అలవాట్లు – అగచాట్లు – ప్రొ|| ఆ.సువర్ణ అలివేలు

మనలో కొన్ని చెడు అలవాట్లు పాతుకుపోయాయి. అవి మాటల్లోనూ, మనం చేసే నిత్యకృత్యాలలోనూ గోచరిస్తాయి. ఎంతో జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప మనలోని ఆ దురలవాట్లు వదులుకోలేము. అవి అనాగరికం, అసభ్యం కూడా. కొన్ని ఉదాహరణలు:
”ఎలా ఉన్నావు? ఆరోగ్యం బావుందా? పిల్లలెంతమంది? లేరా? అయ్యో డాక్టరుకి చూపించుకున్నావా?” ఇలా ప్రశ్నమీద ప్రశ్న వేస్తూ వేధిస్తుంటారు కొందరు. వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదేమో అనుకోరు.

పాతకాలంలో దేశ, కాల, పరిస్థితులు వేరుగా ఉండేవి. యోగక్షేమాలు అడగడం ఆత్మీయతకి చిహ్నంగా ఉండేది. మరి ఇప్పుడు… అలా కనిపించగానే నిలదీసి అడగడం సభ్యత కాదు. కాబట్టి కాలంతోపాటు మనమూ మారాలి. కానీ ఇదే వైఖరి (ప్రశ్నల వర్షం) తమను  ఇంకొకరు నిలదీసి అడిగితే ఇబ్బందిగా ఫీలవుతారు. ఆ సంగతి వాళ్ళు వెంటనే గమనించి దిద్దుకుంటే బాగుంటుంది.

కొందరు మరీ అతి చనువు తీసుకుని మోటుగా మాట్లాడతారు. పనిమనిషిని రావే, పోవే, నీ మొహం, నీకు తెలివి లేదు అనడం చాలామందికి అలవాటు. ఇంకా పెత్తనం చెయ్యడం, వాళ్ళు తమ గుప్పిట్లోనే ఉండాలని కూడా ఆశిస్తారు. పనిమనుషుల కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడం, అనవసరంగా లేనిపోని సలహాలివ్వడం కూడా  జరుగుతూ ఉంటుంది.

కానీ తన బాస్‌ ఏదో చిరాకులో విసుక్కున్నా, ఒక ‘మాట’ అన్నా దాన్ని చిలవలు, పలవలు చేసి అందరికీ చెప్పుకుని సానుభూతి పొందాలని చూస్తారు. గౌరవంగా  బతకాలని అందరికీ ఉంటుంది. మనకింద పనిచేసేవాళ్ళను సమౌచితంగా గౌరవించాలి.

వయో వృద్ధుల్ని వాళ్ళ మొహంమీదే ‘మీరు పాతకాలం మనుష్యులని, మీకేమీ తెలియదని’ ఎవరైనా అంటే ”ఔరౌరా! ఎంత మాట అనేసింది. ఎంత గర్వం ఇప్పటివాళ్ళకి” అని వాళ్ళు చిర్రుబుర్రులాడతారు. వృద్ధుల్ని చులకన చేయకూడదు. రేపో మాపో మనకీ ఆ పరిస్థితి వస్తుంది.

ఇంకా చెప్పాలంటే వాళ్ళని ఆదరించి, సేవ చేస్తే మనకే లాభం. ఇది ప్రతి వ్యక్తి గ్రహిస్తే కుటుంబమంతా ఆనందపడతారు. ఇక ప్రతిరోజూ పండగే. ఏదైనా సమస్య తీవ్రంగా (జఠిలంగా)

ఉంటే, ఆలోచనల్లో  సతమతమైతే ”అందరూ సుఖంగా ఉన్నారు. నేనే కష్టపడిపోతున్నా” అని వాపోతారు.

నదులు… కొండలు, గుట్టలు, మెట్టల మీదుగా పారుతుంటాయి. అది మనం ఆనందంగా తిలకిస్తాం. మరి అలాగే తమ జీవితం కూడా హెచ్చుతగ్గులెన్ని ఉన్నా, నిర్మలంగా సాగిపోవాలని కాంక్షించాలి. ఎంతమంది మనకి నచ్చచెప్పినా వినబుద్ధి కాదు. కాబట్టి మన మనసుకి మనమే సర్దిచెప్పుకోవడం ఉత్తమం.

”సంఝౌతా గయొంసే కర్‌లో” అనే పాట కూడా ఉంది.

పని ఎక్కువ ఉంటే ”నేనే దురదృష్టవంతురాలిని, అందరూ సుఖంగా ఉన్నారు. ఛీ! పాడు బతుకు” అని తమను తామే నిందించు కుంటారు. అసలు సుఖం అంటే విశ్రాంతి కాదు. చేతిలో పనిలేకపోతే, హాయిగా ఉన్నారని అనుకోకూడదు. ఏ పనీ లేకపోవడం ”హాయి” అనుకుంటే శుద్ధ తప్పు. అసలు ఏ పనీ లేకపోతే కాలం ఆగిపోయినట్లవుతుంది. ఖాళీగా కూర్చుంటే  జైలు శిక్షలా ఉంటుంది.

నల్లగా ఉంటే ఛీ నల్లగా ఉంది అనుకుంటాం. ”పాపం నల్లగా ఉంది” అని పదిమందిలోనూ అనేస్తారు.

మరి ‘నలుపు రంగులో నాణ్యం లేదా?’ అని అనుకోరు. ఈ రోజుల్లోనూ అది ఏదో పెద్ద దురదృష్టం అని నమ్ముతున్నాం. ఇది ఎంత మూర్ఖత్వంగా ఉందంటే సదరు నల్లపిల్ల కూడా అది లోపమే అనుకునేంతగా. ఎంతమంది నల్లవాళ్ళకి పెళ్ళిళ్ళు కావడంలేదు అనే ఆలోచన రాకపోవడం శోచనీయం.

కొడుకు పుడితే గొప్ప వరం అనుకోవడం కేవలం వెర్రితనం.

పుట్టిన బిడ్డ ఆడయినా, మగయినా ఆరోగ్యంగా ఉండాలి, మంచి అభివృద్ధిలోకి రావాలి అని కాంక్షించాలి. అసలు ‘సంతాన ప్రాప్తిరస్తు’ అనాలి కానీ ‘పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు’ అనడంలో ఔచిత్యం లేదు.

‘మగువలు నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్‌’ అని ఎప్పుడో అన్నాడు ఒక ఆశుకవి. ఆయన ఆశీర్వాద ఫలితంగా నేడు జెట్‌ ఫైటర్లని ఆడవాళ్ళు కూడా నడపగల సామర్థ్యం మనం చూస్తూనే ఉన్నాంగా….!

ప్రతిరోజూ స్పెషల్‌గానూ, థ్రిల్లింగ్‌గానూ గడవాలని కోరుకుంటాం.

Every day is not a Sunday.

అసలైన థ్రిల్‌ కష్టపడి సాధించాలనుకోవడంలో ఉంది.

పెద్ద పెద్ద పోస్టుల్లో పనిచేసేవాళ్ళు కూడా ‘దిష్టి’ని నమ్ముతారు. దిష్టి అన్నది లేదు. ఇది కేవలం గుడ్డి నమ్మకం. పైపైన ‘అవునవును’ అని ఒప్పుకుంటారు (వాదోపవాదాలలో). కానీ తీరా తమదాకా వస్తే ఎందుకైనా మంచిదని దిష్టితీస్తారు.

ఇవి డబుల్‌ స్టాండర్డ్స్‌. అంటే పైకి చెప్పేదొకటి, చేసేదొకటి అని అర్థం.

చాలామంది ఆడవాళ్ళు తమ భర్తలు గొప్ప పేరు పొందాలని అనుకుంటారు. తీరా ఆ ‘కీర్తిమంతుడు’ మరొక స్త్రీతో స్నేహం లేక పరిచయం పెంచుకుంటే సదరు స్త్రీలు కుతకుత ఉడికిపోతారు.

ఆడ, మగ మధ్య సత్సంబంధాలు ఉండడం, ఆదరణీయంగా కూడా ఉండొచ్చు. ఆ ఆదర్శమైన స్నేహబంధం సెక్స్‌కి అతీతంగా ఉంటుందన్నది ఈ నాటికీ తెలుసుకోలేకపోతున్నాం.

… ఇలా ఆలోచిస్తూ పోతే… ఇంకా చాలా తప్పుడు భావాలు, దురలవాట్లు మనలో వెతికి చూస్తే చాలా ఉంటాయి. వీటిని మనసులోంచి ఏరిపారేస్తే తప్ప సమాజానికి వన్నె తేలేం. సామరస్యం (ఒకరిపట్ల ఒకరు) సాధించాలంటే మన ధోరణిని తర్కించుకుంటూ self discipline నేర్చుకుంటూ ఉండాలి. ఈ self discipline మన జీవిత లక్ష్యం సాధించడానికి తప్పకుండా పనికివస్తుంది. మనం పుట్టినప్పటినుంచి పుడకలదాకా (womb to tomb) ఈ శీలం భాసిల్లుతూ ఉండాలి.

ఇదే మనం శాసనంగా పాటిస్తే భావి తరాలకు మనం అందిచే ఆస్తి అవుతుంది. చిన్నపిల్లలు మనని అనుకరిస్తారని సదా గుర్తుంచుకోవాలి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో