పిల్లల భూమిక

పాట
చదువే జ్ఞానం చదువే ధైౖర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం
పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం
చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా
|| చదువే ||
కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతేర్చెది చదువేరా
కల నెరవేర్చేది బడులురా
బడి అంటే జైలు అని భయమెందుకులే ఓ నేస్తం
బడి అంటే అమ్మ ఒడి అది బాదరబందీ లేని గుడి
బెదురును వదిలి పరుగున కదిలి ఆటపాటలతో చదివేద్దాం
అక్షర జెండా ఎగరేద్దాం
|| చదువే ||
పేద ధనిక భేదాలు చదువుకు లేనే లేవురా
ఏకగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమౌనురా
చదువుతో అంబేద్కర్‌ ఎన్నో కష్టాలను ఎదిరించాడు
భారత రాజ్యంగాన్ని రాసి బాబా సాహెబయ్యాడు
|| చదువే ||
కరువు సీమలో పుట్టాము కన్నీళ్ళను కారుస్తున్నాము
చీకటి కమ్మిన ఈ నేలలో మన చదువే ఒక వెలుగు దివ్వెర
పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యం చేద్దాము
శోధించి పరిశోధించి మన చదువుతో కరువును తరిమేద్దాం
|| చదువే ||
– పి. భూమిక, 7వ తరగతి, జడ్‌పిహెచ్‌ఎస్‌, పల్లెర్ల

కథ

పదవ తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. వారు ఇద్దరూ ప్రాణ స్నేహితులు. వీళ్ళిద్దరూ ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌ ఉండేవారు. అందులో ఒక అమ్మాయికి వాళ్ళ నాన్న పెళ్ళి సంబంధం తీసుకువచ్చారు. అయితే ఆ అమ్మాయి బాల్య వివాహాల వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయని తెలిసి కూడా పెద్దల ఒత్తిడి వల్ల పెళ్ళికి ఒకే అంటుంది. తన స్నేహితురాలు వద్దు అని ఎంత చెప్పిన పట్టించుకోదు. స్నేహితురాలికి కోపం వచ్చి ఉపాధ్యాయులతో జరిగిన విషయం చెప్పింది. కాని వాళ్ళూ పట్టించుకోలేదు. పోలీస్‌లతో చెప్పాలని అనుకుంది. కాని భయం వేసి ఆగిపోయింది. చివరికి ఒక రోజు భూమిక హెల్ప్‌లైన్‌కి 1800 425 2908 నెంబర్‌పై ఫోన్‌ చేసి జరిగిన విషయం అంతా చెప్పింది. వాళ్ళు వచ్చి ఆ పెళ్ళిని ఆపి ఆమెకు, ఆమె తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఆ తరువాత ఆమె బాగా చదివి ఒక స్థాయికి వచ్చాక ఆమెకు నచ్చిన వారిని పెళ్ళి చేసుకొని సుఖ సంతోషాలతో ఉంది.
– డి. మౌనిక & టి. జ్యోతి, గ్రా||మద్దూర్‌
కవిత్వం
సమాజంలో స్త్రీ అనేక బాధ్యతలను మోస్తూ ఉంది
తల్లిదండ్రులకు – కూతురిగా
అన్నయ్యకు – చెల్లెలిగా
తమ్ముడికి – అక్కగా
భర్తకు – భార్యగా
కొడుకుకి – అమ్మగా
అత్తమామలకు – కోడలిగా
ఇన్ని బాధ్యతలను మోస్తున్నాము మనం
మన లక్ష్యాన్ని చేరడం ఒక విషయమా!

ఓ విద్యార్థీ
జీవితం అనే యుద్ధంలో
చదువు అనే ఆయుధంతో యుద్ధం చేస్తున్నావు
నీ ఆయుధాన్ని పదును పెట్టుకో విజయం నీదే
బడికి పోవడం మొదలయ్యాక తెలసింది
”ఆటల” విలువ
కాలేజిలో చేరిన తర్వాత తెలిసింది ”స్కూల్‌” విలువ
ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత తెలిసింది ”చదువు” విలువ
మిత్రుడు దూరం అయినప్పుడు తెలిసింది ”స్నేహం” విలువ
అమ్మా నాన్న దూరంగా ఉన్నప్పుడు తెలిసింది ”ప్రేమ” విలువ
మరణానికి దగ్గరవుతున్నప్పుడు తెలిసింది ”జీవితం” విలువ
ఇదంతా చదివాక తెలిసింది ”కాలం” విలువ
– వి. కవిత, 9వ తరగతి, ఖాజీపూర్‌ తాండా
చుక్కలు లేకుండా ఆకాశం ఉండవచ్చు
నీరు లేకుండా సముద్రాలు ఉండవచ్చు
ఆకులు లేకుండా చెట్లు ఉండవచ్చు
స్నేహం లేకుండా నేనుండడం కష్టం
– ఎ.అశ్విన్‌, 7వ తరగతి, జడ్‌పిహెచ్‌ఎస్‌, పల్లెర్ల

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో