హెచ్ఐవి /ఎయిడ్స్ అవగాహన మీద చిన్న సర్వే

– భూమిక టీం

నిఖితా ఖట్ర
నాపేరు నిఖితా ఖట్రా. మేము మార్వాడీస్. మా నాన్నగారికి జువెల్లరీ షాపు వుంది. మేము సాయిరాం నగర్‌లో వుంటున్నాం. ఇక్కడకు దగ్గరలోనే ఒక కాలేజీలో కామర్స్ కోర్స్ చదువుతున్నాను. నా వయసు 17 సంవత్సరాలు. నాకు ఎయిడ్స్ గురించి తెలుసు. అది సెక్స్ వల్ల, రక్తం మార్పిడివల్ల వస్తుందని తెలుసు. టి.విలో చాలాసార్లు చూశాను. కాని ఆశ కార్యక్రమం చూడలేదు. స్టార్ టి.వి, ఈ టి.విలో చూశాను. రెడ్ రిబ్బను ఎయిడ్స్ కి చిహ్నం. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అని తెలుసు. మా కాలేజీలో మా స్నేహితులం అప్పుడప్పుడు ఎయిడ్స్ గురించి మాట్లాడుకుంటాం. కాని ఇప్పటివరకు ఎయిడ్స్ వున్నవారిని చూడలేదు.

జానకి
నాపేరు జానకి, వయసు 43 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు. నా భర్త ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తాడు. మేము కీసరఘట్‌లో నివసిస్తున్నాం.నేను గృహిణిణి. నాకు హెచ్ఐవి అంటే ఏమిటో తెలీదు. కాని ఎయిడ్స్ అనే మాటని చాలా రోజుల్నించి వింటున్నాను. బహుశా దానికి మందు లేదనుకుంటాను. అది వచ్చినవారు తప్పకుండా చనిపోతారని పేపర్‌లో చదివాను. అది అక్రమ సంబంధాలు వుంటే వస్తుందని మా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే మా చుట్టాల్లో ఒకబ్బాయి ఎప్పుడూ వేశ్యల దగ్గరికి వెళుతూ వుండేవాడు. అతనికి కూడా ఎయిడ్స్ వచ్చిందని చెప్పుకున్నారు. ఇప్పుడు అతను ఇంట్లో లేడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. నేను ఆశ కార్యక్రమం ఎప్పుడూ చూడలేదు. ఇంకా ఇంతకంటే వివరాలేమీ తెలియవు.

వనజ
నాపేరు వనజ. పనిమనిషిగా పని చేస్తున్నాను. నా వయసు 28 సంవత్సరాలు.నాకు ఒక కూతురు, నా భర్త ప్రైవేటు కంపెనీలో వాచ్‌మెన్. నేను ఎయిడ్స్ గురించి వినలేదు. కాని క్యాన్సరు గురించి విన్నాను. మా ఆయన బీడీలు ఎక్కువగా కాలుస్తాడు. తాగుతూ వుంటాడు కూడా. ఎక్కువ తాగినా, బీడీలు కాల్చినా క్యాన్సరు వస్తుందని టి.విలో చూశాం. ఎయిడ్స్ గురించి చూసే వుంటాం కాని గుర్తులేదు. మా బస్తీలో ఎవరూ దాని గురించి మాట్లాడుకోరు. ఆశ కార్యక్రమం చూడలేదు.

సుమ
నాపేరు సుమ.నా వయసు 17 సంవత్సరాలు. నాకు ఎయిడ్స్ అంటే తెలుసు. మా స్కూల్‌లో చెప్పారు. ఆశ పుస్తకాలు చదవడం ద్వారా తెలిసింది. స్కూల్‌లో చాలా డిటేల్‌గా చెప్పారు మ్యాప్‌ల ద్వారా. హెచ్ఐవి ద్వారా ఎయిడ్స్ వస్తుందని తెలుసు. ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుందో తెలుసు. సెక్స్ వల్లనే ఎక్కువగా వస్తుంది. మేం డాక్టర్ దగ్గరికి వెళితే సిరంజీ తీసుకొని పోతాం. ఇతరులతో సంబంధాలు పెట్టుకోకుండా వుంటే ఇది ఇంతగా వ్యాపించదు.

శోభ
పని మనిషిగా చేస్తున్నాను. నాకు ఎయిడ్స్ గురించి తెలుసు. టివిలో చూశాను. ఆశ ప్రోగ్రాం గురించి వినలేదు. వేరేవాళ్ళతో సంబంధం, రక్తం ద్వారా, సూదీ ద్వారా హెచ్ఐవి వస్తుంది. మనం జాగ్రత్తలో వుండాలి. డాక్టర్ దగ్గరికి పోతే సూదులు తీసుకొని పోతాం. కడుపులో పాపకు వస్తుందని తెలుసు. వేరే వాళ్ళ దగ్గరికి పోకుండా అందరూ భయం పెట్టుకోవాలి.మొదట్లో మాకు తెలియదు. టివిలో వార్తలు వింటున్నాను. అందరూ మంచిగా వుండాలి. మగవాళ్ళందరూ వేరే సంబంధాల జోలికి పోకుండా వుండాలి. పిల్లలుగాని, భర్తగాని జాగ్రత్తగా వుండాలి. గవర్నమెంటు అందర్నీ ఆదుకోవాలి. ఎయిడ్స్ వచ్చిన వాళ్ళను ఆదుకోవాలి. నేను ఏం చదువలేదు కాని టివి వల్ల చాలా తెలివి వచ్చింది.

ప్రేరక్ విజయలక్ష్మి, నిరంతర విద్యాకేంద్రం, బాగ్ అమీర్, కూకట్‌పల్లి
శిబిరము ద్వారా ఎయిడ్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఆశ ప్రోగ్రామ్ గురించి తెలియదు. కలిసి తినడం వల్ల ఎయిడ్స్ వ్యాధి సోకదు. చేతులు కలిపితే రాదు. బయటవారితో లైంగిక సంబంధం వల్ల ఎయిడ్స్ వ్యాధి సోకుతుంది. హెచ్ఐవి ఉన్నవారిని ఆదరించడం మన బాధ్యత.

డి. శ్రీలత, అసిస్టెంట్ డి.డి, హైదరాబాద్.
నేను ఏ.పి. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఉద్యోగం చేస్తున్నాను. నా ఉద్దేశ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పుదోవ పట్టకుండా, చెడు స్నేహాలకు దూరంగా వుండేలా చూసుకోవాలి. సమాజంలో వ్యాపించి వున్న హెచ్.ఐ.వి / ఎయిడ్స్ గురించి వారితో చర్చించి, వ్యాధి ఎలా సంక్రమిస్తుందో, దాని నివారణ ఏమిటి అని విషయాలు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. వారిలో వుండే అనుమానాలను, సందేహాలను గురించి మాట్లాడేలా ప్రోత్సహించాలి. చదువు విలువ గురించి వారికి చెప్పాలి. వారిని చక్కని బాటలో నడిపించే బాధ్యత తల్లిదండ్రులదే.

పుష్ప (స్టూడెంట్)
నాకు ఎయిడ్స్ గురించి తెలుసు. ఎయిడ్స్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకున్నాను. తొమ్మిదవ తరగతిలోనే ఎయిడ్స్ గురించి పోస్టర్‌ల ద్వారా, చెప్పడం ద్వారా తెలుసుకున్నాను. ఎయిడ్స్ గురించి 10వ తరగతిలో చదివాను. మేడం వాళ్ళు వచ్చి చెప్పారు. హెచ్ఐవి తర్వాత ఎయిడ్స్ వస్తుందని తెలుసు. ఆశ గురించి విన్నాను కాని తెలియదు. స్టూడెంట్స్ కి అవగాహన లేకపోవడం, గైడెన్స్ లేకపోవడం, టీనేజ్లో వచ్చిన ఆలోచనల వల్ల ఏది మంచో చెడో తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు బాగా చదువుకుని వుంటే ఆలోచించే శక్తి వుంటుంది. ఆలోచన లేకుంటే ఏది తెలుసుకోలేకపోతారు. ఎయిడ్స్ వస్తే తెలివితక్కువతనం వల్ల వారిని దూరం చేస్తారు, కానీ అది అంటురోగం కాదు.

ఎయిడ్స్ గురించి చాలామందికి తెలియదు. గ్రామాల్లోని వారిని మోటివేట్ చేయడం, చదివించడం చేయాలి.

మాది మహబూబ్‌నగర్. ఆశ ప్రోగ్రాం లాంటివి సక్రమంగా జరిగితే విలేజ్ అందరికి తెలుస్తుంది. ఇంతవరకు అక్కడ అలాంటివి జరిగినట్లు లేదు.

ఇల్లీగల్ రిలేషన్స్ సమాజంలో వున్నాయి.తల్లిదండ్రులు పిల్లల్ని మోటివేట్ చేస్తుండాలి. వాళ్ళను చెడుమార్గంలో పోకుండా చేయాలి. మీడియాలో ఎక్కువగా ప్రేమలు, పెళ్ళిళ్ళు చూపిస్తున్నారు. అవి చూసి బయట కూడా ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు. టీవిలో చానల్స్ అన్ని న్యూస్ కోసం పరిమితం చేయాలి. వారికి అవగాహన ఇవ్వాలి. ఎయిడ్స్ వచ్చిన వారికి ఏదైనా పని చూపించాలి. వారిని మనలో కలుపుకోవాలి. జీవితం ఇంతే అని అనుకోకుండా వారికి బతకడానికి ప్రోత్సాహం ఇవ్వాలి.

స్వప్న, బాగ్ అమీర్.
హెచ్ఐవి గురించి తెలియనివారికి తెలియచెప్పటం చాలా కష్టతరమైనది. పిల్లల నడవడిని సరైన మార్గంలో వుంచడం, తెలియని విషయాలను టివీ ద్వారా, రోడ్డుపై పోస్టర్‌ల ద్వారా మరియు నిరంతర విద్యా కేంద్రాల ద్వారా, అవగాహన సదస్సుల ద్వారా తెలియజేయడం జరగాలి. రోడ్డుపై రబ్బరు కండోమ్‌లను కట్టడం చూడడం జరిగింది.దాన్ని చూసి తెలుసుకున్నాము.

కమల, ఇందిరా కాలనీ, కె.పి.హెచ్.బి
హెచ్ఐవి వ్యాధి హెచ్ఐవి గురించి డాక్టరు సలహా ద్వారా అడిగి తెలుసుకోవడం జరిగింది. హెచ్ఐవి వ్యాధి రక్త మార్పిడి వల్ల కూడా వస్తుంది. గర్భవతిగా వున్న స్త్రీలలో కూడా హెచ్ఐవి సోకుతుందని టివీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. పుస్తకాలలో కూడా చదివి తెలుసుకోవడం జరిగింది.

రమ, హబ్సిగూడ
నేను పని మనిషిగా పని చేస్తున్నాను. నాకు హెచ్ఐవి, ఎయిడ్స్ అంటే తెలియదు. నేను ఎక్కువగా టి.వీ చూడను. మేము వుండే దగ్గర కూడా ప్రచారం ఎవ్వరూ చేయలేదు. ఇప్పుడు వింటున్నాను. ఎవరైనా వచ్చి దీని గురించి చెప్పితే బాగుంటుంది.

ప్రవీణ, ఉప్పల్
నేను ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఎయిడ్స్ గురించి తెలుసు. పదవ తరగతి విద్యార్ధులకు వేరే సంస్థల నుండి వచ్చి వారికి ఎయిడ్స్ గురించి వివరించారు. దేనినుంచి వస్తుందో, ఎలా వస్తుందో వివరంగా వారికి తెలియ జేయడం జరిగింది. ఆశ ప్రోగ్రామ్ గురించి టీవీలో వినడం, చూడడం ద్వారా తెలుసుకున్నాను. ఇప్పుడు పిల్లలు ఎయిడ్స్ గురించి బాగానే అవగాహన చేసుకుంటున్నారు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.