ఉద్యమ స్పూర్తినందించిన ఉత్తరాంధ్ర యాత్ర

బి. రమాదేవి
భూమిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాత్రలో భాగంగా విశాఖ బయలుదేరాం. సత్యగారు విశాఖ అనగానే అక్కడ జరుగుతున్న సామాజిక ఉద్యమం, వీటి పరిణామాలు అన్నీ ఒకేసారి మదిలో మెదిలాయి. బాధితుల దగ్గరికి వెళ్తామని సత్య పంపిన వివరాలు చదివిన తర్వాత తప్పక వెళ్ళాలని నిశ్చయించుకున్నాం. అలాగే బయలుదేరాం.
ఉత్తరాంధ్రలో గత 2 సం||లుగా జరుగుతున్న సామాజిక ఉద్యమాలు – వాటి పట్ల రాజ్యం యొక్క దృక్పధం అది కొనసాగిస్తున్న పాలనకు పరాకాష్టగా రాజ్యహింసకు మారుపేరుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా గంగవరం పోర్టు వల్ల నిర్వాసితులౌతున్న మత్స్యకారులు సముద్రం పోతావుంది, అంటే మా ప్రాణం పోయినట్లేనని, వాకపల్లి కోండు తెగకు చెందిన ఆదివాసీ స్త్రీలు మా మానం పోయిందంటే మా ప్రాణం పోయినట్లేనని, జిందాల్‌ రిఫైనరీకై భూములు కోల్పోయి నిర్వాసితులు అవుతున్నారు. బాక్సైట్‌ త్రవ్వకాలను వ్యతిరేకిస్తున్నవారు మా భూమి పోతా ఉంది, మా భూమితోనే వ ప్రాణం పోయినట్లేనని సముద్రం కొరకు, న్యాయం కొరకు, భూమి కొరకు జరుగుతున్న ఉద్యమంలో స్థిరంగా నిలబడి, పోలీసు కాల్పులు, బెదిరింపులు, వేధింపులు, అత్యాచారాలు, కోర్టు కేసులు భరించడమే కాక, లక్షలాది రూపాయలను ఎరగా చూపినా వాటిని తృణప్రాయంగా భావించి, వాటిని ఆశించక తమకు న్యాయం జరగాలని పోరాడుతున్నారు. ఈ మూడు ఉద్యమాలలోని పురుషులు ఆర్థిక ప్రలోభాలకు లొంగిపోయి, ఉద్యమ నాయకత్వం వహిస్తున్న మహిళలను ఎంత హింసించినా, వేధించినా, ఒత్తిడి చేసినా ఎదుర్కొని, ఇటు కుటుంబ హింసను, రాజ్యహింసను ఎదుర్కొంటూ కూడ ఉద్యమాలకు ముందుభాగాన కడదాకా నిలబడి పోరాడతామంటున్నారు. ఈ ఉద్యమస్పూర్తినే నాగరిక సమాజంలో జరిగే అనేక సమస్యలను ఎదుర్కొనక రాజీపడుతూ బతికే మహిళలు ఉద్యమస్పూర్తిని, పోరాట వారసత్వాన్ని అందుకోవాల్సిన అవసరం ఉందని బాహ్య ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యతను రచయిత్రులకు గుర్తుచేసారు. వారు ఆట్టి స్త్రీమూర్తుల పోరాటానికి అనేక మంది అండగా ఉన్నా, ఉద్యమాలకు ద్రోహం చేసేవారు అధికార, ప్రతిపక్ష పార్టీలలోను, ప్రజా ఉద్యమకారుల్లోన ఉంటారు. వారి ద్రోహానికి ఉద్యమకారులు బలవుతనే ఉంటారని ఈ మూడు ఉద్యమాలను దెబ్బతీయడానికి రాజ్యాలు చేసిన కుట్రలు, కుతంత్రాలు, ఎత్తుగడలు, ఎరలకు లొంగిపోయి ఉద్యమించేవారిని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తారనడానికి నిదర్శనం గంగవరం పోర్టు నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఉన్న గ్రామాల ప్రజల ఐక్యతను దెబ్బతీసి, వారిని విభజించి, పాలించి, సమస్యలపై పోరాడుతున్న వారిపై కాల్పులు జరిపి, ఇద్దరి చావుకు కారణమై పోరాటం ఆపని గంగవరం ప్రజలపై వారికి అండగా ఉన్న ప్రజాస౦ఘాలపై కేసులు పెట్టి 47 రోజులు జైలుకు పంపి (అందులో 16 మంది మహిళలు) బెదిరించి, భయపెట్టి ప్యాకేజీలను ఎరగా చూపి సంతకాలు పెట్టించి, వారిని వేరే ప్రాంతానికి తరలించటమే. దిబ్బపాలెం గ్రామాన్ని చూస్తే సునామీకంటే, లాథర్‌ భూకంపం సంభవించిన నాటి దృశ్యాల కంటే హృదయవిదారకంగా, నిరంకుశంగా నేలమట్టం చేయబడ్డ 350 ఇండ్లను చూసినపుడు హృదయంలో ప్రభుత్వం విధానాల పట్ల తీవ్ర ఆగ్రహం కలిగించింది. విభజించి పాలించే న్యాయసూత్రాన్ని పాటించే ప్రభుత్వం సముద్రం మీద హక్కుకై పోరాడుతున్న గంగవరం, దిబ్బపాలెం, తదితర గ్రామాల ప్రజలను పోరాటం నుండి విరమింపచేసి, వారిని ఒంటరిగా చేసి తన పని తాను కొనసాగిస్తూనే ఉంది. గంగవరం ప్రజలు పోరాటం చేస్తనే ఉన్నారు. వాళ్ళ ఎదురుగా సముద్రఘోష, ఆటుపోట్లు కనిపిస్తన్నా, ‘వాళ్ళందరూ మా సముద్రం పోయింది’ అంటున్నారంటే వాళ్ళ బ్రతుకు పోయిందని, తాత తండ్రులనుండి వచ్చిన జీవనోపాధి, ముందు తరాల వారికి లేకుండా, తండ్రిలా కాపాడాల్సిన ప్రభుత్వమే సర్వం దోచి కాజేస్తుంది. అన్నంపెట్టే తల్లి విషం పెట్టినట్లుగా భార్యలు పోరాటం చేస్తూ, శిక్షలతో మ్రగ్గుత పోరాటం కొనసాగిస్తుంటే మగవాళ్ళు ప్రభుత్వం ఇవ్వజూపిన తాయిలాలు అందుకోవడానికి లాలచి, కక్కుర్తిపడి దొంగ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. అయినా సముద్రఘోష వినిపించే వరకు, అలల కదలికలు ఆగనంత వరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు.
ఇక వాకపల్లి విషయంలో చూస్తే అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ మానవహక్కుల ఉల్లంఘన ఎంత ఘోరంగా ఉన్నా కనీసం న్యాయవ్యవస్థ మీద కనీసంగా వున్న నమ్మకం, గౌరవాన్ని కూడా పోగొట్టింది వాకపల్లి మహిళల అత్యాచారానికి సంబంధించిన కోర్టు తీర్పు. స్వాతంత్య్రం అంటే ఏమిటో తెలియని ఆదివాసీ మహిళలు న్యాయం కోసం నాగరిక ప్రపంచం వైపు పరుగులు తీసిన రోజు ఆగస్టు 20, 2007. దాదాపుగా మావోయిస్టుల ప్రభావం 25 సం||లుగా ఉన్నా ఈనాడు సహజవనరులను కొల్లగొట్టు బాక్సైట్‌, అల్యూమినియం, రిఫైనరీల వంటి బహుళ జాతి సంస్థల అవసరాలను తీర్చడానికి, ఆ ప్రాంతాల నుండి ఆదివాసులను తరిమికొట్టడానికి చేసిన ప్రయత్నాలలో భాగంగా గ్రేహౌండ్స్‌ దళాలను పంపి 11 మందిపై సామూహిక అత్యాచారం జరిపారు.
