జెండర్స్‌ మైండులోనే బాడీలో కాదు – జూపాక సుభద్ర

రచన, బిట్టు, వైజయంతి వాల్లు తెలంగాణ ట్రాన్స్‌ క్వీర్‌ ట్రిబ్యునల్‌కి జ్యూరీగా పిలిస్తే పోయిన. మొత్తం సభంత ఎల్జీబీటీ సభ్యులతో రంగురంగుల సువాసనల పూలతోటలా ఉంది. ఏ జెండర్‌ పెత్తనాలు, ఆధిపత్యాలు కనిపించకుండా ఆయిబాయిగ నిపిచ్చింది ఒక్క నిమిషం. కాని అవి గండ్లు బడిన గాయాల ముద్దలని తర్వాత అర్తమైంది. కుటుంబాల నుంచి పారిపోయి వచ్చి వ్యక్తులుగా, గుంపులుగా, లేదా గురువు ప్రాపకంలో ఉండే ట్రాన్స్‌ జెండర్స్‌ ఒక అసోసియేషన్‌గా ఏర్పడడం ఒక పెద్ద బలము, చైతన్యము.

సంఘంగా సంఘటితమై సమాజాన్ని ఆలోచింపజేయడం, సామాజిక ఉద్యమ శక్తుల సంఘీబావాలు పొందడము, వారి సామాజిక న్యాయాల్ని కొత్త కోణంగా కూర్చుకునే ప్రయత్నాలు ఆవిష్కరించు కుంటున్నారు. యీ ఆవిష్కరణలు సమాజంలో బలహీన సమూహాలకు చాలా అవసరము.

ట్రాన్స్‌ జెండర్లు సామాజిక బాధితులు. వారికి సామాజికంగా, రాజ్యాంగపరంగా ఎట్లాంటి రక్షణలు లేవు. వాల్లం చూడగానే దూరం కొట్టడం, అవమానిస్తూంటది సమాజము. వీరికి యిండ్లు యివ్వరు కిరాయికి, ఉద్యోగాలు లేవు, చదువులు కూడా చాలా తక్కువ. కుటుంబాల ఆదరణ ఉండది. ప్రభుత్వాలు          పట్టించుకోవు. మరి ట్రాన్స్‌జెండర్స్‌ ఎట్లా బత్కాలి? పని ఇవ్వరు వీల్లకు. మరి వారి జీవనమెట్లా… పగలు దుకాణాలు తిరిగి అడుక్కొని, రాత్రి సెక్స్‌ వర్క్‌ చేస్తేనే గాని బతుకు లేదు.

వీల్లు నిత్యము దినదిన గండంగా, నరకంగా పోలీసులు, గూండాలు, దాదాగిరి గాల్ల అత్యాచారాలకు, హత్యలకు గురయినా, కొట్టినా, బట్టలూడదీసి అవమానించినా, చెప్పనలవిగాని బూతులు తిట్టినా, వేధింపులకు గురిచేసినా అవి నేరాలుగా నమోదయ్యే చట్టాలు లేవు, శిక్షలు లేవు. ఎందుకంటే ట్రాన్స్‌జెండర్లు గూడా మనలాంటి మనుషులనే సోయి ఉండది, మన కుటుంబాల నుంచే వచ్చిన తల్లి పిల్లలని చెప్పుకోనీకి నామోషి. వాల్లపట్ల కనీస మానవీయతుండది. పశుపక్ష్యాదులకన్నా బ్లూ క్రాస్‌, ‘పెటా’ వంటి సంస్థలన్నా ఉన్నాయి. కానీ సాటి మనుషులైన వీల్ల మానవ హక్కుల మీద ఏ సంస్థలుండవు, ఏ పౌర సమాజాల గొంతులు పెగలవు.

‘సామాజిక న్యాయాలు ఆఖరి మనిషిదాకా చేరాలి’ అని ఉద్యమాలు చేస్తున్న ఉద్యమ పార్టీలు కూడా ఎల్జీబీటీ సమస్యల పట్ల, వారి సంఘర్షణల పట్ల పెద్దగా అవగాహన కనిపించదు. వీరిమీద జరిగే యీ హింస వ్యవస్థీకృతం అని అర్తం కావాలి. ట్రాన్స్‌జెండర్‌ల మీద జరిగే క్రూర హింసలు వ్యవస్థీకృతంగా జరుగుతున్నయి.

జీవిత సాక్ష్యాలుగా యీ మీటింగులో కొంతమంది తమ నిత్య హింసల్ని పరిచారు. ఆ సాక్ష్యాలు వింటుంటే మైండంత పుండయింది. అంటరాని అట్టడుగు మహిళల మీద సమాజం చూయించే వివక్షలు, హింసలకు, హత్యలు, అత్యాచారాలకు కనీసం ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్‌ చట్టమన్నా ఉంది. కాని ట్రాన్స్‌జెండర్‌ల మీద ఏ క్రూర నేరాలు జరిగినా రక్షణగా చట్టాల్లేవు, నిందితులకు శిక్షల్లేవు. రాజ్యాంగ రక్షణలు అసలే లేవు, హక్కులు అంతకన్నా లేవు.

పేక్‌ సోనియా: అందమైన ట్రాన్స్‌ జెండర్‌ వుమన్‌, మంచి డాన్సర్‌. ఆమె డాన్స్‌ చూసి ప్రేమిస్తున్నానని పెండ్లి చేస్కుందామని వెంటబడి నమ్మించి ఆమె డాన్స్‌చేసిన డబ్బులకు మరిగి డబ్బులివ్వనంటే ఆసిడ్‌ పోసిండు. ఆడవాల్ల మీద ఆసిడ్‌ దాడులు సంచలన వార్తల యినయి. ప్రభుత్వాలు కదిలినయి. కాని ట్రాన్స్‌జెండర్‌ మీద జరిగితే ఏ వార్త రాలే, ఏ చర్చలు జరగలే, ఏ ప్రభుత్వాలు, పౌర సమాజాలు కదల్లే.

ప్రవల్లిక: వీదీూ చేసిన చదువరి. ఊరి నుంచి సిటీకొచ్చి సెక్స్‌ వర్క్‌ చేస్తూ జీవనం సాగిస్తోంది. కూకట్‌పల్లి గూండా ఫక్తు హిజ్రాల పైసలమీన్నే బత్కుతుంటడు. యీ గూండా ప్రవల్లిక డబ్బులివ్వనని తిరగబడ్డందుకు బండతో బాది చంపేసిండు. నిషాను సికింద్రాబాద్‌ గూండా గ్యాంగ్‌ ఎత్కపోయి గ్యాంగ్‌ రేప్‌ చేసి చంపేసిండ్రు. యివన్నీ వార్తలు కాలే, యీ నేరస్తులకు శిక్షలు పడలే. యివన్ని వ్యవస్థీకృతాలే. రాజ్యాంగ రక్షణలు రూపొందాలి.

ఇక పోలీసు గూండాలను అదుపు చేయరు గానీ హిజ్రాల పట్ల గూండాలకన్నా ఘోరమైన హింసలు బెడ్తారని చెప్పిండ్రు. స్టేషన్‌కి పిలిచి న్యూసెన్సు చేస్తున్నారని, బట్టలూడదీసి ఆడామగా అని అవమాన కరంగా మాట్లాడి లాఠికి జండుబామ్‌ పూసి ‘ఆనెల్‌’లో గుచ్చి ఆనందిస్తారనీ, యిక ఆర్మీవాల్లు గూడా మా జాకీట్లల్ల, బ్యాగుల్ల్ల్లల్ల చేతులు బెట్టి మేము సెక్స్‌ వర్క్‌ చేసిన పైసలు గుంజుకుంటారని చెప్పిండ్రు. బలవంతంగా రేప్‌లు చేస్తారనీ… మా మీద నిత్యం రేప్‌లు జరుగుతుంటయని చెప్పిండ్రు.

మమ్మల్ని మనుషులుగా చూడడం లేదు, అసాంఘిక శక్తులుగా చూస్తుంది స్టేట్‌, సమాజం. నల్సా జడ్జిమెంట్‌ అమలు కావట్లేదు. తన జెండర్‌ను తాను గుర్తించు కునే హక్కు నల్సా జడ్జిమెంట్‌ ఇచ్చింది. పార్లమెంట్‌లో ట్రాన్స్‌జెండర్‌ బిల్లు పెండిం గులో ఉంది. బిల్లు తయారీలో మా ఎల్జీబీటీ లతో చర్చించి మా సూచనలతో బిల్లు రూపొందించాలి.

ట్రాన్స్‌జెండర్స్‌కి ప్రత్యేక టాయి లెట్స్‌ ఏర్పాటు చేయాలి. వాల్లకు ఇండ్లు కట్టించి యివ్వాలి. ముఖ్యంగా వారి చదువు ను బట్టి వారికి బతుకు తెరువు కోసం

ఉద్యోగాలను కల్పించాలి. రాజ్యాంగంలో వారికి ప్రత్యేకమైన చట్టాలేర్పాటు చేయాలి. బడ్జెట్‌ ప్రత్యేకంగా కేటాయించి ఎల్జీబీటి మనుషుల్ని ప్రభుత్వాలు ఆదుకోవాలి. జెండర్‌లు మైండ్‌లో ఉంటాయి గానీ శరీరాల్లో ఉండవనే చైతన్యాలు రావాలి సమాజానికి.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>