రోగం, నొప్పి మనవి! మందులు మాత్రం మల్టీనేషనల్‌వి!! – పి. ప్రశాంతి

అపార్ట్‌మెంట్‌ గేట్‌లోకి వస్తూనే ఎదురుగా పిల్లర్‌ మీదున్న గడియారంపైకి చూపు సారించి ”అబ్బా… ఏడున్నరైపోయిందా..” అనుకుంది శాంతి. పార్కింగ్‌ స్థలంలో స్కూటీని పార్క్‌ చేస్తూ ఎదురుగా చీకట్లో నక్షత్రాల్లా మెరు స్తున్న ముద్ద నందివర్థనం పూలని చూసి తన కళ్ళ మంటలకి మందు దొరికిందనుకుంటూ మెట్లవైపుగా నడిచింది. రోజూ తను రావడం చూసి పరిగెత్తు కొచ్చే వాచ్‌మేన్‌ పిల్లలు రెండ్రోజు ల్నుంచి కనబడకపోవడంతో ఏమయ్యిందో అనుకుంటూ వాచ్‌మేన్‌ గదివైపు నాలు గడుగు లేసి ‘వర్షా… వర్షా…’ అంటూ పిలిచింది. సమాధానం లేదు. ‘ఊరికి పోయారేమో’ అనుకుంటూ తన ఫ్లాట్‌కి వెళ్ళిపోయింది.

మర్నాడు పొద్దున్న లేచి రోజూలాగే పళ్ళు తోముకుని, బాల్కనీలో పెట్టిన పది రకాల మొక్కలకి నీళ్ళు పోస్తూ అమృతవల్లి తీగలు పాకి గ్రిల్లు మీదుగా పైకెళ్ళిపోగా, చిలగడదుంప (మొరం గడ్డ) కాడలు సాగి కిందికి వేళ్ళాడుతు న్నాయే అని క్రిందికి చూస్తుంటే వాచ్‌మేన్‌ భార్య శ్రావణి కనబడింది. ‘పిల్లలు కనబడట్లేదు ఊరెళ్ళారా’ అన్న శాంతి ప్రశ్నకి ‘వర్షిణికి మూడ్రోజుల్నుంచి చెవి పోటు, ఏడుస్తుంటే నిన్న సాయంత్రం డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్ళాము. ఒకటే ఏడుపు.. పిల్ల బాధ చూడలేకుండా ఉందమ్మా’ అని వాపోయింది శ్రావణి. చేస్తున్న పని ఆపి, తలుపులు దగ్గరగా వేసి క్రిందికెళ్ళి ఒక మూల ఏపుగా పెరిగిన రుద్రజడ ఆకుల్ని కోసి, కడిగి వర్షిణిని తీసుకురమ్మని చెప్పింది శాంతి.

చెవిపోటుతో తల్లడిల్లుతూ ఏడుస్తున్న నాలుగేళ్ళ వర్షిణిని చూస్తే బాధతోపాటు, ఎవరిమీదో తెలియని కోపం కూడా వచ్చింది. వర్షిణిని దగ్గరకు తీసుకుని, కళ్ళు తుడిచి రుద్రజడ ఆకుల్ని కొద్దిగా నలిపి చేతిలో పెడ్తూ… ‘వర్షా! నీకు గోలీలు యిష్టంలేదు కదా! ఈ ఆకులు వాసన చూడు… నీ నొప్పి తగ్గించేస్తాయివి!’ అంది శాంతి. హాయిగా వున్న ఆ వాసనకు వర్షిణి ఏడుపు ఆపి ఉబ్బిన కనురెప్పల్ని ఎత్తి ‘నా నొప్పిని తగ్గిస్తావా..’ అన్నట్లు చూసింది. తన చల్లని చేతిని దొప్పలా చేసి వర్షిణి చెవిని మూస్తూ ‘నీ చెవిని నాకిచ్చెయ్‌.. నీకు నొప్పుండదు’ అని నవ్వింది శాంతి. ఆకులు వాసన చూస్తూ వర్షిణి కూడా సన్నగా నవ్వింది. ఇదంతా అబ్బురంగా చూస్తూ నిల్చుంది శ్రావణి. దూదితో వర్షిణి చెవిలో సున్నితంగా తుడిచి రుద్రజడ ఆకుల్ని రెండు అరచేతుల తో బాగా నలిపి వర్షిణి తలని ఒళ్ళోకి తీసుకుని ఆ ఆకుల రసాన్ని రెండు చుక్కలు చెవిలో పడేలా వేసింది. అలా మళ్ళీ మధ్యాహ్నం, సాయంత్రం కూడా చేయమని శ్రావణికి చెప్పి ‘సాయంత్రం నేనొచ్చేసరికి నీ నొప్పి మాయమైపోతుంది. అప్పుడు మనం చాక్లెట్‌ తిందాం… సరేనా!’ అంటూ వర్షిణి తలని నిమిరి తిరిగొచ్చేసింది.

చెవినొప్పికి మాచుపత్రి, రుద్రజడా కుల రసంలాగే, దగ్గుకి, గొంతులో గరగరకి తులసి ఆకు నమలడం, కళ్ళ మంటలకి ముద్ద నందివర్థనం పూలు కళ్ళమీద పెట్టుకోవడం, జలుబు చేస్తున్నట్లుంటే వామాకు నమలడం.. దేనికీ డాక్టర్‌ ప్రసక్తే ఉండేది కాదు. ఆ శాస్త్రీయ విజ్ఞానమంతా అమ్మమ్మ, నానమ్మలకు కొట్టిన పిండి. ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా ఇంటి వైద్యంతోనే ఒకటి, రెండు రోజుల్లో కులాసాగా అయిపోయేవారు. మరిప్పుడు!! అన్నిటికీ యాంటీబయాటిక్‌… ఇది వింటేనే భయమే స్తుంది. ప్రతి దానికీ యాంటీ బయాటిక్‌ మాత్ర లేసుకుని మన శరీరాల్ని ఏ చిన్న అనారోగ్యాన్నీ తట్టుకోలేనట్టు చేసేస్తున్నాం.

నా చిన్నప్పుడు తలనొప్పొస్తే నొప్పి ఎక్కడన్న దాన్ని బట్టి – మాడు నొప్పైతే ఆముదం ఆకులు వేసికట్టడం, కణతలు నొప్పైతే యూక లిప్టస్‌ నూనె రాయడం, నుదురు నొప్పైతే గంధం చెక్క అరగదీసి పట్టు వేయడం… ప్రతి దానికీ ఒక చిట్కా వైద్యం. అంతా ఇళ్ళల్లోనే! పార్శ్వ నొప్పికి రాత్రిపూట అన్నంలో పాలు పోసి, ఉల్లిపాయ ముక్కలు వేసి, తోడుపెట్టి, నెల్లాళ్ళు పరగడుపున తింటే ముప్పై ఏళ్ళుగా మళ్ళీ రాలేదు. మోకాళ్ళ నొప్పులకి ఆముదంతో మర్దన చేసి, ఉడకబెట్టిన వరిపిండిని బట్టలో చుట్టి పట్టు వేస్తే ఎంతో రిలీఫ్‌ ఇచ్చేది. జలుబు చేస్తే మిరియా లచారు, వేడి చేస్తే బెల్లంచారు లేదా పచ్చిపులుసు, కడుపులో బాగోపోతే అల్లం, ధనియాలతో చేసిన చారు, నోరు బాగోపోతే వామువేసి కాసిన చారు… ఎన్ని రకాల చార్లు కాసేవారు!

అరగక కడుపులో నొప్పిగా ఉంటే వేడన్నంలో ఆవకాయ పచ్చడ్తో తింటే చాలు. విరోచనాలవుతుంటే ఒక స్పూన్‌ పెరుగులో 15-20 మెంతి గింజలు వేసి మింగేస్తే లేదా ఒక స్పూనుడు గసగసాలో నమిలేసిన ఒక్క పూటలో కట్టేసేవి. నీరసంగా ఉందంటే మినప గారెలొండి, పక్కన చక్కెరలో కరిగించిన నెయ్యేసి తినిపించేవారు. శీతాకాలంలో కాకర కాయ, గుమ్మడికాయ లాంటి వేడినిచ్చే కూరలు, ఎండాకాలంలో బీరకాయ, సొరకాయ లాంటి నీరున్న కూరగాయలు… మధ్యాహ్న భోజనాల య్యాక లేత తమలపాకుల్లో చిటికెడు సున్నం, ఒక వక్క, చిన్న లవంగం తింటే అరుగుదలతో పాటు కాల్షియం కూడా చేరేది. 70 ఏళ్ళొచ్చినా పళ్ళూడేవి కాదు..!! వీటన్నిటి వెనక శాస్త్రీయ విజ్ఞానం ఉంది.

ఇప్పుడు ఒంటి నొప్పికి, పంటి నొప్పికి, తలనొప్పికి… అన్నిటికీ డాక్టర్ల దగ్గరికి పరిగెత్తా ల్సిందే! లేదా మందుల దుకాణానికి పోయి సొంత వైద్యపు మాత్రలు మింగడమే. తలనొప్పికి శారిడాన్‌, ఒంటి నొప్పికి క్రోసిన్‌, తుమ్ములొస్తే ఎవిల్‌, దగ్గొస్తే సిరప్‌, నీరసంగా వుంటే టానిక్‌… అన్నీ రసాయ నాలే! ఒంటిని విషపూరితం చేసి కొన్నాళ్ళకి ఏ మందూ పనిచేయని స్థితికి తెచ్చేసే ‘మందులు’. మన ఒంట్లో సహజంగా ఉండే వ్యాధి నిరోధక శక్తిని హరించేసే ‘మందులు’. ఎండకి తిరక్క, కాస్త దూరమైనా నడవక, ఎగరడం, పరిగెత్తడం లాంటివి చేయక శరీరంలో సహజంగా జరగాల్సిన ప్రక్రియల్ని జరగనివ్వట్లేదు. సహజ మార్గాల్ని వదిలిపెట్టి అసహజ పదార్థాలని తీసుకోవడం వల్ల, చెట్లులేని కాంక్రీట్‌ వనాల్లో శభ్రమైన గాలికి నోచుకోక, సింథటిక్‌ తిండ్లు, జంక్‌ఫుడ్‌ల వల్ల తలనొప్పితో మొదలుపెట్టి బి.పి., షుగర్‌, క్యాన్సర్‌ల దాకా ‘కొని’ తెచ్చుకుంటున్నాం. డెంగ్యూ లాంటి కొత్త జ్వరాలకి మన పెరటి చెట్లే మందని, పదిహేనేళ్ళ క్రిందటి వరకు రక్తంలో ప్లేట్‌లెట్స్‌ పడిపోవడమంటే తెలియని మనకి దీనికి మన అమృతవల్లి, బొప్పాయి ఆకుల రసం మంచి మందని ఎవరు చెప్తే వింటాం!!

మల్టీనేషనల్‌ కంపెనీల స్వార్థం కోసం బి.పి., షుగర్‌ వంటి వాటి ప్రామాణికాలనే మార్చే స్తున్నాయి అగ్రరాజ్యాలు. వాటిని పట్టుకు ప్రాకులాడే దేశాలపై పడి దోచుకుంటు న్నాయి ఈ కంపెనీలు. మరి మన వాతావరణ పరిస్థితుల కి తగ్గట్టు మనం పండించే సాంప్రదాయ పంటలే మన శరీరాలకి, ఆరోగ్యానికి అవసరం… పిజ్జాలు, పాస్తాలు మన ఒంటికి సరిపడవని మనం విచక్షణతో అర్థం చేసుకుంటేనే మన పెరట్లో మొక్కలు, మన వంటింట్లో దినుసులు చాలు మన వైద్యానికి అని తెలుసుకోగలుగుతాం. కానీ ఆ జ్ఞానాన్నీ, విజ్ఞానాన్నీ ఇవ్వట్లేదే మన చదువులు! పెద్ద తరం మనుషుల్ని ఇముడ్చుకోలేని మన ప్రస్తుత కుటుంబాల్లో ఒక తరం నుండి ఇంకో తరానికి అందే ఓరల్‌ ట్రెడిషన్నీ పోగొట్టుకుని నష్టపోతు న్నామా – లాభపడ్తున్నామా? ఒక పద్ధతి ప్రకారం మన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని కొల్లగొడ్తున్న, ఎందుకూ కొరగానిదిగా చేస్తున్న ఈ కుట్రకి సామ్రాజ్యవాద ప్రభుత్వాలూ చేయూతని స్తుంటే… ఎవర్ని తప్పుపట్టాలి? స్వార్థపూరిత సంస్థల్నా? తమ విజ్ఞానానికి విలువనివ్వని ప్రజల్నా?

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో