అక్షర సాన్నిహిత్యం – ఎన్‌. వేణుగోపాల్‌

రెండుసార్లు జీవన సాఫల్య పురస్కారం పొందిన సీనియర్‌ జర్నలిస్ట్‌, భూమికకు అత్యంత ఆత్మీయులు వి. హనుమంతరావు గారు ఇటీవల మరణించారు. పూర్ణ జీవితం గడిపిన హనుమంతరావుగారు జర్నలిస్ట్‌గా, వీక్షణం పత్రిక బాధ్యులుగా ఎంతో నిబద్ధతతో జీవించారు. భూమిక సంపాదకురాలుగా నాకు ఉత్తమ జర్నలిస్ట్‌ అవార్డు ఇచ్చి సత్కరించారు. ఎన్‌. వేణుగోపాల్‌ రాసిన ఈ వ్యాసంతో వారికి భూమిక నివాళి సమర్పిస్తోంది. – ఎడిటర్‌

హనుమంతరావు గారు ఒకరకంగా నాకు గురువుకాని గురువు అయితే నేనాయనకు శిష్యుడినికాని శిష్యుడిని. నాూ ఆయనూ నలభై సంవత్సరాల తేడా. నేను పుట్టేటప్పటి ఆయన సుందరయ్యగారికి లేఖకుడిగా, ‘ప్రజాశక్తి’, ‘విశాలాంధ్ర’ పత్రికలకు బెజవాడలోనూ ఢిల్లీలోనూ విలేకరిగా, మొట్టమొదటి పార్లమెంటు సమావేశాలను రిపోర్టు చేసిన తెలుగువాడిగా అనేక విజయాలు సాధించారు. నేను రచయితగా పుట్టేటప్పటి ఆయన వేలాదిగా వ్యాసాలు రాసి ఉన్నారు. ఆయన ఆత్మకథ ‘విమర్శ – పరామర్శ’ లో నేను నాలుగుమాటలు రాయాలని ఆయన కోరుకోవడం ఆయనకు నామీద ఉన్న ప్రేమాభిమానాల వల్లనేగాని నా అర్హత వల్ల కాదు. పదిహేను సంవత్సరాలుగా ఆయనతో నిరంతర సంభాషణలో ఉన్నందువల్ల ూడ ఆయన నా మాటలు ఈ పుస్తకంలో ఉండాలని అనుకుని ఉండవచ్చు.

ఆయన రచనలతో నా పరిచయాన్ని ఎంతవెనక్కి తవ్వగలనో తెలియడంలేదుగాని ఆయనను మొదటిసారి చూసిన జ్ఞాపకమైతే 1982-83లది. అప్పుడు నేను ఉస్మానియాలో ఎకనమిక్స్‌ ఎం ఎ చదువుతున్నాను. అప్పటి అడపాదడపా ఆయన వ్యాసాలు చదువుతున్నాను గాని అంతకన్న ఎక్కువగా ఆయన అప్పుడు ప్రచురిస్తుండిన ‘ఆంధ్రప్రదేశ్‌ ఇయర్‌ బుక్‌’ చదువుతూ, నారచనలలో దానిలోని వివరాలను, గణాంకాలను వాడుకుంటూ ఉన్నాను. ఒకరోజు ‘విఎచ్‌ దగ్గరికి వెళ్దాం వస్తావా’ అని సి వి సుబ్బారావు గన్‌ ఫౌండ్రీలో లేపాక్షి పక్కన ఒక పాతభవనంలో మొదటి అంతస్తులో ఉన్న డేటా న్యూస్‌ ఫీచర్స్‌ ఆఫీసుకు తీసుకువెళ్లాడు. అక్కడ మొదటిసారి హనుమంతరావు గారిని చూసినట్టు జ్ఞాపకం.

ఆ తర్వాత పది సంవత్సరాలకు నూతన ఆర్థిక విధానాలు మొదలయిన తర్వాత నేను ూడ రాజకీయార్థిక వ్యవహారాలమీద రాయడం, మాట్లాడడం మొదలుపెట్టాను. అప్పటి ఆ విషయాలమీద ఎబి ప్రసాద్‌ గారు, హనుమంతరావు గారు విరివిగా రాస్తున్నారు. వాళ్ల వ్యాసాలను జాగ్రత్తగా చదువుతుండేవాణ్ని గనుక వాళ్లిద్దరితో ూడ అలా అక్షరసాన్నిహిత్యం పెరిగింది.

నేను బెంగళూరులో ‘ఎకనమిక్‌ టైవ్స్‌ు’ లో పనిచేస్తున్న ప్పుడు 1994లోనో, 95లోనో ఒక మిట్టమధ్యాహ్నం హఠాత్తుగా భుజానికి ఒక గుడ్డసంచీ తగిలించుకుని హనుమంతరావు గారు మా రెసిడెంట్‌ ఎడిటర్‌ గదిలో ప్రవేశించారు. నేను పరుగెత్తుళ్లిె పలకరించాను. అప్పటికి నాకు ఆయన చాల పరిచయం కాని ఆయనకు నేను తెలియదు. ఆయన అప్పుడు బెంగళూరు వివేకానంద యోగ ంద్రంలో ఒకవైపు యోగా నేర్చుకుంటూ, మరొకవైపు ఆ ంద్రానికి సమాచార సంబంధాలు నిర్వహిస్తూ, అదేసమయంలో ఆర్థికవిషయాలమీద వివిధపత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉన్నారు. అలా పరిచయమైన తర్వాత ఆయన చాలసార్లు నన్ను కలవడానికి ‘ఎకనమిక్‌ టైవ్స్‌ు’ ఎం జి రోడ్డు ఆఫీసుకు వచ్చారు. ఆయన రాసిన దాదాపు వంద వ్యాసాల కట్ట ఒకటి ఇచ్చి వాటిని ఎడిట్‌ చేసి అభిప్రాయం రాసి ఇమ్మన్నారు. నేను వాటిమీద అభిప్రాయం రాసి ఇస్తే దానికి పారితోషికం ూడ ఇచ్చారు. ప్రేమతో, ఇష్టంతో చేసిన పనికి ప్రతిఫలం ఎందుకంటే బలవంతాన జేబులో డబ్బులు పెట్టారు.

ఇక 1995లో నేను బదిలీ మీద హైదరాబాదు ‘ఎకనమిక్‌ టైవ్స్‌ు’ కు వచ్చిన తర్వాత మా బంధం మరింత బలపడింది. వైస్రాయ్‌ కుట్రతో ఆగస్టులో చంద్రబాబు నాయుడు అధికారం చేపడితే నా బదిలీ సెప్టెంబర్‌లో జరిగింది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీసుకున్న ప్రతి విధాన నిర్ణయం మీద, ప్రతి రాజకీయార్థిక చర్య మీద, వాటి వెనుక ఉన్న ప్రపంచబ్యాంకు ఆదేశాలమీద హనుమంతరావు గారూ నేనూ చర్చించుకునేవాళ్లం. గంటలకు గంటలు ఆలోచనలు పంచుకున్నాం. ఆయన రచనలమీద ఆ సంభాషణల ప్రభావం ఎంతో నాకు తెలియదుగాని అప్పటి నా రచనలమీద ఆయన ప్రభావం అపారంగా ఉండేది.

అలా బలపడిన బంధంతోనే ఆయన ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యామ్నాయ ఆర్థిక సర్వే’ పనిలో నన్ను భాగం చేశారు. ‘సమీక్ష’ పత్రిక పెట్టాలనుకున్నప్పుడు నన్ను వ్యవస్థాపక సలహా మండలిలో భాగం చేశారు. ‘సమీక్ష’ రిజిస్ట్రేషన్‌ కారణాలవల్ల ‘వీక్షణం’గా మారినతర్వాత నామీద మరింత బాధ్యత పెట్టారు. చివరికి 2005 జనవరి నుంచి నన్ను వర్కింగ్‌ ఎడిటర్‌ను చేసి పత్రికను పూర్తిగా నాచేతుల్లో పెట్టారు. అప్పుడప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా

ఉన్న రచనలు వేసినా ఓపికతో ఆమోదించారు. సెంటర్‌ ఫర్‌ డాక్యుమెంటేషన్‌, రిసర్చ్‌ అండ్‌ కమ్యూనిషేన్‌ (సి డి ఆర్‌ సి) సంస్థను ఏర్పాటు చేసినప్పుడు దాని వ్యవస్థాపక బోర్డు సభ్యుడిగా ఉండడానికి అంగీకరించారు. సి డి ఆర్‌ సి ప్రచురణగా వెలువడిన ‘ఫిఫ్టీ ఇయర్స్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ పుస్తకానికి సహసంపాదకుడిగా గత రెండు సంవత్సరాలలో నాతో ఇబ్బందులూ పడ్డారు, నన్ను ఇబ్బందులూ పెట్టారు.

అలా గత పదిహేను సంవత్సరాలలో మొదటి ఐదు సంవత్సరాలు అప్పుడప్పుడూ, తర్వాతి పది సంవత్సరాలు నిరంతరంగానూ సాగుతున్న మా సంభాషణలో, సంబంధంలో, అక్షర సాన్నిహిత్యంలో ఆత్మీయంగా తలచుకోదగిన ఆర్ద్ర జ్ఞాపకాలు వేలాదిగా ఉన్నాయి. ఇంతకాలంగా నాపట్ల ఆయన చూపుతున్న ప్రేమాభిమానాలను, వాత్సల్యాన్ని సగౌరవంగా మననం చేసుకుంటూ కృతజ్ఞతా సూచకంగా శిరసు వంచడం తప్ప ఆయన ఆత్మకథ గురించి అభిప్రాయం రాయడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు నిజంగా నాకు లేవు.

అయితే ఒక పాఠకుడిగా ఈ ‘విమర్శ – పరామర్శ’ మీద ఒకటి రెండు అభిప్రాయాలు చెప్పాలి.

మొదట – హనుమంతరావుగారు గడిపిన అసాధారణ మైన, వైవిధ్యభరితమైన జీవితంలోని సంపన్నమైన అనుభవాలలో చాల తక్కువ మాత్రమే ఈ రచనలోకి వచ్చాయి. ఆయన తన అర్థశతాబ్ది పాత్రియే జీవితంలో వేలాది అనుభవాలు పొందారు, వేలాది మందిని కలిశారు, వేలాది రచనలు చేశారు. వందలస్థలాలు పర్యటించారు. డజన్లకొద్దీ ప్రముఖులతో సన్నిహితంగా గడిపారు. ఆ అనుభవాలన్నిటినీ వివరంగా రాయగలిగితే అది ఒకరకంగా తెలుగు ప్రజల గత అర్థశతాబ్ది సామాజిక చరిత్ర అవుతుంది. ఆయన ఆ సామాజిక చరిత్రలోని అతి కీలకమైన ఘట్టాలెన్నిటికో సాక్షిగా ఉన్నారు గనుక ఆయన మాత్రమే చెప్పగల అంశాలెన్నో ఉన్నాయి. ఆయన ఆ కీలక ఘట్టాల లోతుపాతులను గురించి ఆయా ఘట్టాలలో విభిన్నపాత్రలు వహించిన వారిద్వారా చూసీ, వినీ ఉన్నారు గనుక అవి ఆయన మాత్రమే చెప్పగలరు. అవన్నీ ఆయన అక్షరీకరిస్తే బాగుండునని కోరుకోవడం అత్యాశ కాదనుకుంటాను.

రెండు – ఎనిమిదిపదులు దాటిన హనుమంతరావుగారిలో చాల సందర్భాలలో నాకు పసితనపు అమాయకత్వం కనిపిస్తుంది. ఎంతో జీవితానుభవం ఉండి, ఎంతో అధ్యయనం ఉండి, చాలా లోతయిన విశ్లేషణ చేయగలిగిన హనుమంతరావుగారు కొన్ని విషయాలను అర్థంచేసుకోవడంలో, గ్రహించడంలో, విశ్లేషించడంలో ఇంత అమాయకంగా ఎలా ఉండగలరా అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. తెలంగాణ ప్రాంతం పట్ల అమలయిన వివక్ష గురించి, తెలంగాణ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ పాలకవర్గాలు ఇచ్చిన అనేక హామీలను, వాగ్ధానాలను ఉల్లంఘించడం గురించి, నక్సలైటు

ఉద్యమం గురించి ఈ పుస్తకంలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇతరేతరంగా అయనకు ఉన్న విశ్లేషణా శక్తికి సరిపోయినవి కావని నాకనిపిస్తుంది.

మూడు – ఆయనకు అంలెమీద ఉన్న ప్రేమను గురించి ఆయనే చెప్పుకున్నారు. అంలెను, అందులోనూ ప్రభుత్వాలు, పాలకవర్గాలు ప్రకటించే అంలెను అంతగా నమ్మనవసరం లేదేమోనని, వాటిని మరింత జాగ్రత్తగా పరీక్షించాలేమోనని నేననుకుంటాను. అంలుె, గణాంకాలు సామాజిక వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి కొంతవరకు తోడ్పడే చిహ్నాలే తప్ప అవే సమస్త వాస్తవం కాదు. గణాంకాలను అబద్ధాలను ఒగాేటనకట్టిన సామెత అందరికీ తెలిసిందే. గణాంకాలను ప్రస్తుత సందర్భంలో ఎవరికి వీలయినట్టు వారు వ్యాఖ్యానించడానికి అవకాశం ఉందని ూడ అందరికీ తెలుసు. కాని హనుమంతరావు గారు కొన్ని సందర్భాలలో అంలె మాయలో పడి ఆ అంలె వెనుక ఉన్న వాస్తవ జగత్తును గ్రహించలేకపోతారేమో అని అనిపిస్తుంది.

ఐతే నాకు లోపాలుగా కనిపించినవి అందరికీ లోపాలుగా కనిపించాలనేమీలేదు. ఈ పుస్తక పాఠకులు వీటిని లోపాలుగా చూడకపోవచ్చు. నేను ూడ ఈలోపాలను గుర్తిస్తూనే హనుమంతరావు గారి వ్యక్తిత్వ విశిష్టతకు అవి ఎంతమాత్రం ప్రతిబంధకం కావని ూడ అనుకుంటున్నాను.

తన నిజాయితీతో, ఏకదీక్షతో, ప్రజాపక్షపాతంతో ఆయన గడిపిన ఆరుపదుల ప్రజాజీవితం అనితరసాధ్యమైనది. ప్రభుత్వాలు చేసే ప్రతి ప్రకటననూ, ప్రతి పనినీ, విడుదలచేసే ప్రతి కాగితాన్నీ, పుస్తకాన్నీ నిశితంగా పరీక్షించి, బాగోగులు చర్చించి ప్రజలకు తెలియజెప్పడం తన బాధ్యతగా గ్రహించిన అరుదయిన ప్రజామేధావుల సంప్రదాయంలో హనుమంతరావుగారి పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. అకుంఠితదీక్షతో, అహరహం శ్రమిస్తూ, వేలాది రచనలు చేసి ఒక ప్రజానుూల ప్రచారకుడు ఎటువంటి కృషి చేయాల్సి ఉంటుందో తన జీవితమే ఉదాహరణగా చూపిన హనుమంతరావు గారు ఒక అనుసరించదగిన ఆదర్శంగా మిగులుతారు. (ఎన్‌.వేణుగోపాల్‌ ఫేస్‌బుక్‌ పేజీ నుంచి…)

 

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>