత్‌ కోసం నిలువెల్లా సంకెళ్ళ బరువులు వెస్తున్న సామాన్యులు.
అంతులేని కష్టాల కొనసాగింపు. ఏకాకిలా మిగిలిపోతున్న సముద్రపుఘోష వాళ్ళ గోస..వాళ్ళు ఆదివాసీలు, గిరిజనుల, బడుగుల, బలహీనుల వెరసి డబ్బుకు జైకొట్టే లోకంలో నిరుపేదలు. వాళ్ళు వంచితులు..పీడితులు..రాజ్యం వల్ల దగాపడిన దీనులు.
గ్రేటర్‌ విశాఖపట్నం నిర్మాణంలో భాగంగా విశాఖ పోర్టు నిర్మించేందుకు సముద్రంపై చుట్టూ కొండాకోనలపై ఆధారపడి జీవించే మత్స్యకారులు గంగవరం, దిబ్బపాలెం మొదలగు నాలుగు గ్రామాల బడుగుజీవులను నిర్వాసితులను చేసి ఊళ్లు కూల్చేసి చూపిన అభివృద్ధి ప్రతాపం..ఫలితంగా ఇండ్లుపోయి, ఊరు ఊడ్చుకపోయి.. బతుకుదెరువైన సముద్రం (చేపల వేట) పోయి చుట్ట ఉన్న పెద్ద పెద్ద కొండలు పోయి దిక్కుతోచనితనంలోంచి లేచిన ఉవ్వెత్తు ఉద్యమం..
విశాఖ జైలులో మహిళా ఖైదీల హృదయవిదారకమైన రోదనలు..నేరం వారిది కాదు మన సభ్యసమాజానిదే..వారు నేరస్తులు అసలే కాదు కండ్లులేని చీకటి అధికారాలది..ఏ గతీలేనివాళ్ళే చెరలో బందీలైన దృశ్యం..ఒక విషాద సందర్భం సంధిస్తున్న ప్రశ్నల సవాళ్ళ సమయం.
చుట్టూ మైళ్ళకొద్దీ కొలువైన వందలాది పచ్చని ఎత్తైన కొండలనడుమ లోయలు..చెట్లు..తోటలు..భూమీ.. వ్యవసాయం.. వాగులు..డొంకలు..తీగలు అజ్ఞాతత్వంతో మమేకమయిన ఆదివాసీల కానరాని జీవనసంగ్రామాలు..రాజ్యాల కోసమూ..అధికారాల కోసమూ కాదు..బతుకు కోసం..! పాడేరు సమీపంలో వాకపల్లి హామ్లెట్‌ వేలలో ఒకటి ఆ కుగ్రామం..అక్కడ పదిమంది ఆదివాసీ యువతులపై గ్రేహౌండ్స్‌ పోలీసువీరుల అఘాయిత్యం..ఫలితంగా ఊరిపొలిమేరలైనా దాటని ఆ అడవికూనలు, నాగరికులను చూస్తే సిగ్గుతో భయంతో ముడుచుకుపోయే అమాయకులు..కుటుంబాల నుండి వెలికి, ఊరినుండి వెలికి..సాంఘిక వెలికి నిర్బంధపూరితమైన వాతావరణంలో జీవచ్చవాలుగా వెక్కివెక్కిపారే జలపాతాల్లా దుఃఖిస్తున్న దుస్థితి..అక్కడంతా క్రూరమైన నిశ్శబ్దం..జీలుగుచెట్లు నరికివేయ బడుతున్న కఠోరమైన గొడ్డలి చప్పుళ్లు..జీలుగు వనాల దహన దృశ్యాలు…
విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు పది కిలోమీటర్ల దూరంలో కొన్ని గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లో బాక్సైట్‌ నిధుల తవ్వకం కోసం భూమిని సేకరించి (లాక్కొని) ఆక్రమించడానికి పేద ఆదివాసీజనం..ఇతరులదీ భూమిని బలవంతంగా ఆశపెట్టో బెదిరించో లాక్కొని ఉక్కుడేగ జిందాల్‌ రిఫైనరీ కంపెనీకి హస్తగతం చేసేందుకు మహారాబందు ప్రభుత్వం దాడులు..కుట్రలు..
సంవత్సర కాలంగా నిలువెల్లా శరాఫతాలలాంటి కేసులు బనాయింపబడినా రాజీలేకుండా..బెదిరింపులకు భయపడకుండా, ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమం చేస్తున్న బక్కప్రాణులు.. దిక్కుమొక్కులేని జనం ఒక్కొక్కరు అగ్నికణమైతే ఎట్లా ఉంటుందో ఈ నాలుగు ప్రదేశాల్లోని బాధిత క్షోభిత ఉద్యమ కారులనూ..దుఃఖితులైన మహిళలనూ చూస్తే అర్థమవుతుంది..
ఆ మహిళాశక్తులు గంగవరం, దిబ్బపాలెం నిర్వాసితులైన ఆదెమ్మ, శాంతి, పైడమ్మ, నర్సమ్మలైనా..వాకపల్లిలో సిత్తాయి, శ్రీదేవి, సునీత, కొండమ్మలైనా..ఎస్‌.కోటలోని కాకి దేముడమ్మ, పార్వతులైనా..వాళ్ళందరూ నిరంతరం తమ చెమటధారలతో భూమిని అభిషేకిస్తూ శ్రమలో జీవితాన్ని పండించుకునే సమర్ధులు.
ఒకరికి సముద్రం పోయింది..ఒకరికి భూమి పోయింది.. ఒకరికి సిగ్గు పోయి జీవితం చిత్రహింసయ్యింది..మరొకరికి ఎత్తైన గోడల నడుమ ఊపిరాడని చావుకేకయ్యింది బతుకు.. కానీ..కానీ వీరిలో పరిస్థితుల వాతావరణాల అవగాహన..జీవితంపట్ల ప్రేమ..ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతితో స్నేహం చేస్తూ నిశ్చింతగా నిరాడంబరంగా గౌరవంగా బతికే విధానం నాయకత్వ లక్షణాలున్న మహిళావరణం..
నిర్వాసితమైతే ఇక పునరావాసమన్నది వయమిథ్యా అని గ్రహించుకునే జ్ఞానం..సక్ష్మత ఈ నిరక్షరకుక్షుల్లో ఉన్నదంటే అది బతుకు కష్టాల్లో కడతేరిన అనుభవం.. వారికి పాఠశాల కళాశాల కష్టాలు! అనుభవం! ఈ దేశంలోని చట్టాల్నీ..ప్రభుత్వాల్నీ.. పార్టీలను..నాయకులను..నాగరీకులనూ ప్రశ్నిస్తున్న తీరు ఆశ్చర్యం గొలుపుతుంది..వారి కొండంత మహోన్నత ముందు నాగరీకుల నకరాలన్నీ చిన్నబోతాయి. సర్వం కోల్పోయిన తెగువ నుండి జీవనోద్యమ పరిపక్వత..ఏ శిక్షణ వల్ల సమకూరుతుంది.
అచ్చంగా ఈ స్త్రీలు ఈ జగన్మాతలు కల్పితపాత్రలైన లేక మూసకల్పిత పాత్రలైన ”ఒసే రాములమ్మలు” కాదు.. ప్రలోభాలకు బలహీనపడి రాజీపడి చతికిలబడే సూడో మాటకారుల కాదు..వీరు నరనారీలోకం గర్వించే ”ఒహో రాములమ్మలు”..
వీరిని చూసి ఏం తెలుసుకున్నాం..వీరిని తెలుసుకొని ఏం నేర్చుకున్నాం.. మైదానప్రాంతాల్లో కృత్రిమమైన జీవితపు తళుకుల వలయా ల్లో గిరికీలు కొడ్తూ..ఎన్ని సౌకర్యాలున్నా ఎంత సంపాదనున్నా అసంతృప్తులతో.. చికాకులతో బతుకుతూ ఇంకా ఏదో కావాలనీ ఎంతో కావాలనీ ఆరాడపడేవాళ్ళం.. కొందరు సమాజానికి ఏం చేయకున్నా సమాజం నుండి సకల సౌభాగ్యాలు పొందుతూ భద్రలోకంలో కీర్తిప్రతిష్టలతో అలరారుతూ గొప్పవాళ్ళ మనే అహంభావంతో విర్రవీగుతూ తమను గురించి తామే తమలో తామే, తమ వాళ్ళ కోసం తాము ఆలోచిస్తూ ఎదిగిపోతున్నామనుకునే గొప్ప బుద్ధిజీవులు మనం చూసిన ఆ వీరవనితల ముందు అల్పజీవుల్లా తేలిపోవడంలో సందేహమే ఆశ్చర్యం అంతకన్నాలేదు.
జీవితానికీ జీవించడానికీ సరైన నిర్వచనం ఈ అధికారబలం, కులం-వర్గం నేపథ్యబలం, చదువూ-స్థాయి-హోదాల అండలేని ఈ సామాన్య పేద మనుషులు మాట్లాడేదంతా కవిత్వమే..చెప్పేవన్నీ జీవగండ్ల కథనాలే..చేసేదంతా పోరాటమే..ఎదుర్కొనేదంతా హింసానిర్బంధాలే..
అయినా నైతికంగా ఎంతటి బలవంతులు వాళ్ళు..చట్టం వంచించినా నైతిక విజయలతో ఎంతో ఎత్తున నిలబడినవాళ్ళు.. సాంఘిక (చట్ట) న్యాయం దక్కకపోయినా సమాజంలో నిజమైన హీరోలు..వీరులు..యెధులు, త్యాగాల్లో మునిగితేలే ధీరులు..మాక్సిమ్‌ గోర్కీ ప్రపంచ గ్రంథమైన ”అమ్మ”లో చెప్పినట్లుగా వీరు ఒక్కొక్కరూ (కార్మిక కర్షక కుటుంబాల్లోని పేదలు) ఎన్నో జీవితాలకు (జన్మలకు) సరిపడా కష్టాలు ఈ ఒక్క జన్మలోనే అనుభవించి ఉంటారు.
యుద్ధభూమిని జేసి డేరాలేసుకొని చుట్టూ రాబందురాజ్యాన్నీ గుండాల ప్రైవేటు సైన్యాన్నీ వారి మారణాయుధాల్నీ నిర్భీతితో ఎదుర్కొంటున్న ఈ బక్కప్రాణుల ఒంటిమీద పిడికెడు మా౦సం కూడా లేని, చేతిలో చిల్లపెంకులైనాలేని ”లేమి” చావుదెబ్బ తిన్నది..తింటున్నది..ఈ అమాయక ఓటర్లు ఫైటర్లుగా మారిన ఆ కారణాలేమిటి? అధ్యయనాలు కావాలిప్పుడు..దాచేస్తే దాగని చరిత్ర సత్యాలకు ప్రకటన కావాలిప్పుడు..
కడివెడు కన్నీళ్ళూ..కలంనిండా అక్షరాలు..సానుభూతి గుండె నిండుగా సరిపోతుందా..అంతకన్నా ఇంకొంచెం మెరుగ్గా ఏమీ చేయలేమా..?
చితికిన చితుకుతున్న ఆ ఊపిర్లకు ఊరటగా బాసటగా ఇంత మానవ ప్రపంచం ఏమీ చేయలేదా..
జీవించే హక్కుకోసం.. భూమీ..నీరూ..ఆకాశం.. సముద్రం.. కొండలు..సహజవనరుల భుక్తికోసం అనాదిగా ప్రజాసమూహాలు ఉద్యమ ప్రవాహాలై మహాయాత్ర చేస్తూనే ఉన్నాయి…
మొక్కవోని దీక్షతో న్యాయపోరాటం చేస్తూ పాలకులనూ, రాజకీయ నాయకులనూ, మేధావులనూ, సభ్య సమాజాన్నీ సవాల్‌ చేస్తున్న కడగొట్టు జనసమూహాలకు పాదాభివందనాలు..నినదించే ఆ పిడికిళ్ళకు నీరాజనాలు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.