దేహం నిదానించిన చోట – ఉమా నూతక్కి

అలముకుంటున్న కలతల
తడి సంకేతాల భాషని కంటికి అంటనివ్వకలా
నీ ప్రతి కలనూ కన్నీరుగా కార్చేస్తుంది
గుండెని కొలిమిలా రగిలిస్తుంది
ప్రతిక్షణమూ నీలోనుండి నిన్ను బయటకి లాగెయ్యాలనే
తమ ఆశకి దాసోహమవ్వకలా
కాలం పొడుగూతా
నువ్వు వేద్దామనుకున్న మైలురాళ్ళని విస్మరిస్తూ
నీ పయనాన్ని పరిమితం చేసేస్తుంది
అందుకే
నీ వాకిట్లోకి వలస వస్తున్న భయాలన్నిటినీ
నీ కంటిమెరుపుల వలలోకి లాగేసేయ్‌
గుండె స్పందన సప్తస్వరమై ఉల్లాసమిచ్చేలా
ప్రతి లయకూ నిబ్బరాన్ని దర్పంగా మలిచేసేయ్‌
అప్పుడిక
ఊపిర్ల నిండా ధైర్యాన్ని అద్దుకున్న శ్వాసలన్నీ
కొడగట్టిపోతున్న ప్రతి లెక్కనూ సరిచేస్తాయి
చేజారిపోతుందనుకున్న జీవితాన్ని
వెనక్కి మరల్చి నడిపించుకొస్తాయి
క్షణాలన్నీ శిధిలాలుగా కూలుతున్న వేళ
మనసూ… దేహం నిదానించిన చోట
ధైర్యమొక ఇంధనమై
ప్రతి శిధిలాన్నీ శిల్పంగా మలుస్తుంది
మనిషిని మళ్ళీ పచ్చగా చిగురిస్తుంది.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.