మనదేశంలో స్త్రీలపై కుటుంబ ‘హింస’ పెరగడానికి కారణాలు – నివారణ మార్గాలు కె. రాజశ్రీ

(భూమిక నిర్వహించిన కథ, వ్యాసం, కవితల పోటీల్లో రెండవ బహుమతి పొందిన వ్యాసం)

ముందుగా ‘హింస’కు నిర్వచనం తెలుసుకుందాం. స్త్రీలకు వ్యతిరేకంగా జరిపే పెత్తనాలు, అధికారాలు, అణచివేతలు ‘హింస’గా పరిగణించవచ్చు. ‘హింస’ అనేది శారీరకమైనదే కానవసరం లేదు.

భారతదేశంలో కుటుంబ వ్యవస్థ పరిగణనలోనికి తీసుకుంటే అంతటా పురుషాధిపత్యమే నెలకొని ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది.

ప్రపంచంలో వివిధ ప్రాంతాలు, దేశాలు, వివిధ రకాల జాతులు, మతాలు అనేక రకాల వ్యవస్థలతో, రూపాలతో, సిద్ధాంతాలతో కుటుంబ వ్యవస్థ ముడిపడి ఉంది. ఈ క్రమంలో కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ప్రాధాన్యత సంతరించుకున్నప్పటికీ ‘హింస’కు మొదటిగా బలవుతోంది మాత్రం స్త్రీనే.

కుటుంబ వ్యవస్థకు అతీతంగా సామాజిక జీవనాన్ని ఊహించలేము. మానవజాతి మనుగడ.. అనగా పుట్టుక పెరగడానికి మధ్యలో ప్రేమాభిమానాలతో పాటు మానవ సంబంధాలన్నీ కుటుంబ వ్యవస్థకు మూలాధారాలు. అయితే, స్త్రీలపట్ల ‘హింస’ కుటుంబ వ్యవస్థలో సహజమైనదిగా, అంతర్గత కలహాలుగా ప్రాధాన్యత లేకుండా రూపుదిద్దుకుంది.

ప్రకృతిలో మిగిలిన ప్రాణులకంటే బుద్ధి, జ్ఞానం, వివేకం, సామర్ధ్యం, మాట్లాడే శక్తి, భావ వ్యక్తీకరణ మానవులకే ఉంది. ప్రతి శిశువు సామాజిక పరిస్థితులతో పాటు కుటుంబ ప్రభావంతో పెరుగుతుంది. కుటుంబమనేది ప్రేమాభిమానాలతో పాటు బాధ్యతలతోను, హక్కులతోను కూడుకున్న చట్రం.

స్త్రీలపై కుటుంబ హింసకు కారణాలను పరిశీలిస్తే –

1. అవిద్య / నిరక్షరాస్యత

2. అధిక సంతతి

3. ఆర్థిక అసమానతలు,

4. కుటుంబ పెద్దగా పురుషుడే సంపాదనాపరుడిగా, పెత్తందారీగా యుగయుగాలుగా అన్ని రకాల వ్యవస్థలలో వేళ్ళూనుకుని ఉండడం.

5. కుటుంబంలో ఆడపిల్లలకు సరైన గుర్తింపు లేకుండా అత్తవారింటికి శాశ్వతంగా వెళ్ళవలసిందేనని, ఎప్పుడో పండగలకు, శుభకార్యాలకు మాత్రమే తల్లిదండ్రుల వద్దకు తాత్కాలికంగా రావడమనే విధానంతో పాటు- మగబిడ్డ ఇంటికి వారసుడిగా, కుటుంబ పెద్ద తర్వాత ఇంటిపై, ఆస్తిపై సర్వ హక్కుదారుడిగా తల్లిదండ్రుల వద్ద శాశ్వత స్థానం కలిగి ఉండే వంశోద్ధారకునిగా పాతుకుపోయిన ధోరణి యుగ యుగాల నుండి నేటికీ కొనసాగుతోంది.

6. వరకట్నం

7. అసమానంగా ఆస్తి పంపకాలు

8. మూఢ విశ్వాసాలు మరియు ఆచారాలు

9. ప్రకటనల పరంగా, వినోదపరంగా స్త్రీలను ఒక అంగడి వస్తువుగా, సెక్స్‌ సింబల్‌గా చౌకబారుతనంగా చూపడం.

10. హింసకు కారకులైన నిందితుల పట్ల ఉదాసీనత. స్రీలపై హింసను కుటుంబ అంతర్గత సాధారణ సమస్యగా పరిగణించడం.

11. కుటుంబ హింసకు శిక్షలు అతి స్వల్పంగా అమలు కావడం. కాలయాపన కారణంగా శిక్షలు వీగిపోవడం.

12. స్త్రీలకు తమ ఆలోచనలకు, నిర్వర్తించే పనులపట్ల కానీ, ఆర్థిక సాధికారత పట్ల కానీ స్వేచ్ఛ లేకపోవడంతో స్త్రీని నేటికీ ద్వితీయ శ్రేణి వర్గంగా పరిగణించడం.

కుటుంబంలో స్త్రీలపై హింసకు నివారణ మార్గాలు తెలుసుకుందాం:

మొదటిదశ – తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో ఆడ, మగ వ్యత్యాసాలు చూపరాదు. ఇంటి పనులు చేయడం ఆడపిల్లల బాధ్యతగా, విద్య, ఇతర సౌకర్యాలు మగపిల్లల హక్కుగా అమలు జరిగే విధానంగా కాక ఇరువురికీ సమాన ప్రాధాన్యత కల్పించాలి. విద్యాపరంగా, ఆర్థిక పరంగా, ఇంటి పనుల నిర్వహణ అనేవి విభజన, వ్యత్యాసాలు లేకుండా సమాన ప్రాతినిధ్యం కలిగించాలి. పెద్దల పట్ల గౌరవం మరియు ఇతరుల ఇష్టాఇష్టాలను గౌరవించే మానసిక పరిపక్వతను పిల్లలకు బోధించే తొలి గురువులుగా తల్లిదండ్రులు బాధ్యత వహించాలి.

రెండవదశ – వ్యక్తికి జ్ఞానం, విలువలు, నైపుణ్యంతో పాటు మానవ సంబంధాలను గౌరవించి, పెంపొందించే దశలో విద్యావిధానం ఉండాలి. పాఠ్యాంశాలలో మానవ సంబంధాలు మరియు కుటుంబ అంశాల పట్ల, బాధ్యతల పట్ల అవగాహన కలిగించే అంశాలను చేర్చాలి.

ఈ ప్రపంచంలో జన్మించే ప్రతి శిశువుకు జీవించే హక్కు ఉంది. ప్రపంచ మనుగడకు స్త్రీ పురుషులిరువురూ సమానులేనని విద్యాపరంగా, వినోదపరంగా ఆలోచనలకు దోహదపడే విద్యావిధానం రావాలి.

మూడవ దశ – కుటుంబ సభ్యుల నుండి హింసకు గురైన స్త్రీలు నిర్భీతిగా, నిస్సంకోచంగా తమ పట్ల జరుగుతున్న హింస గురించి ఫిర్యాదు చేయగలిగే స్వేచ్ఛా వాతావరణం ఏర్పడాలి.

కుటుంబం, పరువు, మర్యాద అనే ఛాందస భావాలతో ఏ ఒక్కరూ బ్రతకరాదు.

నిందితుల పట్ల కఠిన చర్యలు, బాధ్యత స్త్రీలకు సత్వర న్యాయం, సహాయం ఇవ్వగలమని ప్రభుత్వం తమ పాలన ద్వారా నమ్మకం కలిగించాలి.

జాతి భేదాలకు దారితీసే అపోహలు, విధానాలను తొలగించి, ఆశ్రిత పక్షపాతం లేకుండా ప్రభుత్వాలు బాధిత స్త్రీలకు బాసటగా నిలవాలి.

న్యాయం కోసం, రక్షణ కోసం కుటుంబ హింసను బహిర్గతంగా ఫిర్యాదు చేసిన స్త్రీలను చులకనగా చూడక చేయూతనిచ్చి, ఆలంబన చేకూర్చే విధంగా న్యాయం జరగాలి. ఏ విధమైన వివక్ష చూపరాదు. కుటుంబంలో హింసను ఎదుర్కొన్న స్త్రీలు ఫిర్యాదు చేసిన వారిని లేదా ఎదిరించిన వారిని, ప్రశ్నించిన వారిని అవమానాలకు, అవహేళనలకు గురిచేయరాదు.

నాల్గవ దశ – కుటుంబ హింసకు గురైన స్త్రీలను దాని కారకులైన వారు ఎంతటివారైనా పోలీసులు, న్యాయ శాఖ బాధితుల పట్ల స్వచ్ఛందంగా నిలవాలి. రక్షణ చర్యలు చేపట్టాలి.

విద్య, ఉపాధి, స్వయం, ఉపాధి ద్వారా ఆర్థిక అవకాశాలు పురుషులతో పాటు స్త్రీలు సమంగా పొందడానికి విస్తృతస్థాయిలో ఏర్పాటు చేయాలి.

స్త్రీలు వివాహితులయ్యారు, తల్లులయ్యారని వారిపట్ల భేదభావం చూపించరాదు. పురుషులతో సమానంగా ఏ విధమైన భేదభావానికి గురిచేయక పాలకులకు/ప్రభుత్వాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే విధంగా అవకాశాలు కల్పించాలి.

అదేవిధంగా వివాహం చేసుకోవడానికి లేదా రద్దయిన వివాహితకు సమాన హక్కులు, బాధ్యతలు ఏర్పరచాలి. పిల్లలు / సంతతికి సంబంధించిన అధికారాలు, బాధ్యతలు స్త్రీ పురుషులిద్దరూ సమానంగా నిర్వహించే విధానం ఉండాలి.

కుటుంబంలో, సమాజంలో, దేశంలో, ప్రపంచంలో అన్నిచోట్లా సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పటికీ అత్యవసరమైన విలువలు, మానవ సంబంధాలు పడిపోతున్నాయనే ఆందోళన, అపనమ్మకం దృష్ట్యా సాంఘిక, నైతిక విలువలు పెంపొందించే శక్తి సాధనాలు రూపొందాలంటే ముందుగా స్త్రీలకు ఇంటా, బయటా అన్నింటా సమాన ప్రాతినిధ్యం కల్పించగలిగిననాడే కుటుంబం, సమాజం, దేశం, ప్రపంచం అంతటా మానవత్వపు పరిమళాలు గుబాళించగలవు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో