ఇట్లు.. ఓ ఆడపిల్ల – కె. శాంతారావు

ఆధునిక కవిత్వం అనేది నిజాయితీగా చేసే ఒక విస్పష్ట ప్రకటన. ఇంకా చెప్పాలంటే… ఆత్మఘోషను బాహ్య ప్రపంచానికి విన్పించే ఓ పొలికేక. గంగవరపు సునీత ఓ కవితా సంపుటితో ఆ పనే చేసింది.

”ఇట్లు ఒక ఆడపిల్ల” అంటూ సమాజానికి లేఖను సంధించి ఆధునిక ఆడపిల్ల గొంతుకను విన్పించింది.

‘కవిత్వం నాకు అమ్మలాంటిది. ఎవరూలేని ఒంటరితనంలో తోడుగా నిలబడుతుంది. అలసిపోయిన ఆలోచనా విధానాలకు కొత్త రూపునిస్తుంది. నాతో పుట్టి నాతోనే ఉంటూ, అక్షరాల్లో నన్ను నిక్షిప్తపరుచుకుని నా తర్వాత కూడా జీవింపచేసే నా కవిత్వం అంటే నాకెంతో ఇష్టం’ అని సునీత తన గురించి ‘ఒక నిముషం’గా చెప్పుకుంది.

కవిత్వం అంటే ఆత్మస్ధైర్యమని, నవతకు, నవశక్తికి అది సంకేతమని వేరుగా చెప్పనక్కర్లేదు కదా!

‘ముల్లులు’ చేసే దురాగతాలకు ‘ఆకుల’ను బాధ్యులను చేయకండి, అలాంటి ముల్లులను విరిచేయండి. ఆకులను పచ్చగా చిగురించనివ్వండి’… అంటూ స్వీయానుభూతిగా హితవు పలికింది.

కవితా ఖండికలతో పాటు లేఖా సాహిత్యం కూడా ఉన్నదా పుస్తకంలో.

‘మీ ల్యాప్‌ట్యాప్‌ దుమ్ము దులిపి జాగ్రత్త చేశాను. మీ బూట్లు తుడిచి, సాక్స్‌ ఉతికిపెట్టాను’ అని ‘శ్రీవారికి సగటు భార్య’ లేఖ రాస్తే… ‘సైనికుడి లేఖ’లో… నే వచ్చేవరకు చెక్కిట చేయిజార్చి అభిసారికలా ఎదురుచూడకు. ఒకవేళ రాలేకపోతే.. నీ కన్నీటితో నా శరీరానికి స్నానం చేయించాలని అనుకోకు. వీరమరణం చెందిన సైనికుడి భార్యగా బ్రతికినంతకాలం ధైర్యంగా, అపరిష్కృత సమస్యలకు సమాధానం వెతుకుతూ, స్ఫూర్తిని పంచే చైతన్య దీపికవై ముందుకు సాగిపో’ అని భార్యకు రాస్తాడు.

ఒక లేఖ పురుషాధిక్య సమాజం సృష్టించిన అంతులేని అణచివేత, అమాయకతను చాటితే, మరో లేఖ దానిని ప్రతిఘటిస్తూ బాధ్యతతో ముందుకు సాగిపొమ్మని పిలుపునిస్తుంది.కోడి కూయకముందే తెల్లారిన ఆమె జీవితాన్ని ఎర్రటి ఎండలో పంటచేలలో నడుం బిగించిన ఆమె పనితనాన్ని సూరీడు మెచ్చుకోలుగా చూస్తుంటాడు.

మొగుడి కష్టం సారాయి ప్యాకెట్‌ అవుతుంది.

నులక మంచంమీద నిస్సహాయంగా వాలిన ఆమె గుండెలమీద ఏడాది బుడ్డోడు ఈడ్చి తంతుంటాడు.

ఈ వచన కవిత్వం ‘అవిశ్రాంత’గా చక్రబంధమైన గ్రామీణ వ్యవసాయ కూలి మహిళ దైనందిన జీవితాన్ని కళ్ళకు కడుతుంది.

‘అక్రమ సంతానం ఎక్కడా ఉండదు. అక్రమ తల్లిదండ్రులే ఉంటారు. తన ప్రమేయం లేకుండా అలా జనించిన బిడ్డ గురించి రాస్తూ… యవ్వనం శృతి చేసిన వీణపైన శాపంలా ధ్వనించిన శృతి నీవు. కట్టుబాట్లు ఇనుప సంకెళ్ళ మధ్య దుఃఖాన్ని బంధించి, మౌనంగా నీ మృత్యువును చూస్తున్న ఈ అమ్మను పెద్ద మనసుతో క్షమించు తల్లీ’ అని ‘మన్నించు బిడ్డ’లో వాపోతుంది.

తొక్కుకుంటూ పోతే, తక్కువగా చూస్తే, ‘గడ్డిపూలు గర్జించవా మరి’ అని హెచ్చరిక చేస్తూనే…

‘అవును ఇప్పుడు మరోసారి తలవంచింది. కట్టుబాట్ల కడలిలో ముంచి సాంప్రదాయాల పేరుతో శాసించి, మొగుడు చచ్చిన ముండనే ముద్ర వేశాయి’ – ఇదో ‘సాంస్కృతిక అవమానం’ అని ధ్వజమెత్తింది.

నేనొక ప్రాణిని, ప్రకృతి పరవళ్ళు త్రొక్కినా, ప్రపంచం తల్లకిందులైనా, పర్వతాలు పెకిలించబడినా, ప్రాణాలు పైకెగిరిపోతున్నా, నా కట్టుబాట్ల ప్రభావం నన్ను చుట్టుకునే ఉంటుంది. కాలం కదిలినా, కాటికి కదిలినా మారని మా బతుకుకు విముక్తి లేదు. అందుకే అనిపిస్తుంది ‘ఆడపిల్లగా పుట్టకూడదని. పుట్టినా ఈ సమాజాన్ని సంస్కరించే ఆయుధంగా మారాలని…’ కోరుకుంటుంది.

‘ఇక్కడి బాల్యం మట్టివాసనతో మేల్కొంటుంది.

పాలుతాగి ఆటలాడాల్సిన పసి ప్రాయం ఎర్రని ఎండలో

మిరపకోతలో, వరినాట్లకో వంగి మాడిపోతుంది

ఏ ప్రగతికి నోచుకోని ఈ చిన్నారి శ్రామికులు గుడిలో ఉండని

నిస్వార్ధ దైవాలు’ అని చి(మ)ట్టి చేతులపై ఆపేక్షను ఓ తల్లిలా ఒలకబోస్తుంది.

ఇలా ప్రతి కవితా ఖండిక ఓ సానుకూల సామాజిక స్పృహ, సంవేదనతో పాటు కవితాత్మ ముప్పేట జడగా జాలువారి మనముందుంటుంది. ఇలా మొత్తం 65 ఉన్నాయి.

అందుకే సాంస్కృతిక కార్యకర్త దేవి – ”ఊహల్ని నిజాలు చేసుకోవడానికి

ఉద్వేగం అవసరం. చైతన్యం రక్తంలా ప్రవహించడం అవసరం.’ అంటూ సునీత కవితల్లోని నిజాయితీ తపనకు స్పందనగా అభినందన అక్షరమాల వేసింది.

ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్‌ – సునీత తన అస్థిత్వాన్ని అక్షర నేపధ్యాన్ని, సామాజిక చైతన్యాన్ని తొలి పుస్తకంలోనే బలంగా కవిత్వీకరించిందని కితాబు ఇచ్చారు.

శ్రామిక వర్గం పట్ల నిమగ్నత, నిబద్ధత కల్గిన రచయితలు, కవులు కార్యకర్తల సాంగత్యంలో సునీత కవితలు భవితలో మరింతగా రాటుదేలి సమాజాన్ని రాపాడిస్తాయని ఆశిద్దాం.

 

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో