మయూఖ -సెలవు

బాల్కనీ తలుపు తెరిచాను, చల్లని గాలిని లోపలికి ఆహ్వానించడానికి. మనస్సు ఎప్పటిలాగే ఏదో ఆలోచిస్తూ ఉంది. మెదడు అన్నింటిని గుర్తు చేస్తూనే ఉంది. ఇంతలో ఎప్పుడొచ్చిందో తెలీదు. స్నేహితురాలు మాయ రానే వచ్చింది. ఎప్పటిలాగే ఉద్యోగం ముగించుకుని అలసిపోయి వచ్చి పరుపు మీద కాసేపు వాలింది. కొంచెం సేపయ్యాక లేచింది.

”ఎప్పుడొచ్చావే?” అని అడిగాను.

”నువ్వు బాల్కనీలో కూర్చుని ఆ గులాబి పువ్వులను పలకరిస్తూ ఏదో ఆలోచిస్తున్నప్పుడే వచ్చాను. ఏం ఆలోచిస్తున్నవే?” అడిగింది మాయ.

”ఎప్పటిలాగే ఏదో ఆలోచిస్తూ కూర్చుండిపోయాను. నువ్వు ఎప్పుడొచ్చింది కూడా తెలియలేదు” అంటూ, మళ్ళీ బాల్కనీ దగ్గరకు వచ్చి నిలుచున్నాను.

ఉరుములు… మెరుపులు… చల్లని గాలి…

ఆ గాలికి నేనే కాక నా కురులు కూడా పులకితులై నాట్యమాడుతున్నాయి.

”క్యాండిల్‌ ఎక్కడుందే?” అనే మాయ మాటతో మళ్ళీ కొత్తగా గదిలోకి అడుగుపెట్టాను.

అసలు నేను ఏం ఆలోచిస్తున్నానో నాకే తెలియదు. నా కళ్ళముందు ఏం జరిగినా నా మెదడు స్పందించదు. ఈ గాలి స్పర్శకు మళ్ళీ నా లోకంలోకి వెళ్ళి వస్తున్నట్టుంది. నేను పెయింటింగ్‌ వేస్తున్నప్పుడు కూడా ఈ లోకంలో ఉండను. అప్పుడప్పుడు ‘నేను కూడా నా పెయింటింగులో ఉన్నానా’ అని అనుకుంటుంటాను. ఏదో ఆలోచనలతో నా మనస్సంతా నిండి ఉంటుంది. పచ్చని పంట పొలాల్లో తిరుగుతూ ఉంటే ఎంతో హాయిగా మా అమ్మ ఒళ్ళో ఉన్నట్టనిపించేది. అసలు ప్రకృతి అందాలు వర్ణితమైనవి కావు. అందరూ నేను ఎవరి గురించో ఆలోచిస్తున్నాను అనుకుంటారు. కానీ నేను ఎప్పుడూ ప్రకృతి అందానికి ముగ్ధురాలినై వాటిని మనస్సులో తలచుకుంటూ ఉంటాను. ఇది చెబితే తెలిసేది ఎంత మాత్రం కాదు.

”ఏమైందే. కాండిల్‌ ఎక్కడుంది?” అనే మాటతో మళ్ళీ మనస్సుతో మాట్లాడటం ఆపాను.

ఒంటరిగా ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ ఎప్పటిలాగే మాట్లాడుకుంటాము – నేను, నా మనస్సు. ”ఏంటే? నేను మాట్లాడుతూ ఉంటాను. నువ్వేమీ బదులు పలకవు. నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పు” అంటూ ఉంటుంది మాయ.

”మనుషులతో మాట్లాడి ప్రయోజనం లేనప్పుడు మనస్సుతో మాట్లాడు” అంటాను నేను.

ఈ లోకంలో ఎన్నో పక్షులు… ఎన్నోన్నో రకాల జంతువులు. అవన్నీ ఒక దగ్గరగా ఉంటూనే హాయిగా జీవితం సాగిస్తున్నప్పుడు ఇన్ని తెలివితేటలున్న మనం ఎందుకు ప్రతిదానికీ తగాదా పడతాం. చంపడం, చావడం… ఇవే ఎందుకుంటాయి లోకంలో. ఇలాంటివి లేకుండా ఉండలేమా? అర్థం కాదు నాకు.

కనిపించని గాలి మనని బ్రతికిస్తున్నప్పుడు కనిపించే ఈ ప్రకృతి మనకు జీవం పోస్తుంది. ఈ పచ్చటి చెట్లు నా చెవిలో మ్రోగే పాట, ఈ చల్లని గాలి, దాని పులకరింపు, అందమైన పక్షులు… ఆహా! ఇవి కదా నన్ను బతికిస్తున్నవి. వీటిని చూడటానికి కదా ఈ జన్మ నాకు లభించింది అన్న భావనతో మనస్సు నాట్యమాడుతూ

ఉంటుంది. ఈ గాలి ప్రతిసారీ నాకొక కొత్త అనుభూతిని మోసుకొస్తూనే ఉంటుంది. అహ్‌… గులాబీ ముళ్ళు… అవి నన్ను ముద్దుపెట్టు కోవడంతో నా గదిలోకి ప్రవేశించాను.

….

”చూసుకోవే. గులాబీ ముళ్ళు గుచ్చుకుంటాయని చెప్పాను కదా. అయినా వింటావా నా మాట” అంది మాయ.

”అదేం కాదే. ఏదో ఆలోచిస్తూ…” అని బదులిచ్చాను.

మళ్ళీ ఎన్నో రకాల పువ్వులు, చెట్ల మధ్య మెల్లగా నడుస్తున్నాను. వెనకాల ఎవరో వస్తున్నారనిపించి చూస్తే, నలుగురు అబ్బాయిలు కత్తులు పట్టుకుని నా వైపే నడుస్తున్నారు.

నేను కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చి గాలి నాకు ఏం చెయ్యమని చెబుతుందా అని వింటున్నాను.

నా శరీరాన్ని తేలిక చేసుకున్నాను. ఆ నలుగురినీ తప్పించుకుని ఉరుకుతూ కొంచెం దూరం దాకా వచ్చాను. మళ్ళీ ఒక గాఢ శ్వాస తీసుకుని నా నడక మొదలెట్టాను.

పై నుంచి మంచు. అసలు ఆ ప్రాంతానికి ఎలా చేరుకున్నానో తెలీదు. కొంత దూరం వెళ్తూ ఉంటే ఒక పెద్ద చెట్టు కనిపించింది. అక్కడినుంచి నా దారి ఆగిపోయింది. ఎటూ వెళ్ళలేను. చుట్టూ చెట్లు. దారేదీ కనిపించటం లేదు. కళ్ళు మూసుకుని నా మనస్సును ప్రశ్నించడం మొదలెట్టాను. అదంటుంది… ”నీ విశ్వాసము, నీ ధైర్యమే నీకు తోడు. నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. మనస్సులో భయాన్ని ఏనాడూ నింపుకోకు. నీకు కనిపించేదంతా నిజమని ఏనాడూ అనుకోకు. నేను చెప్పే మాట విను. వెళ్ళు. నీ ప్రయాణానికి ఏ ఆటంకమూ కలగదు. వెళ్ళు” అంది.

విన్నాను. విని, నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే నా మనస్సులాగే చెట్టు కూడా దారిచ్చింది.

ఆ చెట్ల అందము, పువ్వుల పరిమళం నన్ను ముగ్ధురాలిని చేసాయి. ఆలోచిస్తున్నాను. ఎందుకు నేను పువ్వులా, చెట్టులా, పక్షిలా పుట్టలేదు. ఎంత అందమైన జీవితం వాటికి. ఆహా…! వాటిని చూస్తుంటే నా మనస్సు ఆనందంతో పులకిస్తోంది. ఈ అర్థం లేని ఆనందం, పసిపిల్లలా గెంతులేస్తున్న ఈ మనస్సు, నా వశంలో లేని శరీరం అప్పుడే మొదలైన వర్షంలా తడుస్తున్నాయి. ఈ హాయి నేను ఎప్పటికీ మరచిపోలేను.

ఇంతలో ‘మయూఖా’ అన్న పిలుపుతో నిజ జీవితంలోకి ప్రవేశించాను.

”మయూఖా” అన్న మా అమ్మ పిలుపును మూట గట్టుకొచ్చిన ఆ గాలి నన్ను, నా ఇంటిని గుర్తుచేస్తూ ఉండగా ”అబ్బా.. ఎక్కడుందో చెప్పవే క్యాండిల్‌” అంటూ నా స్నేహితురాలు మాయ నా గదిలోకి ప్రవేశించింది. నా తనువు ”ఆ, వస్తున్నా…” అంటూ నా మనస్సులోని ఆలోచనల తలుపు మూస్తూ బాల్కనీలో నుంచి వస్తున్న గాలిని ఆహ్వానిస్తూ నేల తల్లికి పాదాలతో ముద్దులు పెడుతూ ముందుకు కదిలింది.

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>