మా నోట్లో మట్టి కొట్టిన యెట్టి కొలువులు – జూపాక సుభద్ర

ఓమ్మా… జెర నువ్వయిన జెప్పు, 20, 25 ఏండ్లకాంచి గీ సెక్రెటరీ ఆఫీసుల వూడిసి, కడిగే పంజేత్తన్నమ్‌. గిన్నేండ్ల కాన్నుంచి తీసెయ్యలే… కాని గిప్పుడు మమ్ముల తీసేత్తన్నము యెల్లిపోండ్రని యెల్లగొడ్తండ్రు, యాడికి బోము సెప్పుండ్రి. పిల్లల గల్లోల్లం, గింత అదాటున పోండ్రంటే… ఎట్ల సావాలె, యేడికి బోతము, పిల్లలు మేము బువ్వలేక ఆకలికి సచ్చిపోతము. తెలంగాణ కొట్లాటలు జరిగినపుడు మేము లేందెల్లిందామ్మ, పొద్దు పొడిసిన కాన్నుంచి పొద్దుమీకే దాక యెట్ల లొల్లి జెయ్యమంటె గట్లెనే లొల్లి జేసినం. రోడ్లమీదంత మా మందే, మా సీపర్లు, అటెండర్లేనాయె. గీ సెక్రెటరాపీసుల మాతోనే బొబ్బ బుట్టింది, మాతోనే లొల్లి లొల్లిగయింది. మా మంది లేకుంటే సెక్రెటరి ఆఫీసుల వేరే పైల్ల పంజేసేటోల్లు యెవరున్నరు యెవరచ్చె. అంత ఆంధ్రోల్లేనాయె. గుంపంత మా స్లీపర్లదేనాయె.

రోడ్లమీద, ఆపీసు ముంగట ఎట్ల ఒర్లమంటె గట్లెనే ఒర్లినము. ఎండల నీల్లులేకున్నా, బువ్వలేకున్నా బ్యానర్లు మోసినం, కట్టినము, కలపత్రాలు బంచినము, బిల్డింగులన్ని దిరుక్కుంట ‘జై తెలంగాణ, జై తెలంగాణ’ అని లొల్లిజేస్తిమి. తెలంగాణొత్తె మీకు పర్మనెంటరీ జేత్తమనంటె ఆశపడ్తిమి. మాకు పర్మనెంటు వద్దేవద్దు, మా కొలువులు ఊడబీక కుంటె సాలు. ఏండ్లకాన్నుంచి గీ ఆఫీసును నమ్ముకొని బత్కవడితిమి, గియ్యాల మమ్ముల ఒర్రంగ యింటికి బొమ్మంటె యెట్లబోదుము. తెలంగాణ కోసం ఆడినం పాడినం, లొల్లి జేసినం, కొట్లాడినం.

ఆందర్రాండ్రి రేపు తెలంగాణత్తె మీ కొలువులు పర్మనెంటు జేత్తమని యెంత ఆశబెట్టిండ్రు లీడర్లు. ఓడదాటెదాక ఓడమల్లయ్య ఓడదాటినంక బోడ మల్లయ్య’ అన్నట్లే జేసిండ్రు. పర్మనెంట్లు పాడుగాను మా ఉన్న కొలువులు యిట్లనే సేసుకోనిత్తె సాలు. మిమ్ముల యెల్లగొడ్తున్నమ్‌ యెల్లిపోండ్రి పనిలేదు జీతం లేదని సెప్తండ్రు నోటి మాటగనే. యెల్లగొడ్తున్నట్లు కాయితమిత్తరట, మాకు యే కాయితమియ్యరట. యెట్టి కొలువులాట మాయి. మా సేత సెదలుబట్టె.

ఊడిసూడిసి సీపురు పుల్లలోలె అరిగిపొయినయి సేతులు, కక్కోసులన్ని గిన్నేండ్ల కాంచి కడిగితే… గియ్యాల పొమ్మనంగనే పోవాలట. ఏ లీడరు మాట్లాడ్తలేడు. గిప్పుడు వాల్లకు మా అవసరము తీరిపాయె. మాకెవరు సాయం జెయ్యాలె, మా గోస యెవరింటరు? గా లీడరు సాబులు గిప్పుడు దొర్కుతలేదు. తెలంగాణ కొట్లాటప్పుడు ‘మీ ఆడోల్లందరు ఎప్పుడు బిలిసినా ఉరికి రావాలె, రేపు తెలంగాణ వచ్చినంక మీకేంగావాల్నొ గయన్ని వత్తయి, గందికే బాగా మొత్తుకోండ్రంటె గట్లెనే జేసినం. మా మందల మందల ఆడోల్లం జూయించుకొని, మా మందలను ముందట బెట్టుకుని లీడర్లయిండ్రు.

బత్కమ్మలు మోసింది, బోనాలు మోసింది మా సీపరోల్లమే. గీ ఆఫీసుల తెలంగాణ లొల్లిజేసింది మేమే. గియ్యాల మమ్ముల పనికి రావద్దంటే ఒక్క లీడరు కనబడ్తలేడు దొర్కుతలేడు. దొర్కినోడు దగ్గెర్రానిత్తలేడు. తెలంగాణ లొల్లికోసం మా కడుపుల తల్కాయ బెట్టినట్లు మాట్లాడిండ్రు. అమ్మా, అప్పా అని మా సుట్టు దిరిగి మాకు బోలెడాశెలు బెట్టిండ్రు. గిప్పుడే లీడరు మా కొలువులు ఊస్టు జేత్తె మాట్లాడ్తలేడు.

20, 25 ఏండ్ల సంది గీ ఆఫీసుల మురికి లేకుంట, సెత్త లేకుంట నున్నంగ అద్దమోలె మెరిపిచ్చిన మమ్ముల తీసేసిండ్రని తెలిసి గేటు కాడ పోలీసు గూడ రానిత్తలేడు. మా ఐడి కార్డులు తీస్కుండ్రు. మా గోస సెప్పుకునే దానికి ఆపీసులోపటిగ్గూడ రానిత్తలేరు. గిసోంటి సెరలు యెవ్వలికి రావద్దు. ఒక్కలు గాదు యిద్దరు గాదు 40 మందిని తీసేసిండ్రు. పదిరువయి మందత్తండ్రు గేటుకాడ అంగలార్సి ఎవరన్న తెల్సిన లీడరు సారో, తెల్సిన మేడమో అదీ గేటుకాన్నుంచి నడుసుకుంట పొయేవాల్లను ఆపి తమ గోడు చెప్పుకుంటుండ్రు. ఔట్‌సోర్సింగ్‌ స్వీపర్లు, స్కావెంజర్లు, అట్లా ఓ సారి నాకగపడి వాల్లగోడంత యెల్లబోస్కుండ్రు.

ప్రభుత్వాలు గూడ యెట్టికి 25 ఏండ్లు వెయ్యి, పదిహేను వందల కాన్నుంచి చేస్తుండ్రట. సెక్రెటేరియట్‌ల తెలంగాణ

ఉద్యమం ప్రధానంగ వాల్లతోనే నడ్సింది. లీడర్లు గూడ వాల్లకు తెలంగాణొస్తె స్వర్గమే అని ఆశ సూయించి వాల్ల నినాదాన్ని, వాల్ల శ్రమని, వాల్ల ఆశల్ని ఆగం జేసిండ్రు. యీ రోజు వాల్ల యెట్టి కొలువులు బొయి ఆఫీసు బైటి రోడ్డుమీద బడి, కనీసం ఆఫీసు లోపలికి కూడా అనుమతులు లేకుండా, వారి గోడును కనీసం వినే మానవత్వాలు కూడా చూయిస్తలేరు తెలంగాణ లీడర్లు.

ఆ అంటరాని ఆడవాల్లు, ఆ వెనకబడిన కులాల ఆడవాల్లు, ఊడ్చే, కక్కోసులు కడిగే ఆకరి, హీనవృత్తులు చేసే పనులను కూడా వారికి యివ్వకుండా ముందస్తుగ చెప్పకుండా అదాటుగ రేపట్నుంచి రావద్దనడంను ఏ చట్టాలు మాట్లాడవా, ఏ మీడియా కన్ను బడదా, అక్షరం ఆనదా!

 

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.