కృతజ్ఞత డి.వైష్ణవి, వాసవీ పబ్లిక్‌ స్కూల్‌, హైదరాబాద

మహాలక్ష్మికి ఎవ్వరూ లేరు. అయితే ఈ నెహ్రూనే (చెట్టే) అంతా చూసుకుంటాడు. కానీ నెహ్రూ కూడా ప్రాణే అయినప్పటికీ పనిచేసి డబ్బు సంపాదించలేడు. మరి లక్ష్మికి ఫీజు కట్టాల్సి వచ్చింది. నెహ్రూకి డబ్బు ఎలా తెచ్చి, కట్టి పాపని చదివించాలో తెలియలేదు.

లక్ష్మి రోజూలాగే ఈ రోజు కూడా బడికి వెళ్ళింది. అప్పుడు దారినపోయే బాటసారి నడచి, నడచి అలసిపోయి నెహ్రూ కింద ఉన్న అరుగుమీదకు వచ్చి కూర్చునేలోగా పాప బడినుంచి వచ్చేసింది. పాప చేతిలో చిన్న కాగితం ఉంది. లక్ష్మి నెహ్రూతో ‘ఈ కాగితాన్ని మీ ఇంట్లో పెద్దవాళ్ళకు చూపించు అన్నారు. నాకు పెద్దంటే నువ్వే కదా, మరి చూడు’ అంది. ఇదంతా గమనిస్తున్న ఆ బాటసారి పాపతో ‘ఆ కాగితాన్ని ఇలా ఇవ్వు. నేను చదివి వినిపిస్తాను’ అన్నాడు. అందులో పాప ఫీజు కట్టమని ఉందని చెప్పాడు. అదేం పట్టించుకోకుండా పాప ఆడుకోవడానికి వెళ్ళింది. అప్పుడు బాటసారి నెహ్రూను లక్ష్మి తల్లిదండ్రుల గురించి అడిగాడు. నెహ్రూ బాటసారితో ”ఒక చీకటి రాత్రిలో, చల్లగాలి వీస్తుండగా వాళ్ళ తల్లిదండ్రులు పాపని నా అరుగుమీద పెట్టి తమకు ఆడపిల్ల పుట్టడంవల్ల దురదృష్టాలు ఎదుర్కోవలసి వస్తుందనీ, అందువల్ల ఈ పాపను ఇక్కడ వదిలేద్దామని నిర్ణయించుకున్నామని చెప్పి, అన్నంతపనీ చేశారు. వాళ్ళమ్మ కూడా తనూ ఒక స్త్రీననే విషయం మరచిపోయి ఈ నిర్ణయానికి రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ పాపకు నేనే పేరుపెట్టి ఇప్పటివరకూ చూసుకుంటున్నాను. పాప తిండి, బట్టలు, పడుకునే చోటు, బడిలో చేర్చడం వరకూ అన్నీ చేయగలిగాను కానీ, ఇప్పుడు ఇంకా డబ్బులంటే నా వల్ల ఎలా సాధ్యమవుతుంది” అన్నాడు.

”మరి పాపని బడిలో ఎలా చేర్చగలిగావు?” అని బాటసారి అనగానే వెంటనే నెహ్రూ అందుకుని ”ఈ ఊరికి పెద్ద అయిన సర్పంచ్‌ నా అరుగుమీదే కూర్చుని అన్ని గొడవల్ని సరిచేస్తాడు. అతను నా కోసం పాపను బడిలో చేర్చాడు. కానీ అతనికి భార్యా, పిల్లలూ ఉన్నారు. తన సంపాదన వాళ్ళ తిండికీ, చదువులకే సరిపోతుంది కనుక ఇంకా ఇవ్వలేనని అన్నాడు” అని చెప్పాడు. అప్పుడు ఆ బాటసారి ”మీరేం దిగులుపడకండి. పాపకు డబ్బు నేను కడతాను. ఎవరూ సహాయం చేయకపోతే ఈ పాప ఎలా పైకి వస్తుందో చెప్పండి” అని ఇంత డబ్బు ఎందుకు అంటున్నా వినకుండా ”ఫరవాలేదు. ఉంచుకోండి. తర్వాత ఉపయోగపడతాయి” అంటూ పదివేల రూపాయలు తీసి ఇచ్చాడు. ఈ లోపు పాప వచ్చింది. బాటసారి పాపని తట్టి ”తల్లీ! బాగా చదువుకుని పైకి రావాలి” అని చెప్పి వెళ్ళిపోయాడు.

మర్నాడు పాప తన ఫీజు డబ్బును మాస్టారుకిచ్చి వెళ్ళి పుస్తకం తెరిచింది. వాళ్ళ మాస్టారు ఆ రోజు పిల్లల్ని ఒక్కొక్కరినీ లేపి వాళ్ళు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారో చెప్పమన్నారు. లక్ష్మి లేచి తాను కలెక్టరవ్వాలనుకుంటున్నానని చెప్పింది. అప్పుడు మాస్టారు ”కలెక్టర్‌ కావాలంటే నువ్వు ఎన్నో పుస్తకాలు చదవాలి. దేశం గురించి జ్ఞానం కలిగించే పుస్తకాలు, సాంఘిక శాస్త్రం వంటి ఎన్నో పుస్తకాలు చదవాలి” అన్నారు. ఇంతలో బడి గంట కొట్టారు. లక్ష్మి ఇంటికి వచ్చి నెహ్రూతో మాస్టారు చెప్పినదంతా చెప్పి ఆయన చెప్పిన పుస్తకాలన్నీ కావాలి అంది. నెహ్రూ ఆమెతో ”నా బంగారు తల్లీ! నీ లక్ష్యాన్ని చేరుకోవడానికైతే నేను నిస్సంకోచంగా డబ్బు ఇస్తాను” అని డబ్బు ఇచ్చాడు. అప్పుడు పాప వెంటనే ”ఇంత డబ్బు నీకెక్కడ నుంచి వచ్చింది” అని ప్రశ్నించింది. దానికి నెహ్రూ ”నా దగ్గర అంత డబ్బెక్కడుంది. ఇవన్నీ ఆ రోజు వచ్చిన బాటసారివి” అన్నాడు. ”ఔనా!” అని ఆ డబ్బుతో పుస్తకాలు కొనుక్కుని బాగా శ్రద్ధగా చదువుకుని, కలెక్టరయ్యే మార్గంలో నడిచింది లక్ష్మి.

కొన్నేళ్ళ తర్వాత ఆ బాటసారి అదే దారిన వచ్చి, అదే నెహ్రూ కింద ఉండే అరుగుమీద అలసిపోయి కూర్చున్నాడు. లక్ష్మి ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉండడం చూసి ఉప్పొంగిపోయాడు. దగ్గరకు వెళ్ళి ”తల్లీ! నన్ను గుర్తుపట్టావా” అని ఆప్యాయంగా అడిగాడు. ఈలోగా నెహ్రూ అతన్ని గుర్తుపట్టి, ”మీరెంతో సేవ చేసిన మహానుభావులు. మీకు వందనాలు” అన్నాడు. పాప మాత్రం ”మీరెవరో నాకు తెలియదు. నేను చదువుకుంటున్నాను. నన్ను విసిగించకండి” అంది. ఆ మాటలకు తట్టుకోలేక బాటసారి మనసు విరిగిపోయింది. ఆ బాటసారి వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా, నెహ్రూ ఆపినా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. నెహ్రూ వెంటనే ”తల్లీ!” అని కోపంగా అరిచి, మెల్లగా కోపం తగ్గించుకుంటూ లక్ష్మితో ”మనకు సహాయం చేసినవారిపై మనం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి” అన్నాడు. అందుకు లక్ష్మి ”అతను నన్ను చక్కగా చదువుకోమన్నాడు. ఇంకా చేరవలసిన లక్ష్మాన్ని చేరడం కోసం కష్టపడమన్నాడు. అంతేకదా” అంది. అలాగే నిద్రపోయింది.

ప్రతిరోజూ కాంతినిచ్చే సూర్యుడు తూర్పున ఉదయించినట్లు లక్ష్మి కూడా మరుసటిరోజు లేచి బడికి వెళ్ళింది. అక్కడ తన స్నేహితురాలు జానకి తనకోసం ఎదురుచూస్తూ ఉంది. లక్ష్మి వెళ్ళగానే జానకి ”లక్ష్మీ! లక్ష్మీ! నేను మాస్టారిచ్చిన హోం వర్క్‌ పూర్తి చేయలేదు. మా తల్లిదండ్రులతో బయటికెళ్ళాను. పూర్తి కాలేదు” అంది. వెంటనే లక్ష్మి జానకి పుస్తకాన్ని తీసుకుని, తన క్లాసుకు ఆలస్యం అవుతుందనే విషయం కూడా పట్టించుకోకుండా హోం వర్కును పూర్తి చేసింది. లక్ష్మి వల్లనే జానకికి ఆ రోజు తిట్లుపడలేదు. తర్వాత ఆటల సమయం వచ్చినప్పుడు అమ్మాయిలందరూ తొక్కుడు బిళ్ళ ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు లక్ష్మి జానకి దగ్గరకు వచ్చి ”జానకీ! నీ తర్వాత నేను ఆడవచ్చా” అని అడిగినప్పుడు, ”లేదు, లేదు. ఎందుకు ఆడనివ్వాలి? నువ్వు నాకేం చేశావని ఆడనివ్వాలి చెప్పు” అని ప్రశ్నించింది జానకి. అప్పుడు లక్ష్మి ”పొద్దున్న నీకు నీ హోంవర్కు రాసి ఇచ్చాను కదా” అంటే ”అయితే ఏంటి?” అని జానకి అన్నప్పుడు లక్ష్మి మనసు ముక్కలయింది. బాధపడుతూ ఇంటికి వెళ్ళి తన బడిలో జరిగిందంతా నెహ్రూతో చెప్పింది. ”నేనంత సహాయం చేస్తే జానకి నాకు కృతజ్ఞతతో ఉండాల్సింది పోయి, అలా పొగరుగా మాట్లాడింది” అని ఏడ్చింది. అప్పుడు నెహ్రూ ”ఇప్పుడు నీకింత బాధగా ఉంది కదా! ఆ బాటసారి కూడా నీ వల్ల ఇంతే బాధపడి ఉంటాడు కదమ్మా!” అన్నాడు.

ఇలా ఉండగా ఒకరోజు ఆ బాటసారి మళ్ళీ అదే దారిన వెళ్తూ, ఈ సారి చెట్టు దగ్గర ఆగకుండా వెళ్తున్నాడు. లక్ష్మి అది చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ”అయ్యగారూ! అయ్యగారూ! ఆ రోజు నేను మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం పెద్ద తప్పు. కానీ నేను మీరు చేసిన మేలును మాత్రం మరచిపోను. సర్వదా మీకు కృతజ్ఞతతో ఉంటాను. నన్ను క్షమించండి” అంది. అది విన్న బాటసారి పాపను లేపి ”తల్లీ! నీ తప్పును నీవు తెలుసుకుని, అర్థం చేసుకున్నావు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది” అంటూ ఉంటే ఇదంతా విన్న నెహ్రూ లక్ష్మిలో వచ్చిన మార్పును చూసి చాలా సంతోషించాడు.

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.