అలనేం చేయను ? – సుజాత పట్వారి

హాయిగా చెరువులో
గెంతులేస్తున్న దాన్ని
వూరుకోక
పక్కనే సముద్రంలోకి దూకాను
ఇహ అప్పటి నుండీనన్ను నేను కాపాడుకోవడంలో
తలప్రాణం మొప్పల్లోకి దిగుతున్నదనుకో
తెలిసిన ప్రాణులు
తెలియని ప్రాణులు
తలలున్నవి, తలలు లేనివి
తోకలు మాత్రమే వున్నవి
సముద్రం గొప్పదని చెప్పిన వెధవెక్కడ?
ఇదో గంభీర కదన మథనం
ఈరోజు
నా మీదకు దూసుకొస్తున్న
అలను చూసి నోరెళ్లబెట్టాను
గుటక్‌…..
మింగాలేను కక్కాలేను
విక్రమార్కా… విక్రమార్కా…
నా కడుపులోని అలనేం చేయను?
కడుపులో వుమ్మ నీరున్నప్పుడు
ప్రసవ వేదన పడ్డదాన్ని
ఇప్పుడీ వుప్పునీటిలో
ప్రణవ వేదన పడుతున్నదాన్ని
సంసారం సాగరం
జన్మదుఃఖం జరా దుఃఖం…
విక్రమార్కా…. విక్రమార్కా…
తల వేయి చెక్కలయ్యిందా?
అయినా
నీటిని వెనక్కుతోస్తూ
ముందుకీదుకెళ్ళాలి గానీ
ఇలా అలల్ని, ఆల్చిప్పల్ని
కంటి ముందు పోగేసుకుంటారా?
చక్రం తిప్పినట్టు
తోకను తిప్పి దిశను మార్చితే
ఒక్క అలేంటి
సముద్రంమొత్తమే
దూదిపింజయి ఎగిరిపోదూ!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో