జీవన్మరణ పోరాటం చేస్తున్న గ్రామీణ మహిళలు

యం.రత్నమాల
ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రజలు ముఖ్యంగా ఆదివాసీలు సామ్రాజ్యవాద బహుళజాతి గుత్త సంస్థలు, ప్రభుత్వం కొల్లగొడుతున్న తమ జీవనాధారాలను కాపాడుకునే క్రమంలో జీవన్మరణ పోరాటం చేస్తున్న గ్రామాల్లో భూమిక ఏర్పాటుచేసిన పర్యటన ఒక గొప్ప అనుభూతి, అనుభవం.
విశాఖ తీరంలో నిర్మిస్తున్న గంగవరం పోర్టు వల్ల నిర్వాసితులవుతున్న గంగవరం, దిబ్బపాలెం మత్స్యకారులతో అరకులో బాక్సైట్‌ త్రవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలతోనూ, గ్రేహౌండ్స్‌ పోలీసులు వాకపల్లి గ్రామంపై చేసిన పాశవిక దాడిలో పోలీసుల లైంగిక బలాత్కారం, లైంగిక హింస బాధితులైన మహిళలను గతంలో వివిధ సందర్భాల్లో కలిసి మాట్లాడినప్పటికి, భూమిక రచయిత్రుల పర్యటనలో భాగంగా ఈ ప్రాంతాలలో తిరిగి పోరాడుతున్న స్త్రీలతో మాట్లాడ్డం ఒక ప్రత్యేక అనుభవం మాత్రమే కాదు నిర్వాసిత సమస్యకి-స్త్రీ సమితికి-రాజ్యహింసకి-పితృస్వామ్య అణచివేతకి మధ్య విడదీయరాని సంబంధంలోని ఎన్నో కొత్తగుణాలు స్పష్టమయ్యాయి.
మమ్మల్ని బలత్కరించిన వారిని శిక్షించండయ్య అంటే అయిదు లక్షలిస్తాం కేసు ఒగ్గేసుకోమంటున్నారు. ఇదేం న్యాయం అని అడిగిన వాకపల్లి ఆదివాసీ స్త్రీల ప్రశ్నకి న్యాయవ్యవస్థ ఏ సమాధానం చెపుతుంది. ప్రాణాలతో సహా ప్రతి దానికి నష్టపరిహారం ఎరవేస్తున్న పాలకుల న్యాయనికి ఇంతకంటేచెంపదెబ్బ సమాధానం ఏం ఉంటుంది. ”మేం సదువుసంధ్య లేనోళ్ళం రేయింబవళ్లు రెక్కల కష్టం చేసి టంకంబలి తాగి బతికే కొండోళ్ళం (కోందుతెగ గిరిజనులు) సంతకు పోతే తప్ప మా గూడెం (గిరిజన గ్రామం) దాటెరుగనోళ్ళం, పోలీసులు చేసిన పాపానికి తొక్కిన పసుపు తోటలు పచ్చిపుండయిన మావొళ్లు (శరీరం), వొంటి మీద దెబ్బలు (లైంగిక హింస అని స్పష్టం చేసే గాయాలు) తప్ప డాక్టరు సర్టిఫికెట్లు యన్నుంటి తేం? ఊరు దాటిపోకుంట మధ్యలో ఆపి వైద్యపరీక్షల్లో తేలిందని, ఏం జరగలేదంటున్నరు. మొగనితో సంబంధాన్ని, మొగని పేరును కూడా చెప్పడానికి బిడియపడే మేం జరిగంది జరిగిందని చెప్పి, మా బతుకుల్ల మేమే మన్నెట్ల బోసుకుంటం అన్న ప్రశ్న లైంగిక బలత్కార స్త్రీల శిక్షాస్మృతి అమలుకు ఇక్కడ అవకాశం లేదన్న వాస్తవాన్ని తేటతెల్లం చేసింది. 1980ల నించి దాదాపు అయిదారు సంవత్సరాలు దేశవ్యాప్తంగా మహిళా ఉద్యమం పోరాట ఫలితంగా లైంగిక బలాత్కార నేరశిక్షాసృృతి, ముఖ్యంగా ఇందుకు సంబంధించి భారత సాక్ష్యాధారాలు చట్టానికి ప్రభుత్వం చేసిన సవరణలు కానీ, 1985 తర్వాత మహిళా ఉద్యమ పోరాట ఫలితంగా ప్రభుత్వం చేసిన లైంగిక వేధింపులు, లైంగిక హింస మొదలైన నేరాలకు సంబంధించిన చట్టాలుగాని అట్టడుగు ప్రజలకు అందుబాటులోకి రావడం లేదని వాకపల్లి కేసు రుజువు చేసింది. పోలీసులు, ప్రభుత్వం, న్యాయవ్యవస్థ చివరకి కొన్ని రాజకీయ పక్షాలు చర్చను ”జరిగిందా”, ”జరగలేదా” అన్న అంశానికే సమస్యను పరిమితం చేసి మాట్లాడ్డం లైంగిక హింసను అర్థం చేసుకోవడంలో ఈ వ్యవస్థ అజ్ఞానాన్ని పితృసామిక ఆధిపత్యాన్ని స్పష్టంగా నిరపించింది. లైంగికపరమైన భాష సంజ్ఞలు కూడా శిక్షార్హమైనవన్న చట్టబద్ధ విషయం చట్టాన్ని అమలుచేసే యంత్రాంగ వ్యవస్థలకు (ప్రభుత్వం అంటే అధికారులు, పాలకులు, ప్రతిపక్షాలు, న్యాయవ్యవస్థ పోలీసు యంత్రాంగం) లెక్కలేదని, పట్టించుకోవడం లేదని వాకపల్లి రుజువు చేసింది.
సైద్ధాంతిక పరిజ్ఞానం పట్టణ మధ్యతరగతి మహిళా ఉద్యమాలలోనే. నిర్వాసిత సమస్య, భూమి, భుక్తి, విముక్తి సమస్యలపై పోరాటాల్లో స్త్రీల భాగస్వామ్య ప్రాతినిధ్యం గ్రామీణ, నిరక్షరాస్య, ఆదివాసీ దళిత పేద అట్టడుగు స్త్రీలను పోరాట శక్తులుగా, ఆయా పోరాటాల్లో నాయకత్వ స్థాయికి ఎంతగా ఎదిగించగలవో ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో సామ్రాజ్యవాద బహుళజాతి గుత్త సంస్థలు కొల్లగొట్టుకుపోతున్న తమ జీవనాధారాలను కాపాడుకోవడానికి పోరాడు స్త్రీమూర్తుల మాటల్లో మేం అర్థం చేసుకున్నాం. ఎంతో ఉత్తేజాన్ని పొందాం. స్త్రీల హక్కుల నిర్వచనం పోరాడుతున్న ఈ అట్టడుగు వర్గాల స్త్రీల అనుభవాల నించి రూపొందవలసి ఉందన్న చలనసూత్రాన్ని ఈ పర్యటన మరోసారి నిరూపించింది.

”స్త్రీలపై పితృస్వామ్య అణచివేత వ్యతిరేక పోరాటం జాతి మత (మనదేశంలో కులం కూడా) వర్గ తదితర అంతరాలను అధిగమించి సహోదరిత్వం వర్ధిల్లుతుంది. ఆనాటి ఆరంభదినాల్లో అంతర్జాతీయ స్త్రీవాద ఉద్యమం ఇచ్చిన నినాద ప్రతిస్పందన ప్రతిఫలన భూమిక సంపాదకురాలు సత్యవతి గారు, సంపాదకవర్గం, భూమిక నిర్వాహకవర్గం నిర్వహించిన నడిపించిన ఈ పర్యటన. మహిళా హక్కులను అట్టడుగు స్థాయి మహిళా జనజీవన గమనం నించి నిర్వచించుకోవాలనే రచయిత్రుల తపన, చైతన్యం ఈ పర్యటనకు దారిచూపింది.
అరకులో బాక్సైటు త్రవ్వకాల వ్యతిరేక గిరిజన పోరాట కమిటీ నాయకత్వం అధ్యక్ష కార్యదర్శులతో సహా ముప్పాతిక నాయకత్వం స్త్రీలే ఉండడం సమాజంలో అన్ని అసమానతలు అణచివేతలు అన్యాయలకు వ్యతిరేకంగా పితృస్వామ్య వ్యతిరేక పోరాటం జమిలిగా సాగవలసిన అవసరాన్ని ప్రాతినిధ్యం భాగసామ్యమే మహిళా సాధికారతను సాధిస్తుందని, అంతేతప్ప కేవలం ప్రభుత్వ ప్రచార ఆర్బాటాలు కాదని మరోసారి నిరూపించాయి.
భూమిక సంపాదకవర్గం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న పర్యాటక కార్యక్రమాల క్రమంలో పోలెపల్లి సెజ్‌ వ్యతిరేక గ్రామాలు పోపల్లి, ముదిరెడ్డిపల్లె, సండ్గగడ్డ తండ గ్రామాలు పర్యటించి పోరాడుతున్న ప్రజల స్త్రీలతో మాట్లాడ్డం స్త్రీవాద ఉద్యమం వేసిన ఆశాజనక ముందడుగు అయితే ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఆదివాసీ పోరాట ప్రాంతాల పర్యటన మరింత ముందుడుగు. ఈ అడుగు ఆగకుండా ముందుకి, మునుముందుకీ మరిన్ని బాధిత ప్రాంతాలకు విస్తరిస్తూ పోరాడుతూ స్త్రీలతో సంభాషిస్తూ సాగిపోవాలని మనసారా కోరుకుంటూ…

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో