మనసు గీచిన బొమ్మలు ఈ సినిమాలు! – శివలక్ష్మి

(గత సంచిక తరువాత)

నీ పేరు జస్టిన్‌..

”నీ పేరు జస్టిన్‌” (Your name is Justine) : ఇది పోలాండ్‌ చిత్రం. డైరెక్టర్‌ ఫ్రాంకో .

మారియోలా ఒక అందమైన యువతి. పోలాండ్‌ లోని ల్సంబర్గ్‌ లో అల్లారు ముద్దుగా చూసుకునే తన అమ్మమ్మతో భవిష్యత్తు గురించి అందమైన కలలు కంటూ హాయిగా జీవించే యువతి. తన అమ్మమ్మలా పాతతరం మనుషుల్లాగా సాదా సీదాగా సాఫీ జీవితం కాకుండా జీవితం ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా, భిన్నంగా,

ఉత్తేజకరంగా తీర్చిదిద్దుకోవాలని ఉవ్విళ్ళూరుతూ కోటి కోరికలతో తపన పడుతూ ఉంటుంది. ముగ్గురు స్నేహితురాళ్ళలో ఉద్యోగం సంపాదించుకుని జీవితంలోని ప్రతి అడుగులో విజయం సాధించబోతున్న ప్రత్యేకమైన దానిలా ఉంటుంది .

ఆమెకు ఆర్ధర్‌ అనే అందమైన ప్రియుడుంటాడు. ఒక రోజు ఆర్ధర్‌ మారియోలా దగ్గరి కొస్తాడు. ఒక సెలవు దినాన్న యూరప్‌ వెళ్ళి సముద్రతీరంలో సృజనాత్మకంగా, అద్భుతంగా గడుపుదామని ఊరించే కబుర్లతో నచ్చజెప్పి మారియోలాను ఒప్పిస్తాడు. ఆర్థర్‌ ఆమె మాజీ ప్రియుడు కాబట్టి యూరప్‌ చుట్టూ విహార యాత్ర అనగానే మురిసి పోతుంది మారియోలా. విడిపోయిన ఆమెను తిరిగి పొందడానికి, ప్రేమగా మాట్లాడుతూ పెళ్ళి చేసుకుంటానని హామీ ఇచ్చి పెళ్ళికి ముందు అతని తండ్రి మారియోలాను చూడాలనుకుంటున్నాడు కాబట్టి జర్మనీకి వెళదామంటాడు. జర్మనీ లోని కొలోన్‌ లో ఉన్న ఆర్థర్‌ వాళ్ళ కుటుంబాన్ని సందర్శించడానికి పోలాండ్‌ నుండి ప్రయాణం చేయబోతున్నామని చెబుతాడు ఆర్ధర్‌. ట్రిప్‌ ప్రారంభానికి ముందు, అతను ఆమె నివసించే ప్రాంతానికి వచ్చి ఆమెను రకరకాల భంగిమల్లో నవ్విస్తూ కొన్ని ఫొటోలు, ఆమె అమ్మమ్మతో సహా కొన్నిఫొటోలు తీస్తాడు. నాన్న తమ పెళ్ళికి తొందర పడుతున్నాడనీ, ఆయనకి మారియోలాను చూపించడానికి జర్మనీకి తీసిళ్తుెన్నానని ూడా అమ్మమ్మతో చెబుతాడు. తాను జర్మనీలో కాబోయే మామగారిని చూడ బోతున్నాననుకుని దారిలో చాలా ఉద్విగ్నంగా కొన్ని జర్మన్‌ పదాలు ూడా నేర్చుకుంటుంది మారియోలా. జర్మనీ దాటగానే బెర్లిన్‌లో ఒక అపార్ట్‌ మెంట్‌కి తీసిళ్తాెడు ఆర్ధర్‌. ఆ ఇంట్లో చంటిపాపతో ఉన్న ఒక మహిళ తనవంక వింతగా చూడడం, ఆ ఇంటి వాతావరణం అసాధారణంగా, తేడాగా ఉండడంతో ఆర్ధర్‌తో వెంటనే ఇక్కణ్ణుంచి వెళ్ళిపోదాం, వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడం అని అంటుంది మారియోలా. ఒక్క రాత్రి సర్దుకుందాం అని అంటాడు ఆర్ధర్‌.

ఇంతలో ముగ్గురు రాక్షసుల్లాంటి మృగాళ్ళు వస్తారు. అతి కౄరంగా ఉన్న ఒకడు సరాసరి మారియోలా దగ్గరకొచ్చి దౌర్జన్యంగా మీద చెయ్యేస్తాడు. ‘ఇక నీకు ఎంతమాత్రమూ నీ అసలు పేరు మారియోలా అని ఉండదు. ఈ రోజునుంచి నీ పేరు జస్టిన్‌’ అని అంటాడు. ఒక పక్క నుంచి తీవ్రంగా ప్రతిఘటిస్తూనే, ఇతను మీదకొస్తున్నాడంటూ గొప్ప నమ్మకంతో ప్రియుడికి అమాయకంగా ఫిర్యాదు చెయ్యబోతుంది మారియోలా. అందులో ఒకడి దగ్గరనుంచి నోట్ల కట్టలు అందుకుంటూ ప్రేక్షకులకు కనిపిస్తాడు ఆర్ధర్‌. ‘నీ ప్రియుడు ఆర్ధర్‌ నిన్ను మాకు అమ్మేశాడు’ అంటాడు చెర బట్టిన వాడు. ఆమె ప్రియుడు లోపల పైశాచిక ప్రవృత్తి గల అతి కౄరుడు. మారియోలాను పాస్‌ పోర్ట్‌ తో సహా ఒక వేశ్యను అమ్మినట్లు అమ్మేసి మరుక్షణంలో మాయమవుతాడు!

ల్సంబర్గ్‌ సరిహద్దు దాటి జర్మనీలోకి ప్రవేశించి బెర్లిన్‌ లోని ఒక ఇంటికి తీసిళ్ళేె వరూ ఆనందంగా ఉంటుంది మారియోలా. అంతే! ఆమె జీవితంలో సంతోషపు ఘడియలం తరించిపోతాయి! మరుక్షణంలో జీవితం ఊహించని విధంగా భయానకంగా మారిపోతుంది! ఇక మారియోలా జస్టిన్‌ గా చెలామణీ అవుతూ ఉంటుంది!

అప్పటినుంచి జస్టిన్‌ జీవితంలో చూడలేని, భరింపరాని లైంగిక హింస మొదలవుతుంది. చెరబట్టిన ముగ్గురిలో ఇద్దరు జస్టిన్‌ని చెప్పనలవి కానన్ని చిత్రహింసలు పెడుతూ ఉంటారు. ఆమె వారించిన కొద్దీ విపరీతంగా కొట్టి కొట్టి రక్తాలు కారేలా చేస్తారు. వారిలో ఇద్దరు ఒకడి తర్వాత ఒకడు పశువులకంటే హీనంగా, నీచాతి నీచంగా ప్రవర్తిస్తారు. జస్టిన్‌ ూడా చాలా బలంగా మంచి శరీర దారుఢ్యంతో ఉండి తనకున్న శక్తినంతా ఉపయోగించి ధీటుగా ఎదిరిస్తూనే ఉంటుంది. ప్రచండంగా, భీకరమైన పోరులో శక్తి కొద్దీ శత్రువుతో పోరాడినట్లు ప్రతిఘటిస్తూనే ఉంటుంది. కానీ ఆమె శక్తి చాలదు. పెనుగులాడీ, పెనుగులాడీ నిర్జీవంగా మిగిలిపోతుంది

పతిసారీ. వారి రాక్షసత్వం ముందు ఆమె నిస్త్రాణంగా నిస్తేజంగా మిగిలిపోతూ ఉంటుంది. ఒకసారి కాదు, అనేకసార్లు ఆమె మీద బలప్రయోగం చేస్తారు. రోజుల తరబడి అత్యాచారం కొనసాగిస్తారు. చివరికి ఆమె కొట్టొద్దని దీనంగా వేడుకునే పరిస్థితికి వస్తుంది. వస్తూ, పోతూ తాళాలు వేసి బంధిస్తూ ఉంటారు. ఆ ఇల్లొక భూతాల కొంప లాగా, పాడుపడిన కొంపలాగా పరమ మురిగ్గా ఉంటుంది. ఎవరూ ఉండరు. తాగుదామంటే పంప్‌లో నీళ్ళు రావు. ఫ్రిజ్‌ తెరిస్తే తినడానిమీే ఉండవు. అమ్మమ్మను తల్చుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆకలితో అలమటించిపోతూ, ధ్వంసమైపోతున్న తన జీవితాన్ని తలచుకుని భయంకరమైన మానసిక సంఘర్షణకు గురౌతుంది. ఇంట్లో దయ్యం పట్టిన దానిలా తిరుగుతూ, తిండికోసం వెతుక్కుంటూ, అందంగా ఉన్న తన జుట్టును ఒక కత్తిని దొరిక బుచ్చుకుని బర బరా కోసేసుకుంటుంది. బట్టలు ఎక్కడివక్కడ చింపేసుకుంటుంది. అపార్ట్‌ మెంట్‌ కిటికీ తలుపుల్ని తన బలాన్నంతా ఉపయోగించి ఊడదీసి బయటికొచ్చి రక్షించమంటూ వెర్రి కేలు పెడుతుంది. ఎవరికీ వినిపించని ఆమె కేలు అరణ్య రోదనగానే మిగిలిపోతాయి. ఆ రాక్షసులు సుడి గాలిలా వస్తూనే ఉంటారు. భీభత్సం సృష్టిస్తూనే ఉంటారు!

వారిలో మూడోవాడు మాత్రం నేను నిన్నేమీ చేయను, నమ్మమంటాడు. లైంగికంగా ఏ విధంగానూ వేధించడు. ఆమెను చూసి జాలి పడినట్లే, కనికరించినట్లే చేస్తాడు. ఒకరోజు తినడానికి కాస్త తిండీ, తాగడానికి డ్రిూం తెచ్చిస్తాడు. అప్పుడప్పుడూ వచ్చి కాస్త తిండి, అవసరమైన చిన్న చిన్న వస్తువులు తెచ్చి పెడుతూ దయగా ఉంటాడు. నేను చెప్పినట్లు వింటే నీకిక్కడనుంచి విముక్తి కలిగిస్తానని నిరంతరంగా సంప్రదింపులు జరుపుతూ ఉంటాడు. నిస్సహాయస్థితిలో ఉన్న ఆమె వినక చేసేది ూడా ఏమీ లేదు. అతడికి వేరే ప్రణాళికలుంటాయి!

ఆమెను బయటికి తెచ్చి ఒక ¬టెల్‌లో కాల్‌ గర్ల్‌ గా నియమిస్తాడు. ఆ ¬టెల్‌ రూం రష్‌ని కాలింగ్‌ బెల్‌ మోగడం – వాడొక పక్కన నిలబడి డబ్బు వసూలు చేసుకోవడం ద్వారా సూచిస్తాడు డైరెక్ట్రర్‌ ఫ్రాంకో. విటులుగా వచ్చిన ప్రతి ఒక్కరిని నేను మోసపోయాను. నన్ను మా అమ్మమ్మ దగ్గరికి చేర్చి సహాయం చెయ్యమని వేడుకుంటుంది. ప్రతి అడుగులోనూ పదునైన బాకులు పొంచి చూస్తున్నట్లు, పగబట్టినట్లున్న ఆమె జీవితంలో అంతటి అదృష్టమేది?

ఇంతలో ఒకరోజు ఎక్కడినుంచో ప్రియుడి రూపంలో ఉన్న కిరాతకుడు ఆర్ధర్‌ ఊడిపడతాడు. నీకొక చెడు వార్త అంటూ అమ్మమ్మ మరణం గురించి చెప్తాడు. అప్పటివరూ అంతటి దుఃఖంలోనూ ‘అమ్మమ్మా! నీ రాజకుమారి కఠినమైన జైల్లో ఉంది. ఎవరూ చొరబడలేని కోట బురుజులున్న రాజ భవనంలో బంధింపబడి ఉంది. స్వేచ్చగా ఎగిరే పక్షుల్ని చూడాలనుకుంటుంది’ అని అనుకుంటూ అమ్మమ్మని తల్చుకుని ఊహల్లోనైనా సేదదీరే జస్టిన్‌కి ఆ ఆశ ూడా లేకుండా పోతుంది. పట్టరాని కసితో ఆర్ధర్‌ని చంపేస్తుంది! జైలుకి వెళ్తుంది!!

మూడేళ్ళ జైలు శిక్ష ముగిశాక ూడా మన మారియోలా గొప్ప ఆశాజీవిగా కనపడుతుంది. తన జీవితాన్ని మళ్ళీ పునర్నిర్మించు కోవాలనుకుంటుంది. కానీ తన చుట్టూ ఉన్న బయటి ప్రపంచమంతా మారిపోయి ఉంటుంది. తనకి అమ్మమ్మ లేదు! ఊళ్ళో ఎవరూ లేరు! ఉన్న ఇద్దరు దోస్తులు గుర్తొస్తారు గానీ తాను జీవితం నుంచి ఎంత దూరం జరిగిందో తెలుసుకుని నిస్తేజపడుతుంది. అసలు న్యాయం ఎక్కడుంది? ప్రేమకు అర్ధమేమిటి? స్వేచ్ఛ అందని వస్తువేనా? అనడంతో సినిమా ముగుస్తుంది. ప్రేక్షకుల హృదయాలు భారమవుతాయి.

మహిళలు తరతరాలుగా ఆర్జించి పెట్టి ఈ సమాజానికి అందించిన జ్ఞానం, మాతృస్వామ్య వ్యవస్థనుంచి ఇంటి పెద్దగా వారి పాలనానుభవం, శక్తి సామర్ధ్యాలు, అందం, అధికారం, అనేకరకాల స్వభావాలతో ఈ ప్రపంచాన్ని అర్ధవంతం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రపంచంలోని అగ్ర రాజ్యాలతో సహా ఏ దేశంలోనూ మహిళల్ని మానవులుగా సమాజంలో సగ భాగంగా భావించడం లేదు. మనసుని మెలిపెట్టే బాధతో, గుండెలవిసిపోయేలా గింజుకుని, ఊపిరాడక అల్లాడిపోయే ఈ జస్టిన్‌ పాత్రను ప్రపంచీకరణ నేపధ్యంలో దేశ దేశాల్లోని మహిళలు నిస్సహాయమైన పరిస్థితుల్లో లైంగిక దోపిడీకి బలవుతున్న మహిళలకు ప్రతీకగా చూడాలి.

ఈ సినిమా కథలు రెండూ ‘ఒసామా’, ‘నీ పేరు జస్టిన్‌’ మహిళలపై ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థీకృతమైన అసంబద్ధ ూరత్వం గురించి చెప్తాయి. ఒక శతాబ్దం వెనక్కి నెట్టే ఇటువంటి పాత రాతియుగం ఆలోచనలు నమ్మటం కష్టం. మనం నవ నాగరికుల మని మురిసి పోతున్న ఈ కాలంలోనే ప్రపంచంలోని కొన్ని మూలల్లో జరుగుతున్న అమానుష చర్యలివి!

బూర్జువా ప్రపంచంలో బాల్యాన్ని, యవ్వనాన్ని, జీవితాన్ని పోగొట్టుకున్న ఒక బాలిక ద్వారా ఆ యా దేశాల్లో స్త్రీల పట్ల జరుగుతున్న వ్యవస్థీకృత హింసలను ఎంతో ఆర్ధ్రంగా అర్థం చేసుకుని నిజాయితీగా ప్రాణాలకు తెగించి గొప్ప స్కోప్‌ లో బర్మెక్‌ తెరక్కిెస్తే, లైంగిక బానిసత్వాన్ని ఇతివృత్తంగా తీసుకుని దిగ్భ్రాంతి కలిగేలా చిత్రాన్ని మలిచారు డైరెక్టర్‌ ఫ్రాంకో. మన చలం లాగా స్త్రీల స్వేచ్చ కోసం తపించి ఆర్తితో పని చేసిన ఈ ఇద్దరికీ స్త్రీజాతి తరఫున ధన్యవాదాలు చెప్పాలనిపిస్తుంది.

ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా 1913 లో ప్రపంచ సినిమా విశ్వవేదిక మీద కొచ్చింది. సరిగ్గా శతాబ్ద కాలం గడిచాక ూడా అంటే 2013 లో వచ్చిన ఈ రెండు సినిమాలను పరిశీలిస్తే స్త్రీల జీవితాలు ఏమాత్రం మెరుగుపడలేదనీ, వారు ఆత్మ గౌరవంతో జీవించే పరిస్థితులు అగ్రదేశాలతో సహా ప్రపంచంలో ఏ దేశంలోనూ లేవనీ రుజువైంది.

ఆశ్చర్యకరంగా వేరు వేరు ప్రాంతాల్లో తీసిన ఈ రెండు సినిమాల్లోనూ దుర్భర పరిస్థితుల్ని అనుభవిస్తున్న కథానాయికలిద్దరూ ూడా అమ్మమ్మ ప్రేమలో స్వాంతన పొందుతారు!

చీకటి థియేటర్‌ లో సినిమా చూడడం ఒక ధ్యానం లాంటిది. నా దృష్టిలో ఇం కళారూపం ఇలాంటి అనుభూతిని ఇవ్వలేదు. ‘చికాకులు, మానసిక ఒత్తిడితో ఒంటరి దీవులుగా మారిపోయిన నేటి మానవ కుటుంబాన్ని సమైక్య పరచే ఏకైక శక్తి సినిమా’ – అంటారు ఆదూర్‌ గోపాలకృష్ణన్‌. స్త్రీలూ, పిల్లలూ, అట్టడుగు ప్రజలు, బలహీనులు సమానత్వాన్ని కోరుకుంటారు. కాస్త మెరుగైన పరిస్థితుల్లో ఉన్న మనమందరం ప్రపంచ కుగ్రామం లోని వారి పట్ల సహానుభూతితో ఉందాం. ప్రపంచం సినిమా ద్వారా బాధాసర్పదష్టులకు దగ్గరవుదాం!

ఎక్కడో తాలిబన్‌లో కదా ఒసామాకథ, పోలాండ్‌లో కదా నీ పేరు జస్టిన్‌ కథ జరిగింది అని తేలిగ్గా తీసుకోనక్కరలేదు. మన దేశంలో మొన్న మన నిర్భయకీ, నిన్నమన జిషాకీ జరిగిన ఘాెరాల సంగతేమిటి? పసిపాపల పట్ల ప్రతిరోజూ ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు?

(‘సారంగ’ వెబ్‌ మ్యాగజైన్‌ నుంచి)

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో