సుప్రీంకోర్టు తీర్పు సమంజసం కాదు… తల్లిదండ్రుల సంరక్షణ ఇద్దరిదీ… – పసుపులేటి రమాదేవి

మన కోర్టులు కొన్నిసార్లు క్లిష్టమైన తీర్పులు ఇస్తుంటాయి. తాజాగా సుప్రీంకోర్టు కర్నాటక దంపతుల కేసులో విడాకులకు సంబంధించి ఇచ్చిన తీర్పులో భార్య కనుక వేరే కాపురం పెట్టాలని పట్టుబడితే భర్త విడాకులు ఇచ్చేయొచ్చని తీర్పు చెప్పింది.

హిందూ కుటుంబాల్లో వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ కొడుకుల ‘పవిత్రమైన’ బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

హిందూ కుటుంబంలో కుమారుడు తల్లిదండ్రుల బాధ్యతలు చూడాలని, ఒక్కడే కుమారుడైతే అతని జీతంలో వారికి హక్కు ఉంటుందని పేర్కొంది. అలాంటి పరిస్థితిలో భార్య కనుక కలిసి ఉండేందుకు ఒప్పుకోకపోతే భర్త విడాకులు తీసుకోవచ్చని జస్టిస్‌ అనిల్‌ ఆర్‌.దావే, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం తీర్పునిస్తూ వివాహం తర్వాత భర్త కుటుంబంలో భార్య భాగమైపోతుందని, భర్త ఆదాయాన్ని అనుభవించడానికి, భర్తతో వేరు కాపురం పెట్టించడానికి కుదరదని పేర్కొంది. అలా చేయడం భర్తపట్ల క్రూరంగా వ్యవహరించడంగా పరిగణించబడుతుందని పేర్కొంది. భార్య ఆత్మహత్యకు ప్రయత్నించడం లేదా ఆత్మహత్య చేసుకోవడంవల్ల భర్త మానసిక వ్యథకు గురవుతాడని పేర్కొంది. అయితే భార్య ఆత్మహత్యకు ప్రయత్నించడానికి దారితీసిన పరిస్థితుల గురించి ప్రస్తావన లేదు.

బిబిసి ఛానల్‌లో వచ్చిన ఒక కథనం ప్రకారం భారతదేశంలో మహిళల ఆత్మహత్యలకు ముఖ్య కారణం వివాహం తర్వాత ఆమె ఆకాంక్షలకు తగిన జీవితం లభించకపోవడమే.

తల్లిదండ్రులను చూసుకోవడం, వేరు కాపురం పెట్టకపోవడం కుమారుడిగా భర్త సదాచరణలుగా భావించడం బాగానే ఉంది కానీ అదే సూత్రం భార్యకు ఎందుకు వర్తించదు? కుమార్తెగా భార్య తన సొంత తల్లిదండ్రులను చూసుకోవడం కూడా ఆమెకు సంబంధించిన సదాచరణ కాదా?

భర్త తన తల్లిదండ్రులతో కలిసి ఉండడాన్ని, వారిని ఆదుకోవడాన్ని భార్య అంగీకరించకపోతే, వేరు కాపురం కావాలని కోరితే భర్తకు విడాకులిచ్చే హక్కు ఉందనడం చాలా ఆందోళనకరమైన విషయమే. మహిళలను రెండవ తరగతి పౌరులుగా భావించడం తప్ప మరేమీ కాదిది.

సాధారణంగా పెళ్ళి తర్వాత భర్త కుటుంబంతో భార్య కలిసి ఉండాలని, కుమారుడు తన తల్లిదండ్రులను చూసుకోవడం హిందూ సమాజంలో సాధారణమనీ, భర్త ఆదాయం తాను అనుభవించాలని హిందూ మహిళ కోరడాన్ని హైకోర్టు సమర్ధించింది. కానీ అది చెల్లదనీ, హిందూ కుమారుడి సదాచార విధులకు అది విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. భర్త కుటుంబంలో భార్య అంతర్భాగం కాబట్టి ఆమె వేరు కాపురం కావాలనడం అనుచితమని అభిప్రాయపడింది.

ఈ అభిప్రాయాలు పరిశీలిస్తే స్త్రీలు పురుషులకు సమానం కాదని, పురుషులకన్నా తక్కువన్న మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కుటుంబంలో మహిళలు నిర్వర్తించే విధులను బట్టి మంచి భార్య, మంచి కుమార్తె, మంచి తల్లి వగైరా బిరుదులివ్వడానికి ఉద్దేశించిన కట్టుబాట్లను చెబుతున్నాయి. అంతేకాదు, భర్త మానసిక ప్రశాంతతకు ఎలాంటి భంగం కలుగకుండా జాగ్రత్తగా భర్త కుటుంబంలో భాగమై పోవాలన్న ఆంక్ష పెడుతున్నాయి. మహిళ అంటే కేవలం ఒక భార్య, తల్లి, కుమార్తె, చెల్లి వగైరా.. పురుషుడికి సంబంధించిన పాత్రల చట్రంలోనే ఇరికించడం జరుగుతోంది.

వివాహం తర్వాత స్త్రీ భార్యగా భర్త జీవితంలోకి వస్తుందన్న భావన ఉందే కానీ, వివాహం ద్వారా ఇద్దరు వ్యక్తులు – ఆడ, మగ – సమాన స్థాయిలో కలిసి ఉండడానికి నిర్ణయించుకున్నారన్న భావన లేదు.

భార్య తన తల్లిదండ్రులకు సేవ చేయడంలేదని, తల్లిదండ్రుల బాగోగులు తనను చూడనివ్వడంలేదని, అత్తామామలను సరిగ్గా చూడడం లేదనీ, వేరు కాపురం కోసం ఒత్తిడి చేస్తోందంటూ భర్త ఆరోపించడానికి, విడాకులిస్తానంటూ బెదిరించడానికి, భార్యను వేధించడానికి ఈ తీర్పు ఉపయోగపడే అవకాశాలున్నాయి.

కుటుంబ వ్యవస్థ సమాజానికి చాలా అవసరమన్నది కాదనలేని నిజం. కుటుంబాన్ని కాపాడడానికి అవసరమైతే వ్యక్తిగత హక్కులను వదులుకోవడం అనేది స్త్రీ, పురుషులు ఇద్దరి విషయంలోనూ న్యాయబద్ధంగా ఉండాలి. పెళ్ళయిన తర్వాత దంపతులది ప్రత్యేక కుటుంబమవుతుంది. కానీ భర్త కుటుంబంలో దంపతులిద్దరూ అంతర్భాగం అయిపోవాలని వాదిస్తే భార్య కుటుంబంలో ఎందుకు అంతర్భాగం కాకూడదన్న ప్రశ్న సహజంగానే వస్తుంది.

భార్యా భర్తల మధ్య సంబంధం పరస్పర గౌరవాదరాలు, ప్రేమాభిమానాల పునాదులపై ఉండాలే కానీ, విధులు, బాధ్యతలు, అధికారాలు, హక్కుల చట్రంలో బిగించడం మంచిది కాదు.

అసలు మన రాజ్యాంగంలో స్త్రీ, పురుషులిద్దరికీ సమానమైన హక్కులున్నాయంటూనే వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణా బాధ్యత కొడుకుల పవిత్రమైన బాధ్యత అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంలో అర్థం ఏంటి? మరి అమ్మాయిలకు వాళ్ళ వృద్ధ తల్లిదండ్రుల

సంరక్షణా బాధ్యత ఉండదా?

ఒక రకంగా ఇప్పుడు జరుగుతున్న దారుణమైన పరిస్థితికి అంటే అమ్మాయిలను పుట్టకుండానే భ్రూణ హత్యలు చేస్తున్నారు. మరి ఈ తీర్పు దాన్ని ఇంకా ఎక్కువగా ప్రేరేపించినట్లే కదా? కేవలం అబ్బాయిలకు మాత్రమే తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ఉందని చెప్పడం పరోక్షంగా అమ్మాయిలు వద్దనుకునే విధంగానే ఉంది కదా?

ఈ తీర్పులో కూడా కేవలం భార్యకు మాత్రమే విడాకులిచ్చి పంపేయాలనడం ఎలా సమర్థనీయమవుతుంది?

పరస్పర అవగాహన పెరిగేలోగా ఎవరైనా అలా భావిస్తే నేరమేమీ కాదు. తప్పులు ఎటైనా వుండొచ్చు, కనుక నచ్చచెప్పవలసిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఉమ్మడి కుటుంబం కోసం దంపతులను విడదీయడం కూడా పొరపాటే అవుతుంది.

ముసలి తల్లిదండ్రులను వదిలేయడం లేదా వారినుంచి వేరుపడడం లేదా వారిని పట్టించుకోకపోవడం అనేది కూడా సమాజానికి మంచిది కాదు. కానీ వృద్ధులైన తల్లిదండ్రులు… భర్త తల్లిదండ్రులు కానీ, భార్య తల్లిదండ్రులు కానీ… వారిని చూసుకునే బాధ్యతను ఖచ్చితంగా నిర్దేశించే చట్టాలు కావాలి. అసలు తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ఆడపిల్లయినా, మగపిల్లవాడైనా అది వారి నైతిక బాధ్యతగా గుర్తించబడాలి.

అసలు ఒక యువతి, యువకుడు కలిసి వివాహం చేసుకోవడమంటే కేవలం అది వారిద్దరికే సంబంధించిన విషయం కాదు. రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం. కాబట్టి ఇరు కుటుంబాలను కలిపి సమిష్టి కుటుంబంలాగా భావించి ఇద్దరి తల్లిదండ్రులను ఇద్దరూ బాధ్యతగా చూసుకోగలగాలి.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో