సావిత్రి – జ్యోతిబా సంభాషణ సావిత్రి…

చంద్రుడు వెళ్ళిపోయాడు

సూర్యుడు వచ్చేశాడు

నాలుగు వైపుల

అద్భుత అపూర్వ కాంతులు

తూర్పు దిక్కు నుంచి వ్యాపించాయిల

జ్యోతిబా చూడండి ఆకాశాన్ని

ఒకసారి చూడండి

నా వ్రేలు వైపు

కొంచెం దృష్టి సారించి చూడండి

ఈ దిక్కుల వైపు

 

జ్యోతిబా…

పద, ఇద్దరం వెళ్దాం తోటవైపు

చూద్దాం ప్రకృతి శోభను

ఆకాశంలో సూర్యుడు

గులాబీ గోళంలా

తిరుగుతూ వస్తున్నాడు మన వైపు

పువ్వుల మీద వాలుతున్న

సీతాకోక చిలుకలను చూడు

చెట్ల మీద కూర్చుని పక్షులు కూస్తున్నాయి

చల్ల చల్లగా గాలి వీస్తుంది

సృష్టి మొత్తం వికసించింది

కాని,

అనంత దుఃఖంలో రాత్రి గడచిపోయింది

సావిత్రి…

ఎల్ల కాలం చీకటిగానే ఉండాలని

రాత్రి కోరుకుంటుంది

సూర్యుడి మీద శాపాల వర్షం కురవాలని

మూర్ఖులు కోరుకుంటారు

విషపూరిత కాళరాత్రి వెళ్ళిపోయింది

సూర్య తేజస్సుతో సృష్టి సమస్తం

ప్రకాశవంతమైంది

జ్యోతిబా…

నిజమే, అంధకారం తొలగిపోయింది

శూద్రాది దీనులు మేల్కొన్నారు

దీన మాంగులు మహార్లు అజ్ఞానంతో దుఃఖాన్ని సహించాలి

పశువుల మాదిరి జీవించాలి

అదే మూర్ఖుల కోరిక

గంప క్రింద కమ్మినప్పటికీ

కోడి కూస్తుంది

తెల్లారుతుందనే సంకేతం

జనులకు ఇస్తుంది

సావిత్రి…

కాళరాత్రి గడచిపోయింది

అజ్ఞానం పారిపోయింది

ఈ సూర్యుడు మాత్రం

అందరిని మేల్కొలిపాడు

శూద్ర జనుల ఆకాశంలో

జ్యోతిబా ఓ సూర్యుడు

తేజస్సుతో పరిపూర్ణం

అపూర్వం ఉదయం

పదండి, నాతో బాటు

ముందుకు నడవండి

సాధిద్దాం కలిసి మానవతా లక్ష్యం

పొందుదాం మనుషలమనే

సర్వోన్నత స్థానం

(సావిత్రిబాయి ఫూలే కవితలు ‘కావ్య పూలు’ కవితల పుస్తకం నుంచి)

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో