తీపి చేదు అనుభవాల కలయిక ఈ యాత్ర

కె.హేమంత
సత్యవతి గారు సాహితీ యాత్ర గురించి చెప్పగానే ఎంతో సంతోషించాను.

ఇంతమంది రచయిత్రుల్ని ఒకేసారి కలవటమే కాక వారితో మూడు రోజులు కలిసి వుండే భాగ్యం కలగడం నా ఆనందానికి కారణాలు. హైదరాబాద్‌లో రైలు ఎక్కినప్పటి నుంచీ ఎంతో సందడిగా పరిచయాలు పలకరింపుల మధ్య ఉల్లాసంగా సాగిపోయింది విశాఖ వైపు మా ప్రయణం.
మా యత్రలో తొలి మజిలీ గంగవరం గ్రామం. విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణ సమయంలో నిర్వాసితులైన ప్రజలకు గంగవరంలో పునరావాసం కల్పించారు. ఆ సమయంలో స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగం కల్పిస్తామని ఇచ్చిన కార్డు లబ్దిదారులకు కొందరికి ఇప్పటికీ ఉద్యోగావకాశాలు కల్పించలేదు. ప్రస్తుతం ఈ గ్రామస్థులు గంగవరం పోర్టు కారణంగా మళ్ళీ నిర్వాసితు లవబోతున్నారు. ప్రభుత్వం పోర్టులో ఉద్యోగం ఇస్తామని మళ్ళీ నమ్మబలుకుతోంది.
ప్రధానంగా గంగవరం గ్రామస్థు లందరూ మత్స్యకారులు. మగవారు సముద్రంలో వేటకు వెళ్ళి చేపలు పట్టుకొస్తే ఆడవారు వాటిని ఇల్లిల్లు తిరిగి అమ్ము కుంటారు. సముద్రమే వారి జీవనానికి మూలాధారం. వారి వ్యవసాయానికి వారి కష్టమే పెట్టుబడి. ఎంత కష్టపడితే అంతగా వారి వలలు నిండుతాయి, కలలు పండు తాయి. అటువంటి కష్టజీవుల్ని, వారి పని మానేసి (సోమరులని చేసి) ఆ వూరు వదిలేసి వెళ్ళిపోతే నెలకి రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు నిరుద్యోగ భృతి చెల్లిస్తానంటోంది ప్రభుత్వం. ఆర్నెల్ల పాటు కొనసాగించిన ఈ ప్యాకేజిని కూడా ప్రస్తుతం నిలిపివేశారు.
”మేము సముద్రంలో చేపలు పట్టుకు బతికేటోళ్ళం. వకు తెలిసిన విద్య అదొక్కటే. వ తాతల కాలం నుండి అదే వ వృత్తి. ఈ పోర్టులో చదకున్నోళ్ళకి ఉద్యోగం ఇస్తాం, చదకోనివాళ్ళకి కూలిపని ఇస్తాం అంటున్నారు. మాలో ఒకరికో ఇద్దరికో తప్ప పెద్దగా ఎవరికీ చదువురాదు. ఒకవేళ చదివినా వాళ్ళ దగ్గర సర్టిఫికెట్లే లేవు. చేపలు పట్టేటోల్లం మాకు కూలిపని, బస్తాలు మొయ్యడం లాంటివి చాతనైతయ్య? ఇవాళ మాకు వుద్యోగం ఇచ్చినా రేపు మా పిల్లల గతేంటి? మమ్మల్ని సముద్రం వదిలేసి ఎల్లిపొమ్మంటున్నారు. రేపు మేం ఎట్లా బతకాల? ఒకళ్ళు చేపలు పడితే మరొకళ్ళు అమ్ముకొస్తాం. చుట్టుపక్కల అడవిలో కట్టెలు తెచ్చుకుంటాం. మాలో ఒకరికి పని ఇస్తారు. మిగిలినవారు ఏం పనిచెయ్యల? నష్టపరిహారం అని డబ్బు ముట్టచెపుతారు. నెల తిరగకుండానే అవన్నీ మొగోళ్ళు తాగి తగలేస్తారు. ఆ తరువాత మేం అడుక్కుతిని బతకాల. అందుకే చెపుతున్నాం, మేం ఇక్కడ్నించి ఎల్లాలంటే మాకు మరో ఒడ్డున వసతులు కల్పించండి. మా సముద్రం మాకియ్యండి” అని మొరపెట్టుకున్నారు.
గంగవరం పక్కనే వున్న మరో గ్రామం దిబ్బపాలెం. ఈ వూరిలో కొందరు ప్రభుత్వం ఇచ్చిన పరిహారం తీసుకుని వెళ్ళిపోయరు. అక్కడక్కడా కొద్దిమంది, ముఖ్యంగా మత్స్యకారులు మాత్రం ఎటువెళ్ళాలో తెలియక, సముద్రం విడిచిపెడితే ఏం పని చేసుకు బ్రతకాలో అర్థంకాక వూరు విడిచి వెళ్ళకుండా వుండిపోయారు. అక్కడొకటి, అక్కడొకటి తప్పితే దాదాపు ఇళ్ళన్నీ కూలగొట్టేశారు. ఇక్కడ ఇళ్ళంటే పూరిగుడిసెలు కాదు. సిమెంట్‌ స్లాబ్‌లు వేసిన ఒక మధ్యతరగతి స్థాయి అనిపించే ఆనవాళ్ళు కలిగిన పక్కా భవనాలు. ఆ ప్రాంతంలో నడుస్తుంటే అదొక యుద్ధభూమిని తలపించింది.
పడగొట్టినవారికి అవి గోడలేమొ కాని అవి విడిచి వెళ్ళిన వారి అనుభూతులు, అనుభవాలు, సుఖదుఃఖాల జ్ఞాపకాలు, తాతల నాటి కథలు, కష్టపడి నిర్మించుకున్న కలలసౌధాలు, భవిష్యత్తుపై పెంచుకున్న ఆశలు ఎన్నో ఆ శిథిలాలలో సమాధి అయ్యాయి.
భారమైన హృదయలతో మేమంతా బస్సెక్కాం. ఆ మధ్యాహ్నం మా భోజనాలు విశాఖ సెంట్రలు జైలులో ఏర్పాటుచేశారు. భోజనాలయ్యాక మేము జైలులోని వుమెన్స్‌ సెల్‌లోని కొంతమంది మహిళా ఖైదీలని కలిశాం. మీ కష్టసుఖాలు మాతో పంచుకో మన్నపుడు ఒక్కొక్కరే వారి వారి కన్నీటి కథలు మాకు చెప్పారు. ఒకరిద్దరు మిన హాయిస్తే, చాలామంది జైలుకు వెళ్ళిన కారణాలు ఉద్రేకంలో, ఆవేశంలో చేసిన తప్పులే. అటువంటివి బయటవున్న మనలో కూడా ఎంతోమంది చేసే వుంటారు. ఉదాహరణకు అత్తాకోడళ్ళు కొట్టుకోవడం, భార్యాభర్తలు గొడవపడటం, ఆస్తితగాదాలు ఇలాంటివి. కేవలం సరైన మార్గదర్శనం లేక వారు జైలులోనే వుండవలసివచ్చింది. వారిలో ఒక సోదరి తన భర్త చనిపోయాడని అందుకు కారణం (ఆత్మహత్యకు ప్రేరేపించ డం) తనేనని శిక్ష విధించారని, తన ఇద్దరు పిల్లలు ఇప్పుడెక్కడున్నారో తెలియదని కన్నీళ్ళు పెట్టినపుడు చాలా బాధ కలిగింది.
మర్నాడు ఉదయమే మేము పాడేరు బయల్దేరాం. వాకపల్లికి నడవలేక కష్టపడు తున్న మాకు అబ్బూరి ఛాయదేవి గారు స్పూర్తినిచ్చి ముందుకు నడిపించారు.
తమకు జరిగిన అన్యాయం గురించి సిత్తాయి ఇలా చెప్పుకొచ్చింది. ”అది చాలా సిగ్గువిషయం కాదా? అక్క చెల్లితో కూడా చెప్పుకోం. మేము ఎప్పుడ పాడేరు సంతకి కూడా ఎల్లలేదు. అలాటిది హైద్రాబాదు దాకా వచ్చి సిగ్గు యిడిచి అందరికీ అబద్ధం చెపుతామా? మేం చదువుకోలేదు. మాకు తెలుగు కూడా సరిగా రాదు. అడవిలో ఆకులు దుంపలు తిని బతికేటోల్లం. మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంది? తప్పు జరిగింది. తప్పు చేసిన వాళ్ళు బాగానే బయట తిరుగుతున్నారు. శిక్ష మాత్రం మాకు పడింది. తల్లీ, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఎవ్వరూ మాతో మాట్లాడటం లేదు.
ఎవరు నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని మేం నమ్ముతున్నాం. మాలాంటి ఎంతో మంది నమ్ముతున్నారు. మీరు కాదు సిగ్గుపడాల్సింది తప్పు చేసిన వాళ్ళు, వారి కొమ్ముకాచినవాళ్ళు, మీకు న్యాయం చేయలేనందుకు ఈ వ్యవస్థ సిగ్గుపడాలి, అని వారికి ధైర్యం చెప్పి తిరిగివస్తుంటే దారిలో ఒక ఇంటి గోడ పక్కగా వెళ్తూ ఒక తాచుపాము కనపడింది. వెంటనే ఇద్దరు మనుషులు దానిని చంపేశారు. ఎంతో సునాయసంగా క్రూరమృగాల నుండి తమను తాము రక్షించుకునే ఈ అమాయకులు మానవమృగాల చేతిలో బలవ్వడం నిజంగా సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవలసిన విషయం.
మర్నాడు మధ్యాహ్నం 2 గం||ల ప్రాంతంలో ఎస్‌.కోట చేరుకున్నాం.
ఎస్‌. కోట చుట్టుపక్కల గ్రామాలలోని భూములను ప్రభుత్వం జిందాల్‌ కంపెనీకి అప్పగించింది. జీవనాధారం అయిన తమ భూమిని వదులుకోవడానికి ఇష్టపడని గ్రామస్థులందర కలిసి స్వయంగా, పార్టీలకతీతంగా ఒక ఐక్య సంఘాన్ని ఏర్పరచుకున్నారు. ఈ సంఘానికి అధ్యక్షురాలు కాకిదేవుడమ్మ. తమ ఉద్యమం గురించి దేవుడమ్మ ఈ విధంగా వివరించింది.
మా భూమికి బదులుగా ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇస్తాం అన్నారు. ఎకరాకు లక్షా ఇరవై వేలు ఇస్తాం అన్నారు. మేం ఒప్పుకోలేదు. అప్పుడు మళ్ళీ ఎకరాకు రెండు లక్షల అయిదు వందలు చేశారు. డి ఫారం వున్న వాళ్ళందరి భూములు తీసేసుకున్నారు. మేం ఒప్పుకోలేదు. భూమి బదులు భూమి కావాలని కోర్టుకెళ్ళాం. అక్కడ మాకు అనుకూలంగానే తీర్పువచ్చింది. మాకు సరైన ప్రత్యామ్నాయం చూపకుండా మా భూములలో ఎటువంటి (ఫ్యాక్టరీ) పనులు చేయరాదని కోర్టు ఆదేశించింది. కానీ ఆ మర్నాడే కొంతమంది ఫ్యాక్టరీ అధికారులు వచ్చి మా భూములను సర్వే చేయటం మొదలుపెట్టారు. మేం వారిని ఒక ఇంట్లో కట్టిపడేశాం. మా భూముల జోలికి రాము అని కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని వదిలిపెట్టాం. మామీద కిడ్నాపు కేసు పెట్టారు. కానీ కోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన వారి మీద ఎటువంటి కేసు నమొదు కాలేదు. మాలో మాకు విబేధాలు కల్పించటానికి కారుల్లో మా ఇళ్లకు వచ్చారు. మేం అద్దాలు పగులకొట్టాం. అందుకు మరోకేసు పెట్టారు. ఇలా మా మీద రకరకాల కేసులు బనాయించారు. అయినా మేం వెనక్కి తగ్గలేదు. ఎన్ని కేసులైనా పెట్టుకోండి చావటా నికైనా మేం సిద్ధమే కాని మా భూములు మాత్రం వదులుకోం అని చెప్పాం. ఇంతగా ప్రలోభపెట్టినా నువ్వెందుకు ఒప్పుకోలేదు అని అడిగినపుడు దేవుడమ్మ ఇచ్చిన వివరణకు మేమంతా మంత్రముగ్ధుల మయ్యం. ఇప్పటిదాకా అందరికీ ధైర్యం చెపుత వచ్చిన మేము దేవుడమ్మ దగ్గర్నించి నేర్చుకోవలసింది ఎంతో వుందని మాకందరికీ అనిపించింది. రెండవ తరగతి వరకే చదువుకున్నా, తన కొచ్చిన కోర్టు కాగితాలని కూడా పక్కవారిచేత చదివించుకునే దేవుడమ్మకున్న భావస్పష్టత, తనపై తనకున్న నమ్మకం, తమ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన అవగాహన, సాధించాలనే పట్టుదల, క్లిష్టమైన పరిస్థితులను కూడా ధైర్యంగా నిబ్బరంగా ఎదుర్కొన్న ఆమెను చూసి మేమంతా అచ్చెరువొందాము.

దేవుడమ్మకు కనీసం తన భర్త నుండి కూడా సహకారం లేదు. తాగుడుకు బానిసైన ఈమె భర్త డబ్బు తీసుకుని పొలం అమ్మమని ఇప్పటికీ వేధిస్తూనే వున్నాడు. గంగవరంలో, దిబ్బపాలెంలో, ఎస్‌.కోటలో జీవనాధారం కోల్పోతే భవిష్యత్తు దుర్భరంగా మారు తుందని స్త్రీలు గుర్తించి పోరాడుతుంటే కొందరు. పురుషులు మాత్రం తాత్కాలిక ప్రలోభాలకు లొంగి వీరి ఉద్యమాల్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్త్రీలు పరిస్థితులు, సమాజం తోటే కాక కుటుంబం కోసం కుటుంబ సభ్యులతో కూడా విభేదించి పోరాడవలసి వస్తోంది.
ఎస్‌.కోట నుంచి విజయనగరం వెళ్తూ దారిలో జిందాల్‌ కట్టిన గోడ చూశాం. ఆ దారంతా చక్కగా జీడిమామిడి, అరటి తోటలతో కళకళలాడుతోంది. రేపు ఆ భూమంతా బీడవబోతోంది, ఎన్నో జీవితా లను బీటలు వార్చబోతోంది అని తలుచు కుంటే మనసుకు ఎంతో బాధ కలిగింది.
ఈ యాత్రలో ఎందరో స్త్రీమూర్తుల వ్యధాభరిత జీవనాలను చూశాను. అదే సమయంలో ఎంతోమంది సాహితీమూర్తుల పరిచయం అయ్యింది. కష్టాలు, కన్నీళ్ళు, అవమానం, ఆక్రోశం, ఆవేశం, పోరాటం ఒక పక్కైతే స్వాంతన, చేయూత, స్పందన, నమ్మకం, స్ఫర్తి, ఆలోచన మరోపక్కగా నిలిచింది. పరిచయలు, పలుకరింపులతో ప్రారంభమై ఒకరికి ఒకరుగా కొందరు, అందరికీ తామై కొందరు, ఎవరికి వారై కొందరు అందరం కలిసి ఒక్కటిగా సాగిన ఎన్నో తీపి చేదు అనుభూతుల కలయిక అయిన ఈ యాత్ర నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.