వాకపల్లి మహిళలు ఎండనక, వాననక వెటు కష్టం చేస్తూ, కొండలు, గుట్టలు ఎక్కుతూ, తిరుగుతూ పోడు చేస్తూ, బక్కచిక్కిన శరీరాలతో ఉన్నారు. వారిని చూస్తే పోలీసులు వారి పట్ల మొహంతో కాక, వారి బెదిరింపులలో భాగంగా జరిపిన అత్యాచారంగానే కనిపిస్తుంది.
పైగా వారంతా మావోయిస్టు సానుభూతిపరులుగా ముద్రవేయడమే కాక అలాంటి సంఘటన జరగలేదని డి.జి.పితో సహా, హోమ్‌ మినిస్టర్‌ వరకు, యావత్‌ పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు చూస్తే, వరంగల్‌ జిల్లా మామునరులో దొంగతనం నేరంపై పోలీసుస్టేషనులో ఉన్న తల్లికి మధ్యాహ్నం భోజనం పట్టుకెళ్ళిన కూతురు భారతిపై ఐ.|. సహా నలుగురు అత్యాచారం చేసి, ఆ విషయంలో మెడికల్‌ ఎగ్జామినేషన్‌కు సాక్ష్యాలు అందనీయని విధంగా వ్యవహరించి, క్రింది స్థాయి నుండి ప్రభుత్వం, హోంశాఖ వరకు రాజ్యము, పోలీసులు కొట్టిపారేయడమే కాక, ఈ విషయాలను గవర్నరుకు విన్నవించినందుకు ఆయా ప్రజాసంఘాల నాయకురాళ్ళమైన మా భర్తలను మావోయిస్టులుగా ముద్రించి, నాలుగు సంవత్సరాలు చిత్రవథ చేసిన వైనం. పోలీసుల చరిత్రలో ఇటువంటి సంఘటనలు అనేకం. మన కళ్ళ ముందే కదలాడే సజీవదృశ్యాలు గుర్తుకు రాక మానవు. వాకపల్లి మహిళలు తమను సభ్య సమాజం, పోలీసులు, ప్రభుత్వం ఎవరూ నమ్మడం లేదని, పాడేరు, విశాఖకు కూడా ఎన్నడూ పోవడం తెలీని మేము మాకు అన్యాయం జరిగిందీ న్యాయం చేయండి అని హైద్రాబాద్‌ వరకు వెళ్ళి మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదు అవవనాల పాలైనామని భోరున ఏడుస్తూ, మేమూ నీతి నిజాయితీగా బ్రతికేవాళ్ళం. మా భర్తలు, మా తల్లిగారు, అన్నల వద్ద మేము తలెత్తుకోలేని దుస్థితికి, ప్రభుత్వం మమ్మల్ని నెట్టింది. మా బంధువుల శుభకార్యాలకు, బయటికి ఎక్కడికీ వెళ్ళలేకపోతున్నాం. తప్పు చేసింది పోలీసులైతే శిక్ష మేము అనుభవిస్తున్నాం అంటూ వారు పడే వేదన అక్కడ ఉన్న మా అందరినీ కదిలించి, కంటనీరు పెట్టేలా చేసింది. కాని వారితో మీరు ప్రభుత్వం నుండి న్యాయం పొందలేకపోయినా, సమాజంలో మీరు నైతికంగా విజయం సాధించారు. మహిళా సమాజం అంతా, ప్రజాసంఘాలు అన్నీ అండగా ఉండటం మీ గురించి మేమంతా ఆలోచించడం, మీకు అండగా ఉంటామని అక్షరయుద్ధం చేయగలమని హామీ ఇవ్వటం, మీరు మాకు పోరాట స్పూర్తి అందించారు. మీకు మేము ఏమీ చేయలేకపోయినా, మీనుండి సమాజమే అనేక పాఠాలు నేర్చుకుంటుందని మేమంతా కూడా ఆ స్పూర్తిని వెసుకొని వెళ్తూ, మహిళా సమస్యలకు మరింత అండగా ఉంటామని వారికి మాట ఇచ్చి వచ్చాం. వారి ఆక్రందన, వారు వినిపించిన ఆలోచనా స్పోరకమైన మాటల్లో, ‘మాకు నోరు లేకపోవచ్చు కానీ సిగ్గులేదా?’ అనే ప్రశ్న మనకు చెంపపెట్టులాంటిది. నోరున్న మనం నోరులేని వాళ్ళ కోసం గొంతు చించుకొని అరవాల్సిన అవసరాన్ని గుర్తింపచేసింది. పోరాడి సాధించిన అనేక హక్కులు, చట్టాలు అమలుపరుచుకునే దిశగా, ప్రభుత్వంతో పాటు న్యాయవ్యవస్థతోన, న్యాయపోరాటం చేయల్సిన అవసరాన్ని గుర్తించేలా, ఆదివాసీ, మహిళా ఉద్యమాలకు ప్రజాస్వామ్య శక్తులన్నీ బాసటగా నిలవాల్సిన అవసరాన్ని, వాస్తవిక జీవితాల సంఘర్షణను అక్షరయుద్ధం చేయటం మరింత సామాజిక బాధ్యతగా రచయిత్రులు అర్థం చేసుకున్నారు.
విశాఖ సెంట్రల్‌ జైల్లో ఉన్న మహిళా ఖైదీలను కలిసినపుడు, క్షణికావేశాలతో, చిన్న చిన్న కారణాలు, భర్త అత్తమామల వేధింపులు, మిలిటెంట్‌గా పనిచేస్తూ, తన వయస్సు 25సం|| అయితే తనపై పెట్టిన అక్రమ కేసులు 50 పైనే భరిస్తూ, తమ వారిని వదులుకొని, తమ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియక, అనాథలుగా మారుతున్న దుస్థితిని గురించి బాధపడ్డవారి కళ్ళలోని అంతులేని ఆవేదన, దుఃఖము మమ్మల్ని విచలితుల్ని చేసింది. ఉన్న చట్టాలు సక్రమంగా అమలు కాని పరిస్థితి ఒక ప్రక్కన ఉంటే, ఐ.్పు., ఐ.ఊ., అట్రాసిటీ కేసులు ఎలా దుర్వినియెగమవుతున్నాయె తెలిసే విధంగా జైల్లో ఖైదీలుగా ఉన్న వారు తెల్పిన వివరాలు మనసును కల్లోలపరిచాయి. వారిలో కొందరికి లాయర్లు పెట్టుకునే స్థోమతలేదు. అలాంటి వారికి మహాలక్ష్మి (అడ్వకేటు, నాయకురాలు అండగా ఉంటానని వారికి బెయిలు మంజూరీకి సహకరిస్తానని, స్వచ్ఛందంగా ప్రకటించి, వారికి కొంత ఊరటనిచ్చింది.
ఆధునిక మహిళ చరిత్రను తిరగారాస్తుంది అన్నట్లుగా, అణగారిన జాతుల్లోకెల్లా అణగారిన జాతిలుగా ఉన్నా మహిళలు అక్షరజ్ఞానం లేక, మూఢ విశ్వాసాలలో కూరుకుపోయి, తమను పట్టించుకునే దిక్కులేక, ఇంటాబయటా అనుక్షణం దోపిడీకీ, అవమానాలకీ, తిరస్కారాలకి, పీడనకు, వంచనకు గురవుతున్న క్రింది తరగతి మహిళలు నేడు నోరువిప్పి అనేక సత్యాలను గొంతెత్తి అరుస్తూ, న్యాయం కొరకు ప్రభుత్వాలతో పోరాటం చేస్తున్నారు.
చదువు పెద్దగా లేకపోయినా ప్రత్యేక ఆర్థిక మండళ్ళ పేరుతో పచ్చటి పంట పొలాలను నాశనం చేస్తూ, ప్రభుత్వం విజయనగరం జిల్లా శృంగవరపు కోటలోని అడ్డతీగ ప్రాంతంలో జిందాల్‌ రిఫైనరీ ఏర్పాటుకు, బాక్సైట్‌ గనులున్నాయని వాటి త్రవ్వకాలకై రైతులనుండి భూమిని తీసుకోవాలని ప్రయత్నించింది. వారికి ఇంటికొక ఉద్యోగం భూమి ధరను బట్టి 1 లక్ష నుండి 5 లక్షల వరకు డబ్బు ఎరగా చూపి గుట్టుచప్పుడు కాకుండా కొందరి నుండి భూమిని తీసుకుంది. కాని దేవుడమ్మ, పార్వతి లాంటి యువతులు ముందుకొచ్చి ”డబ్బు ఇవాళ ఇస్తే, రేపు ఖర్చవుతుంది. తాత, తండ్రుల నుండి ఉన్న భూమి అయితే తరాల వరకు చేసుకుని తినటానికి ఆధారంగా ఉంటుంది. ఇంట్లో వారికి ఉద్యోగం ఇస్తే మిగిలిన వారి సంగతేంటి? అయితే శిలిబీనీదీరిబీబిజి ఉద్యోగాలకు సరిపడే తర్వాత లేని వారికి తాత్కాలికంగా ఇచ్చే ఉద్యోగాలు ఏ మాత్రం ఉపాధినిస్తాయి” అని నిలదీస్తూ ఉన్నారు. భూములు లేనివారికి కూలినాలీ చేసి బతికే వ్యవసాయ కూలీలకు ఏమిటీ ఆధారం? అంటున్నారు. అంతేకాక జిందాల్‌ ఫ్యాక్టరీ పెడితే, జు|ఈఐ ఎంత మహమ్మారియె, అంతకంటే పెద్ద జబ్బులు వస్తాయి. బాక్సైట్‌ త్రవ్వకాల వల్ల, జిందాల్‌ రిఫైనరీ వల్ల దీనికి 15 కి.మీ. పరిధిలో భూమి, నీరు, వాతావరణం విషతుల్యం అయిన వ్యర్థ పదార్థాలలో కలుషితమౌతాయి. గోస్తనీ, శారదా నదుల నీరందక పంటపొలాలు కోల్పోవాల్సి వస్తుంది. మా ఆరోగ్యాలు మా పొలాలు పాడయ్యక వారిచ్చే లక్షలాది రూపాయలు మాకు నిలువుంటాయా, రోగాలు రాకుండా కాపాడుతాయా? అని వారు నిలదీస్తున్నారు. వాళ్ళ భూమిలో జిందాల్‌ వాళ్ళు పెట్టిన బోర్డును కూల్చివేసి, ఈ భూమిపై సర్వహక్కులు మావి అని ఒక బోర్డును వారి భూమిలో పాతినారు. జిందాల్‌ వారు కట్టిన గోడలు పగలగొట్టారు. ప్రభుత్వ చట్టబద్ధతనం ప్రశ్నించిన ప్రజలపై 17.12.2007న దాడిచేసి 38 మందిని అరెస్టు చేసి అనేక తప్పుడు కేసులు బనాయించారు. చిన్న పిల్లల తల్లి అని కూడా చూడకుండా 3 రోజులు జైల్లో నిర్బంధించారు. నిర్బంధకాండ ద్వారా జిందాల్‌ సేవలో మునిగి తేలడానికి, నిస్సిగ్గుగా ముందుకు వస్తున్న ప్రభుత్వానికి అక్కడ ఛిద్రమవుతున్న ప్రజల జీవితాల గూర్చికాని, పాడయ్యే పంటపొలాల గూర్చికాని, పట్టకపోవడం పాలకవర్గాల దుర్నీతికి అద్దం పడుతున్నాయి. ప్రజల కొరకు, ప్రజల కోసం పాలన అని అర్థం పిల్లలకు పాఠాల్లో ప్రజాస్వామ్యాన్ని గూర్చి చెప్పుకోవడానికే ఉపయెగపడ్తున్నాయి. కాని దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ప్రజాస్వామ్య భావనకు భిన్నంగా వ్యవహరిస్తూ, దాని అర్ధాన్ని హరిస్తున్నాయి. ప్రజాభిప్రాయాన్ని తెల్సుకోవడం, వాటిని మన్నించడం, రాజ్యాంగాన్ని, చట్టాలను బలహీనవర్గాలకు రక్షణకవచంగా ఉన్న యాక్టులను అమలు చేయల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వం ఆ స్పూర్తికి విరుద్ధంగా పని చేస్తూ 10%గా ఉన్న బహుళ జాతి సంస్థలకు దేశ సంపదనంతా ధారాదత్తం చేసి, 90% దళిత, గిరిజన, ఆదివాసీ, బహుజనులు, మహిళల హక్కులను కాలరాయడానికి ప్రయత్నించడమే కాక, చట్టబద్ధతను ప్రశ్నించే ప్రజల గొంతు నొక్కడం ద్వారా, పోలీసు వర్కు హింసను ప్రయొగిస్తూ, ప్రజలపై కేసులు పెడ్త, భయెత్పాతాన్ని సృష్టించడం ద్వారా రాజ్యహింసను కొనసాగిస్తూ, ఓట్ల రాజకీయల్లో వీరందరి కొరకే తమ ప్రభుత్వం అవి చెబుతూ బహురపుల వేషాలతో, మొసలి కన్నీళ్ళలో ప్రజల ముందుకు వస్తుంది. ఇంత సీరియస్‌గా రాజ్యం వ్యవహరిస్తున్నా దేవుడమ్మ, పార్వతిలు బాక్సైట్‌ త్రవ్వకాల వ్యతిరేక కమిటీ కన్వీనర్‌ – కో-కన్వీనర్‌లుగా వ్యవహరిస్తూనే ఉన్నారు. ప్రభుత్వంలో భూములు దక్కే వరకు పోరాడుతామంటున్నారు. భయపెడితే భయపెడుతారు. ప్రలోభపెడితే లొంగదీస్తారు. ఈ నాయకురాళ్ళకు లక్షలాది రూపాయలు ఎరగా చూపినా, యిండ్లు కట్టిస్తామని, మీ పిల్లలకు మంచి చదువు చెప్పిస్తామని, ఎవ్వరికీ చెప్పక ఉద్యమాన్ని విరమించమని బ్రతిమిలాడినా మేము లొంగిపోతే మిగిలిన వారందరి గతి ఏమౌతుందని ఆలోచించి వాటిని గడ్డిపరకలకన్న హీనంగా తోసిపారేసామని మా భూమ్మీద మాకున్న ప్రేమయే వారి ప్రలోభాలకు లొంగకుండా ఆపిందని, ఇదంతా పెద్దల కుట్రలో భాగమని చాలా స్పష్టంగా అర్థం చేసుకుని, ఆలోచించి స్థిరంగా నిలబడ్డామని చెప్పారు. వారికి కలిగిన అనుభవాలనుండి భయాన్ని పోగొట్టుకొని చావైనా రేవైనా మా భూమికై పోరాడాలనే వివేచన, ఆలోచనతో ఉద్యమించడానికై ముందుకు వచ్చి నిలబడ్డామని, ఈ క్రమంలో త్రాగుడు, డబ్బు వ్యసనపరులైన మా భర్తలను అడ్డం పెట్టుకుని మమ్మల్ని లొంగతీసుకోవాలని ప్రయత్నించిన రాజ్యం యొక్క కుటిలనీతిని అర్థం చేసుకుంటనే మా కుటుంబాలతో, మా భర్తలతో కూడా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. బాక్సైట్‌ త్రవ్వకాల వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో 25.01.2008న ఒక పెద్ద బహిరంగ సభకు సభాధ్యక్షత వహించి సభ నిర్వహించవలసిన కాకి దేవుడమ్మను ఆ సభకు వెళ్ళనీయకుండా ఆమె భర్త ఆమెని నిర్బంధించినా, కో-కన్వీనర్‌గా ఉన్న పార్వతి ఆమె భర్త సహకారంతో ఆ సభను నిర్వహించడం జరిగింది. అంత పెద్ద బహిరంగసభను నిర్వహించడంలోనే వారిలోని నాయకత్వ ప్రతిభ బయటపడింది. అంటే కుటుంబ హింసను, రాజ్యహింసను ఎదుర్కొంట నాయకత్వమంటే ప్రలోభాలకు, బాధలకు, భయలకు, బెదిరింపులకు లొంగక ప్రజల పక్షాన నిలబడటమేనన్న సత్యాన్ని ప్రపంచానికి చాటిన వారు మొత్తం మహిళా లోకానికే స్పూర్తి ప్రదాతలే కాక చరిత్ర తిరగరాసే మహిళలు వీరేనని ప్రగాఢ విశ్వాసాన్ని, అంతులేని ఆత్మవిశ్వాసాన్ని, మనోనిబ్బరంతో వ్యవహరిస్తున్న ఆ స్త్రీమూర్తులకు రచయిత్రులంతా శిరస్సు వంచి నమస్కరించారు. ఆ పోరాట స్పూర్తిని మదినిండా నింపుకుని, అండగా ఉంటామని బాధితుల పక్షాన పోరాడుతామని, అక్షరయుద్ధం చేస్తామని ప్రకటించి, నూతనోత్సోహాన్ని క్రియశీలక, సమరశీల పోరాట స్ఫర్తిని గుండెల నిండా నింపుకొని ముందుకు సాగాం. రాహుల్‌ సాంకృత్యాయన్‌ ఆయ ప్రాంతాల సంస్కృతి, సజీవ వనవ సంబంధాల దృశ్యాలను స్వయంగా తిరిగి ఆస్వాదించి రచనలు చేసినట్టుగా, వివిధ ప్రాంతాలలోని మహిళల విభిన్న సమస్యలను చసి, వారిద్వారా తెలుసుకొని వారితో మమేకమై ముందుకు సాగాల్సిన అవసరాన్ని మరింత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఈ యత్ర గుర్తుకు చేసింది.
నేను అనేక ప్రజా పోరాటాలలో భాగస్వాములుగా పనిచేస్తున్నప్పటికీ ఉత్తరాంధ్ర ఉద్యవలలో బాధితులే నాయకులుగా ఎదిగి వారి సమస్యలకై పోరాడటానికి సిద్ధపడటం చూసి ఎంతో ఉత్తేజితురాలినయ్యను. వారి సమస్యనుండి వారే నాయకురాళ్ళుగా, రచయిత్రులుగా ఎదగాలని ఆశిస్తూ వారి చైతన్యం మొత్తం మహిళలకు చైతన్యం అందించిందని, దాన్ని భుజాన మొసుకొచ్చి అనేక మందికి తెలపటం ద్వారా సమస్యలపట్ల భయంతో ఆత్మహత్యలు చేసుకొనే యెచన ఉన్నవారికి కనువిప్పు కలిగించి స్పూర్తినందిస్తుందని ఆశిస్తున్నాను.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.