ఆ తల్లి కన్నీటి చుక్కలు వ్యర్థం కావు సుమా – డాక్టర్‌ కత్తి పద్మారావు

వధకే వ్యధ చెందకపోతే
రాజ్యం బండబారినట్లేగా
అందరూ మరొకరిని నడిపితే
తమకు తాము ఎలా నడుస్తారు?మాటకు భయపడి గేట్లు వేస్తే
మాటలను సూర్య కిరణాలు మోసుకెళ్లవా…!
ఆ తల్లిని గేటు దగ్గరే ఆపారు
ఆమె కన్నీరు వ్యర్థం కాదు సుమా…!
ఆ వాచాలుడు దుండగుల వేపు వాదిస్తున్నాడు
సమాజాన్ని స్థబ్దీకృతగానే చూడాలనుకుంటున్నాడు
మార్పును ద్వేషిస్తున్నాడు
శ్రామికులు అక్షరాలు ధరిస్తే
సోమరులు మేథోలేమి
బయటపడుతుందని భయమా…!
ఈ పోగురాయుళ్ళు ఏనాడైనా
ఉత్పత్తిలో భాగం అయ్యారా…!
రాళ్ళకు రత్నాల ఆభరణాలు
ధరింపచేసే వీళ్ళు
శ్రామికుల గుడిసెల్లో
కాగే గంజి రుచి చూశారా…!
మోసపు మాటలతో కోటలు గట్టే వీళ్ళు
కర్ర వంతెన మీద నడిచి
ఆవలి గట్టుకు చేరగలరా…!
నాగుల చవితికి
నాగుల పుట్టలో పాలు…
కార్తీకమాసంలో కుంకుమార్చన
దేవీదేవర్ల తెప్పోత్సవాలు ఇవా…
వీరి నిత్యకృత్యాలు…!
ఇందులో ఏమి ఉత్పత్తి ఉంది?
యానాదుల యువకుడు
బాటనీలో ఫస్టు వస్తే
ఏళ్ళు కోస్తారా…?
గురువుకు కాపట్యం ఉంటే
చదువు వర్ధిల్లుతుందా…!
అక్షరానికి పునాది సమాజమే కదా…!
శాస్త్రానికి పునాది శ్రమజీవనమే కదా…!
ఆహోరోత్పత్తి లేనిదే
మేథో సంపద ఎలా సృష్టి అవుతుంది?
అంబేడ్కర్‌ పాదాల వద్ద తలవంచి
అబద్ధాన్ని వంచించటం మానవ ధర్మమా…!
మనుధర్మమా…!
మనిషిలో దాగున్న జ్ఞానాన్ని చంపడం
శిరశ్ఛేదం కంటే గొప్ప నేరం కాదా…!
మాట్లాడటం అంటే భజన చేయడమా…!
ప్రశ్నించడం కాదా…!
విశ్లేషించడం కాదా…!
గవేశించడం కాదా…!
సత్యవాక్కుకు భయపడి
చార్వాకులను వురి తీయలేదా…!
జాబిలిని వెంటాడ లేదా…!
వేమన్నను వివస్త్రుణ్ణి చేయలేదా…!
బ్రహ్మంగారిని సజీవ సమాధి చేయలేదా…!
అయినా వారి మాటలు ఆకాశ పక్షుల్లా ఎగరలేదా…!
ఆకాశ నక్షత్రాల్లా వెలుగొందలేదా…!
అంబేడ్కర్‌ అక్షరాలను
ముంబాయి నడిబొడ్డులో తగులబెట్టిన వీరే
ఆయన పేరును పదే పదే
పలకడంలో మోసం లేదా…!
మీరు ఎవరికి భయపడుతున్నారో
వారు శక్తివంతులు సుమా…!
తరతరాలుగా మిమ్మల్ని
ఎదిరించి నిలిచినవారు
ప్రత్యామ్నాయ సమాజ నిర్మాతలు
మహాత్మాఫూలే
మీ దేవుళ్ళ అవతారాలన్నీ హంతక పాత్రలని చెప్పలేదా…!
హింసతో మీరు విజయం సాధించలేరు
కరుణ, ప్రేమ, ప్రజ్ఞలే విజయ సూత్రాలు
ఆ తల్లి కన్నీటి చుక్కలు వ్యర్థం కావు సుమా…!
ఇది చారిత్రక సత్యం…

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో