ఇంకా పరిధిలోనే స్త్రీల బతుకు వ్యవసాయం

శిలాలోలిత
ఇటీవల రాస్తున్న కవయిత్రులలో హిమజ కవిత్వం సాంద్రత, ఆర్ద్రత నిండివున్న కవిత్వం. చిన్నచిన్న మాటలతో లోతైన అర్థాన్ని చెప్పడం ఈమె ప్రత్యేకత. ‘ఆకాశమల్లె’ తొలి కవితాసంపుటి (2006).
భావగాఢత వున్న ఈమె ప్రకృతిలో మమేకమై కవిత్వీకరించడం గమనిస్తాం.
పరుషపదాలు, వేగం, అవగాహనా రాహిత్యం ఈమె కవిత్వంలో కనిపించవు.
సరళమైన వ్యక్తీకరణతో, విభిన్న కవితావస్తువుల్ని తీసుకుని కొత్త కోణంతో పరిశీలించడమే కాక, ఊహాతీతంగా వ్యక్తీకరించడం ఈమె కవిత్వ లక్షణం.
సామాజిక విషయల పట్ల తక్షణ స్పందనను వ్యక్తీకరిస్తుంది.
శారీరక సంచలనాల సవ్వడిలో నెచ్చెలిని వెతుక్కుంది. ఒక కొత్త వూహ కొత్త దనం, మామూలు విషయల్ని సైతం, విభ్రమకు గురిచేసే కోణంతో ఆవిష్కరించే నైజమీమెది (హిస్టరెక్టమీ).
పూలక్కూడా హృదయ ముంటుందని పుష్పవిలాపం ఎప్పుడో చెప్పింది. మృదు భాషిణి ఐన ఈమె కవిత్వం కూడా ఆ సున్నిత స్పర్శతోనే సాగింది.
కవిత్వంలా జీవించడం ఒక కళ. కవిత్వమే జీవితమనుకోవడం ఒక ఆదర్శం. కవిత్వం లేకపోతే జీవనరాహిత్యం అనుకోవ డం, ఒక మమేకత్వం. ఈ మూడు లక్షణాల సమహారమే హిమజ కవిత్వం.
కార్పోరేట్‌ వైరుధ్యాల గురించి, అపార్ట్‌మెంట్‌ కల్చర్ల గురించి, గ్లోబలైజేషన్‌ గురించి, స్త్రీల జీవితాలపై దాని ప్రభావం గురించి, ప్రతిరోజూ అతనో పద్యమైతే బాగుండుననే ఆశా దృక్పథాల గురించి, అతడిచ్చిన పదెకరాల పరిధిలోనే ఆమె చేసే బ్రతుకు వ్యవసాయం గురించి, ఇలా వైవిధ్యభరితమైన అనేకాంశాలు ఆమె కవితావస్తువైనాయి.
మనకోసం మనం/కాస్తంత వెసులుబాటు చేసుకుందాం/ మనల్ని మనం మరికొంత ప్రేమించుకుందాం/ లైఫ్‌, నీడ్‌ నాట్‌ పాజ్‌ ఎట్‌ వెనోపాజ్‌ (విరామం)
‘వస్క్‌’ కవితలో రెబెకా మేలిముసుగెందుకేసుకుంది అని ప్రశ్నపై ప్రశ్నలు వేసుకుంట ఇలా అంటుంది.
‘అయినా ముసుగులో ఉపిరాడక/ఎన్నాళ్ళు దాక్కుంటావు/నిర్ణయభారమూ నీదే/ పర్యవసానమూ నీదే అయినవేళ/ వేదనావృత్తంలో ముల్లులా/ఊగిసలాడే కంటే/ స్థైర్యంతో నిబ్బరంగా నిలబడే/ ధైర్యమే ఇప్పుడు కావాల్సింది’ – అని జీవన తాత్వికతను వెల్లడిస్తుంది. ‘వాళ్ళు నలుగురు’ కవిత తోటికోడళ్ళ మీద రాసింది. ఉమ్మడి కుటుంబాల్లోని ఆప్యాయతలు, పనులను విభజించుకొని చేసుకొంట, ప్రేమజీవనాన్ని గడిపిన కమ్మని జీవితాన్ని స్మరించుకుంట రాసిన, నా దృష్టికి వచ్చిన తొలికవిత్వేవె అన్పించింది.
‘ఓ పెద్దింటి వటవృక్షానికి/ తడియర నీయని వేర్లు తామయ్యరు’ – అనేస్తుంది.
ఘంటసాల నిర్మల ‘జ్వరతీరాన’ అనే కవితను ఎంతో భావోద్వేగంతో అద్భుతంగా రాసింది. హిమజ కూడా ఊపిరాడని ఇంటి పనుల మధ్య విసిగివేసారిన స్త్రీకి ఈ జ్వరం ఎలాంటిదో ‘జ్వరవనిని’ కవితలో –
నాలోకి నేను ప్రయణించడానికి/నా అలసటని నిమరడానికి/ జ్వరమొక అవకాశం – అని వివరిస్తుంది.
‘అప్రమేయం’, బిలేటెడ్‌ గ్రీటింగ్సు, ప్రేమ, శోధన, బుథియ…రే…బుథియ…! రెమా…రెమా, రాయనినాడు…, భావన, సైలెన్స్‌ ప్లీజ్‌, జాడ, సంశయం, లివింగ్‌ టుగెదర్‌, ఆకాశమల్లె, పాంచభౌతికం, ఎదురుచూపు, అంతే…మరి…, ఆలంబన, నిదురలాంతరు, వెన్నెల ఎరుక, మనో మైదానం, ఒక ప్రశ్న, వ్యధాభరితం ఇలా చెప్పుకుంటపోతే ఏ కవిత సౌందర్యం దానిదే, మనసుని ఒకచోట ‘ఇంకుడు గుంత’తో పోలుస్తుంది. చేదిన కొద్దీ పెరిగే భావోద్వేగాల రుపనిర్మాణమది.
తనలోంచి కవిత్వజల ఉబికివచ్చి, అక్షరరపాన్ని తొడుక్కున్నప్పుడు భావన ఇలా ఉంటుంది అంటుంది హిమజ
‘నాలో సుళ్ళు తిరిగే భావాలకు/ రెక్కలొచ్చి పద్యమైతే, ప్యూపా నుంచి సీతాకోకచిలుక/ ఎగిరివెళ్ళినంత స్వేచ్ఛగా/ రమ్యంగా వుంటుంది.
హిమజ కవితాశీర్షికలు కూడా క్లుప్తంగా, గుప్తంగా ఉంటాయి. కానీ చాలాచోట్ల… చుక్కల నిర్మాణం ఎక్కువగా కనబడింది. ఇంకా తాను చెప్పాల్సింది చాలా వుందని ఆమె భావించడం, అన్ని విషయల్ని వ్యక్తీకరించడానికి, బిడియం, మొహమాటం జమిలిగా వుండడం కారణమేవె అన్పించింది. తనకు కూడా కనబడని, తనని ఆవరించుకొని వున్న సన్నని మంచుతెరను తీసివేసి, తాననుకున్న భావాల్ని, అంతే స్వచ్ఛంగా, స్వేచ్ఛగా రచించాలన్నదే నా ఆకాంక్ష. లోతైన ‘చుట్టుచపు’ వున్న కవయిత్రి ఈమె. ఎంతో వుత్తమ కవిత్వాన్ని రచించగలిగే శక్తి వున్నందున ఆమె సాహితీ వ్యవసాయం మరింతగా పదును తేలాలని మనస్పూర్తిగా భావిస్తున్నాను.
ప్రస్తుతం హిమజ హైదరాబాదులోనే నివసిస్తున్నారు.

Share
This entry was posted in మనోభావం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో