ఆ తప్పిపోయిన పిల్లడు… మళ్ళీ దొరికాడు! – అపర్ణ తోట

మిమ్మల్నో మాట అడగనా? ఒక చక్కని పుస్తకం… మీ చేతిలోకి వస్తే ఎలా ఉంటుంది? సరే, ఆ చక్కని పుస్తకం మీ రెప్పటి నుంచో వెతుకుతున్నదైతే? మీ కిష్టమై, మీరు ఒకసారి చదివేసి, విపరీతంగా ప్రేమించి, తరువాత తప్పిపోయిన పిల్లాడిలా ఆ పుస్తకం కోసం వెతికి ఇక వీల్లేదనుకున్న సమయంలో ఎవరో దయతలిచి, ‘నా దగ్గరుంది, సర్లే తీసుకో’ అని ప్రేమగా ఇస్తే?!!

అంతకు మించిన గొప్ప అనుభవం జరిగింది నాకు

ఉషోదయాన, హైదరాబాదు రోడ్లలో, కారులో ఒక్కదాన్నే రేడియోలో వచ్చే ‘భూలేబిసేరే గీత్‌’ వింటూ… అలా లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ రోడ్డులో ఉన్న ఇంకా పూర్తిగా సన్నిహితురాలు కాని మిత్రురాలి ఇంటికి వెళ్తుంటే ఆనందం నా వెంటనే వచ్చింది. అదే ఆనందంతో నా స్నేహితురాలితో కలిసి మీటింగ్‌ పూర్తి చేసుకుని, వెనక్కు వచ్చే దారిలో బోల్డన్ని కబుర్లు చెప్పుకుంటూ, ఇద్దరమూ ఒకరినొకరిలో ఇంచుమించుగా చూసుకొంటూ, తబ్బిబ్బవుతూ, దారిలో ఒకచోట ఆగి పున్నాగ పూలు ఏరుకుని వాళ్ళ ఇంటిదాకా వచ్చాము. అదే

ఉత్సాహంతో తను కారునుంచి ఒక్క గంతున ఇంట్లోకి, తరువాత చెంగున పెరట్లోకి దూకింది, నన్ను పిలుస్తూ! తన వెనుకే ‘ఏమిటా’ అని వెళ్ళి అక్కడ నేలరాలిన పారిజాతాలను చూసి నేను ఆశ్చర్యపోతుంటే, తను ఆర్ధ్రంగా నా చేతినిండా ఏరినపూలు పోసి ఇచ్చింది. అప్పటికే మూగబోయిన నాకు లోపలికి పిలిచి ”పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లడు (వి.పనోవ)” నా చేతిలో పెట్టి సాగనంపితే…, ఏం చెప్పాలి!

ఇదిగో. ఈ నెలన్నరా ఆ పుస్తకాన్ని చదివి ప్రతి వాక్యమూ ఆస్వాదిస్తూ ఇష్టంగా రాయాలనుకున్న కోరిక ఇప్పటికి తీరింది! పుస్తకం గురించి చెప్పాలంటే వెనుక అట్టతో మొదలుపెడతాను. అందులో ఇలా ఉంది.

”సెర్యోషకి ఆరేళ్ళొస్తాయి. నాన్న యుద్ధంలో మరణించాడు. అమ్మ ఉంది, పాషా అత్తయ్య ఉంది, ల్యుకానిచ్‌ మావయ్య ఉన్నాడు. మరి సెర్యోషకి తమ చూసుకొవలసినవీ, తను అనుభవించవలసినవీ ఎన్నో ఉన్నాయి. ఏమంటే తన జీవితంలో ప్రతిరోజూ ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది. మరి, ఇప్పుడేమో, తన జీవితంలోకెల్లా అతి ముఖ్యమైన విషయం జరిగింది. తనకి మారు తండ్రి వచ్చాడు. ఈ పిల్లడికీ వాడి రెండవ తండ్రికీ ఉన్న సంబంధాల గురించి ఈ పుస్తకం మనకి చెబుతుంది.”

—–

ఇంతేనా?

ఈ పుస్తకం మనకు ఇంకా చాలా విషయాలు చెబుతుంది. అనుభూతిని పొందడం, స్పందించడం అనే మాటలు తెలుసుకోవా లంటే ఇది చదివాక మన మనస్థితిని అర్థం చేసుకోగలిగితే చాలు.

సెర్యోష! మన పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లడు! తన ఊరూ, ఇల్లూ, స్నేహితులూ, ఇరుగు పొరుగు… అవేగాకుండా తను గమనించవలసిన విషయాలు ఎన్నో… వీటితోనే తను అలిసిపోతుంటే ఇప్పుడింటిలో కొత్తనాన్న రాక… ఇదివరకు కుటుంబానికి మిత్రుడు, ఇప్పుడు కొత్తనాన్నగా మారిన కొరొస్తల్యేవ్‌ వచ్చాక సెర్యోష మామూలుగా అడుగుతాడు. ”నన్ను బెల్టుతో చెమ్డాలెక్కగొడ్తావా?” కొరొస్తల్యేవ్‌ ఆశ్చర్యపోతూనే చెప్తాడు, ”మనం ఒక ఒప్పందం చేసుకుందాం. మన మధ్య బెల్టు వ్యవహారం ఎప్పటికీ ఒద్దు,” అని. సైకిలు కొనివ్వడంతో సెర్యోష అభిమానాన్ని సంపాదిస్తాడు కొరొస్తల్యేవ్‌. అంతేనా? కాదు, తనకెంతో ముఖ్యమైన తన బొమ్మలను, కొరొస్తల్యేవ్‌ బీరువా జరిపి ఇవ్వడంతోనే అతని బలానికి సెర్యోషకు తెలియని ఆరాధన కలుగుతుంది. చిన్న పిల్లలు ఎన్ని చిన్న విషయాలు గమనిస్తారో! ‘అంత బీరువా ఎత్తగలిగిన మనిషి తనని ఎత్తలేడా’, అనే భరోసాతో రెండో రోజే సెర్యోష కొరొస్తల్యేవ్‌ భుజం మీద ఎక్కి గర్వంగా తిరుగుతాడు.

మొదటి పావువంతు పుస్తకం చదవగానే కొరొస్తల్యేవ్‌కి సెర్యోష మీద ఉన్న గౌరవం అర్ధమవుతుంది. నిజానికి ఈ పుస్తకంలో సెర్యోషతో పాటు కొరొస్తల్యేవ్‌ కూడా నాయకుడే. కొరొస్తల్యేవ్‌ ఎప్పుడూ సెర్యోషని చిన్న పిల్లాడిలా చూసినట్లనిపించడు. అంతెందుకు కొరొస్తల్యేవ్‌ భోజనాల సమయంలో అందరితో పాటు సెర్యోషకు కూడా వైన్‌ అందించడంవంటి గౌరవాన్ని మరి ఎవరూ సెర్యోషకు అప్పటిదాకా ఇవ్వలేదు!!

అసలు ఈ పుస్తకం ఒక రకంగా, ”a పశీశీస శీఅ జూaతీవఅ్‌ఱఅస్త్ర” అనవచ్చు. నిజమే, ఇది ఒక సుతిమెత్తని భావనను మిగిల్చే పుస్తకం మాత్రమే కాదు, తెలియకుండానే పేరెంటింగ్‌ టెక్నిక్స్‌ నేర్పే పుస్తకం కూడా. సెర్యోష ప్రకారం పెద్దవాళ్ళు చాలా అనవసరపు మాట్లాడుతారు. ‘ఎందుకు పాడుచేసావు’ లాంటి మాటలన్న మాట! వస్తువులు పాడుచేసినందుకు పిల్లలేమీ సంతోషించరు, ఇంకా సిగ్గుపడతారు. అయినా ఈ పెద్దవారెందుకు ఆ విషయం గుర్తించకుండా అనవసరంగా మాట్లాడతారు? అదే వాళ్ళు పాడుచేస్తే ఎవరూ ఏమీ మాట్లాడరు. అదేదో సరైన పనే జరిగినట్లు! ఇంకో విషయం – ‘దయచేసి (జూశ్రీవaరవ)’ అన్న మాట వాడడం. ‘ఏదన్నా కావాలంటే దయచేసి అన్న మాట జత చేస్తే ఇస్తాను,’ అంటుంది సెర్యోష అమ్మ. ‘మరైతే, ఏదైనా ఇయ్యి’ అని అడిగినప్పుడు, ‘నాకది కావాలని నీకు అర్ధం కాదా?’ అని అడుగుతాడు సెర్యోష. ”దయచేసి అని అడగడం వల్ల ఇచ్చేవారు సంతోషంగా ఇస్తారని’ వివరిస్తుంది. అమ్మ. అంటే ‘దయచేసి అని అడగకపోతే సంతోషం లేకుండా ఇస్తావా’, అనడుగుతాడు సెర్యోష. అమ్మ అప్పుడు, ”అసలు ఇవ్వనే ఇవ్వను”, అని చెప్తుంది. ”సరే అలాగే అంటాను” అనుకుంటాడు సెర్యోష. కాని కొరొస్తల్యేవ్‌ పెద్దవాళ్ళలాగా ఇలాంటి ‘ఉత్తుత్తి మాటలు’ పట్టించుకోడు. అంతేగాకుండా తను ఆడుకుంటున్నప్పుడు ల్యుకానిచ్‌ మావయ్య లాగా అనవసరంగా పిలిచి తనని ముద్దుచేసి చిరాకు పెట్టడు!

పేత్యమామ వచ్చి చాక్లట్‌ అని చెప్పి ఖాళీ కాగితం చుట్టిన ఉండను సెర్యోష కిస్తాడు. సెర్యోష మర్యాదగా దాన్ని అందుకొని మోసాన్ని గ్రహించి సిగ్గుపడితే, పేత్య మామ పగలబడి నవ్వుతాడు. సెర్యోష అసహనంతో ‘పేత్య మామా, నీకు బుద్దిలేదా?’ అని నిర్మొహమాటంగా అడుగు తాడు. ఆ మాటలకు అమ్మ అదిరిపడి, సేర్యోషను మంద లించి, క్షమాపణ అడగ నందుకు శిక్షిస్తుంది. సెర్యోష ఆత్మాభిమానంతో ఏమి బదులు చెప్పడు. అతనికి తన తల్లి మీద కూడా కోపం వస్తుంది. తనను మోసం చేసిన పేత్య మామతో అమ్మ ఇంకా ఎలా కబుర్లూ చెప్తుంది? అని. సాయంత్రం సెర్యోష లేడను కుని జరిగే చర్చలో కొరొస్తల్యేవ్‌ సెర్యోష మాటలను ‘న్యాయమైన విమర్శ’ అంటాడు. బుద్దిలేనివాడిని బుద్దిలేని వాడని అన్నందుకు ఏ బోధనాశాస్త్రం ప్రకారము శిక్షించకూడదు.’ ఈ మాటలకు అర్థం సెర్యోషకు తెలియకపోయినా కొరొస్తల్యేవ్‌ తన తరఫునే మాట్లాడాడని మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటాడు.

సెర్యోషకు కొరొస్తల్యేవ్‌ మీద పూర్తి నమ్మకం ఏర్పడినందుకు గీటురాయిగా, సెర్యోష తనకు ఈ బ్రహ్మాండవిశ్వంలో భూమికాక ఇతర గ్రహాలతోబాటు భూమివంటి మరో గ్రహం ఉంటే, అందులో సెర్యోషవంటి మరో కుర్రవాడి ఉనికిని గురించి వచ్చిన అద్భుతమైన ఊహ ఒక్క కొరొస్తల్యేవ్‌కు మాత్రమే చెబుతాడు. అవును మరి, సెర్యోష ప్రకారం అటుంటివి పంచుకోవడానికి ఒక్క కొరొస్తల్యేవ్‌కి మాత్రమే అర్హత ఉంది!

సెర్యోషకు తమ్ముడు పుట్టినప్పుడు, కొరొస్తల్యేవ్‌ మాటల ప్రకారం తన తమ్ముడిని బాగా చూసుకోవాలనుకున్నాడు సెర్యోష. కానీ అదేంటదీ, ఇంత చిన్నగా ఉండే తమ్ముడిని అమ్మే సరిగ్గా ఎత్తుకోలేకపోతోంది! పైగా ఆ పిల్లాడి వ్యవహారం కూడా నచ్చలేదు సెర్యోషకి. కాస్త పాలకోసం ఏడ్చి గొడవచేసి, పాలుతాగిన వెంటనే చప్పున నిద్రపోయే తమ్ముడిని చూసి, ”ఏం పిల్లాడమ్మా” అని అలసటగా అనుకుంటాడు సెర్యోష, కానీ కొరొస్తల్యేవ్‌ సర్దిచెప్పగానే కుదుటపడతాడు. అమ్మ తమ్ముడితో ఎప్పుడూ పనిలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొరొస్తల్యేవ్‌ వీలు చిక్కి నప్పుడల్లా – అంటే బట్టలు మార్చుకునే సమయాల్లో, నిద్రపోయే ముందు కథలు చెప్తాడు సెర్యోషకి. కాని కొరొస్తల్యేవ్‌కు పూర్తిగా తీరిక అంత తేలిగ్గా ఎప్పుడూ చిక్కదు. అతను చాలా ముఖ్యమైన మనిషి – అతను లేకపోతే పనివాళ్ళకు జీతాలుండవు, కావాలను కుంటే వాళ్ళను ఉద్యోగాల నుండి తీసి వేయగలడు. కొరొస్తల్యేవ్‌ను అందరికీ అధికారిగా నియమించారంటే అర్థం, అతను అందరికన్నా మంచివాడు, గొప్పవాడు అని సెర్యోష గ్రహిస్తాడు.

కానీ కాలం ఎప్పుడూ ఒకేలాగా

ఉండదు. జీవితాన్ని ఇంతగా అర్ధం చేసుకుంటున్న క్రమంలో సెర్యోషకు విపరీతమైన అనారోగ్యం. ఒక జబ్బు తగ్గగానే మళ్ళీ ఇంకొకటి. సెర్యోష కుదుటపడుతుండగా అదే సమయంలో కొరొస్తల్యేవ్‌కు బదిలీ అయింది. సెర్యోష ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అతనిని కొంతకాలం వారు కదల్చలేని పరిస్థితి. కాని సెర్యోష వేదన చెప్పనలవికాదు. అమ్మ, కొరొస్తల్యేవ్‌, ల్యోన్య వెళ్ళిపోతుండగా తనను మాత్రం వదిలి వెళ్ళడం దుర్భరంగా ఉంది సెర్యోషకు. ఒక రోజు సెర్యోష బాధను చూసి కొరొస్తల్యేవ్‌ బయటకు తీసుకువెళ్తాడు. కొరొస్తల్యేవ్‌ ఎంతో ముద్దుగా మంచిగా మాటలు చెప్పి, సెర్యోషను వదిలి వెళ్ళడం తనకు కూడా ఇష్టం లేదు అనే విషయాన్ని వివరించాడు. దానివల్ల రవ్వంత శాంతి కలిగినా సెర్యోష పూర్తిగా సమాధానపడలేదు. ఇదివరకు అమ్మ తనని వదిలి స్కూల్‌లో పనికి వెళ్ళింది. కాని అప్పుడు అమ్మ ఒకతే – పైగా అప్పుడు తానింకా చిన్నవాడు, తనకు తెలియలేదు. ఇప్పుడు అలా కాదు. కొరొస్తల్యేవ్‌

కూడా వెళ్ళిపోతున్నాడు. అన్నింటికన్నా ఘోరం, ల్యోన్యను తీసుకెడుతున్నారు, తనను వదిలేసి! ఆ రాత్రి చిట్టడివిలో సెర్యోషతో కొరొస్తల్యేవ్‌ చెప్పిన మాటలు విన్నా సమాధానపడని సెర్యోష గురించి రచయిత ఇలా అంటారు:

”సెర్యోషకి తన మనసులో ఇలా జవాబు చెప్పాలని పించింది. ఎంత ఆలోచించినా సరే, ఎంత ఏడ్చినా సరే, ఏమి ప్రయోజనం లేదు, మీరు పెద్దవాళ్ళు, మీరు అన్నీ చేయగలరు. ఇది చెయ్యవచ్చని, ఇది చెయ్యకూడదనీ మీరే అన్నీ శాసిస్తారు; కానుకలిచ్చేవారు మీరే; దండిచేవారూ మీరే; మరి నన్ను ఉంచేస్తామని మీరు అన్నారూ అంటే, నేను ఉండిపోవాల్సిందే, నేను ఏమన్నా, ఏం చేసినా కార్యం ఉండదు. తన మనసులో ఉన్నది చెప్పగలిగే సామర్థ్యం ఉండి ఉంటే ఇలా అని సెర్యోష జవాబు చెప్పి ఉండేవాడు.”

ఇంత వేదనను అనుభవించిన సెర్యోష కథ చివరికి ఊహించని మలుపు తిరిగి చదివినవారి హృదయాన్ని చాలా సున్నితంగా తాకుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ పుస్తకాన్ని చదివి చివరలో కంటతడి పెట్టకుండా ఉన్నట్లయితే వారిని ఇక పుస్తకపఠనం ఆపేయమని శాపం ఇవ్వొచ్చు.

ఇంతేనా అన్నది నవలలో… కానేకాదు… కథకు మించిన పాత్రలు – పెద్దరికాన్ని చూపే వాస్య, కష్టాలు పడిన జేన్య, కుళ్ళు బోతు లీద, పెద్ద వాళ్ళ నీచబుద్దికి ప్రతీక జేన్య పెద్దమ్మ, జైలు నుంచి విడుదలైవచ్చి సెర్యోష ఇంటి ఆతిధ్యాన్ని అందుకున్న అనుకోని అతిధి (ఇక్కడ సెర్యోష గమనించిన విషయాలని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి), వాస్య మావయ్య, ఆయన పచ్చబొట్లు, పచ్చబొట్ల కోసం పిల్లల తిప్పలు – ఇలా ఎన్నో పాత్రలతో తియ్యని సన్నివేశాలతో మధురంగా గడిచిపోతుందీ నవల.

లి లి లి లి లి లి

ఇంకొకటి! ఎవరికైనా నేను ఈ పుస్తకం గురించి న్యాయంగా రాయలేదు అనిపిస్తే దయచేసి బాధపడకండి. ఎందుకంటే, మీరనుకున్నది నిజమే కావొచ్చు! ఈ పుస్తకమే అంత అందమైంది! దీని గురించి నేను రాస్తానన్నప్పుడు, ఒక అమ్మాయి రాయొద్దని కూడా బ్రతిమాలింది. ఆమెకి భయం – అలా రాసి ఈ పుస్తకంలో అందమైన అనుభూతిని అందరికీ దగ్గరగాకుండా చేస్తానేమో అని. ఆమె బాధ చాలా న్యాయంగా అనిపించడమే కాదు, అలా బాధపడడం వల్ల ఆమె మీద ప్రేమ కూడా కలిగింది.

ఒక చిన్న నవలలా కనిపించే ఇంత చక్కని కథ రాసింది వి. పనోవ. పుస్తకం అట్టవెనుక రాసినట్లు ‘ఈమె పేరు విదేశీయ పాఠకులకు సుపరిచితమే. ఆమెకు మూడుసార్లు రష్యన్‌ప్రభుత్వ బహుమానం లభించింది. వేరా పనోప నాలుగు పెద్ద నవలలని, ఐదు నాటకాల్ని, ఎన్నో నవలికల్ని రాసింది. అన్నీ ప్రజాదరణ పొందాయి. వీటిలో అనేకం వెండితెరపై ప్రదర్శితమయ్యాయి.’

ఈ రచయిత్రి రాసిన అత్యంత కవితాత్మకమైన కృతులలో ఒకటి – ”పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లడు.” దీని అనువాదం

ఉప్పల లక్ష్మణరావు గారు చేసారు. ‘రాదుగ పబ్లికేషన్స్‌’ వారు ప్రచురించిన ఈ నవల మొదటి ముద్రణ 1968లో, రెండవ ముద్రణ 1987లో అయింది. ప్రస్తుతానికి కాపీలు అందుబాటులో లేవు. మీరు నిజంగా చదవాలనుకుంటే మీకు తెలిసిన, పుస్తకాల పిచ్చి ముదిరిన మిత్రుల దగ్గర ఖచ్చితంగా దొరకొచ్చు – ముందు లేదని దబాయించినా కాళ్ళు పట్టుకొంటే మెత్తబడో, మొహమాటపడో ఒకసారి చదవడానికి ఇవ్వొచ్చు!

విజయీభవ!

(‘సారంగ’ వెబ్‌ మ్యాగజైన్‌ నుంచి)

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.