విప్లవాల వీరాంగన సావిత్రీబాయి ఫూలే – అనిశెట్టి రజిత

సావిత్రి అంటే మన పౌరాణిక కాల్పనిక గాథలలోని ఒక స్త్రీ పాత్ర కాదు. మనకు తెలిసిన పతివ్రతా రాచస్త్రీ అయిన సావిత్రి కాదు. ఆధునిక భారతదేశంలో సామాన్య స్త్రీగా ఉండి చరిత్ర సృష్టించిన అసమాన్య స్త్రీ. ఆమే సావిత్రీబాయి. 3 జనవరి 1831న మహారాష్ట్రలోని సతారా జిల్లా నాయ్‌గావ్‌ అనే చిన్న పల్లెటూరిలో లక్ష్మీబాయి, ఖండోజీ నేవసే పాటిల్‌ల ఇంట జన్మించింది సావిత్రీబాయి. వీరిది మాలి సమాజంలోని శూద్రకులాల్లో అగ్ర కులంగా భావింపబడే కులం. కరుడుగట్టిన కుల వ్యవస్థ మీద సాహసోపేత పోరాటానికి దిగిన సామాన్యుల తెగువకు నిదర్శనంగా 180 సం||ల క్రితం నాటి బ్రాహ్మణాధిపత్య సమాజం మీద యుద్ధం అంటే మాటలు కాదు. అది భావజాల యుద్ధం. ఆయుధం లేకుండా బలవంతులతో చేనే యుద్ధం.

1 జనవరి 1818 సం|| బ్రాహ్మణ మనువాద రాజ్యాన్ని పాలించిన చిట్టచివరి పీష్వా మరణించాడు. దేశవ్యాప్తంగా ఆంగ్లేయుల ఆధిపత్యం విస్తరిస్తూ వారి బానిసత్వంలోకి మరాఠా సమాజం చేరిపోతున్న కాలం అది. బ్రిటిష్‌ వారి విద్యాబోధనకు ప్రాధాన్యత పెరగడం మొదలయ్యింది..

”మన చరిత్ర పర్యంతం ఈనాటి వరకు ూడా ఎంతటి అభ్యుదయవాదులైనా బ్రాహ్మణీయ భావజాలంతో రాజీపడినంతవరకు వారు సమాజానికి ఏమీ ఇవ్వలేరనేది స్పష్టం అయిపోయింది. వారు ఇచ్చేది ఏదైనా ూడా తాత్కాలిక ఉపశమనమే”. దీనికి భిన్నంగా ప్రధాన స్రవంతి మేథో ప్రపంచం ఈనాటికి ూడా బ్రాహ్మణీయ ఆధిపత్యంలోనే ఉండటం గమనించవచ్చు. దీనికి కారణం భారతీయ శిష్ట వర్గాలు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలు ఇంకా కొనసాగుతుండటమే. ప్రజల మీద ఆధిపత్యం చేసే వర్గాల లక్ష ్యం ప్రజలను బహిష్క ృతులుగా మారుస్తూ దోపిడీ చేస్తుండటమే. అందు భారతదేశంలో తీవ్ర అంతరాలు యధాతథంగా ఉంటూ వస్తున్నాయి. పుట్టుకతోనే వస్తున్న కులం, కులం వల్ల ఏర్పడే వర్గం, వీటిని చుట్టుకొని బలోపేతం చేనే వర్ణ వ్యవస్థ దేశ సమాజిక వ్యవస్థను వైకల్యాల పుట్టగా మార్చేసింది.

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విప్లవకర మార్పుల ఫలితంగా భారతదేశంలో ూడా ఆలోచనలకు, తిరుగుబాట్లకు కాలం పరిణామం చెందడానికి సిద్ధమవుతున్న సమయంలో 1827లో పూణేలో గోవిందరావు ఫూలే-చిమ్మాబాయిలకు జ్యోతీరావ్‌ జన్మించాడు. 13 ఏళ్ల జ్యోతీరావ్‌ూ సావిత్రికీ 1840లో వివాహం జరిగింది. ఆ రోజుల్లో సంఘ నియమాల ప్రకారం బాలికలకు

ఆరేళ్ళు, బాలురకు పదేళ్ళు వచ్చేసరికి వివాహం జరగాలి.

శూద్ర కులాల మగవాళ్ళూ, నిమ్నకులస్తులూ న్వేచ్ఛగా బయిటి ప్రపంచంలో తిరిగే హక్కు గానీ, చదువు జ్ఞానార్జనల అవకాశం గానీ లేకపోగా అది సామాజిక నియమాల ధిక్కారంగా, నేరంగా శిక్షలపాలు చేనే సమాజంలో స్త్రీ అస్తిత్వం గురించిన ఆలోచనే

ఉండేదికాదు. స్త్రీలు గడపదాటడం ఒక వింత కాదు విపరీతం. సమాజాన్ని భ్రష్టపర్చడం. కుల పితృస్వామ్యం గుప్పిట్లో పీడిత జనం జంతువులకన్నా హీనంగా అణిచివేయబడే సమాజంలో ఒక శూద్ర స్త్రీ చదువుకోవటం, జ్ఞానసముపార్జన చేయడం, కులంపైనా, అసమానతలపైనా పోరాటానికి పూనుకోవడం అనేది దుస్సాహసం. మానవ హక్కులూ, బాధితులకు ఆధారం, ఆశ్రయం, నేవలూ, విద్యాబుద్ధులు అందించే నాయకురాలిగా, మత వ్యవస్థ మార్మికతను దనుమాడిన మహిళాశక్తిగా, సాహిత్య శిరోమణిగా సావిత్రీబాయి ప్రకటితం కావడం.

మతం అనేది కులవ్యవస్థతో జతకట్టి ఆధిపత్య శక్తులతో చేతులు కలిపి సామాజిక పీడనను సుస్థిరం చేస్తుంటుంది. జ్యోతీరావ్‌ సావిత్రీబాయి ఫూలేలు ఆధిపత్య వ్యవస్థపట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మత విశ్వాసాలపై ఉన్న పట్టును అర్థం చేసుకుని పనిచేసారు. అందు వారు ‘సార్వజనిక్‌ సత్యధర్మ’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

సావిత్రీబాయి పోరాటాల లక్ష్యం భౌతికంగా, ఆత్మికంగా పీడిత ప్రజలను కులమత దోపిడీ స్వామ్యాల నుండి విముక్తి చేయడం. ఇదంతా ఆమె మాటల్లో కాకుండా ఆచరణలో చూపింది. బాధిత ప్రజల్లో ఒక భాగంగా మారింది. సావిత్రీబాయి తపించిన విప్లవాత్మక లక్ష్యం ఈనాటికీ మన ముందు సవాలుగా నిలిచి ఉంది.

జ్యోతిబా చేపట్టిన అన్ని సంస్కరణ ఉద్యమాల్లోనూ సావిత్రీబాయి సమమైన భాగస్వామ్యం కలిగి ఉన్నది. చదువు నేర్పిస్తే నేర్చుకున్నది. ఇంటిపని, వంటపని చేస్తూ ఇంటిలోపల నీడలా తిరుగాడాల్సిన గృహిణిగా ఉండిపోతానని అనకుండా ఎంతో ఆరాటంతో చదువు నేర్చుకున్నది. 1848లో జ్యోతిబా పూనేలోని బుధవార్‌పేటలో తాత్యాసాహెబ్‌ భిడే ఇంట్లో దళిత బాలికల కోసం ప్రారంభించిన పాఠశాలలో టీచర్‌గా ఫాతిమాషేక్‌తో కలిసి పనిచేసింది. దారిలో బ్రాహ్మణ దౌర్జన్యకారులు తిట్లతో అవమానిస్తూ బురద విసిరేసి, రాళ్లతో కొడుతున్నా తట్టుకొని బడికి వెళ్లి సంచీలో తెచ్చుకున్న మరొక జత బట్టలను మార్చుకొని చదువు చెప్పడం కొనసాగించింది. ఒక విధంగా ప్రాణాలకు తెగించింది. ఆ సాహసమే నేడు భారతదేశంలోని మహిళలందరికీ చదువును హక్కుగా ఇచ్చింది. ఛాందసవాదాన్ని చావుదెబ్బతీసిన సావిత్రీబాయి ఆధునిక భారతదేశపు మొదటి ఉపాధ్యాయినిగా చరిత్ర రచనలో క్రొత్త అధ్యాయంగా నిలిచిపోయింది.

1868లో ఆమె అస్పృశ్యతకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపింది. అనాథ స్త్రీలూ, శిశువులూ, బ్రాహ్మణ వితంతువులు కనిపోవడానికి, శిశువుల సంరక్షణ కోసం ”బాలహత్యానిరోధక శరణాలయాన్ని” నడిపింది. 1890, 1897ల్లో ప్లేగు వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు శిబిరాలు నిర్వహించింది.

పసితనంలోనే తల్లిని కోల్పోయిన జ్యోతిబాను సోదరి వరసైన సుగుణాబాయి క్షీరసాగర్‌ తల్లిలా పెంచింది. ఆమె ప్రభావం, ప్రోత్సాహం వల్లనే జ్యోతిబా సావిత్రీబాయిలు ఉద్యమాచరణలోకి ప్రవేశించారు.

అస్పృశ్యులుగా సామాజిక వెలికి గురికాబడ్డ నిమ్నజాతి ప్రజల కోసం తమ ఇంటి బావి నుండి నీళ్లు తోడుకునే అవకాశం కల్పించారు. కరువు కాలంలో పిల్లల కోసం భోజన ంద్రాలు నడిపారు. తామే స్వయంగా నేసి కట్టుకున్న ఖాదీ వస్త్రాలను ధరించారు. 1849-1850 మధ్యకాలంలో 70 బాలికల పాఠశాలలు ఏర్పాటు చేసారు.

1852లో ”మహిళా నేవా మండలి”ని సావిత్రీబాయి ప్రారంభించింది. 1873లో ”సత్యశోధక సమాజ” స్థాపన చేసారు. ఆ సంస్థ ద్వారా హేతుబద్ధమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యామ్నాయ ప్రజా సమాజ సంస్క ృతికి ప్రాణం పోసారు. కులాంతర వివాహాలు, వితంతు వివాహాలు ప్రోత్సహిస్తూ వాటిని నిర్వహించారు. జ్యోతిబా సావిత్రీబాయిలు నిజమైన చదువులు చదివిన వ్యక్తులు. సామాజిక ఉద్ధరణ, సమతా పౌర సమాజ స్థాపన వారి ధ్యేయం. మ¬న్నతమైన మానవీయ హృదయం వారిది.

నల్ల జాతీయుల స్వాతంత్య్రం కోసం పోరాడి బానిసత్వ నిర్మూలన చట్టం తెచ్చిన థామన్‌ క్లార్క్‌సన్‌ జీవిత చరిత్ర చదివిన సావిత్రీబాయి థామన్‌ పెయిన్‌ రాసిన ‘మానవుని హక్కులు’ చదివిన జ్యోతిబా ఎంతో ప్రభావితమై ూరమైన కులవ్యవస్థ ఊబిలో దిగబడిన భారతీయ సమాజ విముక్తికి సంస్కరణ ఉద్యమాలు నిర్మించారు. విద్యతోనే విప్లవం వస్తుందని అజ్ఞాన లోకానికి దారిదీపాలుగా నిలిచి నడిపించారు.

సావిత్రీబాయి 1854లో ‘కావ్యఫూలే’ అనే కవితా సంపుటిని ప్రచురించింది. అది బహుశా వలస పాలనలోని దేశంలో భారతీయ రచయితలు ప్రచురించిన మొదటి కవితా సంపుటి అయి ఉంటుంది. ఆమె పీడిత ప్రజల ఆత్మగౌరవం, న్వేచ్ఛా సమానత్వాల ఆకాంక్షతో మేల్కొల్పు పాటలా కవిత్వం రాసింది. ఇంగ్లీష్‌ భాషను విముక్తి భాషగా గుర్తించి అభిమానించింది.

‘అధ్యయనంతో ఆచరణతో’ అన్న కవితలో ”బలహీను లారా! బాధితులారా! సోదరులారా లేవండి / బానిసత్వ బంధనాలు తెంచుకుని కదలండి / మనువాదులూ, పీష్వాలు కాలగర్భంలో కలిసారు / ఆ మనువే మనలను విద్యకు దూరం చేసాడు…” అని మొదలవుతుంది. ‘అజ్ఞానం’ అనే శీర్షికతో రాసిన మరో కవిత; ”శత్రువొక్కటే మనందరికి / దానిని తన్ని తరిమికొడ్దాం / దానిని మించిన మరో / శత్రువు లేదు మనకు / వెతికి తీయండి / మనస్సు లోపల చూసి పట్టుకోండి…” అంటూ అజ్ఞానమే మన శత్రువనీ, దాని గొంతు నులిమేయమనీ పిలుపునిస్తుంది.

విద్యలేనివారిని వింత జంతువులనే కదా ఈనాటికీ మనం అనేది. ఆనాడు ూడా విద్యలేని వారిని మనుషలని ఎలా అనను? అంటూ ”విద్య లేదు జ్ఞానం లేదు / చదువుకుని విద్యావంతులు కావాలనే ఆలోచన లేదు / తెలివి ఉన్నా వ్యర్థంగా కోల్పోతారు / వారిని మనుషలని ఎలా అనను?” అనే కవిత ఆలోచన, ఆచరణ ఉండాలని బలంగా చెప్పింది. ఆమె ఇతర కవితలు : మాతృభూమి, అమ్మ, సీతాకోక చిలుకలు, గొప్ప ఆస్తిపాస్తులు, ఆంగ్లం చదువు, సంత్‌, విద్యార్థివై కదలిరా వంటివి ఎన్నో ఉన్నాయి.

ఆమె రెండవ పుస్తకం ‘భావన్‌ కషి సుబోధ రత్నాకర్‌’ (రత్నసాగరం). ఇది జ్యోతిబా జీవిత కథ. భారతదేశ చరిత్రపై ఫూలే ప్రసంగాలను పుస్తకంగా ఆమె సంపాదకత్వంలో ప్రచురించింది. 1877లో కృష్ణారావ్‌ భాలేకర్‌ స్థాపించిన ”దీనబంధు” పత్రికతో ఆమెకు అనుబంధం ఏర్పడింది. అదే సమయంలో వాల్వేకర్‌ ప్రారంభించిన ”గృహిణి” అనే పత్రికను ూడా ఆమె చదివేది. ఆ పత్రికలో కొన్ని మార్పులు సూచిస్తూ ”మీరు నగరాల్లోని స్త్రీల కోసమే ఎక్కువ విషయాలు రాస్తున్నారు కానీ అన్నిచోట్ల ఉండే స్త్రీల గురించి రాయాలి” అని చెప్పింది.

1890లో ఫూలే నిర్యాణానంతరం 60 ఏళ్ల వయసులో ‘సత్యశోధక సమాజ్‌’ బాధ్యతలను చేపట్టింది. 1897లో ప్లేగ్‌ వ్యాధిగ్రస్తులకు వైద్యుడైన కొడుకు యశ్వంతరావ్‌ ఫూలేతో పాటుగా నిర్విరామంగా నేవలు చేస్తూ ఆ వ్యాధి సోకి 10 మార్చి రోజున నిర్యాణం చెందింది సావిత్రీబాయి. 10 మార్చి 1998న ంద్ర ప్రభుత్వం ఆమె స్మృతిలో పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేసింది.

స్త్రీలూ దళితులూ స్వాతంత్య్రార్హత, మానవ ¬దా నిరాకరింపబడి, తిరస్క ృతులగా బానిసత్వంలో, అంటరానితనంలో, అవిద్య, అజ్ఞానపు కటిక చీకటిలో హీనంగా నీచంగా పశుప్రాయపు బ్రతుకులు వెళ్లదీస్తూ దోపిడీ పీడనలతో నశిస్తున్న సాటి మనుషలకు మానవహక్కులూ, పౌరహక్కులూ సాధించి వారి మానవ గౌరవాన్ని నిలబెట్టేందుకు సంస్కరణ విప్లవోద్యమాలతో క్రాంతి దార్శనికులుగా ఆవిష్క ృతమయిన సావిత్రీబాయి జ్యోతిబా ఫూలేలు భారతదేశ పీడిత జన సమూహాలకు సర్వదా మార్గదర్శకులు, మ¬న్నత సామాజిక ఉపాధ్యాయులు. వారికి మన నీరాజనాలు !

(3 జనవరి 2017 సావిత్రీబాయి జయంతి)

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.