భూమిక వాలంటీర్స్‌ మరియు అడ్వకేట్స్‌తో సమావేశం – భూమిక టీం

భూమిక పనితీరు నచ్చి చాలామంది భూమికతో కలిసి పనిచేయాలని లేదా భూమిక కుటుంబంలో భాగంగా వారి కార్యక్రమాలలో పాల్గొనాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు.

ఉత్సాహంగా ఉన్న వ్యక్తులందరూ కూడా భూమికకు స్వచ్ఛందంగా సహకారం అందిస్తున్న వాలంటీర్లే. వీరిలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు విద్యార్థులు కూడా ఉన్నారు. వివిధ రంగాల (టీచర్లు, లెక్చరర్లు, సాఫ్టవేర్‌ ఇంజనీర్లు, సీనియర్‌ సిటిజన్స్‌, ఉద్యోగ విరమణ చేసినవారు) వారే కాక ఇంట్లో

ఉంటూ ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నవారు కూడా భూమికకు వాలంటీర్లుగా సహకారం అందిస్తున్నారు. అలాగే అడ్వకేట్లు కూడా స్వచ్ఛం దంగా సహాయం చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద దాదాపు 200 మంది సభ్యులు వాలంటీర్లుగా ఉన్నారు.

ఈ వాలంటీర్లందరికీ భూమిక ఆధ్వర్యంలో సంవత్సరానికి ఒకసారి హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది నవంబర్‌ 19వ తేదీన భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సెయింట్‌ ఆన్స్‌ జనరలేట్‌, తార్నాక నందు వాలంటీర్లు మరియు అడ్వకేట్లతో సమావేశం జరిగింది.

ఈ సమావేశం ప్రత్యేకత ఏమిటంటే ఈ సారి చాలామంది కొత్త సభ్యులు…ముఖ్యంగా యువతీ, యువకులు (18-22 సంవత్సరాల వారు) ఎక్కువగా ఉండడం.

సభ్యులందరూ కూడా తెలంగాణ జిల్లాల నుంచి వచ్చారు. ముఖ్యంగా భూమిక పనిచేస్తున్న కరీంనగర్‌, మహబూబ్‌ నగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌, సైబరాబాద్‌ల నుండి ఎక్కువమంది వాలంటీర్లు హాజరయ్యారు.

భూమిక సెక్రటరీ సత్యవతి సమావేశాన్ని ప్రారంభిస్తూ అందరికీ అభినందనలతో స్వాగతం పలికారు. పరిచయాల కార్యక్రమం ద్వారా ఎవరెవరు ఎక్కడి నుండి వచ్చారు, ఏమి చేస్తున్నారు అని తెలుసుకున్నాం. అనంతరం సత్యవతి గారు మాట్లాడుతూ ”భూమిక స్త్రీ వాద పత్రిక”ను ఎలా మొదలుపెట్టారు, స్త్రీ వాదం అంటే ఏమిటి, 1993 నుండి పత్రికలో ఎలాంటి సమాచారం వస్తోంది, పత్రికతో మొదలుపెట్టి ఇన్నేళ్ళుగా స్త్రీల అంశాలపై ఏ విధంగా పనిచేస్తున్నామో వివరాలను అందించారు.

హెల్ప్‌లైన్‌, సపోర్ట్‌ సెంటర్లు, క్షేత్ర స్థాయిలో యువతీ, యువకులతో నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నింటి గురించి భూమిక టీం సభ్యులు ప్రాజెక్టుల వారీగా వివరించారు. తర్వాత వాలంటీర్ల పాత్రల గురించి చెప్పారు.

భూమిక ప్యానల్‌ అడ్వకేట్‌ ముజీబ్‌ కుమార్‌ మాట్లాడుతూ తన దగ్గరకు కుటుంబ హింస (డి.వి.) కేసు ఫైల్‌ చేయడానికి వచ్చే మహిళలకు భూమిక హెల్ప్‌లైన్‌ నంబరు ఇస్తున్నానని చెప్పారు. న్యాయపరమైన సలహాల కోసం తనకు రిఫర్‌ చేయవచ్చని తెలిపారు. ప్రీ మారిటల్‌ కౌన్సిలింగ్‌లో సెల్‌ఫోన్‌, ఫేస్‌బుక్‌, పర్సనల్‌ మెయిల్స్‌ గురించి జాగ్త్రత్తలు పాటించవలసిన అవసరాన్ని భూమికకు వచ్చే బాధిత స్త్రీలకు వివరించాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆర్డర్‌ ప్రకారం ”అత్త కూడా కోడలిపై” కుటుంబ హింస (డి.వి.) చట్టం కింద కేసు పెట్టుకోవడానికి అవకాశం కల్పించిందని చెప్పారు. కోర్టుకు సమర్పించే ఆధారాలు ఏ విధంగా ఉండాలి, అలానే భర్త తరపు వారు భార్యది తప్పని నిరూపించడానికి మార్ఫింగ్‌ ఎలా చేస్తారు, ఈ విషయాలను స్త్రీలకు, పెళ్ళిచేసుకోబోయే యువతులకు కౌన్సిలింగ్‌లో తెలపాలన్నారు. విడాకులు పొందడం, డి.వి. చట్టం తదితర విషయాలపై సమావేశంలో పాల్గొన్న వారి సందేహాలకు ఆయన వివరణ ఇచ్చారు. తనకు భూమికతో పది సంవత్సరాల అనుబంధం ఉందని, ఎలాంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని ముజీబ్‌ కుమార్‌ తెలిపారు.

సఖి సెంటర్‌ నుండి వచ్చిన లీగల్‌ కౌన్సిలర్‌ విజయ భాస్కర్‌ మాట్లాడుతూ తనకు భూమిక సంస్థపై ఉన్న అభిప్రాయాలను తెలిపారు. నిజాయితీగా, స్వచ్ఛం దంగా సేవలందించే సంస్థలు చాలా తక్కువని, వాటిలో భూమిక మొదటి స్థానంలో ఉంటుందని చెప్పారు. ఈ సంస్థ పనిచేసే విధానంలో చాలా పారదర్శకత ఉంటుందని చెప్పారు. అందుకే తాను ఎనిమిది సంవత్సరాల నుంచి భూమిక వాలంటీర్‌గా కొనసా గుతున్నానన్నారు. తాను పనిచేసే ప్రభుత్వ వన్‌ స్టాప్‌ క్రైసిస్‌ సెంటర్లో (సఖి సెంటర్‌) ఏదైనా క్లిష్టమైన కేసు వస్తే భూమికకే రిఫర్‌ చేస్తున్నామన్నారు. అలాగే అవసరమైన స్త్రీలకు హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఇస్తున్నానని చెప్పారు. తాను నివసించే ప్రాంతంలో ఏవైనా కార్య క్రమాలు నిర్వహించాలంటే తాను తప్ప సహాయం చేస్తానని ఆయన చెప్పారు.

మద్దూరు, దామరగిద్ద మండలాల నుంచి వచ్చిన వాలంటీర్లు తాము భూమికకు ఏ విధంగా సహకరించ గలమో తెలిపారు. తమ పక్క గ్రామాలకు వెళ్ళి బాల్య వివాహాలు, గృహ హింస నిర్మూలనపై అవగాహన కల్పిస్తా మన్నారు. హెల్ప్‌లైన్‌ నంబర్‌ అందరికీ తెలియచేయడం, గ్రామంలోని మహిళా సంఘాలలోని స్త్రీలందరి సెల్‌ ఫోన్లలో హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ఫీడ్‌ చేస్తామన్నారు. గ్రామంలోని ముఖ్యమైన ప్రదేశాల్లో హెల్ప్‌లైన్‌ నంబర్‌ను గోడలపై వ్రాయడం, ర్యాలీలు, కళాజాత కార్యక్రమాల్లో (భూమిక నిర్వహించేవి) పాల్గొంటామన్నారు. అంతేకాక బాల్య వివాహాలు జరగకుండా చూడడం, పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ చేయడంలో సహాయపడతామని తెలిపారు తమ రెండు మండలాలను ”బాల్య వివాహాలు లేని” మోడల్‌ మండలాలుగా చేయడంలో భూమికకు తమ సహకారాన్ని అందిస్తామని చెప్పారు.

తాము అన్ని మండలాలలో పర్యావరణ పరిరక్షణ, స్వయం ఉపాధి అంశాలపై పనిచేస్తున్నప్పటికీ కుటుంబ హింస (డి.వి.) అంశాన్ని కూడా తమ అజెండాలో చేర్చుకుని గ్రామాల్లో హింసలేని సమాజాన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తామని వరంగల్‌ జిల్లా

నుంచి వచ్చిన వాలంటీర్లు రాజ్‌కుమార్‌ మరియు వారి సంస్థ మదర్‌ హ్యూమన్‌ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. హెల్ప్‌లైన్‌ నంబర్‌ గురించి అన్ని మండలాలలో తెలుపుతామన్నారు. ఇలాంటి సహకార సంస్థల గురించి స్త్రీలకు తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటన లపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యంగా ఉండేలా వారిలో అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే జిల్లాలో సోషల్‌ వర్క్‌లో డిగ్రీ చేసిన వాళ్లందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి ఒక ఫోరంను ఏర్పాటు చేసి ఆ ఫోరం ద్వారా హింసలేని సమాజం కోసం ప్రయత్నిస్తామని వారు చెప్పారు. భూమిక కూడా ఆయా సమావేశాలకు రావాలని వారు కోరారు.

వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఇతర వాలంటీర్లు తాము నివసించే అపార్ట్‌మెంట్లు, కాలనీలలో హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ప్రచారం చేస్తామని చెప్పారు. స్త్రీలకు సంబంధించిన సపోర్ట్‌ సిస్టమ్స్‌ గురించి అవసరమైన వారికి సమాచారం ఇస్తామన్నారు. అలాగే వాళ్ళు పనిచేసే పాఠశాలల్లోని విద్యార్థులకు హెల్ప్‌లైన్‌ గురించి అవగాహన కల్పిస్తూ, విద్యార్థుల ద్వారా అన్ని గ్రామాలకు హెల్ప్‌లైన్‌ కార్డులు, స్టిక్కర్లు పంపి తద్వారా హెల్ప్‌లైన్‌ గురించి తెలుపుతామన్నారు. ఇంకా ఎక్కువమంది స్త్రీలు హాజరయ్యే స్వయం సహాయక గ్రూప్‌లు, మహిళా మండళ్ళు, జిల్లా సమాఖ్య సమావేశాల్లో భూమిక హెల్ప్‌లైన్‌, సపోర్ట్‌ సెంటర్ల గురించి సమాచారమిస్తామని తెలిపారు.

”కౌన్సిలింగ్‌ ద్వారా స్త్రీలు, యువతులలో ధైర్యాన్ని నింపుతూ ఎంతోమందికి కావలసిన సహాయాన్ని అందిస్తున్నారు, అది చాలా గొప్ప విషయం, చాలా మంచి పని చేస్తున్నారు, మేము కూడా మీతో పాటు ఉంటాం” అంటూ అందరూ కూడా భూమిక చేస్తున్న పనిని కొనియాడారు.

చివరిగా సత్యవతి గారు మాట్లాడుతూ ”మనం తిరిగి వెళ్ళాక ఈ విషయాల గురించి మన చుట్టుపక్కల వారికి, తోటి సభ్యులకి, స్నేహితులకి తెలపవచ్చు. మీతోపాటు ఇంకా కొంతమంది వాలంటీర్లు ముందుకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది” అన్నారు. అప్పుడు హెల్ప్‌ లైన్‌ సమాచారంతో సమస్యల్లో ఉన్న అనేకమంది స్త్రీలకు మనందరం కలిసి సహాయం చేయవచ్చునన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అవసరమైన వారు భూమిక తయారుచేసిన పోస్టర్లు, ఇతర మెటీరియల్‌ను తీసుకెళ్ళవచ్చని తెలిపారు.

ఈ నివేదికను చదివిన వారు ఎవరైనా కూడా భూమిక కుటుంబంలో ‘వాలంటీర్లు’గా చేరవచ్చు. ఎలాంటి అర్హతలు, ప్రాధాన్యతలు అవసరం లేదు. కేవలం స్త్రీలకు సహాయం చేయాలనే ఒక ఆలోచన, పట్టుదల ఉంటే చాలు. మీరే కాదు, మీ స్నేహితులు, సన్నిహితులు… ఎవరైనా వాలంటీర్లుగా ఉండవచ్చు. ఈ సమావేశం అనంతరం కూడా చర్చలను ముందుకు కొనసాగించడానికి గాను ఒక ”వాట్సప్‌” గ్రూప్‌ కూడా ఏర్పాటు చేయబడింది. ఎవరైనా వాలంటీర్‌గా చేరాలనుకుంటే ఒక చిన్న ఫారంను మీ వివరాలతో నింపి ఇవ్వవలసి ఉంటుంది.

ఇంకా వివరాల కోసం భూమిక హెల్ప్‌లైన్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌: 1800 425 2908 (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వారికి), ఇతర రాష్ట్రాల వారు 040-27605316 నంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

రండి… భూమికతో చేతులు కలపండి… అందరం కలిసి హింసలేని సమాజాన్ని నిర్మిద్దాం…

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో