హైతీపజ్రల కోసం – హెచ్చార్కె

దుఃఖం నేను

దుఃఖం నువ్వు

దుఃఖం మనం

దుఃఖం-దుఃఖం-దుఃఖం

దుః…………………….ఖం

ఆఫ్రికా శరీరంలోనికి, లోపలి ప్రేవుల్లోనికి

ఇంకిపోయిన యీ మృత రక్తాన్ని

యెంత నలుపెక్కిన ఆకాశ వర్షమూ

కడిగేయలేదు

ఆఫ్రికా గర్భం పశ్చిమార్థ గోళంలో

నెత్తురోడుతుంది

ఆమె శిరస్సు నొప్పితో వాలిపోతుంది

ఆమె పాదాలు గాయపడతాయి

ఇరాక్‌ పేవ్‌మెంట్ల మీద

శరీరాలు రాలిన ఆకుల్లా పడి ఉంటాయి

అవి ఒకప్పుడు బతుకు హరితపు పచ్చని ఆకులు

రాగ రహిత విషాద గీతాల్ని

గాలి మోసుకొస్తుంది

బతుకు తీపి ఫలాల్ని

సామ్రాజ్యవాదం హరిస్తుంది

దుఃఖిత వితంతువుల వలె

మోడు వారిన చెట్లు

ప్రజలు చాలా వరకు అమాయకులు

నేరం అమానుషత్వం, అత్యాశలదే

ఇది ఫాసిస్టుల భావజాలం

అతి కొద్దిమందిది అధికారం

సామ్రాజ్యవాదం వారి ఇంటి పేరు

వారి ప్రపంచ బ్యాంకు ఐక్యరాజ్య సమితిని

ఖాతరు చేయదు

ఐక్య ప్రపంచాన్నీ సరకు చేయదు

వాళ్ళు శాంతి గురించి పట్టించుకోరు

వాళ్ళు నరమాంసంతో విందు చేసుకుంటారు

డైనింగ్‌ టేబుల్‌ మీద తుపాకులు, బాంబులు,

అణ్యాయుధాలు

ఒక హెచ్చరిక

పెట్టుబడిదారులతో సహ పంక్తి భోజనం వద్దు

నీకు జబ్బు చేస్తుంది, ఆత్మ కలుషితమవుతుంది

నీ నాల్కను నువ్వే మింగేస్తావు

నీ పిల్లల ఎముకల్ని నువ్వే నవిలేస్తావు

చెడుగుతో కలిసి బతకడం నేర్చుకోకు

అది మంచినంతా చంపేస్తుంది

నేనొక నల్లజాతి అమెరికన్‌ని

అట్లాంటిక్‌, పసిఫిక్‌ సముద్ర గర్భాలెంత నలుపో అంత నలుపు

నైలు, మిసిసిపి నదుల్లా నేను పొడుగాటి నీలిమను కూడా

నా రక్తనాళాల్లో సమవాదం ప్రవహిస్తుంది

ప్రపంచ నదుల్లో జలాల వలె

స్నేహితుల కోసం చూడు

బోల్డంత మంది

రంగు రంగుల చర్మాలలో నేయబడి ఉంటారంతే

పీడితుల కోసం చూడు

చాల చాల మంది

ఎడారిలో ఇసుక రేణువులెన్నో అంత మంది

ప్రేమ కోసం చూడు

వాళ్ళు విప్లవకారులు

సంపూర్ణ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతుంటారు

జనావళి కోసం చూడు

వాళ్ళే మన సైన్యం

న్యాయం కోసం, సమానత్వం కోసం, శాంతి

కోసం పోరాడ్డానికి

స్వాతంత్య్ర పథం కోసం చూడు

అన్ని అణచివేత రూపాలనూ నిషేధించు

భవిష్యత్తు వైపు చూడు

సమానత్వం కోసం పోరాడు

ఆనంద భాష్పాల్ని సృష్టించు

ఎందుకంటే

జీవితం కొనసాగాలి

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో