”రాష్ట్రీయ కొలియారి మజ్‌దూర్‌ సంఘ్‌”పైన వివాదం – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

యాష్‌పాల్‌ కపూర్‌ గారికి రాష్ట్రీయ కొలియారి మజ్‌దూర్‌ సంఘ్‌లో ఉన్న పరస్పరమైన పోట్లాటల రాజకీయ వివాదం విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎమ్‌.పి.ఆర్‌.ఎన్‌.శర్మ కూడా కార్మికుల నేతయే. ఆయనకి బి.సి. సిన్హాకి పడదు. ఇద్దరూ భూమిహార్‌ జాతి వాళ్ళే. సిన్హాకి ఠేకేదార్లతో గుండాలతో స్నేహం

ఉండేది. వాళ్ళలో అందరూ రాజ్‌పూత్‌లే. బిందేశ్వరి దుబె సిన్హా సహాయంతో జనరల్‌ సెక్రటరీ అయ్యారు. శంకర్‌ దయాల్‌ సింహ్‌ పాత గనుల యజమాని, బిహారు మంత్రిగా కూడా పనిచేసారు. ఆయన సోదరుడు శ్రీ సత్‌ దౌల్‌ సింహ్‌ కత్‌రాస్‌లో కార్మికుల మహాసభ ఏర్పాటు చేసారు. బి.పి.సిన్హా దగ్గర సూరజ్‌దేవ్‌ సింహ్‌

ఉండేవారు. సూరజ్‌ దేవ్‌ సింహ్‌ సభకి వెళ్ళారు. నేను దుబె, ఆర్‌.ఎన్‌. శర్మల సహాయంతో సూరజ్‌దేవ్‌ సింహ్‌ని కార్యకారిణిలో మెంబరు కాకుండాచేసాను. ఆయన క్షత్రియుడు, మాఫియాకి నాయకు డయ్యాడు. బి.పి.సిన్హా చెప్పడానికి లేచినప్పుడు ఆయన నిండు సభలో ఈయనని ఒక్క తోపు తోసి మైక్‌ లాక్కున్నాడు. చెప్పకుండా ఆపారు. దుబెగారు చతురుడైన బ్రాహ్మణుడిలా ఇద్దరి మధ్య సయోధ్య అయ్యేలా ప్రయత్నం చేసాడు. ఆరోజు కేడర్‌ మొత్తం పై నుంచి కింద దాకా భూమిహార్‌, రాజ్‌పూత్‌ (క్షత్రియుడు) లుగా చీలిపోయింది. ఆయన వెనకబడ్డవాళ్ళ, దళితుల ప్రభావం ఎక్కడ ఉంటుందో వాళ్ళతో ఉండేవారు. తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పలేకపోయారు. కాని ఈ వివాదం వలన ఒక మంచి జరిగింది. ఆర్‌.ఎన్‌.శర్మ, బి.పి. సిన్హాల మధ్య ఎంతో కాలం నుండి సాగుతున్న వైరం సమాప్తమైపోయింది. వాళ్ళిద్దరు స్నేహితులయ్యారు. కేదార్‌ పాండెని విరోధించడం వలన దుబెతోనాకు కొంత మనస్పర్థలు వచ్చాయి. మేము మా అన్ని శాఖల నుండి దాదాపు పదివేల మంది కార్మికులతో ఆర్‌.సి.ఎమ్‌.ఎస్‌. దక్కన్‌ కార్యాలయంలో బి.పి. సిన్హా పక్షాన ప్రదర్శన జరిపాము. యూనియన్‌లో రాజ్‌పూత్‌ల దాదాగిరిని సమాప్తంచేయడానికి అవకాశం లభించింది. దాస్‌గుప్తా, క్రాంతి మెహతా కూడా బి.పి.సిన్హాతో కలిసారు. వాళ్ళు ఠేకేదార్లతో విరోధించేవాళ్ళు. నేను ఇందిరాగాంధీ గారికి పూర్తి వివరాలతో

ఉత్తరం రాసాను. బిందేశ్వరి దుబె మంత్రి అయ్యారు. కనుక ఆయన యూనియన్‌కి సెక్రెటరీగా ఉండకూడదు. ఆయన బదులు ఆర్‌.ఎన్‌.శర్మని సెక్రెటరీగా ప్రకటించాలని. నిజానికి ఆయనని సెక్రెటరీగా ఎన్నుకున్నారు. కాని లింగేశ్వరి దుబె, కాంతి భాయి కావాలని అనుమతి కోసం రాసిన ఆ లెటర్‌ని పంపించలేదు. ఈ వివాదమే యశపాల్‌కస్టర్‌కి పరిష్కారించాల్సి వచ్చింది. యూనియన్‌ సెక్రెటరిగా ఎవరు ఉండాలి, నిర్ణయించాలి.

మళ్ళీ ఒకసారి రాజకీయాలలో పెనుమార్పులు వచ్చాయి. కేదార్‌ పాండె, జగన్నాథ్‌ మిశ్ర కలిసారు. దుబె వేరయ్యారు. ఆ రోజుల్లో మేం అందరం పాండెగారి ఆ దేశానుసారం జగన్నాధ్‌ మిశ్ర గ్రూపులో పని చేయడం మొదలు పెట్టాం.

కేదార్‌పాండె జగనాధ్‌ మిశ్రకి మధ్య స్నేహం పెరిగాక నన్ను డా. జగనాథ్‌ గారితో పరిచయం చేస్తూ పాండెగారు అన్నారు – ”రమణికను మీరు ప్రత్యేకంగా చూడాలి. ఈమె ఎంతో ధైర్యవంతురాలు. నిజాయితీ పరురాలు. నమ్మకస్తురాలు”.

దీని తరువాత కేదార్‌ పాండె జగన్నాధ్‌ మిశ్ర వేరు పడినప్పుడు పాండెగారు – ”రమణిక! నీవు జగన్నాథ్‌ గ్రూపులోనే ఉండు లేకపోతే బిందేశ్వరి దుబె నిన్ను నాశనం చేస్తాడు. నేను నిన్ను రక్షించలేను.” అని అన్నారు. అప్పటి నుండి నేను జగన్నాథ్‌గారికి సహాయపడ్డాను. దీనివలన బిందేశ్వరి దుబె కోపగించుకున్నారు. యూనియన్‌లో ఆయన రాజీనామా విషయం ఇంకా తేలలేదు. గౌహతి కాంగ్రెస్‌ సభలో నేను జగన్నాధ్‌ ఎదురుకుండా సంజయ్‌కి ఈ సూచన ఇచ్చాను. సంజయ్‌కి చట్ట విరుద్దంగా గనులను నడిపిస్తున్న యజమానుల జాబితాను ఇచ్చాను. అందులో తాపేశ్వర్‌ దేవ్‌ సోదరుడు హైస్సాతాంగ్‌, బెనర్జీలతో పాటు ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి. ఈ జాబితా విధాన పరిషత్‌లో నా ప్రశ్నకి జవాబుగా ప్రభుత్వం ఇచ్చింది. జాబితా తీసుకుని సంజయ్‌ గాంధీ, ఇందిరాగాంధీ గారి దగ్గరకి వెళ్ళాడు. ఆమెస్టేజీ ముందు వరుసలో కూర్చుని ఉన్నారు. ఆయన వెనక్కి వచ్చి జగనాథ్‌గారితో అన్నారు – ”అమ్మతో నేను మాట్లాడాను. చట్టవిరుద్దంగా నడుస్తున్న గనులపై, నడిపిస్తున్న యజమానుల ఇళ్ళపై రైడ్‌ చేయండి. వాళ్ళ బ్యాంక్‌ అకౌంట్లని సీజ్‌ చెయ్యండి. అరెస్ట్‌ చెయ్యండి. దుబెగారిని అడగండి. ఆయన మంత్రిగా ఉండటానికి ఇష్టపడుతున్నారా లేకపోతే రాష్ట్రీయ రాలియారీ మజుదూర్‌ సంఘ్‌కి సెక్రెటరీగానా!”

గౌహతీలో ఇచ్చిన సూచనలన్నీ కార్యరూపం దాల్చాయి. నేను హజారీ బాగ్‌ నుండి వెనక్కివచ్చినప్పుడు చట్టవిరుద్ధంగా తవ్వకాలు జరిపేవారి వ్యాపారం తుడుచుకు పోయిందని, కొందరు జైల్లో ఉన్నారని తెలిసింది. నాకు ఫోన్లలో బెదిరింపులు రాసాగాయి. ప్రభుత్వం తరపున నాకు ఒక బాడీగార్డుని ఇచ్చారు. అప్పుడు నేను ఎమ్‌.ఎల్‌.సి.గా లేను. కేవలం కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలిని మాత్రమే. దుబెగారు జగన్నాథ్‌ గారిని వదిలేసారు. తరువాత దుబెగారు సెక్రెటరీ పదవిని వదిలేసారు. దుబెగారికి నామీద చాలా కోపంగా ఉండేది. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. కాని జగన్నాథ్‌ మిశ్ర నాకు సహాయం చేసారు.

దుబెగారు ఆ రోజుల్లో హెల్త్‌మినిష్టర్‌గా ఉండేవారు. నాతో విభేదించాక ఒకసారి కేదలా కొలియారీలో తన పేరు ప్రతిష్ఠలను పెంచడానికి ఫామిలీ ప్లానింగ్‌ నెపంతో ఆయన మీటింగ్‌ పెడతానని ప్రకటించారు. ఆయన నన్ను పిలవలేదు. ఆయన వేసిన కరపత్రాలు చూసి జుమ్మక్‌ అన్‌సారీ ఇంకా కొందరు కార్మికులు నా దగ్గరికి వచ్చారు. ఏం చేయాలి అన్న ప్రశ్న తలయెత్తింది. కార్మికులు ఆయన సభను వ్యతిరేకించాలని అన్నారు. అప్పటికి ఎమర్జెెన్సీ ఉంది. ఫామిలీ ప్లానింగ్‌ మీటింగును విరోధించడం అంటే సరాసరి జైలుకి వెళ్ళడమే. జ్యోతిగారు ఎస్‌.పి.గా ఉండేవారు. ఆయనకి నేనంటే గౌరవం. ఆయన మీద దుబెగారు మా కేడర్‌ని ఆరెస్ట్‌ చేయాలని ఒత్తిడి చేయసాగారు. నేను ఫోన్‌ ద్వారా ముఖ్యమంత్రి జగన్నాధ్‌ గారికి విషయం అంతా తెలియచేసాను. ఆయన అన్నారు – ”నేను

ఉండగా నిన్ను అరెస్ట్‌ ఎవరు చేయగలుగుతారు? నేను ఎస్‌.పితో మాట్లాడుతాను.” అదే సమయంలో ఎస్‌.పితో మాట్లాడారు. ఎస్‌.పి శ్రీ జ్యోతి మా ఇంటికి వచ్చారు. నేను కేదలా వెళ్ళకూడదని, మా ముఖ్య కేడర్‌ కూడా వెళ్ళకూడదని, వెళ్ళకపోతే అరెస్ట్‌ చెయ్యరు అని నిర్ణయించారు. కార్మికులందరిని కలిపాం. ఏ కార్మికుడు మీటింగుకి వెళ్లకూడదని అందరు తమ-తమ నివాస స్థానాలలో

ఉండాలని బయటికి ఎవరూ రాకూడదని నిర్ణయిచాం. ఆ రోజు సెలవు. అయినా ఎవరూ బజారుకి వెళ్ళకూడదనుకున్నారు. ”రమణిక గారిని సభకు పిలవకపోవడం వలన కార్మికులు మీటింగ్‌ని వ్యతిరేకిస్తున్నారు.” అని సిఐడి రిపోర్టులు వస్తునే ఉన్నాయి. మీటింగ్‌ జరిగింది. పోలీసులు, గనులలో పనిచేసే ఆఫీసర్లు మాత్రమే శ్రోతలయ్యారు. ఒక్క కార్మికుడు కూడా మీటింగుకి వెళ్ళలేదు. జుమ్మక్‌ని పోలీసులు హౌజ్‌ అరెస్ట్‌ చేసారు. నన్ను అరెస్ట్‌ చేయించాలి అన్న దుబె గారి ఉద్దేశ్యం పూర్తికాలేదు. ఫామిలీ ప్లానింగ్‌ పేరున దుబెగారు యూనియన్‌లో రాజకీయం నడపడంకోసం తన మంత్రి పదవిని దురుపయోగం చేస్తున్నారని నా ఆరోపణ. ఆయన నాకు వ్యతిరేకంగా సభలో మాట్లాడ్డం ఏ ఒక్క కార్మికుడికి మంచిగా అనిపించలేదు.

నిజానికి దుబెగారిలో తనను తను గొప్పవాడిగా నిరూపించుకోవాలన్న ఒక హీనగ్రంధి ఉంది. తోటివాళ్ళు ఆయనని ప్రశంసిస్తుంటే తబ్బిబ్బైపోయేవారు. ఆ ప్రశంసలో ఆయన గురించిన నింద అంతర్లీనంగా ఉన్నాసరే. మురారిపాండె (తరువాత ఎమ్‌.పి. అయ్యారు) దుబెగారితో పాటు వస్తూ ఉండేవారు. ఠేకేదార్ల హయాంలో దుబెగారు నన్ను కలవడానికి వచ్చారు. ఆయనకి వెహికిల్‌ కావాల్సి వచ్చింది. నేను ఏర్పాటు చేయలేకపోయాను. నా జీప్‌ పని చేయడం లేదు. టాక్సీ వాళ్ళు నాకు టాక్సీలు ఇవ్వడానికి నిరాకరించారు. ఠెేకేదార్లు నాకు టాక్సీ ఇవ్వకూడదని టాక్సీ వాళ్ళని బెదిరించారు.

మురారిపాండె వ్యంగ్యంగా అన్నారు – ”చూడండి మీరు ఎవరూ టాక్సీ కూడా ఇవ్వరు. దుబెగారు ఒక్క ఫోన్‌ చేసారు. వెహికిల్‌ వచ్చింది.”

నేనన్నాను: ”అసలు వెహికిల్‌ నాకు ఇవ్వకపోవడంలోనే నాకు గౌరవం ఉంది. ఇదేనా పెట్టుబడి, యజమానుల దగ్గరి నుంచి రోజుకో వెహికిల్‌ నాకు లభిస్తుంది. కాని ఇప్పుడున్న ఈ గౌరవం నాకు ఉండదుగా!”

మురారి పాండెకి ఏం జవాబు ఇవ్వాలో తోచలేదు. ఆయన ముఖం వాడిపోయింది.

ఎమర్జెన్సీ

గౌహతీలో కాంగ్రెస్‌ సభ:

అస్సాంలోని గౌహతిలో కాంగ్రెసు వాళ్ళ సభ జరిగింది. నేను మెక్సికో, బర్లిన్‌, యూరోప్‌ టూర్‌ చేసి వచ్చాను. సంజయ్‌ గాంధీని కలిసాను. బిహారులో డా. జగన్నాథ్‌ మిశ్ర ముఖ్యమంత్రిగా ఉండేవారు. డా. జగన్నాథ్‌ మిశ్ర సీతారామ్‌ కేసరి గారు ఎంత ఒద్దన్నా నన్ను ఎమ్‌.ఎల్‌.సి. చేయాలని గట్టిగా అనుకున్నారు. కొంత కాంగ్రెస్‌ అధ్యక్షుడు డి.కె.బారువా కూడా ఇంటరెస్ట్‌ చూపెట్టారు. నేను ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటి (ఎ.ఐ.సి.సి) లో మెంబరుని. నేను గౌహతి వెళ్ళాను. షిమ్‌లా నుండి ఉషా మల్హోత్రా వచ్చింది. పెళ్లికి ముందు ఆమె ఉషాబహత్‌. ఆమె నాతో పాటు లుదియానా గవర్నమెంటు కాలేజ్‌ ఫర్‌ ఉమన్‌లో బి.ఎ. చదివింది. ఆమె ఎ.ఐ.సి.పి లో సభ్యురాలు. తరువాత ఆమె ఎమ్‌.పి. అయింది. నేను బిహారు నుండి వచ్చిన వాళ్ళ వరసలో కూర్చున్నాను. నేను స్పీచ్‌ ఇచ్చేవాళ్ళ జాబితాలో నా పేరు రాయించుకోడానికి స్టేజిమీదికి వెళ్ళాను. అక్కడ డి.కె.బారువా (కాంగ్రెస్‌ అ.భ. అధ్యక్ష) నన్ను స్టేజి మీద కుర్చోమన్నారు. అక్కడ సంజయ్‌, డా. జగన్నాథ్‌ మిశ్ర కూడా కూర్చుని ఉన్నారు. మిశ్రాగారు నా క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. దుబెగారి స్థితి గతులనుకూడా అడిగారు. ఆ రోజుల్లో దుబెగారికి జగన్నాథ్‌ మిశ్రా గారికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనేది. కారణం దుబెగారికి తను ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఉండేది.

ఎమర్జెన్సీ సమయంలో (అప్పుడు నేను ఇంటక్‌లో

ఉన్నాను) యూనియన్‌లో లోలోపల పోట్లాటలు మొదలయ్యాయి. నేను ఇంటక్‌ మహాజనులను, వడ్డీ వ్యాపారస్థులను అరెస్ట్‌ చేయించడం ప్రారంభించాను. 1974-75లో నేను హజారీ బాగ్‌జిల్లా కాంగ్రెస్‌పార్టీకి అధ్యక్షురాలినయ్యాను. ఈ సమయంలో నేను రెండు విలువైన పెద్దపనులు చేసాను. మొదట్లో దళిత – ఆదివాసీ మహిళలను జిల్లా కమిటీ మెంబర్లుగా తీసుకునేవారు కాదు. ఒకవేళ ఎవరైనా కమిటీ మెంబరు అయినా ఏదోగ్రూపువాళ్ళు డబ్బులిచ్చి తీర్పుల సమయంలో తమపక్షాన నిలబడడానికి మాత్రమే

ఉపయోగించుకునేవాళ్ళు. అసలు సమస్యల విషయంలో వాళ్ళ దగ్గర ఎటువంటి సలహాలు తీసుకునేవాళ్ళు కాదు. నేను ఈ గీతను దాటి డబ్బులకు అమ్ముడు పోకుండా, కార్మికులకు కనీసపు కూలి డబ్బులు ఇవ్వాలని వడ్డీ వ్యాపారం బంద్‌చేయిచాలని, సీలింగ్‌ అయ్యాక మిగతా భూములను పంచాలని, భూములను తిరిగి ఇవ్వాలని మొదలైన విషయాలను మీటింగులో పెట్టగలిగిన వాళ్ళని కమిటీ మెంబర్లుగా వేయించేదాన్ని.

నేను కాంగ్రెసు మెంబర్లందరికి తమ – తమ రైతు కూలీలకు కనీసపు కూలీ ఇవ్వాలని నోటీసు పంపించాను. ఒకవేళ ఇట్లా చేయకపోతే పార్టీ నుంచి వాళ్ళను తీసేస్తాం అని నోటీసులో రాసాను. నేను పెద్ద-పెద్ద కాంగ్రెసు నేతలను సర్‌ప్లస్‌ భూములు ఎక్కడున్నా వెదికేదాన్ని. ఈ భూములను దళితులకు పంచాలని

ఉద్యమం నడిపాను. కొందరు దళితులు వాళ్ళ భూముల మీద నివాస స్థానాలు ఏర్పరుచుకోవడం వలన బాస్‌గీత కాగితాలు ఇప్పించాను. అప్పుడు పెద్ద దుమారం రేగింది. పేరున్న కాంగ్రెస్‌ పార్టీ వాళ్ళకి నా మీద కోపం వచ్చింది. తాపేశ్వర్‌ దేవ్‌ భూములు అక్కడే

ఉన్నాయి. ఇంకేముంది భూకంపం వచ్చింది. కామేశ్వర్‌ సింఘ్‌ మర్డరు, రేప్‌ కేసుల కింద అరెస్ట్‌ అయ్యారు. కాని ఇన్‌ఫ్లూయన్స్‌తో బయటపడ్డారు. సీతారామ్‌కేసరి ఆరోజుల్లో బిహారు కాంగ్రెస్‌కి అధ్యక్షులు. ఆయన నన్ను అడిగారు – ‘మీరు ఐ.జి. పోలీసా! కాంగ్రెసు వడ్డీ వ్యాపారస్థులను అరెస్టు చేయిస్తున్నారు. ఈ రైతు – కూలీలకు మీరు పూర్తి కులీ ఇప్పిస్తే ఇక మిమ్మల్ని అడిగే వాడెవడు? అసలు నిజానికి మీరు కమ్యూనిస్టు పార్టీలో ఉండవలసిన వాళ్ళ. రైతు కూలీలకు పూర్తి కూలీ ఇప్పిస్తే మా దగ్గర మాట్లాడటానికి ఏం ఉంటుంది? ఆయన వేసిన ప్రశ్న విని నేను అవాక్కయ్యాను. నేనన్నాను – ”మరి ఇరవై సూత్రాల కార్యక్రమంలో ఈ విషయాలని ఎందుకు పొందుపరిచారు. కాంగ్రెస్‌ వడ్డీ వ్యాపారస్థులు, ఇల్లీగల్‌ పని చేసినా మమ్మల్ని ఏమీ చేయకూడదు అని ఏదైనా పట్టా రాయించారా? ఈ సూత్రాలుకేవలం కేదలా వరకేనా? ఇవన్నీ అమలులో పెట్టడానికి కావా? కేవలం పోచివోలు కబుర్లేవా? స్పీచ్‌లు మాత్రమేనా? ఈ విషయాలన్నీ 20 సూత్రాలలో ఉన్నంత కాలం, అధ్యక్షురాలినైనందుకు అమలు జరిపిస్తాను. లేకపోతే వీటిని అమలు జరప వద్దని రాసి ఇవ్వండి.”

ఆయన మౌనం వహించారు.కానీ ఆయననలో నా పై ద్వేషం నానాటికి పెరగసాగింది. అసలు నిజానికి ఎదుటి వాళ్ళ స్వార్థాన్ని ఎత్తి చూపుతూ ఇట్లా గొడవలు చేయడం వలన నా కెంతో మజా వస్తుంది. చాలా మంది నేను అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటానని కొన్ని విషయాలలో మౌనంగా ఉంటే సరిపోతుందని అనుకునేవాళ్ళు. కాని అసలు ఎక్కడైనా అన్యాయం జరుగుతోందంటే నేను నోరుమూసుకుని ఉండేదాన్ని కాదు. ఈ స్వభావం నన్ను ఎన్నోసార్లు అపాయకరమైన మలుపులలో నిల్చో బెట్టింది. నా ఈ గుణాన్ని చూసి కాంగ్రెస్‌ వాళ్ళు ‘ఈవిడ లోహియా వాది. ఈవిడ ఆ పార్టీలోనే ఉండాలి. ఈవిడ మన పార్టీలో వచ్చి మనల్ని చంపుకు తింటోంది. మూడు చెరువుల నీళ్ళు తాగేలా చెస్తోంది’ అన్నారు.

బడ్‌కానా, పొందు, భురకుండాలో ఎంతో మంది వడ్డీ వ్యాపారం చేస్తున్న ఇంటక్‌ కాంగ్రెస్‌నేతలు నాపై దాడి చేసారు. నేను ఆరోజుల్లో కొలియారీ మజ్‌దూర్‌ సంఘ్‌ (ఆర్‌.సి.ఎమ్‌.ఎస్‌), ఇంటక్‌కి కూడా దీనితో సంబంధం ఉంది, ఉపాధ్యక్షురాలిగా పని చేసేదాన్ని. యూనియన్‌కి సంబంధించిన అనేక శాఖలలో ఎన్నికలు జరిపించాలని కేంద్రీయ కార్యకారిణీలో ప్రస్తావనను ఆమోదింపచేసాను. ఆర్‌.ఎస్‌.శర్మ నా పక్షాన నిలిచారు. గిద్దీ, రైతీగఢా, సొందా, భుర్‌కండా, సెంట్రల్‌ సౌందా శాఖలలో ఎన్నికలు జరుగుతాయని నిర్ణయం అయింది. వడ్డీ వ్యాపారస్థులు, మహాజన్‌ టైప్‌ వారందరు ఒకవైపు అయితే, మేం అంతా ఒకవైపు, జె.పి.సింఘ్‌ (ఇంతకు ముందు ఈ జెపి సింహ్‌ సర్‌కా రెస్ట్‌ హౌజ్‌లో సిపిఐ నేతృత్వంలో నాపైన ప్రాణాంతకమైన దాడి జరిపించారు) సురేంద్ర సింహ్‌ మాతో ఉన్నారు. సౌందాలో నేను యూనియన్‌ సౌందా శాఖ సెక్రెటరీ పదవికోసం సురేంద్ర సింహ్‌ని సమర్థించాను. ఆయన ఎన్నికలలో ఓడిపోయారు. ఆయన ఇంటిని శత్రువులు చుట్టు ముట్టారు. నేను, జె.పి.సింహ్‌ ఎన్నికల తరువాత సౌందా వెళ్ళిపోయాం. కాని భురకుండా చేరాక సురేంద్ర సింహ్‌ ఇంటిని శత్రువులు చుట్టు ముట్టారని తెలిసింది. నేను పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇచ్చి వెంటనే సౌందాకి తిరిగి వచ్చాను. జె.పి.సింహ్‌ ఒద్దన్నారు. కాని నేను వారితో అన్నాను – ”మన తోటి వాళ్ళందరు అపాయంలో ఉంటే వాళ్ళని ఒంటరిగా వదిలి వేసి వెళ్ళిపోవడం సరియైన పద్ధతి కాదు. నేను వెనక్కి వెళ్ళిపోతాను.”

మేము సురేంద్ర సింహ్‌ ఇంటి దగ్గరికి వెళ్ళామో లేదో మా కారుపై రాళ్ళ వర్షం మొదలయింది. మేము సందులు గొందులు తిరిగుతూ వంతెనదాకా వెళ్లాం. ఇంతలో ఒక పెద్ద బండరాయి డ్రైవర్‌పై పడ్డది. అతడు కిందకి వంగాడు. కారు ఫ్రంట్‌ గ్లాసెస్‌ పగిలిపోయాయి. కిటికీ అద్దాలు అంతకు ముందే పగిలిపోయాయి. అద్దాలు లేని ఆకారులో అదే స్థితిలో రాత్రి హజారీబాగ్‌కి వెళ్ళి ఎస్‌.పి.కి వార్త అందించి పాట్నాకి వెళ్ళిపోయాను.

నేను అధ్యక్షురాలైనప్పుడు ఈ నేతలే, వీళ్ళు దామోదర్‌ పాండె పక్షం వాళ్ళు, ఎమర్జెెన్సీ టైమ్‌ అప్పుడు ఒక రోజు మా ఇంటికి వచ్చారు – ”రమణికగారూ! మేము దామోదర్‌ పాండెకి బదులు మీతో ఉండాలనుకుంటున్నాం. మీరు మమ్మల్ని పోలీసుల నుండి రక్షించండి. ఈ ఎమర్జెన్సీలో మా వ్యాపారం మొత్తం చుట్ట చుట్టుకుపోయింది.”

నేనన్నాను – ”మీరు దామోదర్‌ పాండెతోనే ఉండండి. నాకు మీలాంటి వ్యాపారస్థుల సమర్థన అక్కర లేదు. నా పక్షం రావాలంటే మీరు ఈ వడ్డీ వ్యాపారాన్ని మానేయాలి. ఇప్పటి వరకు అయిన వడ్డీలను మాఫ్‌ చెయ్యాలి. అప్పుడే పోలీసులు మిమ్మల్ని వదిలేస్తారు. చెప్పండి మీకు సమ్మతమేనా లేకపోతే జైలుకెళ్ళడానికి సిద్ధం కండి.”

అందరినోళ్ళు మూతబడ్డాయి. తరువాత ఇంటక్‌ నేతలు, వడ్డీ వ్యాపారస్థులు కొందరు అరెస్ట్‌ అయ్యారు. తరువాత చాలా మంది ఈ వ్యాపారం చేయడం మానేసారు.

ట్రేడ్‌ యూనియన్లు

ఒకవేళ సరియైన దృష్టి పెట్టకపోతే పార్టీలో అయినా యూనియన్‌లో అయినా అవకతవకలు వస్తాయి. రొట్టెని పెనంపైన కాల్చాలంటే అటు ఇటు తిప్పాల్సి ఉంటుంది. ఒకవైపు కాలిస్తే మాడిపోతుంది. ఇల్లు శుభ్రం చేయాలంటే ప్రతిరోజు ఊడవాలి. అలకాలి. అప్పుడే చెత్తా-చెదారం లేకుండా శుభ్రం అవుతుంది. చెత్త, మురికి ఇంట్లో పేరుకోవు. యూనియన్‌లో కూడా ఈ విధంగా చేయాలి. లేకపోతే ఒకళ్ళదే నేతృత్వం అవుతుంది. జడంగా మారిపోతుంది. ఒకళ్ళదే రాజ్యం అయిపోతుంది.

అందువలన ఎన్నికలు తప్పకుండా జరగాలి. కాంగ్రెస్‌ పార్టీలో ఇంటక్‌లో ఈ పద్ధతి లేదు. నేను ‘కొరియారీ మజ్‌దూర్‌ సంఘ్‌’లో ఎన్నికలు జరిపించాలని చెప్పినప్పుడు భూకంపం వచ్చింది. కాని నేను ప్రజాస్వామ్యాన్ని మొదలు పెట్టడంలో సఫలీకృతురాలినయ్యాను. దీనిని వ్యతిరేకించడానికి వాళ్ళు లాఠీలు, బల్లాలు, కర్రలు, కఠారులు ఉపయోగించారు. కాంగ్రెస్‌ పార్టీ, ఇంటక్‌ వీటన్నింటిలో ఏకఛత్రాధిపత్యం బాగా ఉండేది. యూనిట్‌ లెవెల్లో నేను ఎలక్షన్లను ఏర్పాటు చేసాను. అసెంబ్లీలో ఎన్నికలు అవుతున్నాయి అని అనిపించింది. ఇదే విధంగా హజారీబాగ్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో అధ్యక్షురాలినైనప్పుడు, బ్రాంచి లెవెల్‌లో ఎన్నికలు జరిపించినప్పుడు గొడవలు అయ్యాయి. పత్‌రాతులో యూనియన్‌లో గుండాగిరీ చేసే దాదాను ఓడించిన ఊరిలోని ఒక యువకుడు గోపాల్‌ మమాతో కాంగ్రెస్‌ పార్టీ పత్‌రాతూ యునిట్‌కి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు.

యూనియన్‌లో కూడా ఈ పదవి ప్రారంభం అయినప్పుడు దామోదర్‌ పాండె పక్షంవైపు వాళ్ళు వ్యతిరేకించడం మొదలెట్టారు. సౌందాలో ఎన్నికల సమయంలో నానా గొడవలు అయ్యాయి. నేను ఆ రోజు ఎట్లా గొట్లా రక్షింపబడ్డాను. ఈ జడశక్తులతో ఏమైనా సరే పోరాడాలని నేను నిర్ణయించుకున్నాను. ఇటువంటి వాళ్ళే కార్మికులను తమ సొత్తు అని అనుకుంటారు. వీళ్ళ శక్తిని వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగిస్తారు. మా యూనియన్‌లో ఇట్లాంటి ఫిర్యాదులు వస్తే కార్మికులను సమావేశ పరిచి వివాదాలని పరిష్కరించే వాళ్ళం. వెంటనే నిర్ణయాన్ని తీసుకునేవాళ్ళం. ఠేకేదార్ల విషయంలో ఎవరైనా నేత నమ్మకద్రోహం చేస్తున్నాడు అన్న వార్త తెలియగానే మేం అందరం వెంటనే కార్మికులను, నేతలను సమావేశ పరిచేవాళ్ళం. ఎదురెదురుగా సాక్ష్యాలు తీసుకుని శిక్ష ఇచ్చేవాళ్ళం. ఇట్లా చేయడం వలన యూనియన్‌ నేతృత్వం పట్ల కార్మికులకు నమ్మకం కలుగుతుంది. ఒకవేళ శిక్షపడ్డ నేతని కార్మికులు మళ్ళీ కావాలనుకుంటే, కార్మికులతో ప్రార్థనా పత్రాన్ని రాయించుకుని అతడికి ఆహ్వానం పలికే వాళ్ళం. అవినీతి – అవకతవకల విషయంలో ఏ నిర్ణయం తీసుకోకపోతే కార్మికులు ”ఇంతే ఈ నేత విషయంలో పైదాకా అందరు చేతులు కలిపే ఉన్నారు. మమ్మల్నిమోసం చేస్తున్నారు. మనకు న్యాయం జరగదు.” అని అనుకుంటారు.

ఎన్‌క్వైరీ కాగానే కార్మికుల ప్రతిక్రియ ఇట్లా ఉంటుంది – ”చూసారా ఎంత బాగా ఎన్‌క్వైరీ చేసారో. ఇక ఎవడైనా నమ్మకద్రోహం చేస్తాడా! ఎవరైనా సరే పై వాళ్ళతో చేతులు కలిపితే వెంటనే తొలగించేస్తారు.”

యూనియన్ల నేతలు ఇటువంటి సమయంలోనే తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళు కార్మికుల మనస్సును తెలుసుకోలేరు. నిజానికి యూనియన్‌ కాడర్‌ని ఏర్పాటు చేయడం చాలా కష్టం. ఎవరిపైననైనా ఎన్‌క్వైరీ జరిగితే వాళ్ళని తొలగిస్తే పైస్థాయిలో నేతలు ఈ పనులన్నింటిని ఎట్లా చూసుకోగలుగుతాం అని భయపడతారు. కాని ఇట్లా ఆలోచించడం తప్పు. ఈ భయం వలన సరియైనవాడు నేతృత్వం వహించడు. కార్మికులకు యూనియన్ల పట్ల నమ్మకం తక్కువ అవుతుంది. రెండో కాడర్‌కి శిక్షణ ఇవ్వవచ్చును. నమ్మకంపోతే కార్మికుడు మరో యూనియన్‌కి వెళ్ళిపోతాడు. కాని తను కూడా ఆ మోసగాళ్ళకు సహాయపడుతున్నా ఇది తప్పు అని అనుకోడు.

ట్రేడ్‌ యూనియన్లు చేసే ఉద్యమాల వలన చాలా సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. కాని మేనేజ్‌మెంటు, గవర్నమెంటు ఒకరితో ఒకరు చేతులు కలపడం వలన కేసులు, వాయిదాలు వర్కర్ల వెన్నెముకలను విరగగొడ్తాయి. ప్రబంధక్‌ కోర్టులో గెలిచినా ఉద్యోగం ఇవ్వరు. వాళ్ళ ఎన్‌క్వైరీ ప్రకారం కార్మికులను తొలగించేస్తారు. యూనియన్లకి, కార్మికులకి లేబర్‌ ట్రిబ్యూనల్‌లో మళ్ళీ కేసు నడిపించాల్సి వస్తుంది. లేకపోతే పారిపోయారు అని ప్రకటన చేస్తారు. మేము ఈ దుర్ఘటనలన్నింటినీ ఎదుర్కొంటూ పోరాటాన్ని చేస్తునే ఉన్నాము. మాతోపాటు ఎక్కువగా కింది గ్రూపు కాటగరీలో పనిచేసే కార్మికులు పీస్‌-రేటెడ్‌ కార్మికులే ఉన్నారు. అందువలన మేము ఎప్పుడూ అవకాశవాదుల ఒప్పందం చేసుకోలేదు. మధ్యమి వర్గ కార్మికులు తమ స్వార్థం కోసం ఇట్లాంటి ఒప్పందం చేసుకోమని నేతలను బలవంతం చేసేవారు. వీళ్ళు కింది వర్గంలో ఉన్న సర్వహారా కార్మికులకు నష్టం కూడా కలిగిస్తారు. మేము ఎప్పుడూ దీనిని ఒప్పుకునే వాళ్ళంకాదు. మధ్య వర్గ కార్మికులు పీస్‌-రేటెడ్‌ కార్మికుల నేతృత్వంపై పెత్తనం చేయకుండా మేము చూసుకునే వాళ్ళం. వాళ్ళకు చదువురాదు. కాని అవగాహన కల వాళ్ళు. సామూహిక హితాన్నే వాళ్ళు కోరుకునే వాళ్ళు. ముంషీ, హజూరీ, బాబూ, మైనింగ్‌ స్టాఫ్‌ మొదలైనవాళ్ళు, కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వడానికి లంచాలు తీసుకునే వాళ్ళు. అందువలన వీళ్ళంటే కార్మికులకు విపరీతమైన కోపం ఉండేది. ఈ బాబూటైప్‌ కాటగిరీ వాళ్ళు యూనియన్ల నేతృత్వంలోనే ఉంటారు. అందువలన కార్మికులు తమ పనులను నెరవేర్చుకోడానికి వాళ్ళు చెప్పినట్లు వింటారు. కాని మనఃస్ఫూర్తిగా వాళ్ళంటే ఇష్టపడరు. ఈ బాబూ తను స్వయంగా దళారీగా పని చేసినప్పుడు తన తోటివారిని కూడా దోపిడీ చేస్తాడు. వాళ్ళచేత చేయిస్తాడు. వాళ్ళకు చెడు చేయడానికి వాళ్ళతో చేతులు కలపడానికి సైతం వెనుకాడడు.

ఇదంతా చూసి మేము యూనియన్‌ వాళ్ళ నేతృత్వాన్ని పీస్‌-రేటెడ్‌ మజ్‌దూర్‌, హోల్‌ టైమర్లకి ఎక్కువగా అందించడమే శ్రేయస్కరం అని అనుకున్నాం, వీళ్ళు మధ్య వర్గ మానసికత ఒత్తిడిలో ఉండరు. అప్పుడప్పుడు ఒత్తిడికి గురియైనా కాస్తపై స్థాయి చేరాక వీళ్ళ ఆలోచనలలో కొంత తేడా వస్తుంది. అయినా తమతోటి వాళ్ళ మంచితనం, వాళ్ళ ఒత్తిడి వలన అంతగా వేరుపడరు. హోల్‌ టైమర్లతో పాటు ఉంటే ముఖ్యమైన లాభం ఒకటుంటుంది. మేనేజ్‌మెంటుతో గొడవ జరిగినా, ఒకళ్ళను ఒకళ్ళు తిట్టుకునేంత పర్యంతం అయినా (ఒక్కొక్కసారి తప్పని పరిస్థితులలో) కార్మికులను డిస్‌మిస్‌, టర్మినేట్‌ చేసే పరిస్థితి ఏర్పడదు. కార్మికుల మనోబలం దెబ్బ తినదు. ఆఫీసర్లలో కూడా భయం ఉంటుంది. ఈ విధంగా కార్మికులకు శిక్ష పడదు. హోల్‌ టైమర్‌ని మేనేజ్‌మెంటు బాయ్‌కాట్‌ చేసినా అతడికి ఏ హాని కలుగదు. అతడితో మాట్లాడటం మానేస్తారు అంతే, మేనేజ్‌మెంటుకు రోజు ఎవరిదో ఏదో ఒక గొడవను చూడాల్సి వస్తుంది. మేనేజ్‌మెంటుకి యూనియన్‌ సహాయం కూడా కావాలి. మేనేజ్‌మెంటు ద్వారా బాయ్‌కాట్‌చేయబడే హోల్‌ టైమర్‌ ప్రభావం కార్మికుల మీద చాలా ఉంటుంది. వాళ్ళకు పడేశిక్ష అతడు అనుభవిస్తున్నాడు అన్న ఆలోచనతో కార్మికులు అతడి మాటకి ఎక్కువ విలువ ఇస్తారు. అఫీషియల్‌గానే కాదు మామూలుగా కూడా మేనేజ్‌మెంట్‌ హోల్‌ టైమర్‌తో మాట్లాడి కార్మికుల సమస్యలను

పరిష్కరిస్తుంది. పని ఆగదు. మేనేజ్‌మెంట్‌ను ఆశ్చర్యపరిచేలా హోల్‌టైమ్‌ పని ఆపే ప్రయత్నం కూడా చేస్తాడు. కింద మేనేజ్‌మెంట్‌కు హోల్‌టైమర్‌తో మళ్ళీ మాట్లాడటానికి పై మేనేజ్‌మెంటుకి సిఫార్సు చేయవలసి వస్తుంది. డిక్టేటర్‌షిప్‌ని కంట్రోల్‌ చేయాలంటే వీళ్ళ అవసరం ఎంతో ఉంటుంది. ప్రభుత్వం విషయంలో ఫరవాలేదు కాని ప్రైవేట్‌ వాటిల్లో హింసాయుతమైన దాడులను యూనియన్‌ ఎదుర్కోవలసి ఉంటుంది.

చతరాలో అలర్లు:

ఎమర్జెన్సీ టైమ్‌లో చతరాలో రైట్స్‌ గొడవలు జరిగాయి. ఎంతోమంది నిర్దోషులైన ముస్లిం యువకులను, నేతలను పోలీసులు అరెస్ట్‌చేసారు. దీనిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి నేను ఒక లేఖ రాసాను. విధానసభ అధ్యక్షుడు షకూర్‌ సాహెబ్‌ పరిశీలించడానికి వచ్చారు. నేను అధ్యక్షురాలిని కాబట్టి నేను ఆయనతో వెళ్ళాను. అప్పుడు పోలీసులు వాళ్ళని వదిలిపెట్టారు. హజారీబాగ్‌లో ఒక పేరున్న ముస్లిం వకీలుని ఎమర్జెన్సీ సమయంలో మీసాచట్టాన్ని

ఉపయోగించి జైలుకి పంపించారు. నేను ఆయనపై నుండి ఈ కేసును తీసేయించాను. నిజానికి ఎంతో మంది కాంగ్రెస్‌ నేతలు కూడా లోపల సంప్రదాయ వాదులే వాళ్ళు అల్లర్లు కూడా జరిపిస్తారు. ఎమర్జెన్సీని అడ్డుగా పెట్టుకుని నిర్ధోషులైన ముస్లింలను కేసులలో ఇరికించేవారు. కాంగ్రెస్‌ ఓడిపోయాక వాళ్ళలో చాలా మంది సాంప్రదాయకమైన పార్టీలలోకి వెళ్ళిఫోయారు.

ఒకసారి ఎమర్జెన్సీ టైమ్‌లో సంయుక్త సోషలిస్ట్‌ పార్టీకి చెందిన కపిల్‌దేవ్‌బాబు జె.పి. ఉద్యమంలో హజారీబాగ్‌ జైల్లో బందీ అయి ఉన్నారు. కుమారుడు అర్జున్‌ ఆయనని కలవాలని వచ్చారు. ఆయన మా పాత సంబంధాలను గుర్తు చేసుకుని సహాయం కోసం నా దగ్గరికి వచ్చారు. నేను ఆయనకి సహాయం చేస్తే కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకులైన వారికి సపోర్టు ఇస్తున్నానని మా పార్టీ వాళ్ళు నా మీద నిందమోపుతారని నాకు తెలుసు. నా మనస్సులో అలజడి మొదలయింది. ఏం చేయాలి? కాని చివరికి వివేకమే గెలిచింది. నేను కల్పించుకుని ఆయన తన తండ్రిని కలవడానికి అనుమతి తీసుకున్నాను. హజారీబాగ్‌కి చెందిన రాణీదే సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు వైకుంటనాధ్‌గారి భార్య. ఆమె జైల్లో ఉన్న తన భర్తని కలవాలనుకుంది. కాని ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఆ సమయంలో సంయుక్త సోషలిస్ట్‌ పార్టీకి చెందిన చాలా మంది నా దగ్గరికి వచ్చి రాణీదేకి సహాయం చేయమని అడిగారు. నేను రాణీదే పక్షాన పోరాడాను. ఆవిడకి అనుమతి దొరికింది. తరువాత ఈవిడే హజూరీబాగ్‌ నుండి ఎమ్‌.పి. అయింది. ఎంతోమంది కాంగ్రెస్‌ నేతలు నన్ను ఆక్షేపించారు. అయినా నేను ఈ నా అడుగు మానవత్వం వైపు అని నమ్మాను. ఎన్నోసార్లు నాకు పార్టీయా! మానవత్మామా! అన్న ప్రశ్నలపై ఎంతో ఆలోచించాల్సి వచ్చింది. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకో నాకు మొదటి నుండి పార్టీకి ప్రతిబద్ధులై ఉండటం కన్నా మానవత్వమే గొప్పది అని అనిపించేది. మానవీయ సంవేదనకే నేను ప్రాధాన్యత ఇచ్చేదాన్ని. కార్మికుల వైపా, పార్టీవైపా అన్న ప్రశ్న తల ఎత్తినప్పుడు కార్మికుల పక్షమే నేను వహించేదాన్ని. పార్టీలోని పదవి వదులుకున్నానే కాని కార్మికులను ఏనాడు వదులుకోలేదు.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో