శానిటరీ నాప్‌కిన్స్‌ ”లగ్జరీ”నా!! ఉమా నూతక్కి

చెల్లీ…

చిన్నప్పుడు నువ్వు చదివిన సోషల్‌ స్టడీస్‌ పాఠాలు గుర్తు ఉన్నాయా? మర్చిపోయావా…! ఏం పర్లేదు! ఘనత వహించిన మన ప్రభుత్వాలు ఉన్నంతవరకు నిన్ను ఏదీ మర్చిపోనివ్వరు. తమ మీద ఓటర్లకి ఏర్పడే అసంతృప్తిని తప్ప.

ఔరంగజేబు జుట్టు మీద పన్ను వేశాడని చిన్నప్పుడు మనం సాంఘికశాస్త్ర పాఠాల్లో చదువుకుని వచ్చాం. తనకన్నా మేమేనా తక్కువ అనుకుందేమో మన ప్రభుత్వం… శానిటరీ నాప్కిన్‌ మీద లగ్జరీ పన్ను వేసింది ‘జి.యస్‌.టి’ పేరుతో.

మనం కట్టే ప్రతీ పన్నూ దేశ ప్రగతికోసమేనట. అవును దేశమంటే మట్టి కాదోయ్‌… దేశమంటే కార్పొరేట్లోయ్‌. ఏమో నీ మలినాన్ని శుభ్రం చేయడానికి వేసిన పన్ను… రేపు ఏ అంబానీకిచ్చే సబ్సిడీకి

ఉపయోగపడుతుందో…

అసలు మనమంటూ పుట్టనివ్వడమే గొప్పయిన చోట ముట్టొక లగ్జరీ కావడంలో వింతేముందిలే.

మీకో సంగతి తెలుసా! మనకి బొట్టూ, కాటుకా, గాజులు ఇవన్నీ పన్ను లేకుండానే ఇస్తారట. మన స్త్రీత్వానికి కొలమానాలు అవేగా మరి. ఇక ఋతు చక్రపు మలినమంటావా… అమ్మమ్మ వాడేసిన నేతచీరలో, అమ్మ పక్కన పడేసిన పాత చీరలో… అవేవీ కాకపోతే ఇసకో, బూడిదో, మీ పెరట్లో ఆవు పిడకో… ఏదో ఒకటి ఉండనే ఉందిగా…

నీకు రాబోయే సర్వైకల్‌ కాన్సర్‌ సాక్షిగా మేం స్వచ్చ భారత్‌ నిర్మించుకుంటాంలే.

స్వచ్చభారత్‌ రావాలంటే రోడ్ల మీద ఉన్న పేడ లాంటివి ఏవీ కనపడదు. అందుకే రోడ్ల మీద పేడ ఎత్తివేసి వాటిని పిడకలు చేసి వంటింట్లో కట్టెల పొయ్యిలో ఇంధనంగా వేసి తరవాత బూడిద కూడా గాలిలో కలవకుండా తమ శారీరక రుగ్మతపై అడ్డుకోవాలి. తద్వారా స్వచ్చభారత్‌ సాకారం అవుతుంది. మరి ఇప్పటకే శానిటరీ నాప్‌కిన్స్‌ వాడుతున్న 15శాతం మందికి కూడా లగ్జరీ టాక్స్‌ వేస్తేనే స్వచ్చభారత్‌ కల త్వరగా నెరవేరుతుంది.

ఇదిగో… ఇప్పుడు కండోమ్స్‌ చారిత్రాత్మక అవసరం. అవసరమైతే ఉచితంగా పంపిణీ చేస్తూ

ఉంటారు. కానీ మన మలినాలని మనం శుభ్రపరుచుకునే ‘శానిటరీ నాప్‌కిన్స్‌’ మాత్రం విలాస వస్తువు. నిజమేనేమో…

సినిమా టిక్కెట్ల మీద టాక్స్‌ పెరగగానే వాళ్ళ గొంతులు లేచాయి. వస్త్రాల మీద పన్ను చూసి వస్త్రవ్యాపారులు బంద్‌ అంటున్నారు. కానీ లగ్జరీ టాక్స్‌ వేశారని ఏ స్త్రీమూర్తి నెలసరి బ్యాన్‌ అవుతుంది.

చెల్లీ… మనకిష్టమైన బంగారం గురించో… చీరల గురించో మాట్లాడటానికి చాలా మందే తయారుగా ఉంటారు. కానీ ఇది మన సమస్య. మనకు మాత్రమే సమస్య. దీని గురించి మాట్లడటం ఎంతో సున్నితమని తెలుసు. అయినా మనమే మాట్లాడాలి. తప్పదు. ప్రభుత్వానికి ఏం పోయింది? సమాజానికి మాత్రం పోయేదేముంది??

అవును… పోయేదేముంది ఎవరికైనా…

అసలు నిన్ను పుట్టన్విటమే నీకొక లగ్జరీ…

ఇన్నాళ్ళు పెరగనివ్వడం నీకు సమాజమిచ్చిన వరం.

ఇంటింటికీ కాపలాగా ఒక కుక్క, పాలివ్వడానికో ఆవు, పిల్లల్ని ఇవ్వడానికేమో నువ్వు… ఇదే నీ ప్రధాన కర్తవ్యం. దీన్ని మించి నీ అవసరం ఇంకేముంది. ఇంకేమున్నా అవన్నీ లగ్జరీస్‌ కదా వాళ్ళ దృష్టిలో.

అసలు ఈ గొడవంతా ఎందుకూ… దేవుడూ వాళ్ళ మనిషేగా… ఆయనకీ చెప్పి ఈ నెలసరి ఏదో ఆపేస్తే… వాళ్ళు వేసిన లగ్జరీ టాక్స్‌ న్యాయమైనదే అని సమర్దన చేసుకోవచ్చు.

ఒంటిని స్వచ్ఛంగా ఉంచుకునే అవకాశం ఇవ్వని చోట… దేశం స్వచ్ఛం అవ్వటం సాధ్యమా? ఆలోచించదేం ఈ సమాజం. ఆడవాళ్ళు సిగ్గు విడిచి చెప్పుకోలేని కొన్ని సున్నితమైన అంశాలపట్ల మరింత సున్నితంగా ఆలోచించి వాళ్లకి భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వమే వాళ్ళ పాలిట రాకాసియై మాన భక్షణ చేస్తున్నా నువ్వు బతుకుతున్నావు చూడు… అదే ఒక లగ్జరీ అని కొత్తగా ఇంకో టాక్స్‌ వేసినా వేస్తారు!

మరి దానికీ సిద్ధంగానే ఉన్నావు కదా!!

Share
This entry was posted in స్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో