‘లష్కర్‌ టు విశాఖ టూర్‌’

గిరిజ


గత రెండేళ్ళుగా భూమిక నిర్వహిస్తున్న రచయిత్రుల క్యాంప్‌ గురించి చదివి, ఈసారి నేను కూడా దీనిలో పాల్గొనాలని అనుకొని వెంటనే భూమికకు ఫోన్‌ చేశాను.

వాళ్ళు ఈసారి వైజాగ్‌ ప్లాన్‌ చేస్తున్నామనీ వివరాలు తర్వాత చెప్తామన్నారు. విశాఖపట్న౦! చాలాసార్లు చూసిందే కదా అనుకున్నాను మనసులో. తర్వాత కొన్నాళ్ళకు ‘లష్కర్‌ టు విశాఖ టూర్‌’ పేరుతో భూమిక వాళ్ళు పంపిన లెటర్‌ వచ్చింది. దానిని చదివిన వెంటనే చాలా ఎగ్జైట్‌మెంట్‌ ఫీలయ్యను. గంగవరం, దిబ్బలపాలెం, విశాఖ జైల్లో మహిళా ఖైదీలతో ముఖాముఖి, జైల్లోనే భోజనం, వాకపల్లి బాధిత మహిళలను కలవడం లాంటి అంశాలతో టూర్‌ ప్లాన్‌ చేశారు. దాంతో అప్పటిదాకా నాలో ఉన్న నిరుత్సాహం మాయమైంది. బాధితుల గురించి పేపర్లో చదవడమే గాని వాళ్ళను ముఖాముఖి కలుసుకునే అవకాశం ఎప్పుడూ రాలేదు. కాబట్టి ఈ టూర్‌ మిస్సవకుండా తప్పకుండా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను.
ఏముందీ అక్టోబర్‌ 17వ తేదీ కోసం ఎంతో ఉద్వేగంగా ఎదురుచూడ్డం మొదలైంది. అనుకున్న తేదీ రానేవచ్చింది. సాయంత్రం విశాఖ ఎక్స్‌ప్రెస్‌లోకి ఎక్కేసరికే రత్నమాల, రమాదేవి లాంటి తెలిసిన ముఖాలు చాలా కనిపించాయి. చాలా ఏళ్ళ తర్వాత రత్నమాలను కలవడం ప్రత్యేకంగా ఈ టూర్‌ తనతో కలిసి చేయడం చాలా ఉత్సాహాన్నిచ్చింది. రాత్రి రైలు ప్రయాణంలో – అంత్యాక్షరీ, మధ్యమధ్యలో మగ ప్రయాణీకులను టీజ్‌ చేస్తూ చేసే అల్లరి, అచ్చంగా ఆడవాళ్ళమే ప్రయాణించడం బాగుంది. ఉదయమే రైలు దిగేసరికే సిద్ధంగా వున్న బస్సులో గెస్ట్‌హౌస్‌కి వెళ్ళి తొందరగా రెడీ అయి జయగారు పంపిన రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్‌ కానిచ్చి గంగవరం బయలుదేరాం. గంగవరం పోర్టు బాధితులతో మాట్లాడాక స్త్రీలలో ఉండే తెగువా, ధైర్యం, అనుబంధాల పట్ల వాళ్ళకుండే మమకారం మరోసారి తెలిశాయి. శాంతి నాయకత్వంలో సముద్రం ఒడ్డునే 14 రోజుల పాటు వాళ్ళు నిర్వహించిన ‘వంటా-వార్పు’ కార్యక్రమం దీనికో ఉదాహరణ. ‘మా సముద్రం పోయింది. పొద్దున లేవంగనే అమ్మను చూస్తే ఎంత హాయిగా ఉ౦టూ౦దో మాకు అలాగ ఉంటూ౦ది. అమ్మతో బిడ్డల్ని ఎడదీస్తున్నరు” వంటి మాటలు వాళ్ళకున్న అనుబంధాన్ని స్పష్టం చేశాయి. దిబ్బలపాలెం నిజంగా ఓ పెద్ద మట్టిదిబ్బలా మారిపోయింది. పోర్టు కొరకు పడగొట్టిన ఇళ్ళను చూసినప్పుడు ప్రకృతి బీభత్సం కంటే మానవబీభత్సం మరీ అమానుషంగా ఉంటుందనిపించింది. అక్కడున్న డిప్యూటీ కలెక్టర్‌ ప్రభుత్వానికి ఏజెంటులా వ్యవహరించిన తీరు చాలా అవనవీయంగా ఉంది. గంగవరం పోర్టు బాధిత మహిళల మాటలు చెవుల్లో మారుమ్రొగుతుంటే అతిభారంగా విశాఖ జైలుకేసి కదిలాం. అక్కడ మహిళా ఖైదీలది ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదగాథ. వాళ్ళు చేసిన నేరాలకు వాళ్ళు ఎంతవరకు బాధ్యులు? సమాజం, ప్రభుత్వం ఎంతవరకు బాధ్యత వహిస్తుంది? అనేది చర్చనీయంశమే. అక్కడ ఖైదీల వినోదం కొరకు నావీవాళ్ళు ఏర్పాటుచేసిన వినోద కార్యక్రమంలో మహిళా ఖైదీలు లేకపోవడం చాలా బాధనిపించింది. బయట ప్రపంచంలో, జైల్లో కూడా వినోదం మగవాడి సొత్తయింది. ఇదే విషయం జైలు సూపరింటెండెంటు గారితో ప్రస్తావించినప్పుడు భద్రత దృష్ట్యా వాళ్ళను రప్పించలేదని ఆయనిచ్చిన సమాధానంతో నా మనసు సమాధానపడలేకపోయింది.
గులకరాళ్ళ దారిలో కొండల గుట్టల్లో పడుతూ లేస్తూ వాకపల్లి వెళ్ళడం నిజంగా అడ్వంచరే. సిత్తాయమ్మ సిలకమ్మ మొదలైన వాకపల్లి బాధిత మహిళలకు జరిగిన అన్యాయన్ని వాళ్ళ మాటల్లోనే విన్నప్పుడు అక్కడికి వెళ్ళిన ప్రతిఒక్కరు కంటతడిపెట్టకుండా ఉండలేకపోయం. ఆదివాసీ స్త్రీల ఆత్మగౌరవాన్ని అభినందించకుండా ఉండలేకపోయం. అంత బాధలోనూ వాళ్ళు ఆప్యాయంగా చేతిలో చేతులు వేసి మమ్మల్ని ఊరి చివరిదాకా సాగనంపిన తీరు మరువలేనిది. ప్రభుత్వం వాళ్ళకు ఒక్కొక్కరికి ప్రకటించిన ఐదు లక్షల కాంపన్‌సేషన్ని కూడా తిరస్కరించి ఆత్మగౌరవాన్ని చాటుకున్న వాళ్ళను వాటేసుకోకుండా ఉండలేకపోయాను.
హృదయభారంతో తిరుగుముఖం పట్టి అరకు చేరుకున్నాం. మరునాడు జిందాల్‌ సెజ్‌ బాధితుల్ని కలిసినప్పుడు కాకి దేవుడమ్మ నాయకత్వ పటిమని అభినందించకుండా ఉండలేకపోయం. తన పరోక్షంలో పోలీసు అధికారి తనను తిట్టాడని తెలిసి, తిరిగి అతనిని తాను నిలదీయడం – ఎవరే మాటలన్నా తలొంచుకొని వెళ్ళే మహిళలకు ఒక కనువిప్పు కలిగిస్తుంది. ఆమె కేవలం రెండో తరగతే చదువుకుంది. చదువుకి నాయకత్వానికి సంబంధం లేదేమొ. ఒక సామాజిక అవసరం నుంచీ సంఘర్షణ నుంచీ నాయకత్వం పుడుతుంది. కాకి దేవుడమ్మ అలాంటి సంఘర్షణలో నుంచి వచ్చిందే. సాహిత్యం కేవలం మానసికానందం కోసం కాకుండా సామాజిక చైతన్యానికి తోడ్పడాలనీ సామాజిక సమస్యలు సాహిత్యంలో ప్రతిబింబించాలని గాఢంగా నమ్మే వ్యక్తిని కాబట్టి, విశాఖ సముద్రతీరాన్ని గానీ, అరకులోయ అందాల్ని గానీ ఆనందించలేకపోయను. చల్లని మంచులో వానలో తడిసినా చల్లారని మనసు మరింత రగిలిపోతుంటే తిరుగు ప్రయాణమయ్యము.
ఆదివాసీ స్త్రీల ఆత్మగౌరవాన్నీ, తెగువనీ నా సహోద్యోగులతో పంచుకోవాలనే ఆరాటంతో మధ్యాహ్నం 12.15 ఇంటికి వచ్చినా ప్రయాణ బడలికను పక్కన పెట్టి, ఒంటిగంటకల్లా పాఠశాలకు వచ్చి – ఆదివాసుల దగ్గరున్న అటవీ సంపదను బహుళజాతి కంపెనీల కోసం గ్రేహౌండ్స్‌ రూపంలో, మహిళలపై లైంగిక అత్యాచార రూపంలో రాజ్యం దాడి చేస్తుందని – నా ప్రయాణ అనుభవాలను సహోద్యోగులతో పంచుకున్నప్పుడు సాటిస్త్రీలుగా వాళ్ళ కళ్ళూ చెమ్మగిల్లాయి. చివరగా ఒక మాట. ఈ సందర్భంగా ప్రయాణం ఆద్యంతమూ భూమిక వాళ్ళు ఖచ్చితమైన ప్రణాళిక. దానిని అమలుపరిచిన భూమిక సిబ్బందిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను.

Share
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో