వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియాతి ప్రియమైన వరలక్ష్మి అక్కకు, ఎలా ఉన్నారు? కాకినాడను ఏకాకినాడను చేసి ‘ఇస్మాయిల్‌’ గారు వెళ్ళిపోయినా, మీరు ప్రతి ఏటా గుర్తుచేసుకునేట్లుగా చేయడం బాగుంది. గత సంవత్సరం ఆ సభకొచ్చే కదా కలుసుకున్నాం. మా పెళ్ళయిన తొలిరోజుల్లో మీనుంచీ వచ్చిన ప్రేమపూర్వక ఆహ్వానానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది మీ దగ్గరకు రావడానికి. సొంత తమ్ముడూ, మరదలు వచ్చినట్లే ఆదరించి, చీరపెట్టడం నన్నెంతో ఉద్వేగానికి గురిచేసింది. మీ చిరునవ్వు, కలుపుగోలుతనం ఆకర్షించాయి. వాడ్రేవు చినవీరభద్రుడు కల్సినప్పుడు కూడా మీ పట్ల తనకున్న అవ్యాజమైన ప్రేమను తల్చుకోకుండా ఉండరు. కుటుంబ బాధ్యతల్ని సమర్థవంతంగా మీరు నిర్వహించే తీరు, రచనలో మీరు చూపించే అద్వితీయమైన ప్రతిభ, పాటల్లో మీ స్వర లాలిత్యం, ఉద్యోగ నిర్వహణలో మీ సమర్థతా, ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో విషయాలు మాటల్లో దొర్లుతుండేవి. పాత పాటల్ని, సాహిత్యం ఒలుకుతుండే పాటల్ని మీ నోటే వినితీరాలని నాకారోజు తెల్సింది. నిజమక్కా! నేనేదో పొగడ్త కోసం చెప్పడం లేదు. మీరు అంత మెత్తగానే పాడుతున్నారు.

అక్కా! మీ సాహిత్యం విషయాల కొస్తే 1980లో అనుకుంటా మొదటగా ‘వెన్నెల ముగ్గు’ రాశారు. 1997లో ఉత్సవ సౌరభం’ పేరిట మొదటి సంకలనం తెచ్చారు. ఆంధ్రప్రభ దినపత్రికలో ‘ఆకులో ఆకునై’ శీర్షికను నిర్వహించారు. ‘సాహిత్య అనుభవం’, ‘సాహిత్య వ్యాఖ్యానం’ పుస్తకాలు రాశారు. ‘మా ఊరిలో కురిసిన వాన’ శీర్షికకు కాలమిస్ట్‌గా పనిచేశారు. ‘భారతీయ నవల’ శీర్షికతో ‘చినుకు’ సాహిత్య పత్రికలో దాదాపుగా 15 భాషల్లో వచ్చిన ఉత్తమ నవలల్ని పరిచయం చేస్తున్నారు. ‘పాలపిట్ట’ పత్రికలో ‘జాజిపూల పందిరి’ నిర్వహిస్తున్నారు. గిరిజనుల భూపోరాటం సమస్యపై ‘కొండ ఫలం’, మరికొన్ని కథలు సంకలనం చేశారు. ఆ ముఖచిత్రం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ‘చలం-సత్యాన్వేషి’ అనే పరిశోధనాత్మక వ్యాసానికి తెలుగు విశ్వవిద్యాలయం 2003లో పి.హెచ్‌.డి., గోల్డ్‌మెడల్‌ ప్రదానం చేసింది. మీరు చదవడమే జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. ఆర్థిక సంస్కరణల ప్రభావంపై అన్ని వర్గాలకు ఉపకరించే చక్కటి సందేశంతో నవల రాయాలని ఉందన్నారు కదా! మీరే రాయగలరు కూడా! సమాజం, వ్యక్తులు, కాల పరిస్థితులను ఆలోచించి రచయిత రచనలు చేస్తే పాఠకుల సంఖ్య తప్పకుండా పెరుగుతుందన్నారు. నేటి తరంపై ఆర్థిక సంస్కరణల ప్రభావం ఎంతో ఉంది. దీన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. పుస్తకాలు సమాజంలో సంస్కృతి, సంప్రదాయాల్లో వెంటనే మార్పులు తేలేవు. కానీ, పఠనాసక్తిని పెంచితే పుస్తకాలద్వారా మార్పు వస్తుందని ఒకసారన్నారు. సాహిత్యంలో మీకు మల్లంపల్లి శరభయ్య గారు ‘గురువు’ అన్నారు. కథలు అందరికీ జీవితంలో భాగమైపోవాలన్నారు. వక్తగా అధ్యక్షునిగా అనేక సభల్లో పాల్గొన్న మీరు, సాహిత్యం ద్వారా సమాజస్థితి మార్పుకై నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కథలు చదివితే సమాజం చాలావరకూ అర్థమవుతుందనీ, గత ఐదేళ్ళుగా మంచి కథలు వస్తున్నాయనీ, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నాయనీ అన్నారు.

ఎఫ్‌బి లో మల్లిక పులుగుర్త మీమీద అద్భుతమైన వీడియో పెట్టారు. మీ చిన్నప్పటి ఫోటోలు, ఊరి పచ్చటి జ్ఞాపకాలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌లో ‘గుర్తుకొస్తున్నాయి’, ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’, ‘మనసున మల్లెల మాలలూగెనే’, ‘చందురుని మించి…’, ‘బాబూజీ ధీరే చెల్నా…’ పాటలతో బాగా తీశారు. అప్పటి వీరలక్ష్మి అక్కను, సహచరుడినీ, రాజాను చూశాను. చిన్నప్పుడు చూసిన ‘రాజా’ను ఇప్పుడు చూస్తే చాలా పెద్దవాడయిపోయాడు. పెళ్ళి కూడా ఐపోయిందన్నారు. పాపాయిగా పిలవబడే మీ తీరు, ఆప్యాయత చాలా బాగా చిత్రీకరించింది. అన్నట్లు మీ పెళ్ళిని కూడా చూశాను. ఎన్నోన్నో అవార్డులను అందుకున్నారు. అవన్నీ చూస్తుంటే మీ జీవితపు నడకలో నేనూ ఉన్నాననిపిం చింది. ప్రేమాస్పదమైన మీ తీరు, సుతిమెత్తని మీ మనసు, మనుషులందర్నీ ప్రేమించే మీ గుణం, సాహిత్య పిపాస అన్నీ అందులో కన్పించాయక్కా! నా దృష్టిలో మీరు మిగతావారందరికంటే చాలా విభిన్నం. అవార్డుల కోసం, కీర్తి కోసం, తామే నెంబర్‌ వన్‌గా మిగలాలనుకుంటూ  సాహిత్య కారులు కాని కొందరీమధ్య, వాళ్ళకు వాళ్ళే నిచ్చెనలు తయారు చేసుకుని, ఆ పై తన్నేస్తున్నారు. చెలామణిలో

ఉంటున్నారు. వాళ్ళను గమనిస్తే ఎంత అసహ్యం వేస్తుందో, మిమ్మల్ని చూస్తుంటే అంత గౌరవం కలుగుతుంది నాకు. మీరొక నిశ్శబ్దపు నిండుకుండ. పచ్చి కుండలు విచ్చిపోతాయనుకోండి. ఎందుకో మీతో పంచుకోవాలన్పించింది ఈ విషయాల్ని. అక్కా! మీ వెన్నెలలాంటి ప్రేమతో నేనూ ఒక చల్లగాలినైనందుకు మురుస్తూ….

– శిలాలోలిత

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

One Response to వర్తమాన లేఖ – శిలాలోలిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో